– జాగృతి డెస్క్

గోరక్షణ పేరుతో కొంతమంది, ఒక సమయంలో అజ్ఞానంతో వ్యవహరించారు. కొందరిని చంపారు. ఇది హేయమైన చర్య. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇలాంటి నేరపూరిత చర్యలకు ఈ దేశంలో స్థానంలేదని గట్టిగా హెచ్చరించిన సంగతి దేశానికి తెలుసు. గోరక్షణ పేరుతో జరిగిన అమానుషాలలో కొందరు ముస్లింలు మరణించారు. ఆ నేరం కొద్దిమంది హిందువులకు సంబంధించినది. కానీ ఆ సమయంలో మీడియాలో ఒక వర్గం, పౌరహక్కుల నేతలు, వామపక్షాల నాయకులు, ముస్లిం నాయకులు, కాంగ్రెస్‌ ‌నాయకులు ఆ కొద్దిమంది హిందువులు అన్యాయంగా, అనాలోచితంగా చేసిన పని గురించి ఎలాంటి ప్రచారం చేశారో ఇప్పుడు దేశం గుర్తు చేసుకోవడం అవసరం. ఆ చెదురుమదురు నేరాలను అంతర్జాతీయ సమాజం ముందు పెట్టి భారత్‌ ‌మీద ఎలాంటి దురభిప్రాయాన్ని సృష్టించేందుకు పాటుపడ్డారో కూడా గుర్తు చేసుకోవాలి. అప్పుడే ‘హిందూ ఫాసిజం’ అంటూ గగ్గోలు పెట్టారు. కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు దిగ్విజయ్‌ ‌హిందూ ఉగ్రవాదం అన్న మాటను కూడా ఉపయోగించాడు. ఈ మాటనే చట్టసభలలో చిదంబరం ప్రయోగించారు. ఫాసిజం ముద్ర చరిత్రలో ఎంత నీచమైనదో, అదెంత ఘోరమైన నిందో ఆలోచించకుండా, మొత్తం ఈ దేశంలోని హిందువులందరి మీద ఫాసిజం ముద్ర వేశారు. గోరక్షణ పేరుతో కొద్దిమంది ముస్లింలను చంపిన ఆ కొద్దిమంది మూర్ఖ హిందువులకూ, దానిని పట్టుకుని మొత్తం హిందూ సమాజం మీద ఫాసిజం ముద్ర వేసిన ఆ ముఠాలకీ ఏమీ తేడా లేదు.

కానీ కొవిడ్‌ 19 ‌కల్లోలం నేపథ్యంలో మర్కజ్‌ ఉదంతానికి మతం ముద్ర వేయరాదనీ, మర్కజ్‌ ‌మృతులు అంటూ, తబ్లిఘిలు అంటూ మీడియా పేర్కొనకుండా కట్టడి చేయాలని కోరుతూ కొందరు ముస్లింలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు దీని మీద స్పందించడానికి నిరాకరించింది. అంతేకాదు, ఈ ఉదంతాన్ని మర్కజ్‌ ‌పేరుతో పిలవరాదంటూ మీడియాకు ఆదేశం ఇచ్చి గొంతు నొక్కలేమని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. జరిగింది చెప్పడానికి, అదెక్కడ జరిగిందో చెప్పడానికీ, దానికి బాధ్యులుగా భావిస్తున్న సంస్థలు, మనుషులు, సిద్ధాంతాల గురించి ప్రస్తావించే హక్కు మీడియాకు ఉందని అత్యున్నత న్యాయస్థానం తిరుగులేకుండా చెప్పింది. ఇది ముస్లిం నాయకులకు, మేధావులకు, వామపక్షవాదులకు, హక్కుల నేతలకు చెంపపెట్టు కాదా!

