అమరజీవి పొట్టి శ్రీరాములు బలిదానంతో 1952లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆ తరు వాత వెంటవెంటనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. తెలంగాణతో కలిసిన విశాలాంధ్ర 1956 లో ఆంధప్రదేశ్‌గా ఆవిర్భవించింది. అకారాద్యమక్ర మణికలో ఇది మొదటిది. తర్వాత మహారాష్ట్ర నుండి గుజరాత్‌ను, సమీప గతంలో మధ్యప్రదేశ్‌ ‌నుండి చత్తీస్‌గఢ్‌ను, ఉత్తరప్రదేశ్‌ ‌నుండి ఉత్తరాఖండ్‌ను.. ఇలా కొన్ని ప్రాంతాలను విడదీశారు. నిజానికి అవన్నీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావు. యూపీ•, ఉత్తరాఖండ్‌, ‌రాజస్థాన్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌చత్తీస్‌గఢ్‌, ‌హరియాణా – ఇలా చాలా రాష్ట్రాలల్లో మాట్లాడేది హిందీ భాషే.

భాషా ప్రయుక్తాల ఉద్దేశం పరిపాలనా సౌకర్యం, సత్వర అభివృద్ధి అని నాటి నేతలు వ్యాఖ్యానించారు. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అనే నినాదాన్ని సృష్టించినట్లే చిన్న రాష్ట్రాలు మంచివి అన్నారు. ఈ 29 రాష్ట్రాలు కలిస్తే భారత సమాఖ్య. ఒక విధంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలను పోలినట్లుంది.

రష్యాలో ఈ సమాఖ్య ప్రయోగం సఫలం కాలేదు. 1990 ప్రాంతంలో అది విచ్చిన్నమై చిన్న చిన్న దేశాలయింది. ఇండియా కూడా అలా అయితే బాగుంటుందని చైనా, పాకిస్తాన్‌, అమెరికా కలలు కంటున్నాయి. అందుకు తగ్గట్టే భిన్న భిన్న రాష్ట్రాలలో వేరే వేరే పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఈ వాతావరణం అనుకూలించి, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది. 1947 నుండి నెహ్రూ- ఇందిరాగాంధీ కాలంలో బలంగా ఉన్న కాంగ్రెసు క్రమంగా విచ్ఛిన్నమైపోయింది. ఢిల్లీ బలహీన మైనప్పుడు దేశంలో సామంతులు స్వతంత్ర రాజ్యాలు స్థాపించుకోవటం చరిత్రలో చూశాం.

కొన్ని సందర్భాలల్లో కుక్కను తోకయే ఆడించింది. ఈ దశలో వికేంద్రీకరణ, ఫెడరేషన్‌, ‌స్వయంప్రతిపత్తి వంటి నినాదాలు తెరపైకి తెచ్చారు. ఈ నినాదాలు, వాటితో జరిపే ఉద్యమాలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బట్టి మారుతూ ఉంటాయి. కమ్యూనిష్టులకు కేంద్రం బలంగా ఉండటం సుత రామూ ఇష్టంలేదు. అందుకు తగ్గట్లే రాష్ట్రాలలోను కేంద్రంలోను ఒకే పార్టీ ప్రభుత్వాలు లేకపోవటం సంకట పరిస్థితి కారణమైంది. ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటు రాష్ట్రంలోను అటు కేంద్రంలోను ఒకే పార్టీ అధికారంలో ఉంటే అది డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌ అన్నారు. ఇది గిట్టనివారు దానిని ట్రబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌ అం‌టున్నారు. ఇప్పుడు ఈ ట్రిబుల్‌ ఎవరు సృష్టించారో గమనించాలి.

