Posts Tagged “26 Mar-1 Apr 2018”

భారత్‌ – ఫ్రాన్స్‌ సంబంధాలలో నవ శకం

By |

భారత్‌ – ఫ్రాన్స్‌ సంబంధాలలో నవ శకం

ఒక పక్క చైనా ప్రపంచ సంబంధాల పేరుతో సామ్రాజ్య విస్తరణ విధానాలకు పాల్పడుతుండటం, మరోపక్క పాకిస్తాన్‌కు సహాయం అందించడానికి రష్యా ముందుకు రావడం వంటి పరిణామాల మధ్య ఫ్రాన్స్‌ అధ్యక్షుని భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా దేశపు సామ్రాజ్య విస్తరణ విధానాలను ఎదుర్కొనేందుకు తోటి దేశాల సహాయ సహకారాల కోసం చూస్తున్న భారత్‌కు ఫ్రాన్స్‌తో సంబంధాలు చాలా కీలకంగా మారాయి. అందుకే రెండు దేశాలు వివిధ రంగాలతోపాటు వ్యూహాత్మక సంబంధాలకూ ప్రాధాన్యమిస్తున్నాయి. మార్చ్‌ 9 నుండి…

Read more »

ఆ పని ప్రజలే చేస్తున్నారు – దత్తాత్రేయ హోసబళే

By |

ఆ పని ప్రజలే చేస్తున్నారు – దత్తాత్రేయ హోసబళే

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపకులు డాక్టర్జీ జయంతి (ఉగాది) సందర్భంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ సర్‌ కార్యవాహ దత్తాత్రేయ హోసబళేను జాగృతి ప్రతినిధి రాకా సుధాకరరావు కలిసి ముఖాముఖి నిర్వహించారు. ఆ ముఖాముఖిలో సంఘం, హిందూ సంఘటన కార్యం, హిందూ సంస్కృతి, మహిళలు, ముస్లింలు, సామాజిక సమరసత, రిజర్వేషన్లు, రాబోయే సంఘం కార్యక్రమాలు వంటి అంశాలపై సంఘ ఆలోచనలను దత్తాత్రేయ హోసబళే స్పష్టం చేశారు. ముఖాముఖి పూర్తి వివరాలు జాగృతి పాఠకుల కోసం.. ప్రశ్న : 93 సంవత్సరాల…

Read more »

అదే ఆయన జీవితాశయం

By |

అదే ఆయన జీవితాశయం

27 మార్చి మళయాళ స్వామి జయంతి ప్రత్యేకం ఒకనాడు కులం పేరుతో సామాజిక అసమానత లకు బీజం పడింది. ఈ అసమానత బీజాలను ఎవరో ఒక మహాపురుషుడు వచ్చి రూపుమాపేవారు. అలా అస్పృశ్యత బలంగా ఉన్న నేటి రెండు తెలుగు రాష్ట్రాల్లో సామాజిక, ధార్మిక సమానతను నిర్మించటంలో విశేష కృషి చేసినవారు నారాయణ గురు శిష్యులైన ‘సద్గురు మళయాళ స్వామి’. పక్షులను కొని ఎగరేశాడు సద్గురు మళయాళ స్వామి కేరళలోని గురువాయూరు దగ్గర ఎన్గండ్యూరు గ్రామంలో 27…

Read more »

అలా చేస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది

By |

అలా చేస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది

మన దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే ముందుగా గ్రామీణ భారతం సుసంపన్నం కావాలి. గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మూలాధారం వ్యవసాయమే. వ్యవసాయ రంగంలో పాడిపంటకు అధిక ప్రాధాన్యముంది. రైతులు సంక్షేమంగా ఉండాలంటే పంటలతో పాటు ‘పాడి’ ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. పాడిపంటల వల్లే వ్యవసాయరంగం ముందు కెళ్తుందని ఇటీవల నిర్వహించిన పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. ఆర్థిక పరిపుష్టికి, ఉపాధి కల్పనకు, ఆరోగ్యవంతమైన జీవితానికి, పిల్లల మనోవికాసానికి పాల ఉత్పత్తి గణనీయంగా తోడ్పడుతుంది. పశుసంపదలో ప్రపంచంలో మనదేశం…

Read more »