ఇక్కడ గోరక్షణ హత్యల గురించి ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, తబ్లిఘి జమాత్‌ ఉదంతం దురదృష్టకరమనీ, ఆ పేరును ఉపయోగించుకుంటూ మొత్తం ముస్లిం సమాజాన్ని రాక్షసుల్లా చిత్రించడం తగదనీ సుప్రీంకోర్టును ముస్లిం మత సంస్థలు కోరిన తీరును బట్టే. ఫాసిజం అన్న నీచమైన తిట్టుతో పోలిస్తే మర్కజ్‌ ‌గురించి మీడియా చేస్తున్న ప్రస్తావన చాలా చిన్న అంశం. ఈ వివాదంలో హిందువులు ముస్లింల పట్ల చూపుతున్న సంయమనం ఇప్పటికీ ముస్లిం నేతలకు, మేధావులకు అర్థం కాలేదు. కొద్దిమంది చేసిన దానికి మొత్తం ముస్లిం సమాజాన్ని శిక్షించడం ఎందుకన్న దృష్టి ప్రతి హిందువులోను కనిపిస్తున్నది. దానికి నిదర్శనమే ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు ఎవరి మీద భౌతిక దాడి జరగలేదు. వారి ఇళ్ల మీద దాడి చేయలేదు. మర్కజ్‌ ‌మీద కోపంతో దేశంలో ఏ మూలా ఏ ఒక్క ఇతర మసీదును ధ్వంసం చేయలేదు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు అని, తబ్లిఘిలనీ, మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారు అని మాత్రమే వ్యవస్థ మొత్తం ప్రస్తావిస్తున్నది. అంతేకాని, ముస్లిం సమాజం మొత్తాన్ని ఏ ఒక్కరు నిందిం చడం లేదు. వాస్తవంగా ఆలోచిస్తే మర్కజ్‌ ‌గురించి ప్రస్తావించరాదంటూ మీడియాను ఆదేశించాలని కోర్టును ఆశ్రయించడం తెంపరి తనం. భారత్‌లో కరోనా వ్యాప్తి ముమ్మాటికీ మర్కజ్‌ ‌ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో జరిగినదే. ఇంత ఘోర విపత్తు వారి చలవే. అయినా సెక్యులరిస్టులు ముస్లింలకు రక్షణ కవచంగా నిలబడుతూనే ఉన్నారు. వారు అమాయకులని చెబుతూనే ఉన్నారు. బుజ్జగింపునే ఇంపుగా భావిస్తున్నారు. కరోనా వైరస్‌ ‌పరిణామాలను ముస్లింలకు అంటగట్టడం బావుండలేదని ఎన్‌సిపి నాయకుడు శరద్‌ ‌పవార్‌ ‌ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో వాపోయారు. ఇలాంటివాళ్లే ఈ దేశంలో వేలమంది ఉన్నారు.

నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌ ‌ద్వారానే కరోనా వైరస్‌ ‌విస్తరించిందని పేర్కొంటూ ఒక వర్గం మీడియా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నదని, కాబట్టి ఈ మాటను ఉపయోగించరాదని ఆదేశించా లంటూ ముస్లిం ప్రముఖులు సుప్రీంకోర్టును కోరారు. కానీ పిటిషనర్లు కోరిన మేరకు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చి పత్రికా స్వేచ్ఛను అరికట్టలేమని కోర్టు ఏప్రిల్‌ 13‌న తేల్చి చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎ ‌బాబ్డే, జస్టిస్‌ ఎల్‌. ‌నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎంఎం ‌శంతనుగోదర్‌లతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా విచారణ జరిపింది. జమాయిత్‌ ఏ ‌హింద్‌ ‌సంస్థ ఈ పిటిషన్‌ ‌దాఖలు చేసింది. కరోనా వైరస్‌ ‌వ్యాప్తి గురించి వివరాలు చెప్పిన ప్రతిసారి తబ్లిఘి జమాత్‌తో వ్యాధి విస్తరించిందంటూ చెబుతున్నారని పిటిషనర్‌ ఆరోపణ. అయితే ఈ కేసులో పీటీఐని ఇంప్లీడ్‌ ‌చేయవలసిందని, తరువాతి విచారణ అప్పుడు జరుగుతుందని కోర్టు చెప్పింది.

దాదాపు తొమ్మిదివేల మంది మర్కజ్‌ ‌ప్రార్థనలకు హాజరయ్యారని వారి వల్లనే దేశం మొత్తం ఈ వైరస్‌ ‌వ్యాపించిందని నివేదికలు చెబుతున్నాయి. ఏప్రిల్‌ 18‌న కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ఇచ్చిన వివరాలు ఏం చెబుతున్నాయి? దేశ వ్యాప్తంగా 14,792 (ఆ నాటికి) కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదైనాయనీ, వాటిలో మర్కజ్‌తో సంబంధం ఉన్నవి నాలుగు వేలు పైనే అని తేలిందని చెప్పారు. మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మర్కజ్‌కు హాజరైన వారి వల్లే వైరస్‌ ‌విస్తరించిందని ఆయన చెప్పారు.