బెంగాల్‌లో మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ ‌కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది. కేంద్ర హోంమంత్రినీ, భారత ప్రధానినీ కూడా అనుమతించ నని మమతా హుంకరించారు. ఇది ఏ రకమైన ఫెడరల్‌ ‌వ్యవస్థ? అసలు ఇదేం ప్రజాస్వామ్యం? అంటే ఇక్కడ బెంగాల్‌దే ట్రబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌ అయింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అనే మరో ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ‘ఢిల్లీ సింహాసనాన్ని కదిలిస్తాం, ఆగమాగం చేస్తాం. నిప్పు పెడతాం’ అంటూ ముఖ్యమంత్రి, ఇతర నాయకులూ బహిరంగ ప్రకటనలు చేశారు. కేరళ పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ హత్యలు నిత్యకృత్యం. ఉగ్రవాదు లను ప్రత్యక్షంగా ప్రభుత్వమే పెంచి పోషిస్తున్నది. ముస్లింలీగ్‌, ‌పీఎఫ్‌ఐ ‌వంటి ఉగ్రవాద సంస్థలు విదేశీ నిధులు సమకూర్చుకొని దేశంలో అశాంతిని ప్రేరేపి స్తున్నాయి. ఇక్కడి ముఖ్యమంత్రి పినరాయ్‌ ‌విజయన్‌ ‌మీద హత్యాభియోగాలున్నాయి. విదేశీ బంగారం రహస్యంగా దౌత్య కార్యాలయ సంచీల నుండి తెచ్చిన భారీ కుంభకోణం ఇటీవలిదే. ప్రత్యర్థులను నరికి ఉప్పుపాతర పెట్టండి అని బహిరంగంగా పినరాయ్‌ ‌పిలుపునిచ్చాడు. తమిళనాడు హిందీ హిందూ వ్యతిరేకోద్యమాలు 20వ శతాబ్దం నుండి సాగుతూనే ఉన్నాయి. తాము ద్రావిడులమనీ, ఉత్తరాదివారు ఆర్యులనీ సంస్కృతం ఆర్య భాష అనీ, తమ నాయ కుడు రావణాసురుడు అనీ బహిరంంగానే చెప్పు కుంటున్నారు. తమది నిరీశ్వరవాదం అని డికె- డి.ఎం.కె పార్టీలు చెప్పుకున్నాయి. ఐయితే శరవేగంగా ఇక్కడ మతం మార్పిడులు జరుగుతుంటే వాటిని ఈ నాస్తికవాదులు ఆపలేదు. సరికదా ఎంజిఆర్‌, ‌కరుణానిధి స్టాలిన్‌ ‌వంటివారు చర్చిల నిర్మాణానికి నిధులు కేటాయించారు. ముస్లింలీగ్‌లో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. ముస్లింలీగ్‌ ‌సెక్యులర్‌ ‌పార్టీ – బీజేపీ మతోన్మాద పార్టీ – ఇది వీరి నిర్వచనం. 1947లో భారతదేశాన్ని మూడు ముక్కలు చేసిన ముస్లింలీగ్‌ ‌మత ప్రాతిపదిక మీదనే నేటికీ దేశంలో తన రాజకీయాలు నడిపిస్తున్నది. ఉగ్రవాద విద్యార్థి సంస్థ ‘సిమి’ తమ స్వంత ఫ్రంట్‌ ఆర్గనైజేషన్‌ అని నాటి యూపీ ముఖ్యమంత్రి ములాయంసింగ్‌ ‌యాదవ్‌ ‌బహిరంగంగా ప్రకటించాడు.

అరుణాచల్‌‌ప్రదేశ్‌, ‌మేఘాలయ, మణిపూర్‌, ‌నాగాలాండ్‌లు క్రైస్తవ మెజారిటీ రాష్ట్రాలు. ఇక్కడ ఆగష్టు 15 నాడు జాతీయ జండా ఎగురవేయటానికి కూడా ఇబ్బందే. హైదరాబాద్‌ ‌పాతబస్తీలో ఆగష్టు 15 నాడు చాలాసార్లు పాకిస్తాన్‌ ‌జండా ఎగురవేశారు. దీనిని ఎవరైనా ప్రశ్నిస్తే ‘సమాఖ్య స్ఫూర్తికి భంగకరం’ అంటూ కుహనా సెక్యులరిస్టులు నానా అల్లరి చేస్తున్నారు. ఫెడరల్‌ ‌వ్యవస్థ కోసం బెంగటిల్లిపోతున్న ముఖ్యమంత్రులు దాదాపు అంతా గవర్నర్‌తో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నవారే. ఈ నేపథ్యంతో చూస్తే ‘గవర్నర్‌ ‌మీద మేము రాళ్లు వేయలేదు’ అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‌ప్రకటన ఎంతో చెబుతుంది. 2022 ఏప్రిల్‌లో శ్రీరామనవమి, హనుమాన్‌జయంతి సందర్భంగా జరిగిన శోభా యాత్రలపై దాడులు జరిగాయి. ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ఇలా ఎందుకు జరిగింది? అంటే 17.4. 2022 రాత్రి 9 గంటలకు ఓ చానల్‌లో ‘మాతములన్నియు మాసిపోవును’ అంటూ గురజాడ కవిత్వం ఉదాహరిస్తూ ఉపన్యాసాలు చేశారు. ఊరేగిం పుల మీద ఎందుకు దాడి జరిగింది? అని ప్రశ్నిస్తే అసలు ఊరేగింపులు ఎందుకు జరుపుకోవాలి? అని చొప్ప దండి ప్రశ్నలు వేస్తున్నారు.

