– కరోనా సంకట సమయంలో మోదీ విరోధుల సిగ్గుమాలిన చర్యలు
– లాక్‌డౌన్ నెపంతో ప్రజాస్వామ్యంపై తిరుగుబాటు
మీ స్వంత పూచీతో ఈ కథనాన్ని చదవండి. ఇది పూర్తిగా రాజకీయపరమైన అంశం. బహుశా ‘రాజకీయంగా తప్పుడు’ వ్యాసం. నేను గతంలో నా రాజకీయ అభిప్రాయాలను ఎవరితోనూ పంచుకోలేదు. మొదటిసారి నా రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాను. కానీ ఈ రోజు ఇది జీవన్మరణ సమస్య. అలాంటి సమయంలో మాట్లాడటం చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను. నేను రాసిన ప్రతిదాన్ని చదివినప్పటికీ మీకు నా మాటలు అర్థం కాకపోతే, దయచేసి ఇక్కడ ద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రతికూల వ్యాఖ్యలు చేయవద్దు. నా వద్ద సమయం లేదు. శక్తి అంతకంటే లేదు. మీతో వాదించాలనే కోరిక నా మనసులో లేదు. మీరు నన్ను అనుసరించకపోయినా ఫర్వాలేదు. జీవన్మరణ సంక్షోభ సమయంలో ఒక వ్యక్తి ఉద్దేశాలు, ఆలోచనలు బాగా అర్థం చేసుకోవచ్చు. ఇదే సరైన సమయం కూడాను. ఇది మన నిజమైన స్వభావం వెల్లడైన సమయం. పెద్ద సంఖ్యలో బుద్ధిహీన ట్రోలు, గూండాలు, భక్తులు తమ మత ఉగ్రవాద అభిప్రాయాలను ఏ సందర్భంలోనైనా కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మరోవైపు ‘మేధావి’, ‘మేల్కొన్న’ సమాజంలో ఎక్కువ భాగం మోదీ పట్ల ద్వేషపూరిత భావనతో ఉన్నారు. ఈ రెండు రకాల తీవ్రమైన భావజాలాలతో ఎలా వెళ్లగలం? ఈ సత్యాన్ని ఎలా అర్థం చేసుకుంటా.
జీన్ షార్ప్ అనే అమెరికన్ రాజకీయ శాస్త్రవేత్త ఒక ప్రభుత్వాన్ని ఏ విధంగా పతనం చేయవచ్చో వివరించే పుస్తకాలు ఎన్నో రాసారు. అందులో అహింసాత్మక, ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి లేదా అణిచివేయడానికి 198 మార్గాల గురించి ఆయన చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే ఉద్యమాలలో శాంతి, ప్రజాస్వామ్యం గురించి తప్పనిసరిగా మాట్లాడాలని ఆయన చెబుతున్నారు. దీని ద్వారానే ప్రభుత్వం నిష్క్రియం అవుతుంది. మొత్తం వ్యవస్థ అస్థవ్యస్థం అవుతుంది. చివరకు ప్రభుత్వానికి అధికారం ఇచ్చే వ్యవస్థ నిర్వీర్యమై ప్రభుత్వం కూలిపోతుంది. ఈ పద్ధతును కొన్ని ఈజిప్టులోని తహ్రీర్ చౌక్ వద్ద అమలు చేయగా, ఉక్రెయిన్‌లో రష్యాకు వ్యతిరేకంగా ఇదే జరిగింది. ఇవే 76 రోజుల్లో హాంకాంగ్ నాశనానికి కారణమయ్యాయి. ఈ పద్ధతుల్లో కొన్ని – పోలీసులు, భద్రతా దళాలపై రాళ్లు విసరడం, వారి మార్గాన్ని నాశనం చేయడం, రోడ్లను అడ్డుకోవడం, ఫైర్ ఇంజన్లకు నిప్పు పెట్టడం, తద్వారా వారు మరెక్కడా మంటలను ఆర్పలేరు. నిరసనలలో మహిళలు, పిల్లలను ముందంజలో ఉంచడం. యాసిడ్ విసరడం, పెట్రోల్ బాంబులు విసరడం, మీడియాతో ప్రతికూల ప్రచారం చేయడం, నకిలీ వార్తలు వ్యాప్తిచేయడం, ప్రజలను తప్పు దోవ పట్టించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపించడం, వికలాంగులను ఉపయోగించడం వంటివన్నీ ఈ పద్ధతులే.