నిజానికి నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌తో పాటు తబ్లిఘి జమాత్‌ ‌హరియణాలోని మేవాట్‌, ‌బిహార్‌లోని నలందలలో కూడా అలాంటి సమావేశాలు నిర్వహించింది. వీటికి కూడా దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి ఆ వర్గీయులు పాల్గొన్నారు. మర్కజ్‌ ఆం‌దోళనకు తోడు మేవాట్‌, ‌నలంద కూడా ఇప్పుడు దేశ ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. ఎందుకంటే ఈ సమావేశాలన్నీ వేలు, వందల మందితోనే జరిగాయి. వైరస్‌ ‌సంగతి వెల్లడైన తరువాత మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిలో చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ సమయంలోనే దేశవ్యాప్తంగా ఉన్న రోహింగ్యా ముస్లింలు కూడా మర్కజ్‌ ‌సమావేశాలకు హాజరయ్యారని, వారి గురించి ఇంతవరకు పట్టించుకోలేదని తెలిసింది. రోహింగ్యాల విషయం గుప్తంగా ఉండిపోయింది. హైదరాబాద్‌ ‌శిబిరం నుంచి ఢిల్లీ వెళ్లిన రోహింగ్యాలు అందరూ తిరిగి రాలేదని వార్తలు వెలువడినాయి. ఇప్పుడు అధికారులకు ఇదొక కొత్త తలనొప్పి తయారయింది.

మర్కజ్‌ ‌ప్రార్థనలే కారణం

కొవిడ్‌ 19 ‌వ్యాప్తిలో సూపర్‌ ‌స్ప్రెడ్డర్లుగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సంస్థలను, వ్యక్తులను గుర్తించారు. భారతదేశానికి సంబంధించినంత వరకు నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌ అలాంటి సూపర్‌ ‌స్ప్రెడ్డర్‌. ఇం‌దులో ఎలాంటి సందేహం లేదు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌ ‌మసీదులో తబ్లిఘి జమాత్‌ ‌నిర్వహించిన (2020 మార్చిలో) ప్రార్థన సమావేశాలలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 9000 మంది పాల్గొన్నారు. నలభయ్‌ ‌దేశాల నుంచి మరొక 960 మంది ప్రతినిధులు కూడా హాజరయ్యారు. వీరే దేశమంతా అంటించారు. భారతీయ ముస్లింలే కాదు, విదేశీ ముస్లింలు కూడా ఇందులో తమ వంతు పాత్ర నిర్వహించారు. ఏప్రిల్‌ 18‌న కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 14,378 పాజిటివ్‌ ‌కేసులు నమోదైనాయి. వీటిలో 4,291 మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారివే. తబ్లిఘి జమాత్‌ ‌సభ్యులు, వారి సంబంధీకులు అంతా కలిపి దేశవ్యాప్తంగా 40,000 మందిని క్వారంటైన్‌ ‌చేశారు. ఒక్క 2020లోనే (అంటే ఈ మూడు నెలల్లోనే) తబ్లిఘి జమాతీయులు 2100 మంది ఈ దేశం వచ్చారని కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. మర్కజ్‌ ‌నుంచి తెలంగాణలోని కరీంనగర్‌కు వచ్చిన (మార్చి 18) ఎనిమిది మంది ఇండోనేషియా తబ్లిఘిలతో ఈ రాష్ట్రం అతలాకుతలం కావడం మొదలయింది. మార్చి 26న జమ్ముకశ్మీర్‌లో తొలి కరోనా మరణం సంభవించింది. అతడు కూడా మర్కజ్‌ ‌ప్రార్థనలకు వెళ్లి వచ్చినవాడే.

