Posts Tagged “29 Apr-05 May 2019”

‘మార్కు’ల రంగంలో మరణమృదంగాలు

By |

‘మార్కు’ల రంగంలో మరణమృదంగాలు

‘చదువంటే గొప్ప స్నేహితుడు. విద్యావంతుడు సర్వత్రా మాన్యుడిగానే ఉంటాడు’ – చాణక్య. ‘విజ్ఞులైన మనుషులు ఉపాధ్యాయుల వల్ల నిర్మితమవుతారు’- ఏపీజే అబ్దుల్‌ కలాం. ‘స్వేచ్ఛ అనే బంగరు వాకిలి తెరిచే తాళమే విద్య’- జార్జి వాషింగ్టన్‌ కార్వెర్‌. హృదయం మీద పన్నీటి చిలకరింత వంటి ఇలాంటి మాటలు కావచ్చు. అక్షరమంటే జ్ఞానజ్యోతులను వెలిగించేదని, చదువు అనేది ఈ సృష్టిలోనే సమున్నతమైనదని, మహోన్నత వరమని మనసా వాచా నమ్మి ఇలాంటి మాటలే వల్లించిన అనేకమంది మహనీయులు కావచ్చు. వారంతా…

Read more »

‘మసీదులలో మేమూ ప్రార్థనలు చేస్తాం!’

By |

‘మసీదులలో మేమూ ప్రార్థనలు చేస్తాం!’

మసీదులలో ముస్లిం మహిళలు ప్రార్థనలు చేయడానికి అర్హత ఉంటుందా ? ఈ అంశం గురించి కొన్నేళ్లుగా ప్రపంచం మొత్తం మీద తీవ్రమైన చర్చే సాగుతోంది. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌, డర్బన్‌ ప్రాంత ముస్లిం మహిళలు నిరుడు కూడా మత పెద్దలకు మళ్లీ విన్నవించారు. ఆ విన్నపం చాలా బలమైనది, ”మేం కూడా మసీదు లోపల ప్రార్థనలు చేసుకోవాలని కోరుకుంటున్నార!” రంజాన్‌ పవిత్ర మాసంలో సాయంత్రం మసీదులలో జరిగే పవిత్ర ఖురాన్‌ ప్రవచనాలను, ప్రార్థనలను వినే అవకాశం తమకు కూడా…

Read more »

పాక్‌ బలహీన పడడమే నేటి అవసరం

By |

పాక్‌ బలహీన పడడమే నేటి అవసరం

నిన్నటివరకు పాకిస్తాన్‌ పట్ల భారతదేశం ఉదార వైఖరితో వ్యవహరించింది. పఠాన్‌కోట దాడి తర్వాత భారత్‌ తన విధానాన్ని మార్చుకోక తప్పలేదు. ఇప్పటికే స్వయంకృతాపరాధాలతో, వరస తప్పులతో కునారిల్లిపోయిన పాకిస్తాన్‌ను ఇంకాస్త బలహీన పరచవలసిన సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్‌ పాపాలన్నీ పండిపోయాయి. ఇక కఠినంగానే నడుచుకోవాలి. భారత్‌ స్నేహహస్తం అందించిన ప్రతిసారి అది వెన్నుపోటు పొడిచింది. భారతీయుల సహనం నశించింది. ఇప్పటివరకు అనుభవించింది చాలు. పాకిస్తాన్‌ కొట్టిన చివరిదెబ్బ పుల్వామా దాడి. ఈ దాడిలో భారతదేశం 43 మంది…

Read more »

స్వేచ్ఛ కావాలి, బాధ్యత ఉండాలి

By |

స్వేచ్ఛ కావాలి, బాధ్యత ఉండాలి

మే 3 అంతర్జాతీయ పత్రికా దినోత్సవం నేటి ప్రపంచంలో ఆధునికతకు కొలబద్ద ప్రజాస్వామిక వ్యవస్థ. ఇక, ఆధునిక ప్రపంచాన్ని ప్రజాస్వామ్యం వైపు నడిపించిన ఘనత వార్తా పత్రికలకే దక్కుతుంది. ప్రపంచంలో వచ్చిన ఏ ఉద్యమమైనా వార్తాపత్రికల చేయూత లేకుండా, ప్రమేయం లేకుండా జరగలేదన్నది సత్యం. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడంలోను పత్రికల పాత్ర విస్మరించలేనిది. ఆ విధంగా ప్రజాస్వామ్యానికి పత్రికా ప్రపంచం, పత్రికా ప్రపంచానికి ప్రజాస్వామ్యం పరస్పరం రక్షణ కవచాలుగా నిలబడిన సంగతి చరిత్ర వెల్లడిస్తున్నది. కానీ ప్రజాస్వామ్య…

Read more »

నైతికత లేని వారికి పాలనాధికారమా!

By |

నైతికత లేని వారికి పాలనాధికారమా!

తెలుగునాట లోక్‌సభ, శాసన సభల ఎన్నికలకు పోలిరగు ఘట్టం ముగిశాక ఆసక్తికర చర్చ జరుగుతోంది. అటు ఉత్తర ప్రదేశ్‌లోను ఇటు ఆంధ్రప్రదేశ్‌లోను జరిగిన రెండు రాజకీయ ఘటనలే ఈ చర్చకు అంకురార్పణ చేశాయి. మనం చట్టాల పక్షమా, నైతికత పక్షమా అన్న చర్చ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోరది. ఎప్పుడైనా ఎక్కడైనా తన పేరు, ఊరు చెప్పడానికి సామాన్యుడు తడబడడు, కొంత సమయం కావాలని కోరడు. రాహుల్‌ గాంధీకి సంబంధించి అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కొంత…

Read more »

సృష్టితత్వం… విశ్వదృష్టి…

By |

సృష్టితత్వం… విశ్వదృష్టి…

సృష్టితత్వం, ఆధునిక విజ్ఞానశాస్త్రం చెప్పే విశ్వదృష్టితో పోలి ఉంటుందా? ఔననే అంటున్నారు అమెరికన్‌ భౌతికశాస్త్రవేత్త ఫ్రిట్జఫ్‌ కాప్రా. ఆయన 1966లో వియన్నా విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో పిహెచ్‌.డి. పట్టా పొందారు. ఈ భౌతిక శాస్త్రవేత్త అనేక విశ్వవిద్యాలయాలలో నేటికీ పరిశోధనలు చేస్తున్నారు. కాప్రా తూర్పు దేశాల అధ్యాత్మిక గ్రంథాలను పరిశీలించారు. అవి నిర్వచించిన సృష్టితత్వం, ఆధునిక సైన్స్‌ చెబుతున్న విశ్వదృష్టితో సంపూర్ణంగా పోలి ఉందని గుర్తించారు. ఆధునిక సైన్స్‌, ప్రాచీన ఆధ్యాత్మికతల మధ్య ఉన్న సమన్వయాన్ని తెలియజేయడం…

Read more »

నాడు కింగ్‌ఫిషర్‌ – నేడు జెట్‌ ఎయిర్‌వేస్‌

By |

నాడు కింగ్‌ఫిషర్‌ – నేడు జెట్‌ ఎయిర్‌వేస్‌

మొన్న కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ విజయ్‌ మాల్యా, నేడు జెట్‌ ఎయిర్‌వేస్‌ నరేశ్‌ గోయల్‌ ఒకే తరహాలో విలాసవంతమైన ఖర్చులతో సంస్థలను నట్టేట ముంచారు. ఫలితంగా భారతీయ బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. ఒకప్పుడు దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థగా ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ నేడు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో మూతపడింది. క్యాషియర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థను అగ్రస్థానంలో నిలిపి ఎందరో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు…

Read more »

రామాయణం – యువతకు మార్గదర్శనం

By |

రామాయణం – యువతకు మార్గదర్శనం

సీతా వియోగంలో ఉన్న శ్రీరాముడు అక్కడి నదులనీ, చెట్లనీ, పుట్టల్నీ, కొండల్నీ, గుట్టల్నీ, లేళ్లనీ, కుందేళ్లనీ కనిపించిన చరాచర జీవరాశినంతటినీ సీత గురించి ప్రశ్నిస్తాడు. ఆయన స్థితిని చూసి తట్టుకోలేక లేళ్లు యథాశక్తి ప్రయత్నించి ఆయనకు రావణ దుర్మార్గాన్ని గురించి సూచించాయట. పర్ణశాల వైపు చూడటం, ఆపైన దక్షిణంగా పరిగెత్తడం, ఆగి ఆకాశం వైపు చూసి కంటనీరు పెట్టడం.. ఇలా చేస్తునాయట. అది గమనించిన రామునికి పర్ణశాలలో ఉన్న సీతని ఎవరో రాక్షసుడు ఎత్తుకుపోయి ఆకాశమార్గంలో దక్షిణదిశగా…

Read more »

సాగర గర్భంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు

By |

సాగర గర్భంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు

ప్లాస్టిక్‌ మానవుని జీవితంలో భాగమైపోయింది. అనుకోని అద్భుతం జరిగి ప్లాస్టిక్‌ ఒక్కసారిగా మాయమైపోతే మానవుని నిత్యజీవనం ఆగిపోయేంతలా ప్లాస్టిక్‌ వాడకం పెరిగింది. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు మనం ఉపయోగించే అన్ని వస్తువుల తయారీలోనూ ప్లాస్టిక్‌ భాగం పంచుకుంటున్నది. టాయిలెట్‌ కమోడ్‌ నుండి బెడ్‌రూమ్‌లోని ఫాన్‌, కూలర్‌, ఏసీ వరకు అన్ని వస్తువులు; వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించే టివి, కంప్యూటర్‌, ఫోన్‌ వంటి అన్ని ఉత్పత్తులు ప్లాస్టిక్‌మయం అయిపోయాయి. విద్యుత్‌ సరఫరా ఒక్క నిముషం…

Read more »

శ్రీరాముడు అందరివాడు

By |

శ్రీరాముడు అందరివాడు

అది భాగ్యనగర్‌ మహానగరం.. అంతటి మహానగరంలో సైదాబాద్‌ కాలనీలోని సింగరేణి కాలనీ అనే మురికివాడ. 2500 గుడిశెలు, 1770 ప్రభుత్వం కట్టించిన గృహాలు ఆ కాలనీలో ఉన్నాయి. ఆ బస్తీలో అనేక కుటుంబాలూ, అన్ని రకాల వ్యక్తులూ నివసిస్తుంటారు. వీరి మధ్య అనేక గొడవలూ జరుగుతాయి. సారా కాయడం, దొంగతనాలు వంటి సంఘ విద్రోహ కార్యకలాపాలూ ఎక్కువే. పోలీసు వారి నేర రికార్డుల్లో సింగరేణి కాలనీలో నివసించే వారి పేర్లు అనేకం ఉంటాయి. ఈ బస్తీని పోలీసులు…

Read more »