భారత్‌ ‌వ్యావసాయిక దేశం. సేద్యం భద్రంగా ఉండాలి. ఆ వృత్తికి గౌరవం ఇవ్వాలి. లేకపోతే  దేశం సుభిక్షంగా ఉండలేదు. మన సాంస్కృతిక మూలాలను గుర్తు చేసే పలు సామాజిక వ్యవస్థలలో వ్యవసాయం ప్రధానమైనది కూడా. జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా ఎంత.. వంటి గణాంకాలతో, ప్రశ్నలతో నిమిత్తం లేకుండా సేద్యాన్ని కాపాడుకోవడం భారతీయులందరి మీద ఉన్న సాంస్కృతికపరమైన బాధ్యత. అందుకే రైతు శ్రేయస్సును ఏ స్థితిలో అయినా అంతా ఆకాంక్షించాలి. 2020, సెప్టెంబర్‌ 27‌న తెచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాల ఉద్దేశం రైతాంగాన్ని ఆదుకోవడమేనని, వ్యవసాయాన్ని సంపద్వంతం చేయడమేనని భారత ప్రభుత్వం సుస్పష్టంగా చెబుతోంది. ఈ చట్టాల వల్ల వ్యవసాయరంగం ప్రైవేటుపరం అవుతుందని, అందుకు నిరసనగా ఆందోళనకు దిగామని ప్రస్తుతం ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు చెబుతున్నారు. చలో ఢిల్లీ పిలుపుతో సెప్టెంబర్‌ 26, 27 ‌తేదీలకు వీరంతా ఢిల్లీ బయలుదేరారు. డిసెంబర్‌ ‌చలిని కూడా లెక్కచేయకుండా రైతులు ఢిల్లీ వీధులలో పడిగాపులు పడి ఉండడం బాధాకరమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌విచారం ప్రకటించారు. పిల్లలు, స్త్రీలు సహా వచ్చి లక్షకు పైగా రైతులు ఢిల్లీలోను, ఆ నగర సరిహద్దులలోను నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒకదాని తరువాత ఒకటిగా డిసెంబర్‌ ఐదు వరకు కేంద్రంతో ఐదుసార్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. డిసెంబర్‌ 8‌వ తేదీ భారత్‌ ‌బంద్‌కు (పరిమిత గంటలు) కూడా రైతులు పిలుపునిచ్చారు.

తమ కోర్కెలు చాలా సాధారణమైనవి కాబట్టి తీర్చాలని రైతులు చెబుతున్నారు. ‘రైతులకు వ్యతిరేకం’ కాబట్టి కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలను, మళ్లీ పార్లమెంటు సమావేశాలు పెట్టి రద్దు చేయాలని చెబుతున్నారు.

సమస్య ఎక్కడ ఉంది?

ఈ మూడు చట్టాలు ఏమిటి? కర్షకుల ఉత్పత్తి- వాణిజ్య అవకాశాలు- కల్పన చట్టం, వ్యవసాయదారుల సాధికారత- రక్షణ ఒప్పందం- ధరలకు పూచీ- సేవల చట్టం, నిత్యావసరాల సవరణ చట్టం. వీటి ప్రకారం రైతులకీ, కొనుగోలుదారులకీ మధ్య దళారీలు ఉండరు. రైతు తన ఉత్పత్తిని తనకు ఇష్టం వచ్చినచోట విక్రయించుకునే అవకాశం ఉంటుంది. అయితే దీనిని కనీస విక్రయ ధర రైతుకు దక్కకుండా చేసే కుట్ర అని విపక్షాలు ప్రచారం ఆరంభించాయి. పంజాబ్‌ ‌సహా కొన్ని రాష్ట్రాలు ఈ చట్టాలను ఆమోదించడం లేదని ప్రకటించాయి కూడా. గుంటూరుకో, కరీంనగర్‌కో లేదంటే మరొక మారుమూల ప్రాంతానికో చెందిన చిన్నరైతు తన వ్యవసాయోత్పత్తిని దేశంలో ఎక్కడికో తీసుకువెళ్లి ఎలా అమ్ముకోగలడని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఎక్కడైనా అమ్ముకోవచ్చునని చెబుతున్నది. మార్కెట్‌ ‌కమిటీలలో కూడా ఉత్పత్తి అమ్ముకోవచ్చునని చెబుతున్నది. అంటే వీలుంటే ఎక్కడైనా విక్రయించు కోవచ్చు. లేదంటే వారి గ్రామంలోని మార్కెట్‌ (ఉం‌టే)లో కూడా అమ్ముకోవచ్చు.

రైతుల ప్రధానమైన కోరిక- రైతుల ఉత్పత్తికి సరైన పైకం అందేటట్టు చేయడానికి కనీస మద్దతు ధర కల్పనకు చట్టబద్ధత కల్పించాలి. కనీస మద్దతు ధర ఎప్పటికీ కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇదివరకు కూడా చెప్పింది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని ప్రభుత్వం చర్చలలో పాల్గొన్న 40 మంది రైతు నాయకులకు తేల్చి చెప్పేసింది. అలా అయితే కనీస మద్దతు ధరకు కూడా చట్టరూపం కల్పించాలని ఆందోళన చేస్తున్న రైతులు కోరుతున్నారు. వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌ ‌కమిటీ (ఏపీఎంసీ) బయట రైతులు ఉత్పత్తులు అమ్ముకోవడానికి అవకాశం ఈ చట్టాలు ఇస్తున్నాయని వారి ఆరోపణ. దీనితో మండీల (మార్కెట్లు) విధానం కనుమరుగవుతుందని కూడా రైతులు అనుమానిస్తున్నారు. కానీ ప్రస్తుతం కూడా 70 శాతానికి పైగా రైతులు తమ ఉత్పత్తిని మండీలకు బయటే అమ్ముకుంటున్నారు కదా, కొత్తగా వచ్చే సమస్య ఏమిటి అని పలువురు విశ్లేషకులు వేస్తున్న ప్రశ్నకు సమాధానం లేదు.  అంతర్రాష్ట వాణిజ్యానికి ఈ చట్టాలు తలుపులు బార్లా తెరుస్తాయని కూడా రైతులు అనుమానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సెస్‌ (‌రుసుము) వసూలు చేసే అవకాశం లేకుండా చేస్తుండడం వల్ల కూడా మార్కెట్లు మాయమయ్యే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. అప్పుడు కార్పొరేట్‌ ‌సంస్థల దయాదాక్షిణ్యాల మీద రైతులు బతకవలసి వస్తుందని కూడా చెబుతున్నారు. ఈ మార్కెట్లు ఎప్పుడైతే పతనమవుతాయో అప్పుడు ఉత్పత్తుల సేకరణలో ఇచ్చే కనీస మద్దతు ధర కోసం కార్పొరేట్‌ ‌శక్తుల చేతులలోకి వెళుతుందని కూడా భావిస్తున్నారు. మొదట మంచి ధరలే ఇచ్చి, రైతులు మార్కెట్‌ల మీద ఆధారపడడం తగ్గించిన తరువాత ధరలను కార్పొరేట్‌ ‌సంస్థలే నిర్ణయించి, రైతుల డిమాండ్‌ ‌శక్తిని హరిస్తాయన్నదే వారి ఆరోపణ.

చర్చలు ఫలవంతమయ్యేనా?

భారతదేశానికి రైతే వెన్నెముక అని, భారతీయతకు అతడే ప్రతీక అని చెబుతూనే రైతాంగం ఆగ్రహానికి దురుద్దేశాలు అంటకట్టడం సరికాదని ఎవరు వాదించినా కాదనలేం. కానీ ఆందోళనకు దిగినది రైతులే అయినా, వాస్తవాలను గురించి చర్చించకుండా ముందరి కాళ్లకు బంధం వేయడం కూడా సరికాదు. మీరు ఆ చట్టాలను రద్దు చేయండి! చేస్తారా లేదా? ఏదో ఒకటే చెప్పండి అంటూ రైతులు భీష్మిస్తే చర్చలకు అర్థం ఏమిటి? ‘ఎస్‌ ఆర్‌ ‌నో’ ఏదో ఒకటే మాట చెప్పాలంటూ ప్లకార్డులు పట్టుకుని రైతునేతలు చర్చలలో శాసిస్తున్నారు. ఇది చర్చలను ఫలవంతం చేయడానికో, వారే చెబుతున్నట్టు సమస్య శాంతియుతంగా పరిష్కారం కావడానికో ఉపకరించేదేనా అన్న అనుమానం కలుగుతుంది. రైతులు సేద్యంలో ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చవలసిన బాధ్యత నిశ్చయంగా ప్రభుత్వాలదే. అందులో జాప్యం జరిగితే అందుకు రైతాంగం ఉద్యమించవచ్చు. ఆ హక్కు అందరికంటే వారికే ఎక్కువగా ఉంది. కానీ వారికి విపక్షాల ‘బయటి నుంచి మద్దతు’ గురించి, కొన్ని విచ్ఛిన్నకర శక్తుల ప్రవేశం గురించి ఆరోపణలు వచ్చినప్పుడు, ఢిల్లీ వీధులలో సాగుతున్నది రాజకీయసేద్యమని బలమైన అభిప్రాయం వెల్లువెత్తినప్పుడు ఆ కోణాలను దేశం పట్టించుకోకుండా ఉండలేదు.  రైతుల సంక్షేమం కోరడం వేరు. వారి సంక్షేమం పేరుతో ఆచరణ సాధ్యం కాని కోర్కెలు ప్రభుత్వం ముందు పెట్టడం వేరు. వాటి మీద ప్రభుత్వ వైఖరి ఏమిటో తేలకుండా ఆందోళనను విస్తరించే ప్రయత్నాలు సాగించడం ఎంతవరకు సబబో అర్థంకాదు. మద్దతు ధర గురించి లిఖితపూర్వక హామీ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా భారత్‌ ‌బంద్‌కు పిలుపునివ్వడం వెనుక ఉద్దేశం ఏమిటో అంతుపట్టదు. ఇదంతా చూస్తే చర్చలు మొక్కుబడికేనన్న వైఖరి, అసలు ఉద్దేశం ఆందోళనేనని, బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమేనని అనిపించక మానదు.

ప్రధాని మోదీ, బీజేపీ కలవరం

నవంబర్‌ 29‌న జరిగిన ‘మన్‌కి బాత్‌’ ‌కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయం ప్రస్తావించారు. గురునానక్‌ 551 ‌జయంతిని (నవంబర్‌ 30) ‌గుర్తుచేస్తూ, ‘హరియాణా-పంజాబ్‌ ‌సరిహద్దులలో జరుగుతున్న రైతు చట్టాల వ్యతిరేక ఆందోళనలను ఖలిస్తాన్‌వాదులు తమ అధీనంలోకి తీసుకువెళ్లారని మోదీ అన్నారు. ఈ మేరకు తమకు నివేదికలు అందాయనీ, ఇందువల్ల దేశభద్రతకు ముప్పు ఏర్పడిందని వ్యాఖ్యానించారు. జితేంద్ర భోయి అనే మొక్కజొన్న రైతు ఈ చట్టాలు వచ్చిన తరువాత  పాత బకాయీలను ఎలా సాధించుకోగలిగాడో ప్రధాని గుర్తు చేశారు. వదంతలు, దుష్ప్రచారాలు నమ్మవద్దని రైతులను కోరారు.

