Posts Tagged “26 Nov-02 Dec 2018”

5 రాష్ట్రాల ఎన్నికల చిత్రం

By |

5 రాష్ట్రాల ఎన్నికల చిత్రం

‘ఒకే దేశం- ఒకేసారి ఎన్నికలు’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదంలోని, బీజేపీ విధానంలోని ప్రయోజనం ఎంతటిదో 2018 సంవత్సరమే కళ్లకు కట్టింది. ఈ సంవత్సరం ఎన్నికలతో ఆరంభమైంది. ఎన్నికలతో ముగుస్తున్నది. ప్రధాని మోదీ తన పార్టీ కోసం పర్యటించడం అనివార్యం. లేదా పార్టీ మెరుగైన ఫలితాలను సాధించడానికి ఎంతో కొంత దష్టి పెట్టాలి. ఆ మేరకు ఆయన నిర్వర్తించే బాధ్యతల మీద వీటి ప్రభావం ఉంటుంది. 2018 ఎన్నికల జాతర నాగాలాండ్‌తో ఆరంభమైంది. త్రిపుర,…

Read more »

మరోసారి ఖలిస్తాన్‌ కుట్ర

By |

మరోసారి ఖలిస్తాన్‌ కుట్ర

పంజాబ్‌ను మరోసారి రక్తపాతంతో, విధ్వంసంతో అతలాకుతలం చేయాలని సిక్కు రాడికల్‌ ముఠాలు కుట్రలు ఆరంభించాయి. ఈ కుట్రలకు పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, ఐఎస్‌ఐ అండగా నిలుస్తున్నాయి. ఈ నవంబర్‌ 17 ఆదివారం అమృత్‌సర్‌లోని రాజాసాని గ్రామంలో నిరంకారీ భవన్‌ మీద జరిగిన గ్రెనేడ్‌ దాడితో ఎన్నో వాస్తవాలు ఒక్కసారిగా వెలుగుచూశాయి. పైగా అల్‌ఖైదా అనుబంధ అన్సార్‌ ఘాజవత్‌ అల్‌హింద్‌ కమాండర్‌ జకీర్‌ ముసా, అతడి ముఠాకు చెందిన ఐదు లేదా ఆరుగురు అనుచరులు నిఘా వర్గాల…

Read more »

ప్రపంచమంతా మాంద్యం వైపు – భారత్‌ వృద్ధి వైపు

By |

ప్రపంచమంతా మాంద్యం వైపు – భారత్‌ వృద్ధి వైపు

ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా మోదీ ధైర్యంతో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేసింది. తాజా పన్ను గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా పలు అభివృద్ధి చెందిన దేశాలు మాంద్యం దిశగా అడుగులు వేస్తుంటే భారత్‌ మాత్రం 7 శాతానికి పైగా వృద్ధిరేటును సాధిస్తూ ముందుకు కదులుతోంది. నోట్ల రద్దు తాత్కాలికంగా ప్రజలకు కొంత ఇబ్బంది కలిగించినా ఇప్పుడు దాని సక్రమ ఫలితాలను ప్రజలు అందుకుంటున్నారు. ప్రపంచ పటంలో…

Read more »

26/11 గాయానికి పదేళ్లు

By |

26/11 గాయానికి పదేళ్లు

నిత్యం ఉరుకులు పరుగులు తీసే ముంబైపై ఆ పూట ఒక్కసారి పెను ఉత్పాతమే విరుచుకుపడింది. 2008 నవంబర్‌ 26 తేదీ రాత్రి 8 గంటల సమయంలో సముద్ర మార్గంలో ఓ చేపల వేట బోటు ద్వారా 10 మంది సాయుధులు ప్రవేశించారు. వెంటనే విచక్షణా రహితంగా కాల్పులు మొదలు పెట్టారు. వచ్చిన వారు ఉగ్రవాదులేనని స్పష్టమైపోయింది. వెంటనే పోలీసు, భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. 26 నవంబర్‌, 2008. భారతదేశ చరిత్రలో మరో మాయని గాయంగా మిగిలిపోయిన తేదీ. దేశ…

Read more »

ఆధ్యాత్మిక పరిభాషలో అంతరంగాల విశ్లేషణ

By |

ఆధ్యాత్మిక పరిభాషలో అంతరంగాల విశ్లేషణ

ఆ మహాకావ్యాలు అక్షరబద్ధమై కొన్ని శతాబ్దాలు గడిచిపోయాయి. క్రీస్తుపూర్వం 400 ప్రాంతంలో ఆ గాథలు కావ్యరూపం దాల్చాయని కొందరి వాదన. అయినా 21వ శతాబ్దంలో కూడా ఆ మహా కావ్యాలు- రామాయణం, మహాభారతం, భాగవతం భారతీయులను రంజింప చేస్తూనే ఉన్నాయి. ఇరవై నాలుగువేల శ్లోకాల రామాయణం ఇప్పటికీ పఠనీయమే. లక్ష శ్లోకాల భారతం ఆరాధనీయ గ్రంథమే. ఆ ఇతిహాసాలతో ప్రభావితం కాని నేల భారత భూమిలో అంగుళమైనా కానరాదు. ఒక అంశాన్ని తాత్వికంగా చెప్పాలన్నా, భారతీయమైన శైలితో…

Read more »

విశుద్ధ, విస్పష్ట తీర్పు కావాలి !