మహారాష్ట్రలో బాల్‌ ‌ఠాక్రే శివసేన అనే సంస్థను స్థాపించాడు. ఇప్పుడు ఆయన కొడుకు ఉద్ధవ్‌ ‌ఠాక్రే దానిని సోనియా సేనగా మార్చాడు. ఛత్రపతి శివాజీ ఆదర్శాలు ఏమైనాయి? తన తండ్రి ఆశయాలు ఎందుకు గంగలో కలిపారు? వారంతా కలిసి ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తారట. కేంద్రాన్ని బలహీనం చేస్తారట. అంటే రష్యా చరిత్రను ఇండియాలో పునరా వృత్తం చేస్తారా? పంజాబ్‌లో భారత ప్రధాని మోదీ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వెళ్తే ఖలీస్థాన్‌ ఉ‌గ్రవాదులు కాన్వాయ్‌ని ఒక ఫ్లై ఓవర్‌ ‌పైన స్తంభింప జేశారు. ఈ ప్రదేశం సరిగ్గా పాకిస్తాన్‌ ‌సరిహద్దుకు అరగంట దూరంలో ఉంది. ఫెడరేషన్‌ ‌పేరుతో భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నాలు ఊపందుకున్నాయి.

రాష్ట్రాలపై కేంద్రం దాడి, రాష్ట్రాలకు నిధులు ఇవ్వటం లేదు వంటి నినాదాలు తెలంగాణలో తరుచు వింటున్నాం. అంతర్జాతీయ ఉగ్రవాది అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌చేతిలోకి న్యూఢిల్లీ, పంజాబు పరిపాలనలు వెళ్లాయి. ఈ పరిణామం స్వతంత్ర భారత సమగ్రతకు ప్రమాద ఘంటిక. ఇదంతా చూచిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు, ఫెడరల్‌ ‌వ్యవస్థ మిధ్య అనిపించడం లేదా? అలాంటి విభజన రాజకీయంగా పెద్ద తప్పు అనుకోవలసి వస్తున్నది.

 కావేరీ జలాల కోసం కర్ణాటక, తమిళనాడు భయంకరంగా కొట్లాడుకుంటున్నా ఏపీ- తెలంగా ణాల మధ్య కృష్ణా గోదావరీ జలాల పంపకం తెగ లేదు. సమస్యలు రావణాకాష్టంలా రగులుతూ ఉంటే ప్రాంతీయ దురభిమానాలు రెచ్చగొట్టి పబ్బం గడుపు కోవచ్చు. ఎవరో లోగడ అన్నారు – ‘కమ్యూనిష్టు పాలనలో బెంగాల్‌, ‌త్రిపుర రాష్ట్రాలల్లో పేదరికం ఎందుకు పోలేదు?’ అని. ‘పేదరికం పోతే ఇక మా పునాది కదిలిపోయినట్లే’ అన్నారు కమ్యూనిస్టులు.

పి.చిదంబరం, కార్తి చిదంబరం, మల్లికార్జున ఖడ్గే, సోనియాగాంధీ, మమతాబెనర్జీ, కమలనాథ్‌ ఇలా ఎందరో ప్రముఖ నాయకులు రకరకాల కేసులలో ఇరుక్కున్నారు. బోఫోర్స్, ‌నేషనల్‌ ‌హెరాల్డ్, ‌సబ్‌మెరిన్‌, ‌డిఫెన్స్ ‌కొనుగోళ్లు, లండన్‌ ‌హౌస్‌, ‌స్విస్‌ఖాతాలు, శారద్‌ ‌చిట్‌ఫండ్‌ ‌స్కాం, హైదరాబాదు ఫిలింనగర్‌ ‌డ్రగ్‌ ‌కేసులు, తంజావూరు యం.లావణ్య ఆత్మహత్య, తెనాలి ఐతానగర్‌ ‌సండే స్కూలు కేసు, మహారాష్ట్ర హోంమంత్రి నవాబ్‌ ‌మాలిక్‌ ఆర్థిక నేరాలు, పంజాబ్‌ ‌డ్రగ్‌ ‌కేసులు… ఇలా వేల సంఖ్యలో నేరాలు, ఘోరాలు ఉన్నాయి. వీటి నుండి తప్పించు కోవడానికి వీరంతా ‘ఫెడరలిజానికి ప్రమాదం’ నినాదంతో కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. తమ పార్టీ అధికారంలో లేకపోతే కేంద్రం మీద విమర్శ పేరుతో దేశ వ్యతిరేకతను రెచ్చగొట్టడానికి కూడా వీళ్లు వెనుకాడడం లేదు.

