హిందూ దేవాలయాల మీద దాడి చేయడం, కూలగొట్టడం, దేవతల విగ్రహాలకు అపచారం తలపెట్టడం మధ్య యుగాల నాటి మహమ్మదీయ పాలకులు చేసిన వికృత చేష్టలు. అదొక మౌఢ్యం. అదొక అజ్ఞానం. అదొక చీకటి యుగం. కానీ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా కొందరు మతోన్మాదులు ఇలాంటి మౌఢ్యాన్నే ప్రదర్శించడానికి వెనుకాడడం లేదు. తద్వారా వారి మధ్యయుగపు మత విద్వేషాన్ని ఇప్పటికీ వదలుకోలేదని చెప్పక చెబుతున్నారు. అదే తమ ధోరణి అని నిస్సుగ్గుగా ప్రకటించుకుంటున్నారు కూడా. సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా దేవీ ఆలయం మీద జరిగిన దాడి, హిందువుల మీద చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలు దీనినే రుజువు చేస్తున్నాయి.