వీరంతా కరోనా అంటించుకుని రావడం ఒక వంతయితే, వైద్యానికి నిరాకరించి వ్యాధి వ్యాప్తికి దోహదం చేయడం మరొకటి. అందుకే వీరి మీద అనుమానాలు బలపడుతున్నాయి. టూరిస్ట్ ‌వీసాల మీద తీసుకొచ్చిన విదేశీ మౌల్వీలు మర్కజ్‌ ‌కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో చాలామంది ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్నారు. నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌ అధిపతి మౌలానా సాద్‌ ‌కూడా ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నాడు. కరోనా వైరస్‌ ‌మీద పోరాటానికి ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు చేయవలసి రావడానికి కారణం మర్కజ్‌ ‌ప్రార్థనలు. వాటికి హాజరైన వారికి ఆ వ్యాధి ఉన్నదని తెలియదు. కానీ తెలిసిన తరువాత వైద్యానికి ఎందుకు రావడం లేదు? ఇంత కల్లోలం జరగుతున్నా ఏ మౌల్వీ కూడా వైద్యం చేయించుకోవలసిందని ఫత్వా జారీ చేయడేమి? అయినా మర్కజ్‌ ‌పేరు ప్రస్తావించరాదని కోర్టులకు ఎక్కుతున్నారు. అందువల్ల వారి మనోభావాలు గాయపడతా యట. అసలు భారతదేశానికి కరోనాతో తగిలిన గాయం ఇప్పటికీ మానకపోవడానికి కారణం మాటేమిటి?

 నలందా తబ్లిఘి జమాత్‌

‌నలంద పేరు చెబితే ఒకనాటి విద్యాకేంద్రం గుర్తుకు వస్తుంది. కానీ కోవిడ్‌ 19 ‌కేసులు విస్తరించడానికి కారణమైన తబ్లిఘి జమాత్‌ ‌కారణంగా మళ్లీ జనం నోళ్లలో నలంద పేరు నానింది. నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌ ‌కారణంగా దేశమంతా ఏర్పడిన భయాందోళనలను నలంద తబ్లిఘి జమాత్‌ ఇం‌కాస్త పెంచింది. మార్చి నెలలో ఇక్కడ సమావేశాలు జరిగాయి. ఇక్కడ నుంచి కొందరు ఢిల్లీ వెళ్లి, ఆ ప్రార్థనలలో పాల్గొన్నారు. మార్చి 14, 15 తేదీలలో జిల్లా కేంద్రమైన నలందలో ఒక మసీదు ఆవరణలో సమావేశాలు జరిగాయి. నలంద బిహార్‌ ‌ముఖ్యమంత్రి నితీశ్‌ ‌కుమార్‌ ‌సొంత జిల్లా. నలంద సమావేశాలలో 640 మంది పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది బిహార్‌ ‌రాష్ట్రం వారే. కొంతమంది జార్ఖండ్‌ ‌నుంచి కూడా వచ్చి పాల్గొని ఉండవచ్చునని అధికా రులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్‌ ‌నుంచి లేఖ రాగానే ఆ మసీదును మూయించారు. దీనితో సరైన సమాచారం అందుబాటులో లేకుండా పోయింది. అయినా 640 మందిలో 274 మంది ఆచూకీ కనుగొన్నట్టు బిహార్‌ ‌విపత్తు నివారణ విభాగం అధికారులు చెప్పారు. మిగిలిన 366 మంది జాడ తెలియలేదు. ఇదెంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి సమావేశ నిర్వాహకుల దగ్గర కూడా పాల్గొన్న వారి అందరి వివరాలు లేవని తెలుస్తున్నది. అయితే నవాడా జిల్లా నుంచి వెళ్లి నలంద సమావేశంలో పాల్గొన్న ఒకరికి మాత్రం పాజిటివ్‌ ‌లక్షణాలు ఉన్నట్టు కనుగొన్నారు. అయితే బిహార్‌కు సంబంధించి కొత్త సమస్య కూడా వచ్చింది. వైశాలి నుంచి వచ్చిన ఒక వ్యక్తి పాట్నాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకు న్నాడు. అయితే అతడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీనితో అధికారులు ఆ ఆస్పత్రిని మూయించారు. అతడు ఆస్పత్రి నుంచి బయట పడిన తరువాత వందమందిని కలుసుకున్నా డని సమాచారం. వీరిలో 67 మంది పాట్నాలోనే ఉన్నారు.

మేవాట్‌లో ఇజ్తెమా

నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌ ‌సమావేశాలకీ, నలందా తబ్లిఘి జమాత్‌కూ రోహింగ్యా ముస్లింలు హాజరైనట్టు సమాచారం ఉన్నది కాబట్టి వారందరినీ గుర్తించవలసిందని ఏప్రిల్‌ 17 ‌ప్రాంతంలో కేంద్ర హోం శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ముఖ్యంగా హైదరాబాద్‌ ‌నుంచి మేవాట్‌కు రోహింగ్యా ముస్లింలు వచ్చారని కేంద్ర హోం శాఖ తెలియచేసింది. మేవాట్‌లో ఇజ్తెమా కార్యక్రమం తరువాత రోహింగ్యాలు నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌కు హాజరయ్యారని తెలియ వచ్చింది. మేవాట్‌ ‌మీద తబ్లిఘి జమాత్‌ ‌తన దృష్టిని కేంద్రీకరించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మేయోలని పిలిచే అక్కడి ముస్లిం జీవన శైలి అందుకు కారణం. ముస్లింలు ఖురాన్‌ ‌ప్రకారం కచ్ఛితంగా జీవితం గడపాలని బోధిస్తుంది తబ్లిఘి జమాత్‌. ‌మేవాట్‌ ‌జిల్లాలో ఇది కనిపించదు. అక్కడ ఇప్పటికీ చాలామంది ముస్లింలు శివుడిని ఆరాధిస్తారు. బావి తవ్వితే జై భైరవ అంటూ తొలి ఇటుక వేస్తారు. స్థానికంగా అంతా పాటించే బావుల పూజలు వారు కూడా చేస్తారు. కట్టు బొట్టు కూడా హిందువులకు దగ్గరగానే ఉంటుంది. అక్కడ చాలామందికి నమాజ్‌ ‌చేయడం ఎలాగో తెలియదు. కాబట్టి అక్కడి ముస్లిం సమాజాన్ని మరమ్మతు చేయడం తబ్లిఘి జమాత్‌ ‌తక్షణ కర్తవ్యంగా భావిస్తుంది. రోహింగ్యాలు పంజాబ్‌ ‌లోని దేరాబస్సీకి కూడా వీరు వెళ్లినట్టు కూడా సమాచారం ఉంది. ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఈ జనవరిలో నిజామాబాద్‌ ‌సమీపంలో కూడా ఇజ్తెమా కార్యక్రమం జరగడం, తరువాత భైంసాలో దారుణమైన స్థాయిలో మత కల్లోలాలు జరగడం మనకు తెలిసినదే.

రోహింగ్యాల వంతు

నిన్న మొన్నటి దాకా దేశవ్యాప్తంగా జరిగిన సీఏఏ అల్లర్ల ఉద్దేశం ఏమిటో గుర్తుండే ఉంటుంది. ఆ చట్టంలో ముస్లింలకు కూడా ఈ దేశానికి రావడానికి అవకాశం కల్పించక పోవడమే. సీఏఏ వ్యతిరేకుల అంతరంగంలో ఉన్నది రోహింగ్యా ముస్లింలే. వీళ్లంతా మైన్మార్‌ ‌నుంచి భారత్‌కు వలస వచ్చారు. అక్కడ మత కల్లోలాల కారణంగా ఇక్కడికి కాందిశీకులుగా వచ్చిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది. కానీ, తబ్లిఘి సమావేశాలకు వీళ్లు కూడా హాజరై తమ వంతుగా వైరస్‌ ‌వ్యాప్తికి సాయం చేశారు. అయితే ఈ సంగతి కాస్త ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. అది మరింత ఇరకాటానికి గురి చేస్తున్నది.

తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్‌, ‌జమ్ము ప్రాంతాల నుంచి రోహింగ్యా ముస్లింలు కొందరు నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌ ‌ప్రార్థనా సమావేశాలకు హాజరయ్యారని కేంద్ర హోం శాఖ తెలియచేసింది. తెలంగాణలో ఉన్న రోహింగ్యా ముస్లింలలో 45 మంది ఢిల్లీ వెళ్లారని అధికారులు అనుమానిస్తున్నారు. వీరిలో 22 మంది తిరిగి తెలంగాణ చేరుకు న్నారు. ఈ 22 మందిలో నలుగురికి పాజిటివ్‌ అని తేలింది. దీనితో ఆస్పత్రిలో వైద్యం చేయించారు. మిగిలిన 23 మంది మేవాట్‌లో లేదా, పంజాబ్‌లో ఉన్నారని తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు లాక్‌డౌన్‌ ‌కారణంగానే తెలంగాణ చేరుకోలేదని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే నల్లగొండ పోలీసులు 17 మంది రోహింగ్యా ముస్లింల మీద కేసులు నమోదు చేశారు. ఇందులో ఏడుగురు ఇక్కడివారు కాదు. మిగిలిన పదిమంది చాంద్రాయణగుట్ట (హైదరాబాద్‌) ‌ప్రాంతంలో ఉంటున్నారు. ఆ ఏడుగురిలో ఐదుగురు మేవాట్‌ ‌నుంచి, ఇద్దరు కశ్మీర్‌ ‌నుంచి వచ్చారు. చాంద్రాయణగుట్టలో ఉంటున్న రోహింగ్యా ముస్లింలలో ఒకరు తబ్లిఘి సమావేశాలకు వెళ్లాడు. పరీక్షలలో మాత్రం ఐదుగురికి కరోనా వైరస్‌ ‌సోకినట్టు తేలింది. 2017లో నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం భారతదేశంలోని రాష్ట్రాలలో 40,000 మంది రోహింగ్యా ముస్లింలు ఉన్నారు.

