జాగృతి – సంపాదకీయం

శాలివాహన 1941 – శ్రీ శార్వరి చైత్ర బహుళ త్రయోదశి – 20 ఏప్రిల్‌ 2020, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ

– బృహదారణ్యకోపనిషత్‌

మలాపురమైనా, ఆదిలాబాదయినా, అమెరికా అయినా; చిన్నా, పెద్దా పేద, సాద తేడా లేకుడా ప్రాణభయం అదరికీ ఒకటే అని కరోనా మరోసారి నిరూపణ చేస్తున్నది. వలస కూలీలు అయినా, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు అయినా ఉపాధి గురించి, జానెడు పొట్ట గురించి పడుతున్న తపన ఒకే తీరుగా ఉంది. తీవ్రతలో తేడాయే గానీ కరోనా కలిగిస్తున్న భయం గుప్పిట్లో ప్రపంచం అంతా చిగురుటాకులా వణికిపోతోంది. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ తదితర ఐరోపా దేశాలతో పాటు పలు ప్రపంచ దేశాలు ఊహాన్‌ ‌నగరాన్ని, చైనా దేశాన్ని కరోనా విపత్తు దోషిగా వేలెత్తి చూపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో జరిగిన మర్కజ్‌ను, దానికి వెళ్లి వచ్చిన ముస్లింలను దోషులుగా చూస్తున్నారు. ప్రపంచ దేశాలను ఆర్థికంగా దెబ్బతీసి ప్రపంచంలో ఎదురులేని ఆర్థికశక్తిగా ఎదగాలని చైనా జీవాయుధ యుద్ధ కుట్ర పన్నిందని, దాన్ని ఉపయోగించుకుని ముస్లింలు జీహాద్‌కు తెగించారని ఇప్పుడు నిదించి ప్రయోజనం లేదు. కరోనా వైరస్‌ ‌జీవాయుధమే అయితే దానికి శత్రు మిత్ర భేదం లేదని, అమెరికా వాడిని, చైనా వాడిని, హిందువును, ముస్లింను, క్రైస్తవుడిని ఒకే తీరున కబళిస్తుందని తేలింది. ఊహించని ఉపద్రవం వచ్చి పడినప్పుడు దాన్నుండి బయట పడటమెలా? అని ఆలోచించి తగిన చర్యలు చేపట్టడం విజ్ఞత. ప్రజలు, ప్రభుత్వం ఒక్కటై పోరు సాగించి కరోనా విపత్తును ఎదిరించాలి.

యుద్ధం లాంటి విపత్తు వ్యతిరేక పోరాటం బలహీనులను బలిగొనకుండా ప్రభుత్వం, ప్రజలు జాగ్రత్త వహిచాంలి. భారత ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా విపత్తును ఎదుర్కోవడంలో ఇప్పటివరకు విజ్ఞతగానే వ్యవహరిస్తున్నాయని చెప్పాలి. ప్రజలు కూడా ప్రభుత్వాల చర్యలకు స్వచ్ఛదంగా మద్దతు ప్రకటిస్తున్నారు. కొన్ని సంపన్న దేశాల్లో మాదిరి స్వేచ్ఛగా బ్రతికే అవకాశం లేకపోతే మరణిస్తాం అంటూ లాక్‌డౌన్‌ ‌నిబంధనలను అతిక్రమించి వీధుల్లోకి వచ్చి వివాదాలకు తెరతీసే తెంపరులు మనకు లేరు. కనుక రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు, చేతి వృత్తులతో పొట్టపోసుకునే పేదలు, అనాథలు ఆకలితో అలమటించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ప్రజలదీ కూడా. ఈ సమయంలో ఆర్థిక స్తోమత, వెసులుబాటు కలిగిన వారు ఉదారతతో వ్యవహరించాలి. కరోనాకు వ్యతిరేకంగా మనం సాగించవలసిన సామూహిక పోరాటంలో ప్రభుత్వాలు ప్రకటించే లాక్‌డౌన్‌ ఒక దశ, భాగం మాత్రమే. దాన్ని అతకంతకూ పొడిగించడాన్ని తాజా అనుభవాల నేపథ్యలో అర్థం చేసుకోవాలి.

