రాజకీయ స్వార్థ పండిచుకోడానికి దేశ స్వాతంత్య్రాన్ని, స్వాభిమానాన్ని తాకట్టు పెట్టగల వ్యక్తుల, శక్తుల జాడ కనిపెట్టడం కష్టమే. అభి, జయచంద్రుడు అంతరించినా దుష్టబుద్ధులు అంతరించలేదు. స్వతంత్ర భారత రాజకీయాలలోనూ ఈ దుర్నీతుల కుట్రలు కొనసాగడం విషాదం. చరిత్ర నేర్పిన పాఠాల వెలుగులో ప్రజలు జాగరూకులు కావాలి. సిరి సంపదలతో తులతూగుతున్న విజయనగర సామ్రాజ్యం పైన విజాతీయుల కన్ను పడ్డది. ఐదుగురు సుల్తానులు ఏకమై వచ్చినా సమరాగణ సార్వభౌముడుగా కీర్తి గడిచిన శ్రీకృష్ణదేవరాయలను నేరుగా యుద్ధంలో ఎదుర్కోలేని అశక్తత వారిది. కృష్ణరాయల కళాభిమానం ఆధారంగా కుట్ర పన్నారు. ఓ భారతీయ నర్తకి రాయల కొలువులో ప్రవేశించి, అభిమానం చూరగొన్నది. మహామంత్రి తిమ్మరుసు జాగరూకత వల్ల ఆమె ఎత్తులు పారలేదు. సుల్తానుల పన్నాగం విఫలమైంది.
అన్నదాతల పట్ల మోదీ ప్రభుత్వానికి గల సానుభూతి నేపథ్యలో ప్రజా ఉద్యమాల పేరిట దుష్టశక్తుల కపట యుద్ధం మొదలైంది. రైతు ఉద్యమం ముసుగులో దుష్టశక్తులు జాతి ప్రతిష్ఠను దిగజార్చేందుకు విఫలయత్నం చేశాయి. ఈ కుట్ర లోతుపాతులను, మూలాలను అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. అందుకు స్థానిక రాజకీయాలతో పాటు ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాల పట్ల అవగాహన అవసరం. మన ఈశాన్య సరిహద్దులో డోక్లాం వద్ద చొరబాట్లకు చైనా ప్రయత్నిస్తే భారత్ తిప్పి కొట్టింది. 1962 నాటి మెతక ప్రభుత్వం కాదని చైనాకు తెలియ చెప్పింది. చైనాకు చెందిన వందకిపైగా యాప్స్‌ను నిషేధించిన మోదీ ప్రభుత్వం ఆర్థికంగా చైనాను దెబ్బతీసింది. మరోవైపు చైనాకు చెందిన హువాయ్, జడ్‌టి వెబ్‌సైట్లు సేకరిస్తున్న సమాచారం తమ జాతీయ భద్రతకు, గోప్యతకు ప్రమాదకరమని ప్రకటించిన అమెరికా వాటిని నిషేధించింది. ఇంగ్లాండు, ఆస్ట్రేలియాలు కూడా అదే బాటలో నడిచాయి. వివిధ రంగాల్లో ఇతర దేశాలకు చెందింన సమాచారాన్ని రహస్యంగా సేకరించి ఆధిపత్యం చాటుకోవాలనే చైనా కుట్రలకు కళ్లెంపడ్డది. ఆస్ట్రేలియా మరికాస్త ముందుకు వెళ్లింది. చైనాకు ఇచ్చిన బొగ్గు గనుల లీజును రద్దుచేసి వాటిని భారత్‌కు చెందిన ఆదానీ గ్రూపుకు కట్టబెట్టింది. పర్యావరణ కార్యకర్తల ముసుగులో ఆస్ట్రేలియా వామపక్షులు ఆందోళనకు దిగారు. పర్యావరణ చిక్కులేమీ లేవని నిర్ధారించుకునే భారత్ కంపెనీలకు లీజుకిచ్చినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం తేల్చి చెప్పింది. దాంతో చైనా ఆశలు ఆవిరి అయ్యాయి. చైనా బాధలు అక్కడితో ఆగలేదు. డోక్లాంలో మోదీ అడ్డుపడితే, ఆస్ట్రేలియాలో ఆదాని అడ్డుపడితే, టెక్నాలజీ రంగంలో అబాని అడ్డుపడుతున్నాడు. కొద్ది