టర్కీ పర్యటనతో  ఇటీవల అమీర్‌ ‌ఖాన్‌ ‌బాగా వార్తలకు ఎక్కాడు. అక్కడ అధ్యక్షుడు ఎర్దోగాన్‌ ‌భార్యను కలిసిన అమీర్‌ ‌ఖాన్‌ ఆ ‌దేశమన్నా, అక్కడి ప్రజలన్నా తనకు, తన భార్య కిరణ్‌రావ్‌కు ఎంతో ఇష్టమని చెప్పాడు. టర్కీ ఇటీవలనే హజియా సోఫియా ప్రదర్శనశాలను అధికారికంగా మసీదుగా మార్చింది. కుర్ద్ ‌లపై మారణకాండ సాగించింది. అన్నిటికంటే ముఖ్యంగా భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి నేపధ్యంలో అమీర్‌ఖాన్‌ అక్కడ పర్యటించడం, అధ్యక్షుడి భార్యతో సమావేశం కావడం పలు విమర్శలకు తావిచ్చింది.


అమీర్‌ఖాన్‌ ‌తనని తాను సెక్యులర్‌ ‌విలువలకు కట్టుబడిన, ఏ పార్టీకి చెందని వ్యక్తిగా చెప్పుకుంటుం టాడు. కానీ యదార్ధం వేరు. ఆయన గురించి అనేక నిజాలను ట్విట్టర్‌లో అనేకమంది బయటపెడుతూనే ఉంటారు. అలా బయటపెట్టిన విషయాల్లో ఒకటి 2002 గుజరాత్‌ అల్లర్లపై అమీర్‌ ‌చేసిన వ్యాఖ్యలు. ఆ అల్లర్లకు అప్పటి గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ కారణమని అమీర్‌ ఆరోపించాడు. అదీ ఈ సంఘటనలపై కోర్ట్‌లో విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు కేంద్రంలో యూపీయే (2005) ప్రభుత్వం ఉంది. అయితే ఆ తరువాత నరేంద్ర మోదీ నిర్దోషి అని కోర్ట్ ‌తీర్పునిచ్చింది. కానీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పని అమీర్‌ ఆ ‌తరువాత జరిగిన ఏ మతకలహాల గురించి ఇంత తీవ్రమైన రీతిలో స్పందించలేదు. బహుశా ఆ గొడవలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరగకపోవడం, ‘సెక్యులర్‌’ ‌పార్టీలైన కాంగ్రెస్‌ ‌లేదా సమాజ్‌ ‌వాదీలను ఏమి అనకూడదనే నియమం వల్ల అలా ప్రవర్తించి ఉంటాడు.

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో తాము పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ విశ్వసిస్తున్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే విధంగా ప్రజలు ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశాడు అమీర్‌. ‌యూపీఏ రెండు ప్రభుత్వాలూ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయాయంటూ మీడియా కోడై కూస్తున్నా, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నా సంకీర్ణ ప్రభుత్వం వైపే అమీర్‌ ‌మొగ్గుచూపాడు. సంకీర్ణ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు ఎలాగూ తమకు అనుకూలమైన కాంగ్రెస్‌ ‌కే మద్దతు తెలుపుతాయి. అప్పుడు మళ్లీ అవినీతిమాయమైన యూపీఏ ప్రభుత్వమే ఏర్పడుతుందన్నది అతని అంచనా కావచ్చును. ఇలా ఏ రాజకీయ పార్టీకి చెందనివాడినని చెప్పుకునే అమీర్‌ ఆ ‌సందర్భంలో మొహమాటం లేకుండా కాంగ్రెస్‌ ‌పక్షాన నిలిచాడు. అయిన ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు, అతన్ని నిలదీయలేదు.

2015లో కూడా అమీర్‌ ఇలాంటి వైఖరే అవలంబించాడు. అప్పుడు తన భార్యకు భారత్‌లో ఉండాలంటే భయంగా ఉందని, వేరే దేశానికి వెళ్లిపోవాలా అనే సందేహం కలుగుతోందంటూ అమీర్‌ ‌బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. ‘మూకుమ్మడి దాడులు’, ‘అసహిష్ణుత’, అవార్డ్‌ల వాపసి వంటి వాటిపై చర్చ జరుగుతున్న రోజుల్లో అతను అలా మాట్లాడాడు. అమీర్‌ ‌ఖాన్‌ ‌సినిమా పీకే కూడా ఆ సమయంలోనే అత్యధిక వసూళ్లు నమోదు చేసింది. అంతేకాదు ఆ ఉపన్యాసంలోనే ఐసిస్‌కు, తీవ్రవాదా నికి, ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదంటూ అమీర్‌ ‌తేల్చి చెప్పాడు. కానీ సరిగ్గా అప్పుడే ప్యారిస్‌లో ఇస్లాం తీవ్రవాదులు దాడి చేసి 127మందిని పొట్టన పెట్టుకున్నారు.