బీజేపీ ఐటి విభాగం అధిపతి అమిత్‌ ‌మాలవీయ చేసిన ట్వీట్‌లో కలవర పెట్టే విషయం ఉంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో పాల్గొంటున్న కొందరి నోటి నుంచి, నరేంద్ర మోదీని బెదిరించే క్రమంలో ఇందిర హత్యోదంతం గురించి నినాదాలు వినిపిస్తున్నాయి. ఇందిరకు పట్టిన గతే మోదీకీ పడుతుందని హెచ్చరిస్తున్నారు. పంజాబ్‌ ‌రైతుల ఆందోళన పేరుతో ఖలిస్తాన్‌ ఎజెండా అమలుకు ప్రయత్నం జరుగు తున్నదని మాలవీయ తన ట్వీట్‌లో విశ్లేషించారు. రైతులు నిరసన చేస్తున్న ప్రదేశాలలో ఖలిస్తాన్‌ ‌పతాకాలు ఉన్న సంగతిని కూడా కొన్ని వీడియోల ద్వారా మాలవీయ చూపించారు. పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఉ‌గ్రవాదులతో జతకడుతున్నదని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలను విడుదల చేశారు. ఇదేమి రైతు ఆందోళన? పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి అమరీందర్‌ ‌సింగ్‌ ‌నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని ఆయన హెచ్చరించారు. బీజేపీ అధికార ప్రతినిధి తేజిందర్‌ ‌బగ్గా కూడా రైతుల ఆందోళన రాజకీయ ప్రయోజనాలతో ప్రేరేపితమైందనీ, ఇందుకు కాంగ్రెస్‌దే బాధ్యత అనీ ఆరోపిస్తున్న పలు వీడియోలను చూపించారు. ‘ఖలిస్తాన్‌ ‌జిందాబాద్‌ అని ఎవరు నినాదం ఇచ్చినా అతడు రైతు కాలేడు. ఏ రైతయినా దేశభక్తుడే. అతడు దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించలేడు. ఖలిస్తాన్‌ ‌జిందాబాద్‌ అం‌టూ నినాదాలు ఇస్తున్న వారంతా కాంగ్రెస్‌ ఏజెంట్లే’ అని బగ్గా తన ట్వీట్‌లో ఆరోపించారు. ఢిల్లీ బీజేపీ నాయకుడు ఇంప్రిత్‌ ‌సింగ్‌ ‌బక్షి మాత్రం రైతులను ఖలిస్తాన్‌ ‌వాదులుగా చిత్రించవద్దని కోరారు. కాంగ్రెస్‌, ‌శిరోమణి అకాలీదళ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ పెడదోవ పట్టించిన ఫలితంగానే వారంతా ఆందోళనకు దిగారని ఆయన అభిప్రాయ పడుతున్నారు.

ఈ రైతు ఉద్యమానికి గతంలో జరిగిన షాహిన్‌బాగ్‌ ఆం‌దోళన రూపం తేవాలని టుక్డే టుక్డే ముఠా ప్రయత్నిస్తున్నదని ఢిల్లీ ఎంపి మనోజ్‌ ‌తివారీ చెబుతున్నారు. దక్షిణ ఢిల్లీలో మొదలైన షాహిన్‌బాగ్‌ ఆం‌దోళన సీఏఏకు వ్యతిరేకం ఆరంభమై, కొవిడ్‌ 19 ‌నేపథ్యంలో వెనక్కిపోయింది. ఖలిస్తాన్‌ ‌నినాదాలు, ప్రధానిని చంపుతామంటూ వ్యాఖ్యలు చేయడం చూస్తే ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగినదేనని భావించవలసి వస్తున్నదని తివారీ అభిప్రాయపడ్డారు. షాహీన్‌బాగ్‌ ఆం‌దోళన మాదిరిగానే దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి రైతు ఉద్యమాన్ని కూడా అదే బాటలో నడపాలని టుక్డే టుక్డే మూకలు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పారు.

సానుభూతి మాటున మూగబోతున్న సాక్ష్యాలు

రైతు ఉద్యమాలంటే ఈ దేశంలో ముందు నుంచి గౌరవం ఉన్నది. బ్రిటిష్‌ ‌పాలనలో దేశభక్తితో సాగిన ఆ ఉద్యమాలది ప్రత్యేక చరిత్ర. స్వాతంత్య్ర పోరాటంతో సమాంతరంగా రైతాంగ ఉద్యమాలు ఇక్కడ జరిగాయి. ఆ నేపథ్యాన్ని బట్టే కాబోలు తాజా రైతు ఉద్యమంలో కనిపిస్తున్న కొన్ని పెడధోరణుల గురించి ప్రస్తావించడానికి చాలామంది సందేహిస్తు న్నారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాటి పట్ల మౌనం దాలుస్తున్నారు. బీజేపీ వ్యతిరేక ఆందోళనకు మద్దతు ఇవ్వడమే పనిగా ఉన్న మీడియా కూడా వాటిని మరుగుపరుస్తున్నది.

ఖలిస్తాన్‌ ‌జాడలు నిజం కాదా?

ఎన్‌డీఏ రైతు సంస్కరణ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్‌- ‌హరియాణా సరిహద్దులలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఖలిస్తాన్‌ అనుకూలురు పాల్గొన్నారని వార్తలు వచ్చిన మాటయితే నిజమే. ఒక సిక్కు ఆందోళనకారుడు మాట్లాడినట్టు చెబుతున్న వీడియోలోని అంశం చాలా తీవ్రమైనదే. ‘మేం కెనడాలో తెల్లవాళ్లను డీకొట్టాం. ఢిల్లీ మాకు లెక్కకాదు. ఇందిరాగాంధీని చంపాం. డిసెంబర్‌ 3 ‌నాటి చర్చలు విఫలమైతే అలాంటి గతే నరేంద్ర మోదీకి పడుతుంది’ అని అతడు వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. పంజాబ్‌లో, హరియాణాలో చాలా చోట్ల మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మరొకటి. కొన్నిచోట్ల ఆయనకు శాపనార్ధాలు పెడుతున్నారు. అంబాలాలో (పంజాబ్‌) ‌జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో ఆందోళనకారులు ఖలిస్తాన్‌ అనుకూల నినాదాలు చేశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే అంబాలా-అమృత్‌సర్‌ ఒకటో నంబర్‌ ‌జాతీయ రహదారి మీద ఆందోళన చేస్తూ రైతులు ఖలిస్తాన్‌ అనుకూల నినాదాలు ఇచ్చారు. ఆ మార్గంలో వెళుతున్న సైనిక వాహనాలను కూడా అడ్డుకున్నారు. వైరల్‌ అయిన మరొక వీడియోలో ఒక వృద్ధ ఆందోళనకారుడు నరేంద్ర మోదీని నిందిస్తూ, ఇమ్రాన్‌ఖాన్‌ను పొగడడం కనిపించింది. మోదీ ఆందోళనకారులకు శత్రువని అతడు తేల్చేశాడు. ‘పాకిస్తాన్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ‌మన మిత్రుడు. మన శత్రువు ఢిల్లీలో కూర్చున్నాడు’ అన్నాడతడు. మొత్తంగా చూస్తే వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ ‌రైతులు ఆరంభించిన ఉద్యమాన్ని ఖలిస్తాన్‌వాదులు అదుపులోకి తెచ్చుకున్నారన్న ఆరోపణ కొట్టిపారేయదగినవి కావనే చెప్పవలసి వస్తుంది.  కొన్ని నిరసన కార్యక్రమాలలో ఖలిస్తాన్‌ ‌మద్దతుదారు, ఆపరేషన్‌ ‌బ్లూస్టార్‌లో మరణించిన జర్నేల్‌ ‌సింగ్‌ ‌భింద్రన్‌వాలే బ్యానర్‌లు కూడా కనిపించాయి. అత్యంత విషాదం ఏమిటంటే, ఇందిరకు పట్టించిన గతినే మోదీకి పట్టిస్తామని నినాదాలు చేస్తున్న ఈ ఉద్యమాన్ని బాహాటంగా సమర్ధిస్తున్న విపక్షాలలో కాంగ్రెస్‌ ‌కూడా ఉంది. సిక్కులు తాము ఇందిరను హత్య చేసిన సంగతిని మరచిపోలేదు. ఈ నినాదాలను బట్టి అదొక ఘనమైన చర్యగానే భావిస్తున్నారని అనిపిస్తున్నది కూడా. కానీ రాజకీయ లబ్ధి కోసం, బీజేపీ మీద గుడ్డి వ్యతిరేకతతో, మోదీ మీద రాజకీయ కక్ష తీర్చుకోవడానికి కాంగ్రెస్‌, ‌రాహుల్‌ ఆ ‌ఘోర ఘటనను మరచి రైతు ఆందోళనలో కొత్త ఆయుధాన్ని వెతుక్కుంటున్నారు. నిజానికి ఈ ఉద్యమం వెనుక ఉన్నది పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి అమరీందర్‌ ‌సింగ్‌ అన్నది బహిరంగ సత్యం. ఆయన కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందినవాడు. ఇలాంటి నినాదాలు వినిపిస్తున్న సంగతి ఆయనకు తెలియదా?

రెండు రాష్ట్రాల మధ్య నుంచి ఢిల్లీకి

రైతుల ఆగ్రహం ఢిల్లీ దాకా వెళ్లక ముందు దానిని రెండు రాష్ట్రాల వివాదంగా  మలచాలని అమరీందర్‌ ‌ప్రయత్నించారు. పొరుగు రాష్ట్రం హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ ‌లాల్‌ ‌ఖట్టర్‌ ఆం‌దోళన చేస్తున్న రైతులు ఢిల్లీ వెళ్లకుండా  కఠిన చర్యలు తీసుకున్నారు. దీనికి ఆగ్రహించిన అమరీందర్‌ ‌వరస ట్వీట్లలో ఖట్టర్‌ను విమర్శించారు. ‘గడచిన రెండు మాసాలుగా పంజాబ్‌లో శాంతియుతంగా ఉద్యమిస్తున్న రైతులకు ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. కానీ వారు బలప్రదర్శనకు పాల్పడేటట్టు హరియాణా ప్రభుత్వం ఎందుకు రెచ్చగొట్టవలసి వచ్చింది? జాతీయ రహదారి మీద శాంతియుతంగా ప్రయాణించే హక్కు రైతులకు లేదా?’ అని అమరీందర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ‘రాజ్యాంగ దినోత్సవం రోజునే రైతుల రాజ్యాంగ హక్కును లాగేసుకున్నారు’ అని కూడా ట్వీట్‌లో పేర్కొన్నారు. అన్నం పెట్టే రైతు పట్ల అంత కఠినంగా వ్యవహరించ వద్దని బీజేపీ పాలిత రాష్ట్రాలను ఆదేశించ వలసిందిగా  అమరీందర్‌ ‌కేంద్ర ప్రభుత్వానికి ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఖట్టర్‌ ‌కూడా అంతే ఘాటుగా సమాధానం ఇచ్చారు. ‘నేను గతంలోను చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. ఈ చట్టాలతో కనీస మద్దతు ధరకు భంగం వాటిల్లిందంటే నేను రాజకీయాల నుంచి వైదొలగుతాను. అమాయక రైతాంగాన్ని రెచ్చగొట్టే చర్యలు ఆపండి’ అని. ‘మీ అబద్ధాలకీ, దగాకీ, దుష్ప్రచారానికీ కాలం చెల్లింది. మీ అసలు రూపం ఏమిటో ప్రజలకు తెలిసింది. కరోనా కాలంలో అమాయక రైతుల ప్రాణాలకు ముప్పు తెచ్చే చర్యలు ఆపండి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకండి. కనీసం ఈ కరోనా కాలంలో అయినా చవకబారు రాజకీయాలను మానుకోండి’ అని కూడా హెచ్చరించారు ఖట్టర్‌. ‌నిజానికి సీఏఏ బిల్లు తరువాత ప్రతిపక్షాలు మరొకసారి వ్యవసాయ సంస్కరణ చట్టాలను అడ్డం పెట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి.

చర్చలు మొదలైననాటి నుంచి…

కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన పూచీ ఇవ్వాలి. లేదంటే చట్టాలను వెనక్కి తీసుకోవాలి. ఇదే రైతుల డిమాండ్‌. ‌దీనితో కేంద్రం డిసెంబర్‌ 3‌న చర్చలకు రావలసిందిగా ఆందోళన చేస్తున్న రైతులను కోరింది. ఆ మూడు చట్టాల మీద వచ్చిన భేదాభిప్రాయాలను పరిష్కరించుకోవడమే ఈ చర్చల ఆశయం. అయితే పంజాబ్‌లో రైల్‌రోకో ఉద్యమాన్ని నిలిపివేయడానికి మరొకసారి కేంద్రం చర్చలు జరపాలని వారు షరతు పెట్టారు. తరువాత గుడ్స్ ‌రైళ్లు నడిచాయి. రైల్‌రోకో మొదలైన తరువాత రైల్వే శాఖ భద్రతా కారణాలతో సర్వీసులను రద్దు చేసింది. దీనితో భారతీయ రైల్వేలకు రూ. 500 కోట్లు నష్టం వాటిల్లింది. ఎట్టకేలకు నవంబర్‌ 4‌న రైల్‌రోకో ఆగింది. తరువాత పంజాబ్‌, ‌హరియాణాల నుంచి ఆందోళన ఢిల్లీకి బయలు దేరింది. పంజాబ్‌ ‌నుంచి నవంబర్‌ 26‌న తమ నిరసన తెలియచేయడానికి ఢిల్లీ బయలుదేరారు. దాదాపు 200 రైతు సంఘాలతో కూడిన అఖిల భారత కిసాన్‌ ‌సంఘర్ష్ ‌సమన్వయ సంఘం ఈ నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నది. ఉత్తరప్రదేశ్‌, ‌హరియాణా రైతులతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు జరిపిన చర్చలు కూడా విఫలమైనాయి.

