నిజాలకు మసిపూసి మారేడు కాయ చేసి దానిని పరమ సత్యంగా సమాజాన్ని నమ్మించే పక్రియకు కమ్యూనిస్టులు పెట్టింది పేరు. అభ్యుదయం, ఉద్యమం పేరిట దారుణాలు చేయడం, వాటిని వక్రీకరించి తమ క్షీణ భావజాలాన్ని నెమ్మదిగా మనపై రుద్దడంలో సంపర పంపర మేధావులు, నిష్ణాతులు ఇటీవలి కాలంలో సినిమా మీడి యాను దుర్వినియోగం చేస్తూ యువకులను తప్పుదోవ పట్టించడం, దానికి ‘మేతావులు’ వంత పాడటం ఎక్కువైంది. నిజామాబాద్ జిల్లాలో అప్పటి పీపుల్స్‌వార్ ప్రస్తుత మావోయిస్టు పార్టీ నాయకుడు శంకర్ చేతిలో అన్యా యంగా బలైపోయిన ‘సరళ’ కథ ఆధారంగా విరాటపర్వం సినిమా తీసిన విషయం తెలిసిందే. అమాయకురాలైన బాలికను దారుణంగా చంపిన నక్సలైట్లను గ్ల్లోరిఫై చేసిన దర్శక శిఖామణిని వామపక్షీయులు పొగుడ్తున్నారు. ఖమ్మం జిల్లా సరళను పీపుల్స్ వార్ ఎలా చంపిందీ అప్పట్లో ఆంధ్రజ్యోతిలో వార్తలు వచ్చాయి.
ప్రేమ ఒక దైవీభావన. తెలుగు సినిమాలలో హైస్కూలు విద్యార్థుల మధ్య చూపించే వెర్రిచూపులు, మనవరాళ్ళ వయసు ఆడపిల్లలను ‘కుమ్మేసే’ చిందులు ప్రేమ కాదు. ప్రజలను హింసించి రక్తపుటేర్లు పారించే విప్లవాన్ని ప్రేమతో ముడిపెట్టి మన చెవిలో పువ్వులు పెట్టిన ‘వేణు’ను పొగిడే మేధా వుల దివాళా కోరుతనం చూస్తే ఆశ్చర్యమేస్తున్నది.
నక్సలైట్లు ప్రజలను అణచేరా?అని ఆశ్చర్యపోయే నేటితరం యువతకు తెలుగు పల్లెల కన్నీటి కథలు తెలియవు. 1980-1990లో ‘జాగృతి’ ప్రచురించిన నక్సలైట్లు కథా కమామీషును ఒప్పుకోకున్నా, జీవితాంతం నక్సలైట్ ఉద్యమానికి రక్షణ కవచంలా నిలిచిన పౌరహక్కుల నాయకుడు బాలగోపాల్ ‘చీకటి కోణాలు’ అనే వ్యాసాన్ని రాశారు. అందులో ఈ విప్లవవీరులు సాగించిన దారుణ మారణకాండను వివరంగా ప్రస్తావించారు.
‘ఆయుధాలతో సమాజంపై వ్యక్తిగత ఆధిపత్యం నెలకొల్పడం ఫ్యాక్షనిస్టుల లక్షణం. ఆయుధాలతో సమాజంపై రాజకీయ ఆధిపత్యం నెలకొల్పడం నక్సలైట్లపై పార్టీల విప్లవ వ్యూహం’. సాయుధ పోరాటం పేరిట ఏ గిరిజన పల్లెలో, ఏ పేద గుడిసెలో ఏమి అరాచకాలు చేశారో సోదాహరణంగా రాశారు.
ఆమ్నెస్టి ఇంటర్నేషనల్‌వారి టూన్యకాస్టరైన్స్‌లో ఆంధ్ర నక్సలైట్లకు, దక్షిణ అమెరికా షైనింగ్ పాల్‌ను ఖండించవలసి వచ్చింది.
వర్గశత్రువు నెత్తురులో చేతులు ముంచినవాడే విప్లవకారి అనే ప్రాథమిక భావజాలాన్ని రొమాంటిక్ చేసి తిరిగి మన మెయిన్ స్ట్రీమ్‌లోనికి వచ్చేందుకు పన్నిన కుట్రలో భాగమే విరాటపర్వం.
అంతకుముందు జార్జిరెడ్డి సినిమాలు, అబద్ధాలతో అందమైన చిత్రాలను నిర్మించారు. అప్పటి మంత్రి పి.వి.నరసింహరావు, జైపాల్ రెడ్డిల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో జైపాల్‌రెడ్డి తరఫు చిన్నపాటి రౌడీ జార్జిరెడ్డి. అతను కనపడిన ప్రతివాడిపై పోట్లాడటం ఒక అలవాటు. రజాకార్లను ఎదురించిన హైదరాబాద్ పాతబస్తీ బి.సి.యువ కులపై ఆధిపత్య దురహంకారంతో పదేపదే దాడులు చేసిన జార్జిరెడ్డి ఒక ఘర్షణలో చనిపోయాడు. అతడిని ఒక ఐకాన్ చేయాలన్న తపన ఇటీవల బయలు దేరింది.
అప్పట్లో పి.డి.ఎస్.యు, ఆర్.ఎస్.యు. వంటి విప్లవ సంస్థలు లేవు. అతడు జైపాల్‌రెడ్డి చేతిలో ఒక చురకత్తి. కాంగ్రెస్ వర్గాల ఘర్షణల మధ్య అతడిని వాడుకున్నారు. హింసను, హింసోన్మాదాన్ని గ్లోరిఫై చేసి దానిని గతి తార్కిక భౌతికవాదం (dialictied materialism) ఎరుపు రంగుట ద్దాలలో చూపించటం ఒక పద్ధతిగా చేస్తున్నారు.
నక్సలిజం పేరిట సాగిన మారణకాండను మరిపింప చేసి నేటి యువతకు అబద్ధాలు చెప్పి స్తున్నారు. ఏమో!
నేటి తెలంగాణ సర్కార్ రజాకార్లకు దాసోహమన్నట్లుగా రాకాసి రాడికల్స్‌ను నెత్తి కెక్కించుకుంటుందా?
– యథార్థవాది