‘మసీదు అక్రమ నిర్మాణం ఆపితే రాళ్లతో కొట్టి చంపాలని పథకం’
బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డితో ఇంటర్వ్యూ
మసీదు నిర్మాణం పేరుతో ఆత్మకూరులో కొందరు ముస్లింలు సాగించిన, సాగిస్తున్న దురాగతాలు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తోన్న ముస్లిం సంతుష్టీకరణ ఫలితమేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతి లేకుండానే హిందువుల నివాసాల మధ్య మసీదు కడతామంటూ దౌర్జన్యానికి దిగడం కూడా అందుకే. దీనితో హిందువుల మనుగడకు ముప్పు ఏర్పడింది. విచ్చలవిడిగా మసీదులు, దర్గాలు, మదర్సాలు నిర్మిస్తున్నారు. తమకు ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలని, షాదీఖానాలు నిర్మించాలని, మక్కాకు వెళ్లేందుకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్లు చేస్తున్నారు. ప్రాబల్యం ప్రదర్శించేందుకు సంఘటితమౌతున్నారు. ముస్లిం అల్లరిమూక పోలీస్‌స్టేషన్‌లపై దాడులు చేసినా వారిపై కేసులు పెట్టలేని పరిస్థితిలో పోలీసులు దిగజారిపోయారు. ఈ క్రమంలో ఆత్మకూరులో ఇటీవల మసీదు అక్రమ నిర్మాణం, దానిని నిర్మించే క్రమంలో అడ్డువచ్చే భాజపా నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డిని హత్యచేయాలనుకోవడం ముందే వేసుకున్న ప్రణాళిక. ఇంత తతంగంతో పక్కా ప్లాన్ వేసింది శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, ఆత్మకూరు స్ధానిక ఎస్‌డీపీఐ (సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) నేత. శిల్పాచక్రపాణి రెడ్డి అనుచరుడు రజాక్. అక్రమ మసీదు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వచ్చే శ్రీకాంత్‌రెడ్డిని రాళ్లతో కొట్టి చంపాలని స్వయంగా శిల్పాచక్రపాణి రెడ్డి అన్న మాటలు ఆడియో లీకైంది. భాజపా వత్తిడి మేరకు శ్రీకాంత్‌రెడ్డికి ఇటీవల బెయిల్ మంజూరైంది. కర్నూలు జిల్లాలో జరుగుతున్న తీవ్రవాద ముస్లింల అరాచకత్వం, ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, అతని అనుచరుడు రజాక్‌లను ఎదిరించినందుకు తనపై జరిగిన హత్యాయత్నం గురించి శ్రీకాంత్‌రెడ్డి జాగృతి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు ఇవి.
పోలీసులు ఎందుకు మీపై కేసులు పెట్టారు?
ఈ సంఘటనలో నేనే బాధితుడిని. కాని నాకు న్యాయం జరగలేదు సరికదా నాపై పోలీసులు తిరిగి కేసులు పెట్టారు. నేను మతం పేరుతో రెచ్చగొట్టి, రాళ్లు, కత్తులతో, హింసాత్మక ధోరణితో ఆయుధాలతో గుంపుగా వెళ్లి ముస్లింలు, పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి నట్లు కేసుపెట్టారు. మొత్తం అయిదు ఎఫ్‌ఐఆర్‌లు. నా మీద హత్నాయత్నం కేసుపెట్టారు. రౌడీషీట్ ఉందని పేర్కొన్నారు. నాపై రౌడీషీట్ ఉందని నాకు తెలీదు.
ఆత్మకూరు ఘటన కావాలని జరిపిన కుట్రగా భావిస్తున్నారా?