ఢిల్లీలో ఇటీవల జరిగిన మతపరమైన అల్లర్లను పరిశీలిస్తే, ప్రభుత్వాన్ని అస్థిరపరి చేందుకు ఇవే వ్యూహాత్మక విధానాలు అమలుపరిచినట్లు అనిపిస్తుంది. దీని లోతుల్లోకి వెళ్లి పరిశీలించినట్లయితే అదే మేధావులు, విద్యావంతులు, ‘అవగాహన గల’ వ్యక్తులు దీని వెనుక ఉన్నారని అర్థం చేసుకుంటారు. జీన్ షార్ప్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వివరించిన పద్ధతుల జాబితాలో కనీసం 70 నుండి 80 పద్ధతులు ఢిల్లీలో జరిగిన సంఘటనలలో నేరుగా ఉపయోగించారు. ఢిల్లీలో ఏది జరిగినా సీఏఏతో ఎటువంటి సంబంధం లేదు. ముస్లింలతో కూడా దీనికి సంబంధం లేదు. ఈ దేశ పరిమాణం జనాభాను చూస్తే, లౌకికవాదం గురించి ప్రశ్న లేవనెత్తాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవాలి! ఫ్రెంచ్, పోర్చుగీస్, బ్రిటిష్, మొఘలుల జోక్యం ఉన్నప్పటికీ, భారతదేశం తన ఉనికిని కాపాడుకుంది. తన సర్వధర్మ సమభావనకు విఘాతం కలగనివ్వలేదు. నేడు కొంతమంది తప్పుడు గూండాలకు భయపడాల్సిన అవసరం ఏమిటి? కొంతమంది ఈ దేశాన్ని శతాబ్దాలుగా దోచుకున్నారు. ఇది దశాబ్దాలుగా మూడవ ప్రపంచ దేశంగా నిలిచింది. కొన్ని దశాబ్దాలు అవినీతి, వంశపారంపర్య రాజకీయాలు ఆధిపత్యం వహించాయి. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, విద్యావంతులు, తెలివైనవారు, మేధావులు కూడా తప్పుడు సమాచారం ద్వారా తప్పుదారి పట్టించారు. నేడు మోదీని అవమానించడానికి ఆడుతున్న రాజకీయ చదరంగం భారత ప్రజాస్వామ్య, లౌకికతత్వానికి అత్యంత ప్రమాదకరం. నాయకత్వం గురించి కొంచెమైనా జ్ఞానం ఉన్నవారెవరికైనా తెలుసు, నాయకుడిగా ఉండటానికి మొదటి నియమం అతను తన బృందాన్ని వారు ఎంత అసమర్థులు, బాధ్యతా రహితంగా ఉన్నప్పటికి వెంట తీసుకెళ్లాలి. ఇది జట్టు కృషి కలిసి పనిచేయడానికి నిదర్శనం. మంచి జట్టు ఆటగాడి లక్షణం తమ అంతర్గత సమస్యలు ఎలా ఉన్నా, జట్టు సభ్యుడిని నిందించడు. అతని లోపాన్ని దాచి, ముందుకు తీసుకెళతాడు. అయితే ఎవరైనా మోదీని ఎందుకు ద్వేషిస్తారు? భారతదేశం దశాబ్దాలుగా అవినీతి, వంశపారంపర్య రాజకీయాల పట్టులో చిక్కుకొని ఉంది.
