Posts Tagged “28 Jan-03 Feb 2019”

కుంకుమపూల నేలమీద నిప్పుపూల జల్లు

By |

కుంకుమపూల నేలమీద నిప్పుపూల జల్లు

కశ్మీర్‌ లోయ అంటే ప్రకృతి సోయగాలూ, కుంకుమపూల సౌందర్యం తలపునకు రావడానికి బదులు జీహాదీ నినాదాలు, తుపాకీ పేలుళ్లు గుర్తుకు రావడం ఇటీవలి అనుభవం. ఇదంతా ఒక విధ్వంసకర, వికృత పంథాయే ధ్యేయంగా నేటి భారత్‌ను కల్లోల పరుస్తున్న ‘లౌకిక వాద’ రాజకీయాల ఫలితం. అలాంటి రాజకీయాలకు కశ్మీర్‌ లోయలో కేంద్ర బిందువే మెహబూబా ముఫ్తీ. భారత రాజ్యాంగం ఎడల విధేయంగా ఉంటానని ప్రమాణం చేసి ఆమె పార్ల మెంటులో ప్రవేశించ గలరు. కశ్మీర్‌ రాజ్యాంగం మీద…

Read more »

కఠినవైఖరే ఉగ్రవాద సమస్యకు పరిష్కారం..!

By |

కఠినవైఖరే ఉగ్రవాద సమస్యకు పరిష్కారం..!

జమ్మూకశ్మీర్‌ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగం. కానీ జమ్మూ, లద్దాక్‌ ప్రాంతాలను మినహాయిస్తే కశ్మీర్‌లోయను భారతదేశం, మిగిలిన భారతావనిని కశ్మీర్‌ లోయ అర్థం చేసుకునే ప్రయత్నంలో, విధానంలో పెద్ద అఘాతమే కొనసాగుతోంది. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదం లోయవాసుల దృష్టిని ప్రభావితం చేస్తున్న మాట ఎవరూ కాదనలేనిది. ఆ అఘాతం ఉగ్రవాదం చూపుతున్న ప్రభావం ఫలితమే కూడా. అక్కడ ప్రభుత్వాల ఏర్పాటు, రాజకీయాలను కూడా పాక్‌ రాజకీయాలు, ఉగ్రవాదం ప్రభావితం చేస్తున్నాయి. అందుకే కొన్ని అవాంఛనీయ, అప్రజాస్వామిక అంశాలు కూడా…

Read more »

10% రిజర్వేషన్లు – అపోహలు వదిలి, అర్థం చేసుకోవాలి!

By |

10% రిజర్వేషన్లు – అపోహలు వదిలి, అర్థం చేసుకోవాలి!

ఆర్థికంగా వెనుకపడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఎన్‌డిఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయటం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయాన్ని కొంతమంది స్వాగతించగా, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మరికొంతమంది ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నిర్ణయం ఇప్పుడే ఎందుకు తీసుకున్నారు? ఇది ఎన్నికల ఎత్తుగడ! అంటూ చాలామంది విమర్శిం చటం వింటున్నాం. మన దేశంలో దాదాపు ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకచోట ఏవో ఒక…

Read more »

పరిశోధన – పరికల్పన

By |

పరిశోధన – పరికల్పన

భారతదేశంలో జ్ఞానార్జనకై ఎందరో రుషులు, మునులు కృషి చేశారు. నేను ఎవరిని? ఆత్మకు, పరమాత్మకు, విశ్వానికీ గల సంబంధం ఏమిటి? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు కనుగొనగలిగారు. మనల్ని మనం తెలుసుగోగలిగితే విశ్వం స్థితి, పరిణామం, లయలను అర్థం చేసుకోగలం. మన ఉనికిని విశ్వానికి కారణమైన శక్తితో అనుసంధించగలం. ఇలాకాక ప్రకృతిపై పట్టుసాధించి, మానవ జీవితాన్ని సులభతరం చేయడం కోసం తెలుసుకోవడాన్నే విజ్ఞానం (Science)) అంటాం. విజ్ఞానం ద్వారా ప్రకృతిలో సహజ సిద్ధమైన వనరులను మనకు కావలసిన…

Read more »

చరిత్రకు అపచారం!

By |

చరిత్రకు అపచారం!

వాచ్యంలో ఒక అర్థం, వ్యక్తీకరణలో భిన్నమైన అర్థం స్ఫురింప చేయగల ప్రక్రియను వ్యంగ్యం అంటారు. ‘అబ్బో! ఈయనొక శ్రీరామచంద్రుడు, అమె ఒక సీతా మహాసాధ్వి!’ ఇలాంటి వ్యంగోక్తులకు తెలుగువారు పెట్టింది పేరు. ఈ నేర్పు తెలుగు నాట మారుమూల పల్లెల్లో సైతం కనిపిస్తుంది. చదువు సంధ్యలతో నిమిత్తం లేకుండా సామాజిక జీవనంలో ఈ నైపుణ్యం తెలుగు ప్రజలకు అలవడుతోంది. ప్రశంసల వేళ ‘బుద్ధికి బృహస్పతి, అందానికి మన్మథుడు, పరాక్రమానికి పరశురాముడు, దాన గుణంలో కర్ణుడు’ వంటి ఉపమానాల…

Read more »

ఆ హృదయం ఒక రంగస్థలం

By |

ఆ హృదయం ఒక రంగస్థలం

నాటక రచయితగా, ప్రయోక్తగా, విమర్శకునిగా ఆచార్య మొదలి నాగభూషణశర్మ సుపరిచితులు. కానీ, నృత్య/నాట్య రంగ పురోభివృద్ధిలో డాక్టర్‌ శర్మ పోషించిన కీలకపాత్ర, రెండు దశకాలాలలో చేసిన పరిశోధన, రచనా వ్యాసంగాల గురించి మాత్రం కొద్దిమందికే తెలుసు. గరికపాటి మురళీధరశర్మ 2001లో ప్రారంభించిన ‘నర్తనం’ (భారతీయ నృత్యరీతులపై త్రైమాసిక పత్రిక) నామకరణ దశ నుండి, పత్రిక ఒక రూపం దాల్చే వరకు, ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకొని పుష్కరకాలం పాటు ఆ పత్రిక సంపాదకునిగా అవిశ్రాంతంగా శ్రమించారు నాగభూషణశర్మ….

Read more »

‘వివేక వాణి’ వినదలుచుకోలేదా?

By |

‘వివేక వాణి’ వినదలుచుకోలేదా?

‘వాదాలు సంవాదాలకు దారి తీయాలి, వివాదాలకు కాదు. మన దేశంలో దురదృష్టం ఏమిటంటే, ఎలాంటి వివాదమూ అవసరం లేని చోట కూడా మనం వివాదాన్ని సృష్టించగలం. వివాదంతో సంఘానికి విఘాతం కల్పించగలం, విషాదం సృష్టించగలం. ఢిల్లీలో ‘మేధావుల’ నెలవుగా పేరొందిన జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలోనే, తాజాగా ఇలాంటి వివాదమే చెలరేగుతోంది. ‘భారతీయ జీవనంలోని శ్రేష్ఠమైన విలువలకు ప్రతీకగా నిలచి, భారతీయ జీవన విధానపు విజయ వైజయంతిని విశ్వమంతటా ప్రకటించిన వివేకా నందుడు, జెయన్‌యులో అస్పృశ్యుడు. ఆయనకు జెయన్‌యు…

Read more »

మాణిక్యాలరావు నిరాహారదీక్ష – తెదేపాకు మరో సవాలు !

By |

మాణిక్యాలరావు నిరాహారదీక్ష – తెదేపాకు మరో సవాలు !

హామీల అమలు కోరుతూ భాజపా ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు నిరవధికంగా చేపట్టిన నిరాహారదీక్ష రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మాణిక్యాలరావు రాష్ట్రంలో 30 శాతానికి పైగా ఉన్న ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటమే అందుకు కారణం. ఈ విషయంలో ముఖ్యమంత్రి తీసుకొనే నిర్ణయం ఆ రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందనేది అతిశయోక్తి కాదు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల బరిలో…

Read more »

కొలువుదీరిన తెలంగాణ అసెంబ్లీ

By |

కొలువుదీరిన తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణలో ఎట్టకేలకు నూతన అసెంబ్లీ కొలువుదీరింది. ముందస్తు ఎన్నికల ఫలితాలు వెలువడిన 40 రోజుల తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెంస్పీకర్‌గా నియమితుడైన ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ఈ నెల 17వ తేదీన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదటిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మహిళా ఎమ్మేల్యేలు, తర్వాత మిగతా వారు ప్రమాణం చేశారు. అసెంబ్లీలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో 114 మంది ప్రమాణ స్వీకారం…

Read more »

నిండు చంద్రుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు..!

By |

నిండు చంద్రుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు..!

కలకత్తా కాళీ సాక్షిగా కుటుంబ, కులపార్టీలన్నీ మరోసారి తమబలం చూపిద్దామని బయల్దేరాయి. పోయినవాళ్లంతా ప్రధాని అభ్యర్థులే. ఈ ‘కప్పల తక్కెడ’ను ‘తప్పుడు తడకల కూటమి’గా భావించి జనం నవ్వుకుంటున్నారు. ‘కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీశాడని’ వ్యంగంగా చెప్పినట్లు తన సీఎం పదవి ఉంటుందో ఊడుతుందో కూడా తెలియని చంద్రబాబు అక్కడకెళ్లి చెప్పిన ఓ ‘ఆణిముత్యం’పై సోషల్‌మీడియా పండుగ చేసుకుంది. ‘ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు బిజెపి వారు కొంటున్నారు’ అన్నాడు. వేదికపై ఉన్న ఫరూఖ్‌…

Read more »