ముమ్మాటికీ కుట్రే. హిందూ వ్యతిరేక చర్యలను నేను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాను. ఆత్మకూరులో నివాసాలు, పాఠశాలల మధ్య ఒక మసీదును నిర్మించడానికి కొందరు ముస్లింలు పూనుకున్నారు. కలెక్టర్ అనుమతి ఇవ్వలేదు. అయినా నిర్మించేందుకు చేసిన ప్రయత్నాలను నేను బహిర్గతం చేయడంతో పగపెంచుకున్నారు. మళ్లీ అక్కడ మసీదును నిర్మిస్తే అడ్డుకునేందుకు నేను వస్తానని అప్పుడు నన్ను అక్కడే హతమార్చాలని పన్నాగం పన్నారు. ఈ పథకం అమలుకు వెలుగోడు, నంద్యాలల్లో ముస్లిం యువతకు ఎస్‌డీపీఐ శిక్షణ ఇచ్చింది. జనవరి 9 న శనివారం దాడి జరిగింది.
దాడులకు, హత్యాయత్నానికి ఎవరు పాల్ప డ్డారు? పురికొల్పింది ఎవరు?
ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి నన్ను హత్య చేయాలని కుట్రపన్నారు. నేనంటే పగతో ఉన్న ముస్లిం యువతను పావులుగా వాడుకున్నారు. హిందువులంటే పడని ఎస్‌డీపీఐకి నన్ను అడ్డు తొలగించే బాధ్యత అప్పగించారు.
మసీదు అక్రమ నిర్మాణంలో ముస్లింలు మీపై దాడిచేస్తే వైకాపా ఎందుకు తలదూర్చింది?
ఎస్‌డీపీఐ స్ధానిక నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి సన్నిహితుడు. చక్రపాణిరెడ్డి చేస్తున్న అక్రమాలను భాజపా కార్యకర్తగా నేను మొదటి నుంచి అడ్డు కుంటున్నా. శ్రీశైలంలో ఎమ్మెల్యే అనుచరుడు రజాక్ చేస్తున్న అక్రమాలపై నేను పోరాడుతున్నా. ఈ కారణాలన్నింటితో శిల్పాచక్రపాణి రెడ్డి నాపై పగ పెంచుకున్నారు.
రాత్రికి రాత్రి ఆత్మకూరులో మసీదు నిర్మాణం పూర్తిచేయాలని శిల్పాచక్రపాణి రెడ్డి నిర్ణయించు కోవడం వెనుక మర్మం ఏమిటి?
శిల్పా చక్రపాణి రెడ్డి కొన్ని రోజుల ముందు ఇక్కడ పర్యటించారు. స్థానిక ముస్లింలు మూడేళ్ల క్రింద• ఆగిన మసీదు నిర్మాణం సంగతి ఆయనకు చెప్పారు. మసీదు నిర్మాణం పూర్తిచేయడంతోపాటు, నన్ను తుదముట్టించాలని భావించారు. మసీదు నిర్మాణానికి అవసరమైన రాళ్లను, సిమెంటును ఇతర వస్తువులను ముందే తెచ్చేసుకుని అక్కడ ఉంచు కోవాలని సూచించారు. డిఎస్పీతో ఒక రోజు అనుమతి తీసుకుంటానని అదే రోజు 24 గంటల్లో మసీదును నిర్మించాలని, రెండూ మూడు రోజులైతే హిందువులు సంఘటితమైతే సమస్య వస్తుందని చెప్పారు. స్టేషన్‌పై దాడిచేసిన ప్రతి వ్యక్తికి శిల్పా చక్రపాణిరెడ్డి రూ.పది వేలు ఇచ్చాడు. అయితే మసీదు నిర్మిస్తున్నప్పుడు స్ధానికంగా వున్న హిందువులు అడ్డుకున్నారు. గంట గంటకు వారు అడ్డుకోవడంతో నిర్మాణ జాప్యం జరిగింది. రెండో రోజూ నిర్మాణం కొనసాగింది. పోలీసులు రంగప్రవేశం చేసి హిందువు ను తరిమికొట్టి ఇళ్లకు తాళాలు వేసి మసీదు నిర్మాణానికి సహకరించారు. ఇంత అక్రమం జరగడంతో నాకు సమాచారం అంది ఆత్మకూరుకు వచ్చా.
శిల్పా చక్రపాణికి మీమీద ఎందకంత ద్వేషం?