ఇదంతా ఒక సాలెగూడును తలపిస్తున్నది. సీఏఏ ఆందోళన, దాని పర్యవసానంగా వచ్చిన షాహిన్‌బాగ్‌ ‌నిరసన, తరువాత ఢిల్లీ అల్లర్లు, తబ్లిఘి జమాత్‌ అన్నిటికీ ఒక లంకె ఉందని ఇప్పడు అంతా అనుమానిస్తున్నారు. జెఎన్‌యు అల్లర్లు, అలీఘర్‌ ‌ముస్లిం విశ్వవిద్యాలయం గొడవలు వాటికి అనుబంధంగా జరిగినవే. వీరందరి లక్ష్యం ఒకటే. భారత్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూలదోయాలి. ఘోరమైన అకృత్యాలు చేసిన రోహింగ్యాలను ఈ దేశ పౌరులుగా చేయడానికి సుప్రీంకోర్టును ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. మైనారిటీలు ఎన్ని అకృత్యాలు చేసినా మెజారిటీలు మౌనంగానే ఉండాలన్న ఆదేశాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం నోటి నుంచి రప్పించాలని ఆశ పడుతున్నారు. తబ్లిఘి జమాత్‌ ‌వంటి అత్యంత వివాదాస్పద సంస్థ నిర్వహిస్తున్న సమావేశాలకు ఈ దేశానికి శరణార్థులుగా వచ్చిన వారు కూడా వెళ్లడమేనా? రోహింగ్యాలు ఎవరి అనుమతితో వెళ్లారు? శరణార్థులకు ఇంతటి విస్తృతమైన హక్కులు ఉంటాయా? ఇలాంటి విస్తృత హక్కులు ఇచ్చే ముస్లిం దేశం ఈ ప్రపంచంలో ఉందా? అక్కడ ఇలాంటివి సాగుతాయా? అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చిన తరువాత మధ్యప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు అర్జున్‌సింగ్‌ ‌తరుచూ ఒక అంశాన్ని తెర మీదకు తెస్తూ ఉండేవారు. అప్పుడు పీవీ నరసింహారావు ప్రధాని. అయోధ్య కూల్చివేతకు పరిహారంగా ప్రధాని ముస్లింలకు క్షమాపణలు చెప్పాలట. అయితే పీవీ ఆ పని చేయలేదు. నిజానికి ఇప్పుడు తబ్లిఘిలు ఆ పని స్వచ్ఛందంగా చేయవలసి ఉంది. అందులోని వాస్తవాన్ని, అవసరాన్ని వారు గుర్తించాలి. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు సయోధ్యగా ఉండడానికి ఆ చర్య దోహదం చేస్తుంది. తమ వల్ల జరిగిన ఈ ఘోర ప్రాణ నష్టానికీ, తట్టుకోనంత ఆర్థిక నష్టానికీ, జాతి మొత్తం అనుభవించిన మనః క్లేశానికి తబ్లిఘిలు సంతాపమైనా ప్రకటించడం సంస్కారం అనిపించుకుంటుంది. ఇలాంటి సంస్కారం వారు ప్రదర్శించాలని అనుకున్నా, మేధావులు, హక్కుల కార్యకర్తలు, కాంగ్రెస్‌ ‌నాయకులు అందుకు అడ్డుపడే అవకాశమే ఎక్కువ. ఇంతకీ సీఏఏ సందర్భంగా ప్రతి ముస్లిం చేతిలోను కనిపించిన త్రివర్ణ పతాకం ఇప్పుడు ఏమైపోయింది? జెండాను వదిలిన చేతులు వైద్యం కోసం రమ్మని చెప్పడానికి వచ్చిన వైద్యులను కొట్టడానికి రాళ్లు అందుకుంటున్నాయి.

About Author

By editor

Twitter
YOUTUBE