పులి-మేకపిల్ల
ఒక మేకలమందలో బుజ్జి మేకపిల్లొకటి ఉండేది. వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్దవాళ్లకు ఏ మాత్రం తీసిపోయేది కాదు. ఒకరోజు యజమాని మేకలను కొండ దిగువకి మేత కోసం తోలుకెళ్లాడు. ఆ కొండ పైన ఒక పెద్ద అడవి ఉంది. మేకపిల్ల అటూ ఇటూ గెంతుతూ మంద నుండి దూరంగా అడవి వైపు వెళ్లిపోయింది. తన తప్పు తెలుసుకుని వెనుకకు తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది. పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజా వణికిపోయింది. ఎలాగోలా గుండె చిక్కబట్టుకుని ధైర్యంగా పులి ముందు నిలబడింది.