ఆయన అవినీతి కార్యక్రమాలను నేను అడ్డు కుంటున్నాను. ఇతని అనుచరుడు రజాక్ శ్రీశైలంలో ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్నాడు. దేవస్ధానం నిర్వహణల్లో ఇతను జోక్యం చేసుకుంటున్నాడు. పవిత్ర శివలింగాన్ని లేపి కింద నవరత్నాలు ఏరుకునే వీడియోను నేను బహిర్గతం చేశాను. రౌడీయిం చేయడంతో కాంట్రాక్టు పనులన్నీ ఇతని కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఈ గూండాయిజాన్ని ప్రశ్నించా. ఒకసారి దేవస్ధానం పాలకవర్గ సమావేశాన్ని అతడు నిర్వహించడం గురించి నిలదీశాను. దాంతో శిల్పా చక్రపాణిరెడ్డి, రజాక్ ద్వేషం పెంచుకున్నారు.
కర్నూలు జిల్లాలో ముస్లిం సంతృష్టీకరణ ఎప్పటి నుంచి కొనసాగుతుంది?
1980 తర్వాత నుంచి సంతుష్టీకరణ జరుగు తోంది. తెదేపా వచ్చాక కాంగ్రెస్, తెదేపా రెండూ ముస్లిం ఓట్ల కోసం వారి డిమాండ్లను నేరవేర్చ సాగాయి. ఇక వైకాపా ఆవిర్భావం నుంచి మైనారిటీ లకు ఎంతో ప్రాధాన్యమిచ్చింది. వారిని అన్ని రకాలుగా ప్రలోభపెట్టి ఓట్లు గంపగుత్తగా వేయించు కుంది. ఇక్కడి గ్రామాల్లో ముస్లింలు సంఘటితమై షాదిఖానాలు కావాలని, మదర్సాలు, మసీదులు నిర్మించాలని డిమాండ్‌లు చేస్తున్నారు. వైకాపా రాజకీయంగా పూర్తి అధిపత్యం సాధించేందుకు ముస్లింల గొంతెమ్మకోర్కెలన్నీ నెరవేరుస్తుంది. హిందూ ఆలయాల స్థలాలను ఆక్రమించి అక్కడ మసీదులు కూడా నిర్మించారు. మసీదుల అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తోంది. వాటి నిర్మాణానికి నిధులు ఇస్తోంది.
ఇంత దూకుడుకు కారణం?
తమ ప్రాబల్యం చూపించుకునేందుకు ముస్లింలు ప్రయత్నిస్తున్నారు. తామంతా సంఘటితంగా ఉన్నామని తమ జోలికి వస్తే చంపడానికి కూడా వెనుకాడమని ఇలాంటి చర్యల ద్వారా చెబుతున్నారు. తమకు వైకాపా వంటి పార్టీల అండ ఉందనేది వారి ధీమా. ఆత్మకూరేకాదు, గుంటూరు పోలీస్ స్టేషన్‌లపై దాడిని గమనిస్తే మనకు తెలుస్తుంది. పోలీసు స్టేషన్‌పై అల్లరి ముస్లిం మూక దాడులు చేసినా కేసులు పెట్టనీయకుండా ఎమ్మెల్యేలు, మంత్రులే పోలీసులపై వత్తిడి తెస్తున్నారు. పేదలు, ఏమీ తెలియని బాలురు రాళ్లేయలేదు. చూడటానికి వచ్చారని చెప్పి పంపేస్తున్నారు.
ఉగ్రవాద సంస్థలు ఎందుకు రాయలసీమలో అడ్డాగా ఎంచుకున్నాయి?