By |

విశుద్ధ, విస్పష్ట తీర్పు కావాలి !

‘సత్యమేవ జయతే!’ మన జాతీయ నినాదం. కనుక ప్రజా జీవన రంగాలన్నిటా సత్యమే గెలవాలి. ప్రజలే పాలకులైన ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే వారు తమ రాజకీయ పార్టీలకు, ఎన్నుకున్న ప్రజలకు ఇరువురికీ ప్రతినిధులు. కనుక ప్రజలు తాము ఎన్నుకునే పార్టీలు, వారి అభ్యర్థులు ఇరువురి సత్యనిష్ఠను గమనించి ప్రతినిధులను ఎన్నుకోవాలి. అభ్యర్థులు పార్టీ వారయినా, స్వతంత్రులు అయినా స్థానికులైతే ప్రజలకు బాగా తెలిసి ఉంటారు కనుక వారి సత్య నిష్ఠ, మంచి చెడులను బేరీజు…

Read more »

మైనారిటీల స్వర్గం… హిందువులకు తప్ప !

By |

మైనారిటీల స్వర్గం… హిందువులకు తప్ప !

పెక్యులరిజం – 22 ఇంటిపేరు సమానత్వం ! ఇల్లంతా అసమానతల దుర్గంధం !! చట్టం ముందు అందరూ సమానులే అని ఘోషిస్తుంది భారత రాజ్యాంగం 14వ అధికరణం. కాని ‘ఇండియా దటీజ్‌ భారత్‌’లో పౌరులందరూ సమానులు ఎంతమాత్రం కారు. ఉన్నవి రెండే తరగతులు 1.ఎక్కువ సమానులు 2. తక్కువ సమానులు. ఈ రకం అసమానత ప్రపంచమంతటా ఉన్నదే ననుకోండి. సంఖ్యాపరంగా బలవంతులైన వాళ్లు ఎక్కువ సమానులు. అల్పసంఖ్యాకులైన బలహీనులు తక్కువ సమానులు. ఇది సాధారణం లోకరీతి. మన…

Read more »

శ్రీకాకుళం తుఫాను బాధితుల సేవలో.. ఆర్‌.ఎస్‌.ఎస్‌.

By |

శ్రీకాకుళం తుఫాను బాధితుల సేవలో.. ఆర్‌.ఎస్‌.ఎస్‌.

ఇటీవల సంభవించిన ‘తిత్లి’ తుఫాను శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపు కొత్తూరు తదితర 10 మండలాలను దెబ్బతీసింది. పలాస రైల్వేస్టేషన్‌లోని పై కప్పులు ఎగిరిపోయాయి. పలాసకు దగ్గరలో ఉన్న టోల్‌గేట్‌ కప్పులు ఎగిరిపడ్డాయి. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలు వాయుగుండం ధాటికి ప్రక్కకు ఒరిగి పోయాయి. ఇక సామాన్యుల గృహాల గురించి చెప్పనవసరం లేదు. 7 గురు మృత్యువాత పడ్డారు. గాలుల ఉధృతికి వేలాది ఎకరాలలో ప్రధాన పంటలైన కొబ్బరి, జీడి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌…

Read more »

ప్రచార జోరు..

By |

ప్రచార జోరు..

తెలంగాణ ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల ఘట్టానికి తెర పడింది. నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థులు పూర్తిగా ప్రచార పర్వంలో మునిగిపోయారు. దీంతో రాష్ట్రంలో నిజమైన ఎన్నికల వాతావరణం వచ్చి చేరింది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడంలో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా మునిగిపోయారు. బహుముఖ పోటీ ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుండగా, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ కూడా ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌,…

Read more »

సీబీఐని అడ్డుకుంటే ఏమిటి లాభం ?

By |

సీబీఐని అడ్డుకుంటే ఏమిటి లాభం ?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోకి సీబీఐని రాకుండా అడ్డుకున్నామని ప్రకటించారు. అదేదో ఘనకార్యమైనట్టు భుజాలు తడుముకున్నారు. ఓ జీవోని అడ్డుపెట్టుకుని సీబీఐ మన రాష్ట్రంలోకి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈయనకు తోడు పశ్చిమ బెంగాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అదే బాటలో నడిచారు. ఆప్‌ ఆధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కూడా చంద్రబాబు చర్యను సమర్ధించారు. రూల్‌బుక్‌ ప్రకారం చంద్రబాబు నాయుడు చేసింది సవ్యమే. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ఏదైనా…

Read more »