మార్కస్‌ను చంపి పుట్టిన మహామేధావులూ…
మావో రక్తాన్ని తమ పెన్ను గన్నుల్లో నింపుకొన్న కవులూ..
అబ్రం లింకన్‌ను దిగమ్రింగి ఉద్భవించిన ప్రజాస్వామ్యవాదులూ..
పార్టీ పంచనజేరి సంపాదనకు మరిగిన సంపాదకులూ..
చుక్కపై నుండి ఏనాడూ క్రిందకు దిగని సూడో ఇంటలెక్చువళ్లూ…
దిక్కూ మొక్కూ లేని సంఘాల పేర్లతో చలామణి అయ్యే కుహనా లౌకికవాదులూ..! మేధావులూ..!
ఒక్క గుంపుగా చేరి ‘పక్కోడెవడో పక్కావాడెవడో’ తెలియకుండా ‘ఎర్రవిషం’ చిమ్మేందుకు ముందుకు వచ్చిన కాలనాగులూ!
‘కరోనా’ మహమ్మారి ప్రపంచాన్ని మృత్యు జ్వరంతో వణికిస్తూ శవాల దిబ్బగా మార్చుతున్న తరుణంలో ఆ పడమటి గాలి మనకూ సోకింది. మనం వెంటనే మేలుకొని, కట్టుదిట్టమైన చర్యలతో విజయం సాధించే తరుణంలో విషం చుక్కలా మీదపడిన ‘తబ్లిఘీ జమాత్’ దుశ్చర్యను దేశ ప్రజలంతా అసహ్యించుకుంటుంటే మతం పేరుతో వాళ్లకు ‘రక్షణ కల్పించే’ రాకాసి దండు ‘కుహనా మేధావులు’గా లేఖలు రాస్తుంటే వీళ్లెంత ప్రకృతి విరుద్ధంగా జీవిస్తున్నారని ఆశ్చర్య మేస్తోంది. భారతదేశంలో ‘షరియా బోల్ష్‌విక్ విప్లవం’ సాధించేందుకు స్వాతంత్రోద్యమంలో, దేశ విభజన సమయంలో జిన్నా మనస్తత్వానికి అండగా నిల్చిన ఈ ‘ఎర్రకుండలే’ ఈ జాతికి అడుగడుగునా గండంగా మారిపోయాయి. మళ్లీ ఇపుడు రాజ్యాంగాన్ని గౌరవించకుండా ‘టూరిస్టు వీసాలపై’ ఈ దేశంలోకి ప్రవేశించి మతప్రచారం చేసి మహమ్మారిని అంటగట్టిన ‘మర్కజ్’ను బోనులో నిలబెట్టడం మతోన్మాదమా! సంస్థల తప్పు ఎత్తిచూపితే మతం రంగు పులుముతారా!
పాటియాలాలో ఓ సిక్కు వ్యక్తి తన వాహనం ఆపినందుకు కత్తితో పోలీస్ చేయి నరికేసాడు. మొత్తం సిక్కు సమాజం దాన్ని ‘జస్టిఫై’ చేసి ‘మా సిక్కులపై దాడి’ అనలేదు కదా! అలాగే గతంలో ఆశారాంబాపు, డేరా సచ్ఛాసౌదా గుర్మీత్ రాంరహీం వంటి వాళ్లపై ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే అదంతా ‘హిందూ సమాజంపై దాడి’గా భావించారా? తెలుగు నాట ఈ తెగులు ఎక్కువై కొన్ని మీడియా సంస్థలు తెంపరితనంతో ప్రవర్తిస్తున్నాయి. ఒక టీవీ యాంకర్ అయితే ఒక మత సంస్థ దుశ్చర్యను కప్పిపుచ్చే పనిలో భాగంగా పరోక్షంగా హిందువులను దోషిగా నిలబెట్టారు?! మరో పత్రిక హిందూ పేర్లతో ‘సంకర జర్నలిజం’ సృష్టించేందుకు సాహసించింది. ఇంకో టీవీ ఛానల్ ‘అమ్మవారి బొమ్మ’ను వెకిలిచేష్ట పోగ్రాంకు వాడుకొంది! ఈ హర్యాలీ గ్యాంగ్, తుక్డే తుక్డే గ్యాంగ్ ప్రభావంతో తెలుగు నాట మెజారిటీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ‘ఉగాది, శ్రీరామనవమి మీరు జరిపితే చట్టపరంగా చర్యలు తీసుకొంటా మంటూ మైకు పట్టుకొని మెజారిటీ ప్రజల కాలనీల్లోకొచ్చి బెదిరింపు ధోరణితో చెప్పినా తల వంచుకొని శిరసావహించే వాళ్లు’ మీ దృష్టిలో దోషులా!
ఈ ‘హిపోక్రసీ’ అంటురోగం ‘సూడో మేధావులకు’ సూదిమందులా ఎవడెక్కించాడో తెలియదు గానీ సత్యాన్ని చంపేసే సాహసానికి పూనుకొన్నారు. ‘ప్రభుత్వం మాట మనం వినవద్దు, మనకు మతమే ప్రాధాన్యం’ అని ఇపుడు దేశం మొత్తం కరోనాను రుద్దిన సంస్థలు మీకు ప్రీతిపాత్రమా? వేలల్లో లక్షల్లో భక్తజనం సందర్శించే ఆలయాల వైపు కన్నెత్తి చూడకుండా ఆ దేవుళ్లనే పేదల్లో, డాక్టర్లలో, పారిశుద్ధ్య కార్మికుల్లో, పోలీసుల్లో చూస్తూ సహకరిస్తూ సేవ చేస్తున్న మెజారిటీలది మతోన్మాదమా! డాక్టర్లపై దాడులు చేస్తూ, నర్సులకు నగ్నావతార దర్శనమిస్తూ, వాటర్ బాటిళ్లలో మూత్రం నింపి విసిరేస్తూ, ఎక్కడంటే అక్కడ ఉమ్మేస్తూ దుశ్చర్య లకు పాల్పడుతున్నవాళ్లు శాంతికాముకులా! కళ్లున్న గుడ్డివాళ్లలా సత్యాన్ని, గణాంకాలను చూడకుండా ఉన్మాద సంస్థకు ఉక్కు కవచంలా నిలబడే మీరు మేధావులా? రచయితలా! కవులా! సంపాదకులా! ఈ చావురాగాలు ఇంకెన్నాళ్లు ఆలపిస్తారు!?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైతే రేపు మనదేశంలో ఏం జరుగనున్నదో తెలియదు. అసలు మీరు అక్షర విషాలు చిమ్మే పత్రికల్లో పనిచేసే చిన్నాచితకా బ్రతుకులేమైపోతాయో కూడా అవగాహన లేదు. ఈ సంక్షోభ సమయంలో దేశాన్ని వదిలి కుత్సితవాదాన్ని బలపరచవద్దని ఆశిస్తున్నాం. ‘దొంగకు సద్దిమూట గట్టే’ సిద్ధాంతాలను ఇప్పటికైనా వదలిపెట్టి ఆత్మవంచన లేకుండా బ్రతకండి! ‘తప్పును తప్పు’ అనకుండా మీకు మీరు గొప్పనుకునే ఆత్మద్రోహం వదలిపెట్టండి. బుజ్జగింపు, సంతుష్టీకరణకు జోలపాడే మీ కలాలను వాటికవే సిగ్గుపడేట్లు చేయకండి! ‘మొదట దేశం- ఆ తర్వాతే మతం, వ్యక్తులు, సంస్థలు’ అని గుర్తెరగండి. మీరు చేస్తున్న ఈ ‘ఆత్మద్రోహం’ కనీసం మీ కుటుంబంతో చర్చించినా మీ డొల్లతనం, హిపోక్రసీ బయట పడిపోతుంది. పత్రికల్లో తిష్ఠ వేసుక్కూర్చుని లాలూచీపడుతూ, లాభపడుతూ వాళ్ల పంచనజేరి, మరోవైపు ‘ఎర్రగుడ్ల’ను పొదిగే దొంగకోళ్లకు జన్మనిస్తున్న మీ ద్రోహబుద్ధి ఈ దేశం ఎప్పుడో పసిగట్టింది. ఇక మీ ఇష్టం!