కేంద్రం పాత్ర, రాష్ట్రాల బాధ్యత, శాంతిభద్రతలు రక్షించే అధికారం రాష్ట్రాలదేనని భారత రాజ్యాంగం స్పష్టం చేసిన సంగతి గమనించాలి. రాష్ట్రంలో దుర్మా ర్గపు ప్రభుత్వం ఉంటే తన అసమర్థతను కప్పిపుచ్చుకో వడానికి నేరాన్ని ఇతరుల మీదకి నెట్టడం సహజమే. 19.4.2022 నాడు తెలంగాణ మహిళా గవర్నర్‌ ‌తమిళసై ‘నేను రబ్బరు స్టాంపును కాను’ అని ఒక సంచలన ప్రకటన చేశారు. లోగడ 80, 90 దశకాల్లో కాంగ్రెసు ప్రభుత్వం గవర్నర్లను అడ్డంపెట్టుకొని ఎన్‌.‌టి.ఆర్‌ ‌పైన, కల్యాణ్‌సింగ్‌ (‌యుపి) పైన పగ సాధించటం చరిత్ర పుటలలో మనం చూశాం. అయితే మమతాబెనర్జీ వంటి అమాననీయ ముఖ్య మంత్రుల దుర్మార్గాలకు నేడు ఫెడరలిజం పేరుతో ఆమోదముద్ర వేస్తే దేశ సమగ్రత మాటేమిటి? కశ్మీర్‌ ‌గవర్నర్‌ ‌మీద కేంద్ర ఏజెంట్‌ ‌ముద్ర వేస్తే ఆ రాష్ట్రం భవిష్యత్తు ఏమిటి? మైనారిటీల పరిస్థితి ఏమిటి? ఫెడరల్‌ ‌వ్యవస్థను కొన్ని రాష్ట్రాలు అవహేళన చేస్తున్నాయి. 2021 జనవరి 26వ తేదీ పంజాబ్‌ ‌కాంగ్రెసు ముఖ్యమంత్రి, ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాదులకు రైతుల వేషం వేసి న్యూఢిల్లీలో సృష్టించిన విధ్వంసం అందరికీ గుర్తుండే ఉంటుంది.

దీనిని సమాఖ్య స్ఫూర్తి అంటారా? రాష్ట్రాల అధి కారాలను కేంద్రం హరిస్తున్నది. అందుకని బీజేపీ, కాంగ్రెసులు లేని ఫెడరల్‌ ‌ఫ్రంటు రూపొందించాలి అంటూ కొన్ని ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నం ఫలించే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే మహా రాష్ట్ర, తమిళనాడులలో పరోక్షంగా, రాజస్థాన్‌లో ప్రత్యక్షంగా కాంగ్రెసుపార్టీ అధికారంలో ఉంది. తెలంగాణలో కాంగ్రెసు టిఆర్‌ఎస్‌కు ప్రధాన శత్రువు. అందువల్ల కాంగ్రెసు లేని ఫెడరల్‌ ‌ఫ్రంట్‌కు మమతా బెనర్జీ, శరత్‌ ‌పవార్‌, ఉద్ధవ్‌ ‌ఠాక్రేలు సుముఖత చూపించటం లేదు.

సారాంశం ఏమంటే ఫెడరలిజం ప్రమాదంలో ఉంది అనే నినాదంతో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ తమ ప్రయోజనాలు వెతుక్కుంటున్నది. ఫెడరల్‌ ‌ఫ్రంట్‌కు కెసిఆర్‌, ‌మమతాబెనర్జీ, సోనియా, శరత్‌పవార్‌ ఎవరికివారు నాయకత్వం వహించాలని ఆశిస్తున్నారు. అంటే 2024 తర్వాత ప్రధాని పదవిని వీరు ఆశిస్తున్నారనేది బహిరంగ సత్యం. ఇందులోని సాధ్యాసాధ్యాలు వేరే విషయం. చాణక్యుడు క్రీస్తు పూర్వం 400 నాటివాడు. మాకియవిల్లీ క్రీస్తుశకం 1500 నాటివాడు. వీరు ఇరువురూ గణరాజ్యాల వలన వచ్చే ప్రమాదాన్ని, ఏకదేశ రాజ్యావశ్యకతను ఆనాడే గుర్తించారు. వర్తమాన భారతదేశంలో ఫెడరేషన్‌ ‌స్ఫూర్తి పేరుతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తులకు ఆనాడే ఆ ఇద్దరు సమాధానం చెప్పారు.

– ప్రొ. ముదిగొండ శివప్రసాద్‌, ‌విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE