మండుటెండలలో మే 3, 4 తేదీలలో కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ రైతాంగం కుదేలైంది. ఎంతో ఆర్భాటంగా ముఖ్యమంత్రి ప్రకటించిన ధాన్యం కొనుగోలు ఇంకా పది జిల్లాలలో ప్రారంభమే కాలేదని వార్తాపత్రికలు రాశాయి. కొనుగోలు కోసం కేంద్రాలకు తెచ్చిపెట్టిన ధాన్యం కూడా నీటి పాలైంది. ఆ వార్తలకు సంబంధించిన ఫొటోలు పత్రికలలో చూస్తుంటే ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది. ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ధాన్యం కొనుగోలు నత్తనడక నడవడం వల్లనేనని మీడియా చెబుతున్నది. రాష్ట్రంలో 6811 కొనుగోలు కేంద్రాలు తెరిచి 74 లక్షల టన్నుల ధాన్యం కొనాలని ఇప్పటికి మూడు వారాల క్రితమే తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ వాస్తంగా జరిగిందేమిటో, తడిసిన ధాన్యాన్ని చూసుకుని కన్నీటి పర్యంత మవుతున్న కర్షకులను చూస్తే తెలుస్తుంది.

అబద్ధాలు చెప్పడంలో, తన వైఫల్యాలకు ఇతరులను బాధ్యులను చేస్తూ విమర్శలు కురిపించ డంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిష్ణాతుడు. అటువంటి చర్యల తరువాతి పరిణామాల గురించి ఆయన పట్టించుకోరు కూడా. నేడు తెలంగాణలో రైతుల కష్టాలకూ, వరి కొనుగోళ్లలో జరుగుతున్న ఇబ్బందులకూ కేసీఆర్‌ ‌చర్యలే కారణం. అయినా ఇప్పుడు ఈ పరిస్థితికి కేంద్రమే కారణమంటూ తన తప్పుడు ఆరోపణలను కేసీఆర్‌ ‌కొనసాగిస్తూనే ఉన్నారు.

వికేంద్రీకృత సేకరణ వ్యవస్థ (డీపీఎస్‌)

‌తెలంగాణ, ఆంధప్రదేశ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌పంజాబ్‌, ‌హరియాణా, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ ‌వంటి అనేక రాష్ట్రాలు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ‌కోసం బియ్యం సేకరణ, పంపిణీ కోసం వికేంద్రీకృత సేకరణ వ్యవస్థను కలిగి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సివిల్‌ ‌సప్లయిస్‌ ‌కార్పొరేషన్‌, ‌రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా రైతుల నుండి వరిని కొనుగోలు చేయాలి. రైతులకు 7 నుంచి 10 రోజుల్లో పైకం చెల్లించాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల్లో ప్రాసెస్‌ ‌చేయాలి.

రాష్ట్రం నుండి కస్టమ్‌-‌మేడ్‌ ‌బియ్యం అదనపు నిల్వలను భారత ఆహార సంస్థ నిర్దేశించిన సూత్రాల ప్రకారం, ఆ సంస్థ ద్వారా రాష్ట్రాలకు రీయింబర్స్ ‌చేసిన మొత్తం మేరకు సేకరిస్తారు. సేకరణ, నిల్వ, పంపిణీ, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), సొసైటీ కమీషన్‌, ‌పాలనా వ్యయాలు, మండి లేబర్‌ ‌ఛార్జీలు, రవాణా ఛార్జీలు, కస్టడీ ఛార్జీలు, నిర్వహణ ఛార్జీలు, గోనె సంచుల ఖర్చు, మిల్లింగ్‌ ‌ఛార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చును నిర్దేశించిన సూత్రాల ప్రకారం భారత ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.

తెలంగాణలో వరి సేకరణ

 నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న ఈ ఏడేళ్లలో కాలంలో తెలంగాణ నుంచి వరి సేకరణ భారీగా పెరిగింది.

2013-2014 సంవత్సరానికి సమైఖ్య ఆంధ్రలో వరి సేకరణకు ఖర్చు చేసిన మొత్తం రూ.3404 కోట్లు. 2021-22 సంవత్సరానికి తెలంగాణలో 21.61 లక్షల మంది రైతుల నుండి వరి సేకరణ కోసం కేంద్రం వెచ్చించిన మొత్తం రూ. 26,6641 కోట్లు. ఇది దేశంలోని రాష్ట్రాలలో మూడవ స్థానం.

కేంద్రం ద్వారా వరి సేకరణ 2016-17లో 35.96 లక్షల మెట్రిక్‌ ‌టన్నులు (మొత్తం ఉత్పత్తిలో 69.5%) నుండి 2020-21 నాటికి 94.45 లక్షల మెట్రిక్‌ ‌టన్నులకు (మొత్తం ఉత్పత్తిలో 122.78%) పెరిగింది.

సమస్యపై వాస్తవాలు

తెలంగాణ పారా బాయిల్డ్ ‌రైస్‌ను వినియో గించదు. కానీ భారత ఆహార సంస్థకు పంపిణీ చేస్తుంది. తెలంగాణలో సేకరించిన ధాన్యాన్ని పార్‌-‌బాయిల్డ్ ‌రైస్‌, ‌ముడి బియ్యంగా ప్రాసెస్‌ ‌చేస్తున్నారు. 100 కిలోల వరి నుండి 68 కిలోల పచ్చి బియ్యం, 67 కిలోల ముడి బియ్యం లభిస్తాయి.

కేరళ, జార్ఖండ్‌, ‌తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే పార్‌-‌బాయిల్డ్ ‌రైస్‌ ‌వినియోగిస్తారు. ఇటీవలి కాలంలో ఆ రాష్ట్రాలలో కూడా పార్‌-‌బాయిల్డ్ ‌రైస్‌ ఉత్పత్తి పెరిగింది. భారత ఆహార సంస్థ పూల్‌ ‌నుండి కేవలం 20 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల పారా బాయిల్డ్ ‌రైస్‌ ‌దేశమంతా వినియోగిస్తారు. పెరిగిన ఉత్పత్తి, తక్కువ డిమాండ్‌ ‌కారణంగా పారా బాయిల్డ్ ‌రైస్‌ ‌స్టాక్‌లు పెరిగి డిసెంబర్‌ 2020 ‌నాటికి 3-4 సంవత్సరాలకు సరిపడా పరిమాణానికి చేరాయి.

ముడి బియ్యాన్ని గరిష్టంగా విడుదల చేయాలని, 2020 ఖరీఫ్‌ ‌పంటలో పారా బాయిల్డ్ ‌రైస్‌ను 50% వరకు పరిమితం చేయడానికి ప్రయత్నించాలని 22-12-2020 న ఎఫ్‌సిఐ నాటి లేఖ ద్వారా తెలంగాణ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు భారత ఆహార సంస్థ డిసెంబర్‌ 22, 2020‌న రాసిన లేఖలో సూచిం చింది. రబీ సీజన్‌లో పారా బాయిల్డ్ ‌రైస్‌ ‌రూపంలో ఎలాంటి మిగులును సంస్థ అంగీకరించదని కూడా స్పష్టంగా పేర్కొంది.

భారత ఆహార సంస్థకు పారా బాయిల్డ్ ‌రైస్‌ ‌సరఫరాను తగ్గించే విషయం గురించి ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలని ఆ సంస్థ డిసెంబర్‌ 30, 2020‌న భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

 2020-21 రబీ పంటలో 24.75 ఎల్‌ఎం‌టి అంటే 50% మిగులు బాయిల్డ్ ‌రైస్‌ని ఎఫ్‌సిఐకి బట్వాడా చేసేందుకు మే 27, 2021న కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని అనుమతించింది. ఆగస్ట్ 26, 2021 ‌తేదీ నాటి లేఖలో ఇప్పటికే ఆమోదించిన 24.75ఎల్‌ఎం‌టికంటే ఎక్కువ పారా బాయిల్డ్ ‌రైస్‌ను భారత ఆహార సంస్థ అంగీకరించదని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసింది. అలాగే ఆగస్ట్ 17,2021‌న జరిగిన ఆహార కార్యదర్శుల సమావేశంలో భారత ఆహార సంస్థ ఏ రాష్ట్రం నుండి పార్‌-‌బాయిల్డ్ ‌బియ్యం అంగీకరించదని స్పష్టం చేసింది.

అయితే తెలంగాణ ప్రభుత్వ నిరంతర అభ్యర్థనపై ఇప్పటికే ఆమోదించబడిన 24.75 ఎల్‌ఎం‌టికి అదనంగా 20.75 ఎల్‌ఎం‌టి పారా-బాయిల్డ్ ‌రైస్‌ని భారత ఆహార సంస్థకు విడుదల చేయడానికి 30-09-2021న కేంద్రం ఆమోదించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 4,2021‌న ఒప్పందం చేసుకొని ఈ విధంగా హామీ ఇచ్చింద్ని భవిష్యత్తులో ఎలాంటి పారా బాయిల్డ్ ‌రైస్‌ను రాష్ట్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థకు సరఫరా చేయద్ను రైస్‌ ‌బ్రాన్‌ ఆయిల్‌ ‌తయారీకి, మిల్లుల్లో బలవర్థకమైన బియ్యం తయారు చేసే సౌకర్యాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. నాణ్యమైన ఆహార ధాన్యాల సరైన నిల్వ, సరఫరా కోసం రాష్ట్రం చర్యలు తీసుకుంటుంది.

 ప్రభుత్వ బాధ్యతారాహిత్యం

 వరి కొనుగోలు కేంద్రాల్లో (పీపీసీ) రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేసీఆర్‌ ‌ప్రభుత్వం సకాలంలో సరయిన చర్యలు చేపట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న 6500 వరి కొనుగోలు కేంద్రాల్లోలలో 350 మాత్రమే నవంబర్‌ 2021 ‌నాటికి తెరిచారు. రైతులకు మొదట వచ్చిన వారికి మొదటి అవకాశం ప్రాతిపదికన టోకెన్లు ఇచ్చారు. రైతులు చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చి ఓ రైతు మృతి చెందాడు.

2020-2021 సంవత్సరానికి భారత ఆహార సంస్థకు బియ్యం డెలివరీ కోసం కేంద్రం గడువును సెప్టెంబర్‌ 2021 ‌నుండి 30-04-2022 వరకు ఆరుసార్లు పొడిగించింది. అయినప్పటికీ, 2020-21 రబీ పంటకు చెందిన 7.78 ఎల్‌ఎం‌టి బియ్యాన్ని (1.34ఎల్‌ఎం‌టిపారా బాయిల్డ్ ‌రైస్‌తో సహా) భారత ఆహార సంస్థకు మార్చి 31,2022 నాటికి పంపిణీ చేయడంలో కేసీఆర్‌ ‌ప్రభుత్వం విఫలమైంది.

ఫిబ్రవరి 5, 2021న జరిగిన ఆహార కార్య దర్శుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం 2021-2022 రబీ పంట కోసం బియ్యం సేకరణ అంచనాలను ప్రతిపాదించలేదు. కేంద్రం అడిగిన ప్రతిపాదనలకు ఇప్పటి వరకు సమాధానం కూడా ఇవ్వలేదు.

అసలు ప్రశ్నలు

రైతుల నుంచి కేసీఆర్‌ ఎం‌దుకు వరి కొనుగోలు చేయడం లేదు? భారత ఆహార సంస్థకు ముడిబియ్యం సరఫరా చేయడానికి ఒప్పందం చేసుకున్న కేసీఆర్‌• ‌వరి ధాన్యాన్ని ముడి బియ్యంగా మార్చడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదు? రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరించడంలో తెలంగాణకే ఎందుకు ఇబ్బంది? తెలంగాణ, 95% రాష్ట్రాలు వినియో గించని వరిని పార బాయిల్డ్ ‌రైస్‌గా మార్చాలని కేసీఆర్‌ ఎం‌దుకు పట్టుబడుతున్నారు? ఏడాదిన్నర క్రితం, డిసెంబర్‌ 2020‌లో భారతదేశమంతటా ఏ రాష్ట్రం నుండి బాయిల్డ్ ‌బియ్యాన్ని సేకరించకూడదని భారత ఆహార సంస్థ విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు కేసీఆర్‌ ఎం‌దుకు మౌనంగా ఉన్నారు? వరి సేకరణలో ఇతర ఏ రాష్ట్రానికీ సమస్య లేదు ఎందుకు? పారా బాయిల్డ్ ‌రైస్‌ ‌తీసుకోవాలని వేరే రాష్ట్రాలు ఎందుకు పట్టుబట్టడం లేదు? వరి ధాన్యాన్ని పారా బాయిల్డ్ ‌రైస్‌గా మార్చడానికి తెలంగాణ చెబుతున్న భౌగోళిక పరమైన సమస్యలు పొరుగు రాష్ట్రాలు ఆంధప్రదేశ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌మహారాష్ట్రలకు లేవా? భారత ఆహార సంస్థకు సమాచారం అందించి ఏడాదిన్నర కావస్తున్నా వరిని ముడి బియ్యంగా మార్చేందుకు కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదు? తమ ప్రభుత్వం ఇకపై పారా బాయిల్డ్ ‌రైస్‌ ‌పంపిణీ చేయదని భారత ఆహార సంస్థతో జరిపిన ఒప్పందంలో కేసీఆర్‌ ఎం‌దుకు సంతకం చేశారు? రబీ 2020-2021కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న బియ్యాన్ని మార్చి 31, 2022 నాటికి భారత ఆహార సంస్థకు కేసీఆర్‌ ఎం‌దుకు పంపిణీ చేయలేదు? 2021-2022 బియ్యం సేకరణకు అంచనాలు కేంద్రం అడిగినప్పటికి కేసీఆర్‌ ఎం‌దుకు పంపలేదు?

రాజకీయ లబ్ధి

జరిగిన సంఘటనలను పరిశీలిస్తే ప్రస్తుత పరిస్థితులు కేసీఆర్‌ ఉద్దేశపూర్వక సృష్టిగా భావించ వలసి ఉంటుంది. తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎం‌సీ, దుబ్బాక, హుజూరాబాద్‌ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా అవతరించింది. వంశ పారంపర్య కుటుంబ టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తెలంగాణను మిగులు బడ్జెట్‌ ‌నుంచి అప్పుల రాష్ట్రంగా మార్చింది. 2022 నాటికి మొత్తం రుణాలు దాదాపు రూ. 3.91 లక్షల కోట్లకు పెరుగుతాయి. కేసీఆర్‌ ‌ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేక పోతోంది. ఇక కేసీఆర్‌ ఆది వల్లిస్తున్న అబద్ధాల సంగతి చెప్పేదేముంది? దళితుడిని సీఎం చేస్తానని అబద్ధం చెప్పారు. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో ఏఐఎంఎంతో టీఆర్‌ఎస్‌ ‌పొత్తు ఉండదన్నారు. విద్యుత్‌ ‌సంస్కరణలు, దళిత బంధు పథకం, పేదలకు మూడు పడక గదుల ఇళ్లపై అబద్ధాలు చెప్పారు. ఇక రాజ్యాంగాన్ని మార్చాలి అన్న మాటలు కేసీఆర్‌ అహంకార పూరిత ధోరణికి ఎప్పటికీ నిదర్శనంగా మిగిలి ఉంటాయి.

వరి సేకరణపై ఈసారి కేసీఆర్‌ అబద్ధాలు చెప్పడానికి ప్రధాన కారణాలు్న    కేసీఆర్‌కు వరి సేకరణపై అవగాహన, చిత్తశుద్ధి లేవ్నుఅప్పుల ఊబిలో కూరుకుపోయిన కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి అరకొరగా ఉన్న ఆర్థిక వనరులను రైతుల కోసం వెచ్చించడం ఇష్టం లేద్ను బీజేపీని అప్రతిష్ట పాల్జేసేందుకు కేంద్రంపై నిందలు మోపాలని కేసీఆర్‌ ‌భావిస్తున్నారు.

ఒప్పందం ప్రకారం రబీ, ఖరీఫ్‌ ‌సీజన్‌లలో తెలంగాణ నుండి ముడి బియ్యం రూపంలో మొత్తం అదనపు నిల్వలను సేకరించేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. పారా బాయిల్డ్ ‌రైస్‌ ‌కొనుగోలు చేయాలని కేసీఆర్‌ ‌పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న ఘటనలు కేసీఆర్‌ ‌ప్రభుత్వ వంచనను బయట పెడుతున్నాయి. కేసీఆర్‌ ‌సృష్టించిన సమస్యకు పరిష్కారం – మాట మీద నిలబడి రైతుల నుంచి వరి సేకరించి, మిల్లుల ద్వారా ముడి బియ్యం భారత ఆహార సంస్థకు అందజేయడం.

నాయకత్వ అత్యంత తీవ్ర వైఫల్యం- ముందు చూపు లేకపోవడం.

  • డా. వినుషా రెడ్డి,  రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, ఇన్‌ఛార్జ్- ‌పాలసీ & రీసెర్చ్, ‌బీజేపీ, ఏపీ.

About Author

By editor

Twitter
YOUTUBE