అసాధారణ ఆటగాడు

భారత క్యూస్పోర్ట్స్ రారాజు పంకజ్ అద్వానీ సరికొత్త చరిత్ర సష్టించాడు. బిలియర్డ్స్, స్నూకర్ విభాగాలలో ప్రపంచ, ఆసియా టైటిల్స్ సాధించడంతో పాటు కెరియర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసిన ఏకైగా ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు. 34 ఏళ్ల వయసులోనే 21 ప్రపంచ టైటిల్స్‌తో పాటు ఆసియా స్నూకర్‌లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకొన్నాడు. బెంగళూరు వేదికగా ముగిసిన 2019 ప్రారంభ ఆసియా స్నూకర్ టోర్నీ రెడ్-6, రెడ్ -15 విభాగాలలో పంకజ్ విజేతగా నిలిచాడు.