జాగృతి – సంపాదకీయం
శాలివాహన 1941 – శ్రీ శార్వరి ఆషాడ అమావాస్య – 20 జూలై 2020, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
—————————————————————————————————————————-
మన దేశ ఈశాన్య సరిహద్దుల్లో దురాక్రమణకు విఫలయత్నం చేసిన చైనా తోక ముడిచినట్లే కనిపిస్తోంది. అయినా ఇంతటితో మనకు ముప్పు తప్పినట్లేనని సంబరపడాల్సిన పరిస్థితుల్లేవని విశ్లేషకుల హెచ్చరిక! కమ్యూనిస్టు చైనా నైజం, విదేశీ దండయాత్రల సందర్భగా మన దేశ అనుభవాలు, స్వార్థపరుల దేశద్రోహం తదితరాలే విశ్లేషకుల అంచనాలకు ఆధారం. గ్రీసు దేశస్తుడైన అలెగ్జాడరు మన దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు అంభి అతనికి తోడ్పడ్డాడు. ఆతరువాత ఢిల్లీ పాలకుడైన పృధ్వీరాజు చేతిలో పరాజితుడై కుమిలిపోతున్న ఘోరీని మన దేశం మరో రాజు జయచంద్రుడు కలసి ధైర్యం చెప్పాడు. ఢిల్లీ గుట్టుమట్లు తెలిపి మరో ప్రయత్నానికి పురికొల్పి ఘోరీ గెలుపునకు తోడ్పడ్డాడు. దాంతో భారతదేశంలో విజాతీయుల పాలనకు బీజం పడింది.
ఆధునికకాలంలో నమ్మించి మోసం చేసే కమ్యూనిస్టు చైనా దుర్బుద్ధి నెహ్రూ హయాం నుండే బట్టబయలవుతోంది. ఐక్యరాజ్య సమితిలో కీలకమైన భద్రతా మండలిలో భారత్‌కు సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు దాన్ని చైనాకు ఇమ్మని నెహ్రూ సిఫారసు చేశారు. కృతజ్ఞత చూపిచాల్సిన చైనా 1962లో మన ఈశాన్య సరిహద్దుల్లో దురాక్రమణకు పాల్పడి తన నైజం చాటుకుంది. చైనా నమ్మకద్రోహానికి మనస్తాపం చెంది మంచం పట్టిన నెహ్రూ ఆ దిగులుతోనే 1964లో మరణించారు. దురాక్రమణకు పాల్పడిన కమ్యూనిస్టు చైనాను భారత కమ్యూనిస్టులు తప్పు పట్టకపోగా డ్రాగన్‌కు స్వాగతం పలుకుతూ భారత్‌లో సభలు నిర్వహించారు. చైనా అధ్యక్షుడు మావోయే మా అధ్యక్షుడు అనేవరకు మన కమ్యూనిస్టులు వెళ్లారు. నాటి నుండి నేటి దాకా కాగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పోటాపోటీగా దేశ ప్రయోజనాలకు విరుద్ధగా వ్యవహరిచడం విషాదం.
భారత రైతులు పండించే పొగాకు కొనడానికి రష్యా నుండి ఆర్డర్లు ఇప్పిస్తామని భారత కమ్యూనిస్టులు మన పొగాకు వ్యాపారుల నుండి విరాళాలు దండుకునేవారు. శ్రీమతి ఇదిర ప్రధాని అయ్యాక ఈ కిటుకు కనిపెట్టి నేరుగా రష్యా ప్రభుత్వతో మాట్లాడి పొగాకు కొనుగోలు ఆర్డర్లు, మంచి ధర ఇప్పిస్తానని చెప్పి వ్యాపారుల నుండి విరాళాలు కాగ్రెస్ పార్టీకి మళ్లించుకున్నారు. ఆమె కమ్యూనిస్టుల ఆట కట్టించారని కాంగ్రెస్ నేతలు సంబరపడ్డారే కాని గతంలో కమ్యూనిస్టులు, ఇప్పుడు కాగ్రెస్ పార్టీ ఇద్దరూ భారత పొగాకు రైతుల పొట్టకొట్టారన్న సత్యం గుర్తించలేకపోయారు.