– ఆచార్య ముదిగొండ శివప్రసాద్, ప్రముఖ రచయిత, చారిత్రక నవలా చక్రవర్తి
– ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, అధ్యక్షులు, అఖిల భారతీయ సాహిత్య పరిషత్
– డా. త్రిపురనేని హనుమాన్ చౌదరి, ఏపీ ప్రభుత్వ మాజీ సాంకేతిక సలహాదారు
– ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య, ప్రముఖ విమర్శకులు
– ఖండవల్లి సత్యదేవప్రసాద్, ప్రముఖ రచయిత
– హెబ్బార్ నాగేశ్వరరావు, ప్రముఖ జర్నలిస్టు
– డా.పి.భాస్కరయోగి, ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకులు
– మావుడూరి సూర్యనారాయణమూర్తి, ప్రచార కార్యదర్శి, అఖిల భారతీయ సాహిత్య పరిషత్
– రాకా సుధాకర్ రావు, ప్రముఖ జర్నలిస్టు, విశ్లేషకులు
– మందాడి సత్యనారాయణరెడ్డి, మాజీ శాసనసభ్యులు
– మామిడి గిరిధర్, రాష్ట్ర కార్యదర్శి ప్రజ్ఞాభారతి
– పగుడాకుల బాలస్వామి, ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త
– గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, ప్రముఖ కవి, రచయిత
– నడింపల్లి ఆయుష్, సామాజిక కార్యకర్త
– కప్పర ప్రసాద్, అధ్యక్షులు, టిజెయు
– నారపరాజు నర్సింగరావు, జర్నలిస్టు
– వనకళ్ల వీరప్ప, జాతీయవాద జర్నలిస్టు, నేషనలిస్టస్ హబ్
– కె.ఎల్. కిస్మత్ కుమార్, మాజీ సంచాల కులు, సమాచార పౌరసంబంధాల శాఖ
– పిరాట్ల నాగేశ్వరరావు, సామాజిక కార్యకర్త
– క్రాంతిదేవ్ మిత్ర, ప్రముఖ జర్నలిస్టు
– శ్రీమతి సత్యవాణి, భారతీయం
– హనుమంతరావు, తపస్ అధ్యక్షులు
– మాసాడి బాబూరావు,సామాజిక విశ్లేషకులు
– డా.మురళీమనోహర్, జిఎన్‌సిఆర్‌ఇ కార్యదర్శి
– సంబరాజు రవిప్రకాశ్ రావు, రచయిత
– మాదిరాజు హరినందరావు, రచయిత
– తరుణ్ చక్రవర్తి, రచయిత
– ఉమ్మెత్త మహేశ్వర్, సామాజిక విశ్లేషకులు
– శ్రీమతి విజయభారతి, ప్రజ్ఞాభారతి
– కుంచకూరి బుచ్చిలింగం, కవి, రచయిత
– అవుసల భానుప్రకాష్, కవి, రచయిత
– గాజుల రవీందర్, కవి, రచయిత
– గుంటి గోపి, రచయిత
– భీంపల్లి శ్రీకాంత్, రచయిత
– ప్రదీప్ రెడ్డి, సామాజిక కార్యకర్త
– సామల కిరణ్, కవి, రచయిత
– చిలకమర్రి లక్ష్మీనాథాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు
– డా.బి. జయరాములు, ప్రముఖ పరిశోధకులు
– చక్రవర్తుల వేణుగోపాల్ రావు, గీత రచయిత
– డా. లక్ష్మీలావణ్య, సామాజిక కార్యకర్త
– సీతామహాలక్ష్మీ, సామాజిక కార్యకర్త
– మాధవీలత, సామాజిక కార్యకర్త
– కృష్ణాగౌడ్, సాహిత్య విశ్లేషకులు
– ఎడ్ల సతీష్ కుమార్, సీనియర్ జర్నలిస్టు
– గొట్టిముక్కల చంద్రమోహన్, సామాజిక కార్యకర్త
– ఎ. సాయికృష్ణ, సీనియర్ జర్నలిస్టు, నేషనలిస్టస్ హబ్
– పట్లోళ్ల శ్రీలతారెడ్డి, సామాజిక కార్యకర్త
– ఆచార్య సాగి కమలాకరశర్మ, సాహితీవేత్త
– ఆచార్య మసన చెన్నప్ప, సామాజికవేత్త
– సామ కృష్ణారెడ్డి, సామాజిక కార్యకర్త
– శ్రీమతి సాగి మనోహరి, సాహితీవేత్త
– ఏ. శ్రీనివాసరావు, సామాజికవేత్త
– పురం సంతోష్ కుమార్, సామాజిక కార్యకర్త
– బి.ఎస్.శర్మ, ప్రజ్ఞాభారతి
– వి.సుమంత్ కుమార్, ఫ్రీలాన్స్ జర్నలిస్టు
– దుర్గరాజు బుచ్చిబాబు,
– ఏ.రాణాప్రతాప్, జర్నలిస్టు
– జగన్, ఫ్రీలాన్స్ జర్నలిస్టు
– విద్యారణ్య కావ్లకర్, సీనియర్ జర్నలిస్టు
– దుర్గరాజు స్వాతి, జర్నలిస్టు
– గుండేపల్లి బాలకృష్ణ రెడ్డి
– చక్రవర్తుల రామానుజాచార్యులు