రోజుల్లోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 5జి టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామని ఇటీవలే రిలయన్స్ అధినేత అబాని ప్రకటించారు. చైనాకు చెందిన చౌకరకం ఫోన్లు ఇప్పటికే ఇండియాతో సహా ప్రపంచ దేశాలను ముంచెత్తి ప్రంపంచ ఆర్థిక శక్తిగా చైనా ఎదగడానికి తోడ్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కు చెందిన వ్యాపారి 5జి టెక్నాలజీతో పోటీ వస్తే చైనా కొంప కొల్లేరే! అడుగడుగునా తనకు, తన విస్తరణ కాంక్షకు భారత్ అడ్డుపడుతోంది. అందుకు కారణం మోదీ. కాంగ్రెస్‌నేత రాహుల్ ప్రధాని కాకుండా మోదీ అడ్డుపడుతున్నారు. అంటు కాంగ్రెస్‌కు, ఇటు కమ్యూనిస్టలకు ఇద్దరికీ మోదీ కంటగింపు అయ్యారు. మోదీతో నేరుగా తలపడే శక్తి ఇద్దరికీ లేదు. ఇద్దరూ కలిసి ప్రయత్నించినా ప్రజలు మోదీకే రెడోసారి కూడా పట్టం కట్టారు. పురుషోత్తముడిని ఎదిరించలేని అభి అలెగ్జాడరుతో చేతులు కలిపాడు. పృథ్విరాజ్‌ను ఎదుర్కోలేని జయచంద్రుడు ఘోరీతో చేతులు కలిపాడు. దేశం గతి ఏమిటని ఇద్దరూ ఆలోచించలేదు. చైనాకు మోదీ ఓటమి కావాలి. కానీ అది చైనా చేతుల్లో లేదు. భారతీయుల సాయంతో దాన్ని సాధించాలి. దానికోసం భారత ప్రజల దృష్టిలో మోదీని ప్రజా వ్యతిరేకిగా, దోపిడీదార్ల తొత్తుగా చిత్రించాలి. సాగు చట్టాల రద్దు కోరుతూ రైతుల ముసుగులో కమ్యూనిస్టలు, కాంగ్రెస్ సాగిస్తున్న ఉద్యమ లక్ష్యం రైతు ప్రయోజనాలు కాదు. రైతుల కోసం దశాబ్దాలుగా కమ్యూనిస్టలు కోరుతున్న, పలుమార్లు కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికల్లో పేర్కొన్న అంశాలకు నూతన వ్యవసాయ చట్టాలు ప్రాణం పోస్తున్నాయి. అర్టికిల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ నిషేధం వంటి చట్టాలను ఆమోదించి, అన్నదాతలకు మేలు చేకూర్చే చట్టాలను రద్దు చేయాల్సిందే అని కోరడమేమిటి? ఈ చట్టాలతో ఏవిధంగాను సంబంధం లేని అబానికి చెందిన వందకు పైగా రిలయన్స్ సెల్ టవర్లను ఆందోళనకారులు ధ్వంసం చేయడం చైనా ధ్వంస రచనేనా! రహదారులు, పోర్టులు వంటి లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులను కాంగ్రెస్ ఏలుబడిలో అబాని, ఆదానిలకు కట్టబెట్టి, గుజరాతీయులకు మోదీ దోచి పెడుతున్నారని రాహుల్ ఆరోపించడం చైనా ఆలోచనేనా! అధికారంలోకి వస్తే సిఎఎను రద్దు చేస్తామని కాగ్రెస్ నేత అస్సాంలో ప్రకటించడంలో ఆతర్యమేమిటి! స్వార్థపరుల పన్నాగాలను ప్రజలు గ్రహిచాలి. దుష్టశక్తుల ఎత్తులను చిత్తు చేయడానికి ప్రతి భారత పౌరుడూ మహా మంత్రి తిమ్మరుసు కావాలి! అప్రమత్తతో స్వార్థపరుల కుట్రను గ్రహించాలి. కుట్రలో పావులైన స్వదేశీయులను కనిపెట్టి ప్రజాక్షేత్రం నుండి తరిమి కొట్టాలి!!