కార్తీకమాసం… డిసెంబర్‌ 5 ‌శనివారం, వేకువ.

 తెల్లవారుజామునే దేవాలయాలలో సందడి మొదలు కావస్తున్నది. కొంతమంది దైవదర్శనాలు చేసుకుని పనులలో దిగుతున్నారు.హఠాత్తుగా ఏలూరు దక్షిణవీధి ప్రాంతంలో హాహాకారాలు వినిపించాయి. కళ్లు తిరిగి పడిపోవడం, నురగలుకక్కుతూ, ఊపినాడక ఉక్కిరిబిక్కివుతూ ప్రాణం కోసం పోరాటం, ఐదు నుంచి పది నిమిషాల నరకం. ఇవీ ఆ వ్యాధి లక్షణాలు. అన్ని వయసులవారు ఆ వ్యాధి బారినపడ్డారు. వ్యాధిగ్రస్థుల బంధువులలో తీవ్రమైన ఆందోళన. వారి ఆక్రందనలతో, అంబులన్స్‌ల సైరన్‌లతో భయభ్రాంతులకు లోనైన కొందరు ఏలూరు విడిచిపెట్టి, వేరే ఊళ్లలోని బంధువుల ఇళ్లకు చేరారు. ఏలూరు 1వ పట్టణ పరిధిలో వ్యాధి తీవ్ర ప్రభావం చూపించింది.

కోటదిబ్బ సంఘశాఖ నుంచి తిరిగి వస్తున్న సేవాభారతి కార్యకర్తలు పరిస్థితి గమనించి వెంటనే 108,104లకు ఫోన్‌ ‌చేసి ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేశారు. రోగులును ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఈ ఘటనలు దక్షిణపు వీధితో ఆగకుండా పడమర వీధి కొత్తపేట, వంగాయ గూడెం ప్రాంతాలలో కూడా సంభవించాయి. కొద్ది సమయానికే ఆసుపత్రిలో 100కి పైగా రోగులు చేరారు. అప్పుడే నగరంలోని పంపుల చెరువు నీరు కలుషితమైంది కాబట్టి, మున్సిపల్‌ ‌కుళాయి నీటిని తాగరాదంటూ మున్సిపల్‌ అధికారుల నుంచి ప్రకటన వెలువడింది. ఇది మరింత కంగారు పెట్టింది. అధికారులు ఇచ్చిన ఆ సమాచారాన్ని సేవాభారతి కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేశారు. తొలిరోజునే ఈ పరిస్థితిని గమనించిన ఏలూరు సేవాభారతి కార్యకర్తలు వెంటనే స్పందించి అన్ని వార్డులలో ప్రతి బెడ్‌ ‌దగ్గరకు వెళ్లి పండ్లు, బ్రెడ్‌ అం‌దజేస్తూ, వ్యాధిగ్రస్థులకు, వారి బంధువులకు సాంత్వన కలిగించి ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కృషి చేశారు.

మరుసటిరోజు, డిసెంబర్‌ ఆరు ఆదివారం కూడా కేపీడీటీ• పాఠశాలలో సాంఘిక్‌ ‌ముగించుకుని సేవాభారతి కార్యకర్తలు రంగంలో దూకారు. ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి రోగులను పరామర్శించారు. సంప్రదాయానుసారం రోగులందరికి బ్రెడ్‌, ‌పళ్లు పంచిపెట్టారు.సేవాభారతి అనే పేరు ఉన్న కాషాయరంగు టీ షర్ట్‌లు ధరించి ఆసుపత్రి అంతా కరోనా జాగ్రత్తలతో పళ్లు, బ్రెడ్‌ ‌పంచుతూ తిరిగిన ఆ కార్యకర్తలను వైద్యులు సిబ్బంది అభినందించారు. సేవలో వ్యక్తి గత గుర్తింపునకు అర్రులు చాచే తత్వం లేని ఆ కార్యకర్తలు భారతమాతకు జయం పలుకుతూ రోగులకు మేమున్నాం చెప్పారు.సేవాభారతి స్ఫూర్తిని మరొకసారి ఏలూరుకు చాటారు.

– ‌కృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్, ‌విజయవాడ

About Author

By editor

Twitter
YOUTUBE