దేశభక్తికి మాతృభావన ముఖ్యం

By |

దేశభక్తికి మాతృభావన ముఖ్యం

మానవ జీవితంలో ఎన్ని రకాల పరిస్థితులుంటాయో అన్ని రకాల భావాలుంటాయి. వాటిలో ఒకటి మాతృ భావన. ఈ మాతృ భావమే జాతీయ వాదానికి మూలం. ‘నమస్తే సదావత్సలే మాతృభూమే’ అంటూ ప్రతినిత్యం శాఖలో చేసే ప్రార్థన ప్రతి స్వయంసేవకునిలో మాతృభావాన్ని తట్టి లేపుతుంది. మాతృభూమి పట్ల శ్రద్ధను కలిగిస్తుంది. సంఘ సిద్ధాంతానికి ఆకర్షితులైన వారిలో మాతృభావన అధికంగా ఉంటుంది. మాతృభావనకు చెందిన గుణాలలో మాతృప్రేమ, జాలి, స్త్రీ సహజమైన తెలివి, ఉన్నత ఆధ్యాత్మిక భావాలు ప్రధానమైనవి. తల్లిలా…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌కు దక్కని డిపాజిట్లు ఉత్తరప్రదేశ్‌లో రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో అనూహ్యంగా ఎస్పి, బిఎస్పిలు ఏకం కావడంతో బిజెపికి ఓటమి తప్పలేదు. ఇక కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉపఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ధరావతులు కోల్పోయారు. కాంగ్రెస్‌కు ఎదురైన ఈ దారుణ పరాభవం భవిష్యత్‌లో ఇతర పార్టీలతో ఏర్పడే కూటమిపైనా ప్రభావం చూపించేలా ఉంది. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా మారడంతో ఆ పార్టీకి…

Read more »

స్పీకర్‌ సంచలన నిర్ణయం

By |

స్పీకర్‌ సంచలన నిర్ణయం

తెలంగాణలో గడిచిన వారం అనూహ్య పరిణా మాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల మొదటిరోజు గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్‌పార్టీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టేబుల్‌ ఎక్కి హెడ్‌ఫోన్‌ విసరడంతో ఆ హెడ్‌ఫోన్‌ తగిలి శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కుడికంటికి గాయమైంది. దీంతో ఆయనకు సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స అందించారు. మొదట 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచిన వైద్యులు ఆపరేషన్‌ అవసరం లేదని ప్రకటించి డిశ్చార్జ్‌ చేశారు. స్పీకర్‌ సంచలన నిర్ణయం…

Read more »

జనసేనాని విమర్శలు

By |

జనసేనాని విమర్శలు

ప్రస్తుతం ఏపిలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఏర్పడిన కూటమి విచ్ఛిన్నమైంది. కేంద్రమంత్రివర్గం నుంచి టిడిపి మంత్రులు నిష్క్రమించారు. రాష్ట్ర క్యాబినెట్‌ నుంచి కాషాయధారులు తప్పుకున్నారు. బిజెపితో టిడిపి తెగదెంపులు చేసుకొంది. టిడిపికి జనసేన కటీఫ్‌ చెప్పింది. అజ్ఞాత వాసి ఒంటరి పోరు దిశగా కసరత్తు చేస్తున్నారు. అంతర్మథనంలో ‘దేశం’, సరికొత్త యత్నాల్లో ‘కమలం’. ఇవీ రాష్ట్రంలో రంగు మారుతున్న రాజకీయాలు. ప్రజాసమస్యల పరిష్కారంలో పాలకులు ఎలాంటి తప్పులు చేసినా ప్రశ్నిస్తానంటూ 2014 ఎన్నికల్లో…

Read more »

ఇంకెందరు ఈసా ఫాజిలీలు బలి కావాలి ?

By |

ఇంకెందరు ఈసా ఫాజిలీలు బలి కావాలి ?

ఈసా ఫాజిలీ ఎర్రగా పండులా ఉంటాడు. మంచి కుటుంబం. ఆస్తిపాస్తులున్నాయి. సంపన్నత, సమద్ధి పుష్కలంగా ఉన్నాయి. ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. బంగారు భవిష్యత్తు ఉన్నవాడు. కానీ ఫాజిలీకి జిహాద్‌ పిచ్చి పట్టుకుంది. అక్కడెక్కడో ఇస్లామిక్‌ ఖాలిఫా వచ్చాడట. కాబట్టి కశ్మీర్‌లోనూ ఖలీఫా రాజ్యం కావాలని ఉగ్రవాదం వైపు వెళ్లిపోయాడు. సరిగ్గా ఆరు నెలలు కూడా తిరగ కుండానే భద్రతాదళాలపై దాడి చేస్తూ మార్చి 13న చనిపోయాడు. ఎన్నో ఉత్తమ నిర్మాణాలను కట్టాల్సిన ఫాజిలీ ఆఖరికి కట్టుకున్నది, కట్టుకోగలిగిందీ…

Read more »

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

By |

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ప్రాంతీయం ఆర్థికం తెలంగాణ బడ్జెట్‌ 2018 -19 తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ 15 మార్చి 2018న తెలంగాణ బడ్జెట్‌ను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం 1 లక్షా 74 వేల 453.84 కోట్లతో 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో సాగునీటి రంగానికి 25 వేల కోట్లు, వచ్చే ఖరీఫ్‌ నుంచి రైతులందించే పెట్టుబడి సాయం పథకానికి 12 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. రైతు బీమాకు 500 కోట్లు,…

Read more »