ఈ ప్రాంతంలో ఉదాసీనతే దీనికి కారణం. కోస్తాతో పోలిస్తే ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువ. మదర్సాలూ ఎక్కువే. వీటిలో రాష్ట్రానికి చెందని వ్యక్తులున్నారు. వారెవరో తెలీదని స్ధానిక ముస్లింలే చెబుతున్నారు. ముస్లింలు తప్పులు చేసినా వారిపై ఈగ వాలనీయకుండా ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు వత్తిడి చేస్తారు. ధర్ణాలకు కూడా దిగుతారు. నిందితులకై పోలీసులు మదర్సాల్లో వెదికే ప్రయత్నం చేస్తే ఆడపిల్లల చేతులు పట్టుకున్నట్లు కేసులు పెట్టిస్తున్నారు. ఇటీవల ఇద్దరు పాకిస్తాన్ జాతీయులు ఇక్కడ అరెస్టయ్యారు. ఎన్‌ఐఏ సోదాలు జరిగాయి. ఐఎస్‌ఐ పోస్టులు వెలుస్తున్నాయి. డీఎస్‌పికి చెప్పినా పట్టించుకోవడం లేదు. మద్యం సేవించి బైక్ నడిపిన ముస్లిం వ్యక్తిని సి.ఐ. పట్టుకుంటే అతడు ఎదురు తిరిగాడు. సి.ఐ. అతని చొక్కా పట్టుకుంటే ముస్లిం ఎమ్మెల్యేలు సిఐచే క్షమాపణలు చెప్పించారు.
ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుంది?
రాయలసీమలో ఉగ్రవాదులకు గట్టి నెట్‌వర్క్ ఉంది. కరోనా సమయంలో ఢిల్లీలో జరిగిన జమాత్ సమావేశాలకు రాయలసీమలోని ప్రతి గ్రామం నుంచి కనీసం ఒకరు వెళ్లారు. ఎస్‌డీపీఐ, పిఎఫ్‌ఐ నెట్‌వర్క్ ఉంది ఐఎస్‌ఐ నెట్‌వర్క్ ఉంది. ఏ గ్రామం లోకి అయినా వారు వెళ్తారు. ఎక్కడైనా ఉంటారు. యువతను తీసుకెళ్తారు. మతపరమైన విద్య ప్రతి గ్రామంలో జరుగుతోంది.
మీకు బెయిల్ రాకపోవడం వెనుక ఉన్నది ఎవరు?
డీఎస్పీ, శిల్పా చక్రపాణిరెడ్డి. డీఎస్పీకి హిందూ వ్యతిరేకవైఖరి చూపిస్తున్నారు. ఆమెకు హిందువులపై విపరీతమైన ద్వేషం ఉన్నట్లు ఆమె చర్యలో తెలుస్తోంది. నన్ను ఆత్మకూరుకు రమ్మంది ఆవిడే. హిందువులను ఆ స్థలంలో లేకుండా చేసింది ఆవిడే. నాపై తప్పుడు కేసులు పెట్టించింది ఆవిడే. ఎవరూ నాపై ఫిర్యాదు చేయకున్నా ఫలానా సెక్షన్లు పెట్టాలని ఎస్‌ఐ మీద వత్తిడి తెచ్చి కేసులు పెట్టించింది. శిల్పాచక్రపాణి రెడ్డి, ప్రభుత్వం పాత్ర కూడా ఉంది.
హోంమంత్రి స్వయంగా మీరే హత్యానేరం చేసినట్లు ఆరోపించడం, అల్లరిమూకపై ఏ మాత్రం స్పందించకపోవడాన్ని బట్టి ఆమెపై తీవ్రవత్తిడి ఉందని భావిస్తున్నారా?
కచ్చితంగా! నామీద ముస్లింలు దాడిచేయడం వీడియోల్లో కనిపిస్తుంది. అయినా నాపై అసత్య ఆరోపణలు ఆపాదించారు. దీని వెనుక హోం మంత్రిపై ప్రభుత్వ వత్తిడి ఉంది. శిల్పా చక్రపాణి రెడ్డి నన్ను రాళ్లతో కొట్టి చంపాలని మాట్లాడిన ఆడియో లీకైంది. జిల్లా ఎస్‌పీ చక్రపాణిపై ఎ2గా కేసు పెట్టాలని చెప్పినా హోంమంత్రి పెట్టనీయలేదు.
– తురగా నాగభూషణం, వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్