నేతాజీ విషయంలో గాంధీజీది తప్పిదమే!

భోగరాజు పట్టాభి సీతారామయ్య గురించి తెలుగు వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అక్కరలేదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఆయన అఖిల భారత స్థాయి జాతీయ నాయకుడు. గాంధీకి బాగా సన్నిహితుడని పేరు కూడా ఉంది ఆయనకు. కాంగ్రెస్ రాజకీయాలకు ఒక విధంగా మూల్యం చెల్లించుకున్నవాడు.