ముస్లిం సంఘాలకు ఇంత ప్రేమ ఎందుకు?

ఉద్యమాల కోసం రైతులు వేలాది ఢిల్లీకి తరలిరావడం కొత్తకాదు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం కూడా కొత్తకాదు. కానీ వీరికి ముస్లిం సంఘాలు భోజన, పడక వసతి కల్పించడానికి ఉరకలు వేయడం ఇప్పుడు కనిపిస్తున్నది. క్లారియన్‌ ఇం‌డియా అనే వార్తా సంస్థ ఇచ్చిన వార్త ఇది. నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఏ ఒక్క రైతు ఆకలితో మిగిలిపోకూడదన్న ధ్యేయంతో ద్వేష వ్యతిరేక ఐక్యవేదిక (ఢిల్లీ) నాలుగు ప్రాంతాలలో వంట శాలలు మొదలు పెట్టింది. పంజాబ్‌ ‌ముస్లిం సమాఖ్య కూడా ఇలాంటి సేవలోనే ఉంది. 25 మంది స్వచ్ఛంద సేవకులతో సామూహిక వంటశాలలు ఏర్పాటుచేసి అహర్నిశలు రైతులకు భోజన సదుపాయం కల్పిస్తున్నది. ఈ కార్యక్రమానికి ఫారూఖి ముబిన్‌  ‌నాయకత్వం వహిస్తున్నారు. ఈ సంగతి పిటీఐ వార్తా సంస్థతో పాటు ఇండియా టుడే కూడా వెల్లడించింది. ‘మా కోసం రైతులు ఎంతో చేశారు. అందుకు రుణం తీర్చుకోవలసిన బాధ్యత మా మీద కూడా ఉంది’ అని ముబిన్‌ ‌చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలియచేసింది.

వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నిరసన చేయడానికి ఢిల్లీ వచ్చిన రైతులకు ఢిల్లీలోని మసీదుల ద్వారా ఆహారం అందించే పని రెండో రోజు (డిసెంబర్‌ 27)‌న కూడా జరిగింది. జాతీయ రహదారుల దిగ్బంధన ఆరోజే మొదలయింది. ఆందోళనకారులు రాత్రివేళ నిద్రించడానికి దాదాపు 25 మసీదులలో ఏర్పాట్లు జరిగాయి. ఇవన్నీ ద్వేష వ్యతిరేక ఐక్యవేదిక ప్రతినిధి నదీమ్‌ ‌ఖాన్‌ ‌చెప్పారు. వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ వచ్చిన ప్రతి రైతును ఆదుకోవడానికి తమ సంస్థ అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు. హాజ్‌ఖాస్‌, ఒఖ్లా, పాత రోహతక్‌ ‌మార్గం, పాత ఢిల్లీలలో వంటశాలలు ఏర్పాటు చేసిన సంగతిని కూడా చెప్పారు. ఈ ప్రాంతాలలో ఉన్న రైతులకు భోజన వసతి కల్పించాం. కొన్ని ప్రాంతాలలో ఉన్న రైతుల కోరిక మేరకు అక్కడికి భోజనం పొట్లాలు తీసుకెళ్లి అందిస్తున్నాం. ఎక్కడ రైతులు గుమిగూడి కనిపించినా మా వాహనాలలో భోజనం పొట్లాలు తీసుకువెళ్లి పంచుతున్నాం అని కూడా నదీమ్‌ ‌చెప్పారు.

దాదాపు 500 సంఘాల ఆధ్వర్యంలో పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌, ‌హరియాణా, ఉత్తరాఖండ్‌, ‌రాజస్తాన్‌ ‌వంటి రాష్ట్రాల నుంచి రైతులు వచ్చారు. నవంబర్‌ 26, 27 ‌తేదీలలో వీరు చలో ఢిల్లీ కార్యక్రమం తలపెట్టారు. రోడ్డు మార్గం ద్వారా వస్తున్న రైతులను పోలీసులు ఢిల్లీ సరిహద్దులలో ఆపేశారు. అయితే రైతుల తీవ్ర నిరసన తరువాత వీరిని నగరంలోకి విడిచిపెట్టారు. తమ నిరసన తెలియచేయడానికి బురారి లోని నిరంకారి మైదానికి అనుమతించారు. కానీ రైతులు ఢిల్లీ అంతటా కనిపిస్తున్నారు. ఇలాంటి రైతుల నుంచి తమకు విన్నపాలు అందుతున్నాయి. వీరిలో ఎవరూ ఆకలితో ఉండిపోకూడదన్న ధ్యేయంతోనే భోజనం ఏర్పాటు చేస్తున్నామని నదీమ్‌ ‌చెప్పారు. ఢిల్లీ అంతటా దాదాపు 25 మసీదులలో వీరు రాత్రి వేళ నిద్రించడానికి వీలుగా దుప్పట్లు అందచేస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలో వివిధ ప్రాంతా లలో ఉన్న రైతులను తీసుకుని దగ్గరలోని మసీదులలో పడక వసతి కోసం తమ సంస్థ కార్యకర్తలు తీసుకువెళుతున్నారని కూడా చెప్పారు.కొన్ని ప్రాంతాల నుంచి వైద్య బృందాలు కూడా రైతులకు సేవలు అందిస్తున్నాయి. ఒక్క ప్రశ్న. దేశంలో నాలుగు లక్షల మంది రైతులు బలవన్మరణం పాలయ్యారు. దాని కోసం ఇప్పటిదాకా ఉద్యమించని వారు ఇప్పుడు మద్దతు ధర పేరుతో ఎందుకు రోడ్డెక్కారు? కేవలం యథాతథ స్థితిని కొనసాగించడానికే.

ఆ భాష ఎవరిది?