భారత్‌లో తన సినిమా ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్న అమీర్‌ ‌ఖాన్‌కు హఠాత్తుగా ఈ దేశం సురక్షితమైనదికాదని ఎందుకనిపించింది? అవార్డ్ ‌వాపసిని సమర్ధించిన అతను తన పద్మశ్రీ, పద్మభూషణ్‌ అవార్డులను ఎందుకు తిరిగి ఇవ్వలేదు? ముంబైకంటే ఐసిస్‌ ‌దాడులతో దద్దరిల్లిన ప్యారిస్‌ ‌సురక్షితమైనదని అతను అనగలడా? లేక ఇస్లాం అసహిష్ణుత, తీవ్రవాదం అంటే అతనికి భయంలేదా? భారత్‌లో ఉండాలంటే భయమేస్తోందన్న తన భార్య ఇటీవల టర్కీ, అక్కడి ప్రజలను ఎంతో మెచ్చుకుందని అమీర్‌ అం‌టున్నాడు. మరి వాళ్లు టర్కీకి ఎప్పుడు తరలిపోతున్నారు?

మన స్నేహితులవల్ల మనమేమిటో తెలుస్తుంది

ఎంతో ‘ఆలోచనాపరుడు’, ‘ప్రజావాణి వినిపించే వాడు’, పని విషయంలో రాజీపడనివాడు, బాలీవుడ్‌ ‌గాసిప్‌లకు దూరంగా ఉండేవాడంటూ అమీర్‌ ఒక పేరును, గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇటీవల సుశాంత్‌ ‌సింగ్‌ ‌రాజ్‌పుత్‌ ‌సంఘటనలో బాలీవుడ్‌, ‌పాకిస్థాన్‌ ‌సంబంధాలపై చర్చ జరుగుతున్నప్పుడు కూడా సల్మాన్‌, ‌షారూఖ్‌, ఇతరుల పేర్లు వినిపించాయి. కానీ అమీర్‌ ‌ఖాన్‌ ‌గురించి ఎవరు ప్రస్తావించలేదు. అలా వివాదరహితుడు అనే పేరు మాత్రం అమీర్‌ ‌సాధించగలిగాడు.

అయితే అమీర్‌ ‌వివాదాలకు నిజంగానే దూరంగా ఉన్నాడా అంటే లేడనే చెప్పాలి. ఒక సిద్ధాంతానికి చెందినవారితో సన్నిహితంగా మెలగడమేకాక అనేకసార్లు వాళ్లు చేసే పనులను బాహాటంగానే సమర్ధించాడు. అర్బన్‌ ‌నక్సల్‌ ‌మేధా పాట్కర్‌కు మద్దతు తెలుపడమేకాక 2006లో నర్మదా నదిపై వంతెనల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆమె చేసిన ఉద్యమానికి బాగా  ప్రచారం చేశాడు. అయితే డ్యామ్‌ల నిర్మాణం వల్ల నిర్వాసితులైన వారందరికి ప్రభుత్వం నష్టపరి హారం చెల్లించడమేకాక, వారికి తగిన జీవనోపాధి చూపించింది. ఈ ప్రాజెక్ట్ ‌పూర్తవడం వల్ల గుజరాత్‌ ‌లోని కరవు ప్రాంతాలకు పుష్కలంగా నీరందుతోంది. ఆ సమయంలో అమీర్‌  ‌చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్‌ ‌నాయకులు సైతం వ్యతిరేకించారు. అయినా అతను మేధాపాట్కర్‌ ‌వైపే నిలుచున్నాడు. అలాగే భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో నీటి కొరతకు, కాలుష్యానికి కారణ మైన కోకాకోలా కంపెనీకి చాలాకాలం ప్రచారం చేశాడు. కాబట్టి డబ్బు సంపాదన విషయం వచ్చిన ప్పుడు పాపం అతనికి ప్రజాసమస్యలు గుర్తుండవు.

పాకిస్థాన్‌కు చెందిన ఇస్లాం మతబోధకులుగా మారిన సంగీతకారులు మౌలానా తారిక్‌ ‌జామీల్‌, ‌జూనైద్‌ ‌జంషెడ్‌లు అమీర్‌కు చాలా సన్నిహితులు. హజ్‌ ‌యాత్రకు వెళ్లినప్పుడు అమీర్‌ ‌గంటలపాటు మౌలానా తారిక్‌ ‌జామీల్‌ ‌పాటలు వినేవాడు. అలాగే తన సినిమాలు విజయవంతం కావాలని ఆశీర్వ దించాలని మౌలానాను తరచూ కోరేవాడు. కోవిడ్‌ ‌మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించడానికి మహి ళలు కురుచ దుస్తులు ధరించడమే కారణమంటూ ఇటీవల మౌలానా జమీల్‌ ‌వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అనేక సందర్భాల్లో బహిరంగంగానే హిందూ ధర్మాన్ని, దేవిదేవతలను గురించి అవమానకరంగా మాట్లాడటం ఆయనకు అలవాటు. ‘ప్రేమను పెంచాలి, పంచాలి’ అని చెపుతూనే మరోపక్క హిందూత్వం ఒక బూటకపు, అసత్యపు మతమంటూ వ్యాఖ్యానించడం మౌలానా తారీక్‌కే చెల్లింది. కానీ మరి ఇంకెవరైనా ఇస్లాం పట్ల అటువంటి ‘ప్రేమను’ కనబరిస్తే వెంటనే వాళ్ల తలకు వెలకడతారు. తబ్లీగి జమాత్‌కు చెందిన ఈ మౌలానా భక్తుడిగా ఆయన సిద్ధాంతానికి, వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నాడో, లేడో అమీర్‌ ‌ఖాన్‌ ‌స్పష్టం చేయాలి.

ఇటీవల అమీర్‌ ‌ఖాన్‌ ‌టర్కీ పర్యటన కూడా అనేక విమర్శలకు తావిచ్చింది. టర్కీ ప్రస్తుత అధ్యక్షుడు ఎర్దోగాన్‌ ‌సెక్యులరిజాన్ని భూస్థాపితం చేసి ఆ దేశాన్ని పూర్తిగా ఇస్లామీకరించడంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడు. ఇస్లాం సంస్థ ముస్లిం బ్రదర్‌ ‌హుడ్‌కు మద్దతునివ్వడమేకాక భారతీయ ముస్లింలకు మతమౌఢ్య పాఠాలు చెప్పేందుకు ఐసిస్‌ ‌తీవ్రవాదు లను కూడా ఎర్దోగాన్‌ ‌నియమించారని అనేక వార్తలు వచ్చాయి.  భారతీయ విద్యార్ధులను టర్కీ పంపడానికి ఇక్కడి టర్కీ రాయబార కార్యాలయం వివిధ స్వఛ్చంద సంస్థలతో కలిసి చురుకుగా ఏర్పాటు చేస్తోందని, అక్కడకు వెళ్లిన విద్యార్ధులకు టర్కీ, పాకిస్థాన్‌ అనుకూల సిద్ధాంతాలు నూరిపోస్తున్నారని ఆ వార్తల సారాంశం. కాశ్మీర్‌, ‌పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ), జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సి)ల విషయంలో ఇప్పటికే పాకిస్థాన్‌ అనుకూల వైఖరి అవలంబిస్తున్న టర్కీ అధ్యక్షుడు భారత్‌ అం‌తర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తు న్నారు. సిరియాలో కుర్ద్‌లపై దారుణ మారణకాండకు పాల్పడిన టర్కీ, గతంలో జరిగిన అర్మేనియా మారణ కాండతో తమకు సంబంధం లేదని బుకాయిస్తోంది. మరోపక్క ఆ దేశంలో ప్రభుత్వమే పనిగట్టుకుని చర్చిలని మసీదులుగా మారుస్తోంది. ఈ విషయాలన్నీ ప్రపంచం మొత్తానికి తెలుసు. అన్నీ మీడియా సంస్థలు వీటి గురించి రాసాయి, చర్చించాయి. ఈ నేపధ్యంలో అమీర్‌ఖాన్‌ ఆ ‌దేశానికి వెళ్లడమేకాక అక్కడ అధ్యక్షుడి భార్యను కలిసి ఆ దేశం పట్ల ఆసక్తిని, గౌరవాన్ని వ్యక్తం చేయడం అతని మోసపూరిత మనస్తత్వాన్ని తెలుపుతుంది. ఇదే అమీర్‌ఖాన్‌ ‌మన దేశానికి వచ్చిన ఇజ్రాయెల్‌ ‌ప్రధాని ఆహ్వానాన్ని తిరస్కరించడం గమనార్హం.

అమీర్‌ ‌సినిమా, సిద్ధాంతం

అమీర్‌ ‌ఖాన్‌ ‌ధోరణి అతని సినిమాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు అతని పీకే సినిమానే తీసుకుందాం. ఈ సినిమా హిందూ ధర్మాన్ని, హిందూ దేవిదేవతలను కించపరచడంతోపాటు ఆ దేవతలను పూజించడమంటే ‘రాంగ్‌ ‌నంబర్‌కు ఫోన్‌ ‌చేయడమే’ నని చూపించారు. అలాగే ముస్లిం అబ్బాయిలతో హిందూ అమ్మాయిలు స్నేహం చేయడంలో తప్పులేదంటూ ఆ సినిమాలో చెప్పారు. కానీ నిజ జీవితంలో ఇలాంటి స్నేహాల వల్ల హిందూ అమ్మాయిలు అనేక కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటు న్నారన్న విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. అమీర్‌ ‌ఖాన్‌ ‌తాను చేసుకున్న రెండు పెళ్లిలలో హిందూ అమ్మాయిలనే ఎంచుకున్నాడు. పైగా తమ పిల్లలను ఇస్లాం ప్రకారమే పెంచుతానని వారికి స్పష్టంగా చెప్పాడు కూడా.

భారతీయ సమాజంలో సమస్యలను పెద్దవి చేసి చూపేందుకు అతను సత్యమేవ జయతే అనే టీవి సీరియల్‌ ‌కూడా తీశాడు. మూడు సీజన్‌లుగా సాగిన ఈ సీరియల్‌ ‌మొత్తంలో ఎక్కడా ట్రిపుల్‌ ‌తలాక్‌, ‌నిఖా హలాల్‌, ‌మదర్సాలలో అత్యాచారాలు, నిఖా ముతా, ముస్లిమేతర ఆడపిల్లలను పెంచడం, పర్దా వంటి వాటిలో ఏ ఒక్కటీ చూపించలేదు, వాటి గురించి చర్చించలేదు. అలా హిందూ సమాజాన్ని కించపరచడం, ముస్లిం సమాజంలో లోపాలు బయటపడకుండా చూడటం ఈ సీరియల్‌ ఉద్దేశమని అనిపిస్తుంది. తాను నటించే, తీసే సినిమాలన్నింటిలో అమీర్‌ ‌ఖాన్‌ ‌తన మాటే చెల్లించుకుంటాడన్నది అందరికీ తెలిసిన విషయమే. అంటే అతను మరెవరో చెప్పిన ప్రకారం చేయడం లేదని, తన సొంత ఆలోచనతోనే వ్యవహరిస్తున్నాడని స్పష్టమవుతుంది. ఇంకా చెప్పాలంటే అమీర్‌ ‌ఖాన్‌ ఇస్లాం అనుకూల, హిందూ లేదా భారత వ్యతిరేక ధోరణి అవలంబి స్తున్నట్లు తెలిసిపోతోంది.

ముగింపు

భారత ప్రజానీకం అమీర్‌ ‌ఖాన్‌కు ఎంతో సంపదనిచ్చారు, ప్రేమాభిమానాలు పంచారు. సినీ రంగంలో ఆ స్థాయికి అతను చేరుకున్నాడంటే అది హిందూ ప్రేక్షకుల పుణ్యమే. కానీ విచిత్రమేమిటంటే అలాంటి అమీర్‌ ‌ఖాన్‌ ‌తనకు ఈ స్థాయి, హోదా ఇచ్చిన ఈ దేశాన్ని నిరసించి, ఈ దేశాన్ని వ్యతిరేకి స్తున్న, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పరాయి దేశాన్ని పొగుడుతున్నాడు. అమీర్‌ ‌ఖాన్‌ అనుసరిస్తున్న ఈ ఇస్లాం అనుకూల, హిందూ వ్యతిరేక ధోరణి గురించి అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆయన అభిమానులు ఈ విషయాన్ని గుర్తించాలి. అలా చేయకపోతే ఈ దేశానికి, ధర్మానికి అన్యాయం చేసిన వారమవుతాం. సత్యమేవ జయతే!

  • పవన్‌ ‌పాండే

About Author

By editor

Twitter
YOUTUBE