కనిపించని శత్రువులాంటి కరోనా మహమ్మారిని నిలువరించడానికి లాక్‌డౌన్‌ ‌లాంటి వ్యూహాలను ఎంత కఠినంగా అమలు చేయాలో, ప్రజలు ఎంత జాగరూకులై మెలగాలో సూర్యాపేట ఉదంతం నిరూపిస్తోది. సూర్యాపేట నుండి ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. ఏప్రిల్‌ ‌రెండున బయటపడిన ఈ కరోనా కేసే అక్కడ మొదటిది. మర్కజీయుడు తరచూ మందులు కొనుక్కునే మెడికల్‌ ‌షాపులో పనిచేసే యువకునికి అతని నుండి ఆ వైరస్‌ ‌సోకింది. ఆ తరువాత మర్కజీయుడు నాగారం మండలం ఓ గ్రామంలోని అత్తగారింటికి వెళ్లి బంధువులకు కూడా వైరస్‌ అంటించాడు. ఇలా కరోనా పాజిటివ్‌ ‌వచ్చిన కేసులు అన్నింటికీ మర్కజీయుడే కారణమని తేలింది. ఇతలో ఓ కిరాణా షాపు యజమాని స్వల్ప అనారోగ్య పాలై ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే కరోనా పాజిటివ్‌ ‌వచ్చింది. ఇతనికి తొలి పాజిటివ్‌ ‌కేసైన మర్కజీయునితో ఎలాంటి కాటాక్టు లేక పోగా ఎలాటి యాత్రల చరిత్ర కూడా లేదు. ఇతనికి కరోనా ఎలా సోకిదో తేల్చడం అధికారులకు తలనొప్పిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు కలసి శ్రమిచి, సిసి ఫుటేజీల ఆధారంతో ఈ మిస్టరీని ఛేదించారు. ఎండుచేపలు అమ్ముకునే ఓ మహిళ మెడికల్‌ ‌షాపుకు రెడుసార్లు వెళ్లి మందులు కొని, అప్పటికే కరోనా వైరస్‌ ‌సోకిన మెడికల్‌ ‌షాపు యువకుడి నుండి కరోనాను అటించుకున్నది. ఖాళీ సమయాల్లో అష్టా చెమ్మా ఆడుతూ, కబుర్లాడుతూ తిరగడం ఆమెకు అలవాటు. లోపల కరోనా వైరస్‌ను మోస్తూ, ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకుడా పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్న ఈ మహిళ కిరాణా షాపుకు వెళ్లి సరుకులు కొన్నది. షాపు యజమానికి కరోనా అంటుకుంది. ఆపైన అతని నుండి కుటుంబీకులకు, అతని కాంటాక్టులోకి వచ్చిన మరి కొందరికి కూడా కరోనా సోకిది.

చైనా వాడో, విదేశాల నుండి వచ్చిన వాడో, ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వాడో మన చుట్టు ప్రక్కల కాదు కదా వంద మీటర్ల దూరంలో కూడా ఎవడూ లేడు అని ధీమాతో ఉడాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. కరోనా అనే జీవాయుధాన్ని మోస్తూ కూడా ఆరోగ్యంగా తిరిగే వాహకుల ప్రమాదం పూర్తిగా తొలగిందనే నమ్మకం కుదిరే దాకా దూరం పాటిచడం, నమస్కరించి తప్పుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తూ స్వీయం రోగ నిరోధకశక్తిని పెంపొందించే ఆహారం, జీవనశైలి మార్చుకోవడంతో మాత్రమే కరోనాను జయించగలం!

About Author

By editor

Twitter
YOUTUBE