రైతు నాయకులు వ్యతిరేక ఆందోళనలో ఉపయోగిస్తున్న భాష ఎవరిదో చెప్పడం పెద్ద కష్టం కాదు. ఢిల్లీ సరిహద్దు సింఘు దగ్గర అట్టారి గ్రామం నుంచి వచ్చిన రైతు దర్శన్‌సింగ్‌ ఇచ్చిన ఉపన్యాసంలో ఇదే ప్రతిధ్వనించింది. ‘అంబానీ, ఆదానీలకు మోదీ మమ్మల్ని (రైతులని) బానిసలుగా మార్చాలని చూస్తున్నారు’ అన్నాడాయన. అట్టారీ భారత్‌ ‌పాకిస్తాన్‌ ‌సరిహద్దులలో ఉంది. పాకిస్తాన్‌ ‌కుయుక్తులు ఆ ప్రాంతం వారి కంటే ఇంకెవరికీ బాగా తెలియవు. కాబట్టి ఆ కుయుక్తులను మోదీ ఎంత సమర్ధంగా తిప్పి కొట్టారో కూడా వాళ్లకే బాగా తెలుస్తుంది. కానీ ఢిల్లీ సరిహద్దుల దగ్గర ఆయన నోటి నుంచి ఇలాంటి భాష వినిపిస్తున్నది. కాని ఇది, ‘మా హక్కులను (రైతులు) హరిస్తున్న పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం’ అంటున్నారు దర్శన్‌సింగ్‌. ‌సింఘులో వేలాదిగా చేరిన వారిలో ఎక్కువ మంది పంజాబీ సిక్కులు. డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఆందోళన చేస్తున్నారు. ట్రక్కులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలలో సిక్కులు ఇక్కడికి చేరుకున్నారు. రోజంతా లౌడ్‌ ‌స్పీకర్లలో నాయకుల ఉపన్యాసాలు వినిపించాయి. పనిలో పనిగా వాళ్ల దృష్టిలో ప్రజా వ్యతిరేక బిల్లుల గురించి కూడా తూర్పార పడుతున్నారు. రైతులంతా ఏకం కావాలని కోరుతూ వారు ఉల్లేఖిస్తున్నవి కూడా సిక్కు మత గ్రంథంలోనివే. మేం ఆరు మాసాల వరకు సరిపోయే విధంగా సంబారాలతో వచ్చాం. మేం మా డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమానికి ఆపబోం అని దర్శన్‌సింగ్‌ ‌చెప్పారు. కొత్త చట్టాల వలన రైతుల ఆర్థిక స్వేచ్ఛకు భంగం కలుగుతుందని ఆయన ఆందోళన చెందుతు న్నారు. మొదటి కొద్ది సంవత్సరాలు కార్పొరేషన్‌ ‌మంచి ధరలు ఇవ్వజూపవచ్చు. కానీ తరువాత మా ఉత్పత్తులు నాసిగా ఉన్నాయని, ఇతరత్రా కారణాలను చూపి తక్కువ ధర ఇస్తామని చెబుతారని, తక్కువ ధరకు కొనగోలు చేసి ఎక్కువ ధరకు ప్రజలకు అమ్ముతా’రని దర్శన్‌సింగ్‌ ‌చెప్పారు. మాకు కనీస ఆదాయం లభిస్తుందన్న పూచీ ఏమీ లేదని ఆయన వాదిస్తున్నారు. ఇంత కనిపిస్తున్నా ఇది పంజాబీ సిక్కుల ఉద్యమం మాత్రమే కాదని ఆందోళనకారులు నమ్మించాలని చూస్తున్నారు.

మరో షాహిన్‌బాగ్‌ ‌కోసమేనా?

షాహిన్‌బాగ్‌ను పోలిన మరొక అలజడిని దేశ రాజధానిలో సృష్టించి బీజేపీ ప్రభుత్వాన్ని మరొకసారి ఇరకాటంలో పెట్టాలన్న దురుద్దేశం కొందరిలో స్పష్టంగానే కనిపిస్తున్నది. అవార్డు తిరిగి ఇచ్చి వేస్తున్నట్టు ప్రకటనల తమాషా, స్త్రీలు, పిల్లలను ఆందోళనలో భాగం చేయడం వంటివన్ని దీనినే సూచిస్తున్నాయి. ప్రకాశ్‌సింగ్‌ ‌బాదల్‌ ఇప్పటికే తన పద్మభూషణ్‌ ‌వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించారు. భీమ్‌ ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ ‌మద్దతు తెలియచేయడం, జేఎన్‌యు టుక్డే టుక్డే ముఠాను తీవ్రంగా అభిమానించే యోగేంద్ర యాదవ్‌ ‌వంటివారి రంగ ప్రవేశం ఇందుకు సాక్ష్యం చెబుతున్నాయి. కొద్దికాలం క్రితం జరిగిన ఢిల్లీ అల్లర్ల వెనుక ఉన్నది వీరే. ఒకటి నిజం. రైతుల న్యాయబద్ధమైన కోరికలు నెరవేరవలసిందే. అంతమాత్రాన పార్లమెంటు చేసిన చట్టాలను రద్దు చేయమంటే ఎలా? ఇవి రద్దు చేసిన మరుక్షణం సీఏఏ చట్టాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనకారులు ఢిల్లీని ముట్టడించరా? దేశం నిండా షాహిన్‌బాగ్‌లు పుట్టగొడుగుల్లా లేవకుండా ఉంటాయా? అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది! ఇక ఆ ప్రమాదకర ధోరణికి అంతం ఎక్కడ? తమ సమస్యలే ప్రాతిపదికగా రైతులు ఏకం కావడం నిజమే అయితే స్వాగతిద్దాం. వారి కోసం వారే ఉద్యమిస్తుంటే సహకరిద్దాం. కానీ ఢిల్లీ వచ్చి రాజకీయ సేద్యం చేద్దామంటే షాహిన్‌బాగ్‌ ‌ప్రహసనమే పునరావృతమవుతుంది.


నిఖార్సయిన కాంగ్రెస్‌ ‌నేత అమరీందర్‌ ‌సింగ్‌

ఒక కాంగ్రెస్‌ ‌నాయకుడు ఎలా మాట్లాడతారో పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి అమరీందర్‌ ‌సింగ్‌ అలాగే మాట్లాడారు. చిచ్చు రేపడం, తరువాత చేతులు ఎత్తి వేయడం ఆ పార్టీ సంస్కృతి. అమరీందర్‌ ‌దానినే కొనసాగిస్తున్నారు. అసలు వ్యవసాయ సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేసేది లేదంటూ శాసనసభ తీర్మానం చేసిన తరువాత ఇంక సమస్య ఏమిటి? అక్కడ అమలు కాదు కదా! మిగిలిన రైతుల తరఫున మాట్లాడడానికి వారు యావద్దేశంలో రైతాంగ ప్రతినిధులు కానేకారు.