నా వ్యక్తిగత జీవితం నుండి ఒక ఉదాహరణ వివరిస్తాను. మా నాన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌గా కెరీర్ ప్రారంభించడానికి 1998లో ముంబైకి వెళ్లారు. ఆయన భారతదేశంలో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్‌ను ప్రవేశపెట్టిన మొదటి వైద్యుడు. నెలకు పన్నెండువేల రూపాయల సంపాదనతో మొదలుపెట్టిన ఆయన ప్రస్తానం ముంబై నగరం నడిబొడ్డున గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రిని స్థాపించే స్థాయికి చేరింది. కానీ ఆయన ప్రయాణం అంత సులభం కాదు. సంవత్సరాలుగా మొత్తం డాక్టర్ల సంఘం ఆయనకి వ్యతిరేకంగా ఉండేది. మరణ బెదిరింపులు, హింసను ఎదుర్కొన్నాడు. ఆయన వ్యక్తిగత సహాయకుని చంపేందుకు కొంతమంది గుండాలు ప్రయత్నించారు. కారణమేమిటో మీకు తెలుసా? ఆయన అందరికంటే యోగ్యుడైన డాక్టర్. ఆయన మొదటి ప్రాధాన్యం తనవద్దకు వచ్చే రోగుల ప్రాణాలు రక్షించడం. అవినీతి కార్యకలాపాల్లో పాలుపంచుకోవడాని నిర్వింద్వంగా తిరస్కరించారు. సహజంగా ఒకవ్యక్తి ఉన్నతిని సాధిస్తుంటే జీర్ణించుకోలేని వ్యక్తులు సమాజంలో చాలామంది ఉంటారు. ఇది మానవ స్వభావం కూడాను. ఒక చిన్న పట్టణం, నిమ్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అభివృద్దిని ఎవరు సహిస్తారు. భారతదేశంలో తొంభై శాతంపైగా ఉన్న ప్రజల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు చాలా కాలంగా లేరు అన్నది ఒప్పుకోవాల్సిందే. టీ అమ్మే వ్యక్తి ఇప్పటివరకు నాయకుడు కాలేదు. అత్యధిక ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలిసిన వర్గం నుండి వచ్చిన వ్యక్తి ఇప్పటివరకు ఎవరూ లేరు. భారతదేశంలో ఏ మార్పుకైనా ఉద్యమాలు అవసరం. చట్టాలు కాదని ప్రధానమంత్రి మోదీ అభిప్రాయం. ఆయన అమలు చేసిన విధానాల వల్ల దేశ పరిస్థితులు ఎంతో మారిపోయాయి. అందుకోసం ఆయన చేసిన కృషి, ప్రజలతో వ్యవహరించిన తీరు ప్రశంసనీయం. ఆయన విఫలమైన ఏకైక సమస్య ఆర్థిక వ్యవస్థ. ఏదేమైనా, దీని కోసం కఠినమైన చర్యలు తీసుకున్నారు. అవి నిజంగా ప్రభావవంతంగా ఉన్నాయో లేదో సమయం మాత్రమే తెలియజేస్తుంది. వాస్తవానికి కొవిడ్ తరువాత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఒక్క భారత ఆర్థిక వ్యవస్థ మాత్రమే. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ తొంభై శాతం వరకు స్వయం సమృద్ధిగా ఉంటుంది.
ఎంబిబిఎస్, ఎండి, రచయిత డాక్టర్ శరద్ ఠాకూర్ నుండి నేను ఇటీవల గుజరాతీలో ఒక ఆడియో క్లిప్ అందుకున్నాను. అందులో ఆయన మోదీతో ప్రీ-కొవిడ్ గురించి చర్చించారు. ఆయన మోదీతో ‘ప్రస్తుతం ఏం జరుగుతోంది. మీరు ఎలా ఉన్నార’ని ప్రశ్నించారు. డాక్టర్ శరద్ మాటల్లో చెప్పాలంటే ఏ సాధారణవ్యక్తి అయినా సరే ‘నేను బాగున్నాను’ అని సమాధానమిస్తారు. కానీ మోదీ కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉన్నారు. కాసేపటి తర్వాత గంభీరంగా చెప్పారు ‘సాధన’. ఆయన మళ్లీ ప్రశ్నించారు. ఏమిటీ సాధన? ఎందుకోసం? మోదీ సమాధానమిస్తూ ‘నిద్రను నియంత్రించేందుకు నేను సాధన చేస్తున్నా’ను అన్నారు. మీరు మొదటి నుండి తక్కువగానే నిద్రిస్తారు కదా! ఇంకా ఎన్ని గంటలపాటు నిద్రని నియంత్రించాలనుకుంటున్నారు? ‘నేను అసలు నిద్రించాలనుకోవడం లేదు. అందుకోసమే నేను సాధన చేస్తున్నాను. ప్రజలకెవరికైనా తెలిస్తే దీన్ని నమ్మరని నాకు తెలుసు. నేను సాధన చేస్తున్నాను. కనుక నాకు నమ్మకం ఉంది. సాధన ద్వారా సాధ్యం కానిది ఏమీ లేదు. అలాగే నిద్రను నియంత్రించవచ్చు. హను మంతుడు ఏ రోజు నిద్రపోలేదని చెబుతుంటారు’ అంటూ మోదీ మరోసారి గంభీరంగా సమాధానం చెప్పారు. డాక్టర్ శరద్ మోదీతో మీరు ఇలా ఎందుకు చేయాలనుకుంటున్నారు. ఎవరి కోసం అంటూ మళ్లీ ప్రశ్నించారు. మోదీ అన్నారు ‘పేదవారి కోసం.. ఈ దేశం కోసం’. ‘మనది ఎంతో మహోన్నతమైన దేశం. దీన్ని దోచుకున్నారు. దీన్ని సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు 20 గంటలు సరిపోవడం లేదు. నాకు మొత్తం 24 గంటలు కావాలి.’ ఇలా చెబుతున్న తరుణంలో మోదీ కళ్లలోనుండి కన్నీళ్లు కారాయి. అది వింటూ డాక్టర్ శరద్ కూడా కన్నీటీధారను ఆపుకోలేకపోయారు. ఆయన మోదీ హిమాలయాల్లో గడిపిన రోజుల గురించి ప్రస్తావించారు. ఆయన విజన్ గురించి మాట్లాడారు. మోదీ మాట్లాడుతూ తాను హిమాలయాల్లో ఉన్న రోజుల్లో నీవు సాధువు కారాదు. దేశానికి సేవ చేయాలనే సందేశం ఆదేశ రూపంలో అందినట్లు చెప్పారు. కనుకనే తాను హిమాలయాలు విడిచి వచ్చానని వివరించారు. డాక్టర్ శరద్ మోదీతో చాలా మంది మీ ప్రాణాల వెంట పడ్డారు. మీరు హిట్‌లిస్ట్‌లో అందరికంటే ముందంజలో ఉన్నారు. మీకు భయం కావడం లేదా? అని ప్రశ్నించారు. దీనికి మోదీ ‘దేశానికి సేవ చేయాలన్నదే నా జీవిత లక్ష్యం. ఎప్పటివరకైతే నా లక్ష్యం పూర్తికాదో అప్పటివరకు నన్ను ఎవరూ చంపలేరు. అయితే నా లక్ష్యం పూర్తి అయిన తర్వాత నా చావును ఆపడం కూడా ఎవరి తరంకాదు. నేను చావుకు భయపడను. నేను నా లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఇక్కడికి వచ్చాను. అది పూర్తి చేసే వెళతాను.’ అని సమాధానం చెప్పారు. డాక్టర్ శరద్ మాట్లాడుతూ నేను కళ్లు మూసుకొని గుడ్డిగా ఎవరినీ అనుసరించను. మనం కుండను ఖరీదు చేయాడానికి మార్కెట్‌కు వెళ్లే సమయంలో అది ఎండినదేనా (నాణ్యమైనదా) లేక ఇంకా పచ్చిగానే ఉందా అని చిన్నగా కొట్టి చూస్తాం. కానీ ఈయన మట్టికుండ కాదు ఒకవ్యక్తి. పైగా అనేక సార్లు ఆయనను పరీక్షించి చూసారు. మోదీని ఒక వ్యక్తిగానే కాదు 130 కోట్లమంది భారతీయులు పరీక్షించి చూసారు. నేటికి ఆయన ధృడంగా నిలిచారు. ఆయన నాణ్యత లేని మట్టికుండ కాదు. నాణ్యత లేని మనిషి అంతకంటే కాదు.
చైనాలోని హుబీ ప్రావిన్స్‌లో లాక్‌డౌన్ సందర్భంగా జరిగిన హింసాత్మక నిరసనల వీడియోలు, ట్వీట్లను చైనా ప్రభుత్వం తొలగించింది. భారతదేశంలో వేలాది మంది వలస కార్మికుల వీడియోలు, ప్రభుత్వాన్ని విమర్శించే ట్వీట్లు ఇప్పటికీ ఇంటర్నెట్‌లో ఉన్నాయి. నిజంగానే అందరు ఆరోపిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఫాసిస్ట్ అయితే, ఇవన్నీ చేయడానికి వీరికి స్వేచ్ఛ ఉండేదా? మోదీ ప్రభుత్వం ఏర్పడి ఆరు సంవత్సరాలు గడిచాయి. ఫాసిజాన్ని పూర్తిగా అమలు చేయాలనుకుంటే, వారికి నిజంగా ఈ ఉద్దేశం ఉంటే, ఇవన్నీ ఏనాడో జరిగి ఉండేవి కదా. అమెరికాలో నివసిస్తున్న నా స్నేహితుడు ఒకరు ఈ ఉదయం ఒక వాయిస్ నోట్ పంపారు. ‘నటాషా నేను ప్రతిచోటా ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని చూశాను. కానీ భారత ప్రజలు ట్విట్టర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతలా దిగజారి వ్యాఖ్యలు చేయడం మరెక్కడా కనిపించదు.’ భారతదేశంలో ట్విట్టర్‌లో విపరీతమైన ప్రతికూలత ఉంది. నేటికీ, ఈ ట్వీట్లు, పోస్టులు మునుపటిలాగా ట్రెండ్ అవుతున్నాయి. సుమారు 4.5 బిలియన్ ప్రజలు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. మీరు వారిని తప్పుదారి పట్టించి, తటస్థంగా చేస్తే – ప్రభుత్వం అసమర్థంగా ఉన్నట్లు లెక్క. ఇక దీనితో మీ సగం పని పూర్తైనట్లే.
జీన్ షార్ప్ కొన్ని వ్యవస్థల గురించి వివ రించారు. ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి, బలహీనపరచడానికి మీడియాను ఉపయో గించాలి. నేడు సద్గురు, ఇతర ఆధ్యాత్మిక సంస్థలను కొంతమంది లక్ష్యంగా చేసుకున్నారన డంలో ఆశ్చర్యం లేదు. జగ్గీ వాదనలు, ఆయన పనిని నిజంగా ఎవరూ కాదనలేరు. అందువల్ల ఒక వర్గానికి చెందిన ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా పనికిమాలిన వ్యూహాలను రచించడం ప్రారంభించారు. ఈ రోజు, కొంత మంది తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తుండగా, అదే సమయంలో సద్గురు ప్రపంచ విధానాలను మార్చడానికి కొన్ని అద్భుతమైన పనులలో నిమగ్నమై ఉన్నారు.
చెడు భావాలు వ్యాప్తి చేసేందుకు ట్విట్టర్‌లో పోస్ట్ చదవకుండా మెషీన్ లాగా రీట్వీట్ చేసేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొంత మంది రీట్వీట్ చేయడానికి డబ్బును కూడా పొందుతున్నారు. అదే సమయంలో, కొంత మంది సంచలనాత్మక వార్తలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ట్విట్టర్‌లో 25 మందితో కూడిన బృందం ఏదైనా ట్వీట్‌ను ట్రెండ్ చేయడానికి సరిపోతారు. సాయంత్రం నుండి రాత్రి వరకు ప్రతికూల ట్వీట్ల ట్రెండ్ నడుస్తున్నప్పుడు, పాశ్చాత్య దేశాలలో ప్రజలు ఆ సమయంలో మేల్కొని ఉంటారు. వారు కూడా ఆ విషయం గురించి చర్చించడం ప్రారంభిస్తారు. అప్పుడు తప్పుడు కథనాల ప్రచారానికి బలం పెరుగుతుంది. విద్యా వంతులైన మేధావులు, అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండే కళాశాల విద్యార్థులు వీరి లక్ష్యానికి సులభంగా చిక్కుతారు. ఎవరూ ఫాసిజాన్ని కోరుకోరు. మత ఉన్మాదాన్ని కూడా ఎవరూ ఆశించరు. మత పోరాటాన్ని ఎవరూ కావాలనుకోరు. సమాజంలో రక్తపాతం జరగాలని ఎవరూ భావించరు.
లాక్‌డౌన్‌లో వేలాది మంది వలస కార్మికులు తమ గ్రామాలకు తిరిగి వెళ్లడానికి హైవే బాటపట్టారు. ఇంకా చాలా మందిని డీటీసీ బస్సుల ద్వారా సరిహద్దుల వద్దకు తీసుకొచ్చి వారి మానాన వారిని వదిలేశారు. కొవిడ్-19 వంటి అంటువ్యాధిని ఎదుర్కోవ టానికి భారతదేశం ప్రయత్నిస్తున్నప్పుడు, అదే సమయంలో, చదువుకొన్న నిరక్షరాస్యులు, నిజమైన నిరక్షరాస్యులు, వాట్సాప్‌లో తప్పుడు వార్తలు, పక్షపాత ధోరణితో ప్రచారం మొదలుపెట్టారు. మేధావులు, దుర్మార్గులైన నాయకుల కారణంగా దేశంలో ఇంకా చాలా సమస్యలు తలెత్తాయి. ప్రధానమంత్రి జాతిని ఉద్ధేశించి ప్రసంగిస్తూ రెండు చేతులు జోడించి ఈ క్లిష్ట పరిస్థితులలో తమవద్ద పనిచేసే చిరు ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని, వారి పరిస్థితులను సహృదయంతో అర్ధం చేసుకోవా లని వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను అభ్యర్థించారు. కానీ చాలా వీడియోలు కరోనా విల్లెన్స్‌లో కనిపిస్తున్నాయి. అందులో ఒక మహిళ వీడియో పంపింది. ‘ఈ మూడు వారాలకు నా పనిమనిషికి ఎవరు జీతం చెల్లించాలి? మీరు చెల్లిస్తారా? ప్రధాని చెల్లిస్తాడా? అని నిలదీసింది. నిజమే వాళ్లు కచ్ఛితంగా బాగానే ఉంటారు. వాళ్లకు ఏమీ జరగలేదు. పనికోసం వస్తారు. దురదృష్టవ శాత్తు, చాలామంది భారతీయ యజమానుల మనస్తత్వం ఇలాగే ఉంది. ఫలితంగా ఎంతోమంది వలస కార్మికులను పనిలో నుండి తొలగించారు. జాతీయ టెలివిజన్‌లో మోదీ రెండు చేతులు జోడించి ‘దయచేసి సామాజిక దూరాన్ని పాటించండి. మీరు ఉన్న చోట ఉండండి. మీ గ్రామానికి తిరిగి వెళ్లవద్దు అని విజ్ఞప్తి చేశారు. ‘అయినప్పటికీ, ఢిల్లీ, యూపీ సరిహద్దులలో ప్రజలు తండోపతండలుగా కనిపిస్తున్నారు. ఇది చూస్తుంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని అనిపించడం సహమేనా? లాక్‌డౌన్ ప్రకటించే ముందు దాని పర్యవసానాల గురించి ప్రభుత్వం ఆలోచించి ఉండాలని కొందరు అంటున్నారు. దేశ ప్రజల పరిస్థితులను అర్థం చేసుకుని వాటి ఫలితాలను అంచనా వేయాలని వారు చెబుతున్నారు. సరే మనం వీటిని స్వీకరిద్దాం. కానీ మన వద్ద ఆలోచించే సమయం కూడా లేదన్నది వాస్తవం. సరిగ్గా అప్పుడే లాక్‌డౌన్ ప్రకటించడం అనివార్యం అయింది. ఇది అర్థం చేసుకోవాలి కదా! కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలంటే ఇలాంటి నిర్ణయాలు ప్రకటించడం ఈ సమయంలో తప్పనిసరి. ఒకవేళ లాక్‌డౌన్ కొద్దిరోజులు ముందుగా ప్రకటించినట్లయితే ప్రజలంతా ఇబ్బందుల పాలయ్యేవారు. అదీ కాకుండా మరికొన్ని రోజులు నిరీక్షించినట్లయితే పరిస్థితులు మరింత దిగజారేవి.
ప్రభుత్వం వలస కూలీలను ఏదైనా స్టేడియంలో ఉంచి వారికి భోజనం, వసతి ఏర్పాట్లు చేస్తే బావుండేదనిపిస్తోంది. నిజానికి అలా జరిగితే ఎంతోమందికి సాంత్వన చేకూరేది. కానీ మోదీ జాతీని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత వ్యవస్థల్లో లోపాలు తలెత్తుతాయని ఎవరూ ఊహించలేరు. ఎవరికి ఎటువంటి అనుమానం కల్గలేదు. విపరీతమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేందప్రభుత్వం పిలుపు మేరకు లాక్‌డౌన్ నుండి మొదలు చికిత్స వరకు అవసరమైన అన్ని సౌకర్యాల ఏర్పాట్లు, ఆర్థిక ప్యాకేజీల ప్రకటన, వైద్యసేవలు అందుకు అవసరమైన సామాగ్రి, శాంతిభద్రతల పరిరక్షణ తదితర వ్యవస్థలు చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఎటువంటి లోపాలు తలెత్తకుండా వ్యవహరించింది. పదివేల పడకల ఆస్పత్రి నిర్మాణానికి చైనాకు పదిరోజుల వ్యవధి అవసరమైంది. అదే భారత్ రైల్వేను రాత్రికి రాత్రి ఆరువేల పడకలతో భవ్యంగా నిర్మించింది. భారతదేశంలో ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేసిన ఏర్పాట్లు, యోజన అద్భుతమైనవి. చారిత్రత్మకమైనవని అభివర్ణించవచ్చు. నిజానికి వలస కూలీలు తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్ బాధితులుగా మారారు. చాలామంది కూలీలు చెప్పిన వివరాల ప్రకారం డీటీసి బస్సు సర్వీసుల వారు ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుండి కూలీల స్వస్థలాల వరకు తీసుకుళ్లే సౌకర్యం కల్పించి నట్లు చెప్పారు.
ఇది జీన్ షార్ప్ సూత్రం 101 ప్రకారం జరిగింది. అనేక వదంతులు వ్యాప్తిలోకి తెచ్చారు. అల్లర్లు జరిగే విధంగా వాతావరణం నిర్మాణం చేశారు. ఈ మహమ్మరిని నియంత్రణలో తెచ్చేందుకు కేందప్రభుత్వం ప్రతి ఒక్క పౌరుని క్షేమం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని విధాలుగా రూపకల్పన చేసింది. దురదృష్టవశాత్తు అనవసర అంశాలపై అధికంగా చర్చ కొనసాగు తోంది. నిజానికి వీటిలో ఏమాత్రం నిజం లేదు. ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూస్తే రాజకీయ క్షేత్రంలో మోదీ ప్రభుత్వం పరాజయం పాలవుతుంటే చూసి ఆనందించేందుకు అనేక శక్తులు కాచుకొని ఉన్నాయి. ఈ శక్తులు దేశహితాన్ని కూడా ఫణంగా పెట్టేందుకు వెనకడవు.
నేడు భారత రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు రాజకీయ వ్యవస్థకే మాయని మచ్చ. అన్నింటికంటే ఇది మానవత్వానికి మచ్చ. భారతదేశంలో పేలవమైన ఆరోగ్య సేవలు, సరిపోని పరీక్షా వస్తు సామాగ్రి, పేదరికం ఎదుర్కొంటున్న సవాళ్లు ఎన్నో ఉన్నప్పటికీ, కేవలం ఒక్క వారంలో మోదీ దేశం కోసం చేసింది అనూహ్యమైనది. అనిర్వచనీయ మైంది. అపూర్వమైంది. పర్యావరణానికి సంబంధించిన అనేక అంతర్జాతీయ సమావేశా లలో అభివృద్ధి చెందిన దేశాల శక్తివంతమైన నాయకుల ముందు, పర్యావరణ పరిరక్షణ విషయంలో భారతదేశానికి స్పష్టమైన విధానం ఉందని మోదీ నిరూపించారు. ‘ఆర్థిక వ్యవస్థ కంటే మానవ జీవితం చాలా ముఖ్యమైంద’ని పర్యావరణంతో ఆటలాడుతున్న అభివృద్ధి చెందిన దేశాలను ఒప్పించడానికి ఆయన ప్రయత్నించారు. ఈ సూత్రాన్ని నినాదంగా తీసుకునే అన్ని నిర్ణయాలు ఉన్నప్పటికీ, వీశీ•ఱవీ••వణఱ••వతీవీ0+!ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. కానీ మోదీ మాత్రమే భారతదేశాన్ని •×ణ – 19 మూడవ దశలోకి నెట్టివేసినట్లు చెబుతున్నారు. ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ప్రతిపక్షాలు నిరాశకు గురవుతున్నాయనడానికి ఇది ఒక సాక్ష్యం మాత్రమే. మోదీ సాధించిన విజయాలను అర్థరహితంగా నిరూపించడానికి ప్రతిపక్షాలు ఎన్ని రకాల యాతనలు పడుతు న్నారో అవన్నీ నిరర్థకమవుతున్నాయనడానికి ఇది రుజువు. మోదీ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు వారు ఎంతకైనా తెగిస్తారు. అందుకు మనుషుల జీవితాలను బలి ఇవ్వడానికైనా సరే సిద్ధమవు తారు. ప్రస్తుతం ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. జీవన్మరణాల మధ్య ఊగిసలాడుతున్నారు. ఈ సమయంలో అందరూ దేశం కోసం నిలబడాలి. అయితే, ఇలాంటి సమయంలో కూడా దేశంలోని బలహీనమైన విభాగం ద్వారా మోదీని అవమానించాలని, అందుకు లభించే ఏ ఒక్క ఆయుధమైనా సరే, ఉపయోగించుకోవడానికి ప్రతిపక్షాలు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. మీరు ఓటు వేసి గెలిపించిన రాక్షసులు కూడా వీరే. ఈ రోజు అమిత్ షా తనదైన రీతిలో ఎన్నికల్లో గెలిచినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఎన్నికలు కఠినంగా ఉన్నప్పటికీ, నేను వారి స్థానంలో ఉంటే, నేను కూడా అదే చేసేదాన్ని. ఎందుకంటే ఈ రాక్షసులు నా దేశంలో ఆధిపత్యం చెలాయించడం చూడలేను. వీరు ప్రజాస్వామ్య విలువల గురించి ఉపన్యాసాలు చెబుతారు. ఎదుటివారికి వాటి గురించి మాట్లాడే ఆర్హతే లేదన్నట్లు వ్యవహరిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో విషయాలను ప్రత్యక్షంగా, బలవంతంగానైనా సరే అమలు చేయగల నాయకుడి అవసరం ఉంది. వాస్తవానికి, జాతీయవాది అంటే ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ రోజు దేశ వ్యతిరేకులు ఎవరో స్పష్టంగా తెలిసింది. నేటి నుండి మా నాయకుని పట్ల నేను ఎంతో గర్వపడుతున్నాను. వాస్తవానికి సంయమనం, ధైర్యం, సాహనం, ప్రతికూల పరిస్థితులలో విజయం సాధించడం చాలా అరుదైన వ్యక్తులకు మాత్రమే సాధ్యం. ఈ అంటువ్యాధిని ఎదుర్కోవ టానికి, భారతీయులందరినీ రక్షించడానికి ప్రధాని మోదీ తీసుకున్న ప్రతి అడుగుకు ఈ రోజు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే నేటి నుండి నేను నా వామపక్ష-ఉదార మిత్రులు ఏమనుకుంటున్నారో ఆలోచించే ముందు నేను ఇన్నాళ్లు మోదీజీకి అనుకూలంగా నిలబడలేదని సిగ్గుపడుతున్నాను. అయితే ఈ రోజు నేను మోదీ ప్రభుత్వానికి నా మద్దతును బహిరంగంగా ప్రకటిస్తున్నాను. మీరు నన్ను భక్తురాలు అని పిలవవచ్చు. సోషల్ మీడియాలో నా నుండి మీరు దూరమవచ్చు – దీని గురించి నేను అస్సలు పట్టించుకోను.
– నటాషా రాథోడ్
రచయిత్రి పరిచయం
ఈమె బాలీవుడ్ చలనచిత్ర రంగంలో ప్రసిద్ధురాలు. షారుఖ్‌ఖాన్ నటించిన ‘దిల్‌వాలే దుల్హానియా లే జయేంగే’ చిత్రంపై ఆమె రూపొందించిన డాక్యుమెంటరీ బాగా ప్రాచుర్యం పొందింది. నటాషా లండన్ ఫిల్మ్ స్కూల్ నుండి ఫిల్మ్ మేకింగ్‌పై అధ్యయనం కొనసాగిస్తూ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేస్తూ రాజకీయ సమస్యలపై తన అభిప్రాయాన్ని మొదటిసారిగా వెలిబుచ్చింది. కరోనా సంక్షోభం, ఇటీవలి రాజకీయ పరిణామాల గురించి సోషల్ మీడియాలో ద్వేషపూరిత ప్రచారం గురించి ఆమె 69 ట్వీట్లు ఒకదాని తరువాత ఒకటి పోస్ట్ చేశారు.