కాంగ్రెస్ పగ్గాలు శ్రీమతి సోనియా చేతికి వచ్చాక పైకి చట్టబద్ధంగా, పారదర్శకంగా సాగినట్లు కనిపించే లాలూచీ వ్యవహారాలతో ద్రోహం కొత్తపుంతలు తొక్కింది. సోనియా అధ్యక్షురాలైన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు నకిలీ గాంధీ కుటుంబీకులే పెత్తందారులు. మన్మోహన్‌సింగ్, చిదంబరం తదితరులు పేరుకు సభ్యులు. ఈ సంస్థకు చైనా ప్రభుత్వం నుండి 2005-06లో 90లక్షల రూపాయలు విరాళంగా వచ్చాయి. ఇది ఆ సంస్థ రికార్డుల్లో, వెబ్‌సైట్లో కూడా ఉంది. ఆ తరువాత చైనాతో భారత్ ఫీట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవాలని ఆ సంస్థ సిఫారసు చేసింది. దాని వల్ల చైనాకు ఆర్థికంగా లబ్ధి చేకూరగా, భారత్‌కు భారీ నష్టం వాటిల్లింది. చైనా నుండి సోనియా సంస్థకు విరాళాలు అందడం, తరువాత ఆ సంస్థ చేసిన సిఫారసులు అమలైన ఫలితంగా భారత ప్రజలకు నష్టం, చైనా ప్రభుత్వానికి కోట్లరూపాయల లబ్ధి చేకూరడం చరిత్ర. ఇలాంటి లాలూచీ వ్యవహారాన్నే కదా క్విడ్‌ప్రోకో నేరంగా వర్ణించి తెలుగునాట జగన్ మోహనరెడ్డిని సోనియా జైలుకు పంపిది. ఆర్థిక నష్టానికి మించి, ఆమె అంతరాంతరాల్లోని ద్రోహ చింతనను ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి.
దేశ సరిహద్దుల వెంట నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చిచండానికి ప్రధాని మోదీ జూన్ 19న అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా రాహుల్ చేసిన ట్వీట్లు, చైనా విషయమై ప్రధాని మోదీ వద్ద ఎలాంటి వ్యూహం ఉందో బయటపెట్టాలి అంటూ సోనియా సంధించిన ప్రశ్నలు వారి లోగుట్టును వెల్లడిస్తున్నాయి. శత్రుదేశంతో మనం అనుసరించే యుద్ధ వ్యూహమేమిటో బహిర్గతం చేయాలని కడుపుకు అన్నం తినే వారెవ్వరూ అడగరు. యుద్ధవ్యూహం అంటేనే రహస్యం. ఐనా సోనియా అలా ఎందుకు అడిగారో తెలుసుకోడానికి గతంలోకి వెళ్లాలి.
సోనియా గాంధీ తెరవెనుక ఉండి కథ నడిపిన యుపిఎ పాలన కాలంలో 2008 ఆగస్టు 7న కాగ్రెస్ పార్టీ చైనా కమ్యూనిష్టు పార్టీతో ఓ అవగాహనా ఒప్పదం కుదుర్చుకుంది. దాని ప్రకారం ఇరు పార్టీలు ఉన్నత స్థాయిలో కలసి పనిచేయాలి. ఇరు పార్టీల మధ్య ఉన్నత స్థాయి సమాచార మార్పిడి, సహకారం, ముఖ్యమైన పరిణామాలపై సంప్రదింపులు ముఖ్యాంశాలు. భారత్‌కు నష్టం వాటిల్లినా సరే సోనియా చైనా రుణం తీర్చుకోవాలి కదా! అందుకే మన యుద్ధ వ్యూహమేమిటో చెప్పమని ఆమె ప్రధాని మోదీని అడిగారు. దేశ రక్షణవ్యూహాలను, వ్యవస్థలను, బలగాల మనో ధైర్యాన్ని, శక్తి సామర్థ్యాలను దొంగ దెబ్బతీసే ఇంటి దొంగల పట్ల ప్రజలు అప్రమత్తులై మెలగాలి!