డిసెంబర్‌ 3‌న ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం చర్చలు జరపడానికి ముందు అమరీందర్‌ ‌సింగ్‌ ‌కేంద్ర హోంమంత్రిని ఢిల్లీలో ఆయన నివాసంలో కలసి మాట్లాడారు. ఆ మూడు చట్టాల గురించి పునరాలోచించమని, ఉద్యమం వల్ల పంజాబ్‌కు ఆర్థికంగాను, దేశానికి భద్రత కోణం నుంచి నష్టం ఉందని చెప్పానని బయటకు వచ్చిన తరువాత అమరీందర్‌ ‌చెప్పడం విశేషం. ఇప్పటికే ఆయన రైతులకు అండగా లేరని ఒక వాదన వచ్చింది. అంటే ఉద్యమం ఆయన చేయి దాటిపోయిందనే. ఆందోళన చేస్తున్న రైతుల ప్రతినిధులకు, కేంద్రానికి మధ్య చర్చలు జరుగు తున్నాయి. ఇక ఈ సమస్యను పరిష్కరించడంలో నా ప్రమేయం ఏమీ ఉండదు అని సుస్పష్టంగానే చెప్పారు. చర్చలలో వచ్చిన ప్రతిష్టంభనను పరిష్కరించడానికి తాను గాని, తన ప్రభుత్వం గాని జోక్యం కల్పించుకోబోమని కూడా చెప్పేశారు. రైతులు చెప్పేది విశాల దృక్పథంతో ఆలకించి, కనీస మద్దతు ధరకు భద్రత కల్పించాలన్న వారి కోరికను త్వరగా పరిష్కరించినట్టయితే వారంతా ఇంటికి వెళ్లిపోతారని, ఇందులో పురుషులే కాకుండా మహిళలు కూడా ఉన్నారని చెప్పినట్టు అమరీందర్‌ ‌వెల్లడించారు. తన మీద దర్యాప్తు జరిపించ మంటారా; రైతులను సమర్ధించడం ఆపుతారా అంటూ అమిత్‌షా బెదిరించడం వల్లనే అమరీందర్‌ ‌వెనక్కి తగ్గారని శిరోమణి అకాలీదళ్‌ ‌వ్యాఖ్యా నించడం కొసమెరుపు.


హితవు చెబుతున్నారా?  ఆంక్షలు విధిస్తున్నారా?

భారత ఎడిటర్స్ ‌గిల్డ్ ‌వైఖరి మరీ విచిత్రం. ఆందోళన చేస్తున్న రైతుల మీద ఖలిస్తాన్‌వాదులు, జాతి వ్యతిరేకులు వంటి ముద్రలు వేయవద్దని దేశంలోని మీడియా సంస్థలకు, ప్రచురణ సంస్థలకు గిల్డ్ ‘‌హితవు’ చెబుతోంది. అలా రాయడం లేదా పేర్కొనడం ‘బాధ్యతాయుతమైన, నైతిక విలువలు ఉన్న పత్రికా రచనకు విరుద్ధం’ అట. భింధ్రెన్‌వాలె బొమ్మ పట్టుకుని ఊరేగుతున్న వాళ్లని కూడా ఖలిస్తాన్‌వాదులని అనకూడదన్నమాట. నిజానికి ఇలాంటి ‘హితవు’లు కూడా పత్రికల మీద ఆంక్షలే. ఇవి ఎడిటర్స్ ‌గిల్డ్ ‌నుంచి రావడమే చిత్రం. పత్రికల మీద కక్ష కట్టి వాటి నోరు నొక్కే పని ఇప్పటికే చాలా ప్రభుత్వాలు చేశాయి. ఇప్పుడు కూడా చేస్తున్నాయి. ఆ మహత్తర బాధ్యతను ఇప్పుడు గిల్డ్ ‌స్వీకరించడం ముమ్మాటికీ ఆక్షేపణీయమే. పత్రికా స్వేచ్ఛకు భంగమే. ఇది ఖలిస్తాన్‌వాదాన్ని ఆవాహన చేయడానికి ఉపకరించే చర్య కాకుండా ఎలా ఉంటుంది? ప్రధాని మోదీని హత్య చేస్తాం అన్న మాట వీళ్ల నోటి నుంచే కదా నినాదం రూపంలో వస్తున్నది! ఈ ఉద్యమం ఇంకా కొనసాగితే దేశభద్రతకే ముప్పు అంటూ సాక్షాత్తు పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి అమరీందర్‌ ‌సింగ్‌ ‌వ్యాఖ్యానించిన సంగతి గిల్డ్‌కు ఎందుకు పట్టడం లేదు? దీని ఆంతర్యం ఎందుకు గ్రహించడం లేదు?


నిర్వాహకులు ఎవరు?

ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారు ఎవరు? హరియాణా రైతాంగానికి గుర్నామ్‌సింగ్‌ ‌నాయకుడు. ఇతడు 2019 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి కేవలం 1,307 ఓట్లు sమాత్రం పొందాడు. దేశంలో పలు ప్రాంతాలకు చెందిన రైతు సంఘాలు, నాయకులు సంయుక్త కిసాన్‌ ‌మోర్చా పేరుతో ఢిల్లీలో sఆందోళనలో భాగస్వాములయ్యారు. వీఎం సింగ్‌ (‌రాష్ట్రీయ కిసాన్‌ ‌మజ్దూర్‌ ‌సంఘటన్‌), అవిక్‌ ‌షా, డాక్టర్‌ ఆశిష్‌ ‌మితాల్‌ (‌జైకిsసాన్‌ ఆం‌దోళన్‌), ‌వి. వెంకటరామయ్య (అఖిల భారత కిసాన్‌ ‌మజ్దూర్‌ ‌సభ), అశోక్‌ ‌ధావల్‌, ‌హన్నన్‌ ‌మొహల్లా, అతుల్‌ ‌కుమార్‌ sఅం‌జాన్‌, ‌భూపేందర్‌ ‌సంబేర్‌ (‌కిసాన్‌ ‌సభ), డాక్టర్‌ ‌దర్శన్‌పాల్‌ (‌కిసాన్‌ ‌యూనియన్‌), ‌జగ్మోహన్‌ ‌సింగ్‌  (‌బీకేయూ -దాకౌండా),s కవిత కురుగంటి, కిరణ్‌ ‌విస్సా (ఆశా-కిసాన్‌ ‌స్వరాజ్‌), ‌కొడిహళ్లి చంద్రశేఖర్‌ (‌కర్ణాటక రాజ్య రైతు సంఘ), మేధా పాట్కర్‌s (‌నేషనల్‌ అలయెన్స్ ‌ఫర్‌ ‌పీపుల్స్ ‌మూవ్‌మెంట్స్), ‌ప్రతిభా షిండే (లోక్‌ ‌సంఘర్ష్ ‌మోర్చా), రాజారామ్‌ ‌సింగ్‌, ‌ప్రేమ్‌సింగ్‌ ‌గెహ్లాత్‌ s(అఖిల భారత కిసాన్‌ ‌మహాసభ), రాజు శెట్టి (స్వాభిమాన్‌ ‌షేత్కారి సంఘటన్‌), ‌రిచా సింగ్‌ (‌సంఘటిన్‌ ‌కిసాన్‌ ‌మజ్దూర్‌ ‌సంఘsటన్‌), ‌సత్నాం సింగ్‌ అజ్నాలా (జమ్‌హోరి కిసాన్‌ ‌సభ), సత్యవాన్‌ (‌కిసాన్‌ ‌ఖేత్‌ ‌మజ్దూర్‌ ‌సంఘటన్‌), ‌డాక్టర్‌ ‌సునీలమ్‌ (‌కిసాన్‌s ‌సంఘర్ష్ ‌సమితి), తేజీందర్‌ ‌సింగ్‌ ‌విర్క్ (‌తెరాయి కిసాన్‌ ‌సభ), యోగేంద్ర యాదవ్‌ (‌జై కిసాన్‌ ఆం‌దోళన్‌) ‌వంటివారు ఢిల్లీ sఆందోళనలో పాల్గొంటున్నారు. దాదాపు బీజేపీయేతర పక్షాలన్నీ మద్దతు పలుకుతున్నాయి. పంజాబ్‌తో పాటు రాజస్తాన్‌ ‌sకూడా రైతుల ఆందోళనకు మొదటే మద్దతు పలికాయి. బంద్‌కు దాదాపు అన్ని బీజేపీయేతర పక్షాలు మద్దతు ప్రకటించాయి.s


భింద్రెన్‌వాలా ఫ్లెక్సీతో

చంపేస్తాం!

మాజీ క్రికెట్‌s ‌క్రీడాకారుడు, నటుడు యోగ్‌రాజ్‌ ‌సింగ్‌ ‌పంజాబ్‌ ‌రైతు ఉద్యమంలో చేరాడు. అది కాదు అసలు సంగతి. ‘మేం ఇందిరను sచంపాం. మోదీని చంపుతాం’ అంటూ కొందరు ఖలిస్తాన్‌ ‌మద్దతుదారులు వినిపించిన నినాదాన్ని ఇతడు సమర్థించాడుs. యోగ్‌రాజ్‌ ‌మాజీ క్రికెట్‌ ‌క్రీడాకారుడు యువరాజ్‌సింగ్‌ ‌తండ్రి. దమ్ముంటే ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా రైతుల మsధ్యకు రావాలని సవాలు కూడా విసిరాడు యోగ్‌రాజ్‌. ‌పంజాబ్‌కు చెందిన రోజానా వార్తా చానల్‌ ‌ప్రతినిధితో మాట్లాడుతూ, sమోదీ హత్య వ్యాఖ్యలను సమర్ధించాడు. అలాగే మనం ఏం విత్తనాలు వేస్తే అదే పంట వస్తుందని కూడా వ్యాఖ్యానించాడుs. ఇది విశ్వాసాలతో పోరాటం. కాబట్టి అలాంటి ప్రకటనలు వెలువడడంలో ఆశ్చర్యం లేదు అని కూడా అన్నాడు. ప్రస్తుతంs కేంద్రం రైతులకు వ్యతిరేకంగా చేస్తున్న అరాచకాలు బాబర్‌,

యోగ్ రాజ్

ఔరంగజేబ్‌, ‌బ్రిటిష్‌ ‌వాళ్లను మించిపోయాయని అన్నాడు. నేను మోsదీ, ఆయన మంత్రిమండలిలోని ఇతర మంత్రుల ముఖాలు చూశాను. అవి దెయ్యాల ముఖాలలాగే ఉన్నాయి.’ అని అక్కsసు అంతావెళ్లగక్కాడు. ఢిల్లీని పంజాబీలు 18 పర్యాయాలు గెలిచారు. మరొకసారి కూడా గెలవగలరు. అలాంటి పరిస్థితి తేవద్sదు. మీ దగ్గర ఉన్న తూటాలు అయిపోతాయి. కానీ తూటాలకు గుండెలు చూపే పంజాబీలు పుడుతూనే ఉంటారు అనిs అన్నాడు. మీరు ఒక్క తూటా పేల్చినా మొగలులు పతనమైనట్టే పతనమవుతారు. మీ ప్రభుత్వ పతనం మొదలవుతుంది. sకేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఇదే తీవ్రతతో విమర్శించాడు యోగ్‌రాజ్‌. ‌తన భద్రతా సిబ్బంది నుంచి సిక్కులను తొలగించిsనా ఆయన రోజులు లెక్క పెట్టవలసిందేనట. అమిత్‌ ‌షా తన మిత్రులు అంబానీ, ఆదానీలను పంజాబ్‌కు తీసుకురావాలని, sవాళ్లు తిరిగి ఎలా వెళతారో చూస్తామని హెచ్చరించాడు. భింద్రెన్‌వాలాను గుర్తు చేసుకుంటూ, రైతులు మరొక భింద్రెన్‌వాలానుs సృష్టించుకోవాలని అతడు అన్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరు భింద్రెన్‌వాలాయే. మీరు పంజాబ్‌ను రక్షించుకోవాలంటే, అsధికారం మీ (రైతులు) చేతులలో ఉండేలా చూసుకోవాలి. అధికారం మీ చేతులలో ఉంటే పంజాబ్‌ ‌నేల మీద కొత్త సూర్యుడు sఉదయిస్తాడు’ అని పిలుపునిచ్చాడు. ఇది వదరుబోతుతనమా? లేదంటే ఖలిస్తాన్‌వాదుల అంతరంగమా?s


– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE