Posts Tagged “25 Feb-03 Mar 2019”

వీరులారా ! వందనం !

By |

వీరులారా ! వందనం !

భారత్‌ను ఒక్కసారిగా దిగ్భ్రాంతి, బాధ, అవమానం చుట్టుముట్టాయి. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోతే, మరో 44 మంది గాయపడ్డారు. దేశమంతటా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. జాతి మొత్తం క్షోభతో కుంగిపోయింది. కాశ్మీర్‌ లోయలో జరిగిన ఈ ఆత్మాహుతి దాడితో దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది. గత రెండు దశాబ్దాలుగా ఇంత పెద్ద ఎత్తున ఆత్మాహుతి దాడి జరగలేదు. దీనితో ఇలాంటి సంఘటనలు మళ్లీ మొదలయ్యాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక యువకుడు ఈ దాడిలో…

Read more »

ఈ న్యాయ పోరాటం హిందువుల చారిత్రక కర్తవ్యం

By |

ఈ న్యాయ పోరాటం హిందువుల చారిత్రక కర్తవ్యం

భారతదేశంలో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. సర్వ సాధారణంగా అంతా అభిప్రాయ పడేదేమిటంటే- భారతదేశంలో అధిక సంఖ్యాకులు హిందువులు. కానీ మారిన కాలంలో ఈ సంఖ్యలు, సమీకరణలు బ్రిటిష్‌ కాలం మాదిరిగా లేవు. ఉండవు. భారతదేశమంతటా హిందువులే అధిక సంఖ్యాకులని ఇప్పుడు చెప్పరాదు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలోని ఏడు రాష్ట్రాలతో పాటు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోను సంఖ్యాపరంగా హిందువులు మైనారిటీలు. కానీ మైనారిటీలుగా ఉన్నప్పటికీ వారికి ఆ గుర్తింపు లేదా…

Read more »

ఆరోగ్యవంతమైన భారత్‌తోనే పరమ వైభవ స్థితి!

By |

ఆరోగ్యవంతమైన భారత్‌తోనే పరమ వైభవ స్థితి!

‘భారతమాత’… ఈ మాట అంటే ఎందరికో స్ఫూర్తి. కానీ ఆయనకు స్ఫూర్తితో పాటు ఆ మాటే పంచాక్షరి. ‘మంచి విద్య, మంచి నడవడి, మంచి ఆరోగ్యం’ అన్న మూడు సూత్రాలనే త్రికరణశుద్ధిగా అమలు చేయాలని తపిస్తున్నారు. ఆయన దృష్టిలో పల్లె ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం అంటే దేశం ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే. బస్తీలకు (మురికివాడలు) వైద్యసేవలు అందించినా అది భారతమాత సేవకే అనుకున్నారు. వైద్యం కోసం బడిపిల్లల దగ్గరకి వెళ్లినా తల్లి భారతిని సేవించడమేనని మనసావాచా నమ్మారు. ఏడు దశాబ్దాలుగా…

Read more »

ఫోన్‌ చార్జీలు తగ్గుతుంటే కరెంటు చార్జీలు పెరుగుతున్నాయి

By |

ఫోన్‌ చార్జీలు తగ్గుతుంటే కరెంటు చార్జీలు పెరుగుతున్నాయి

1951 నుండి 2019 మధ్య కాలంలో మన దేశంలో టెలిఫోన్‌లు 1200 రెట్లు పెరిగాయి. ఇదే సమయంలో విద్యుత్‌ ఉత్పాదకత శక్తి సుమారు వందరెట్లు లోపు మాత్రమే పెరిగింది. టెలిఫోన్‌ రేట్లు నిరంతరం తగ్గిపోతూ, బీదవారికి కూడా అందుబాటులోకి వస్తూంటే విద్యుత్‌ రేటు 16 రెట్లు పెరిగింది. బీదవారు, రైతులు విద్యుత్‌ బిల్లులు కట్టలేని పరిస్థితి నెలకొంది. కారణం విద్యుత్‌ ఉత్పాదన, వితరణ రంగంలో ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉండటమే. భారతదేశంలో సాంకేతిక సరళీకృత ఆర్థిక వ్యవస్థలు తీసుకువచ్చిన…

Read more »

సాహసోపేత నిర్ణయాల వేధిక.. 16వ లోక్‌సభ – సొంతబలం, సంపూర్ణ ఫలం

By |

సాహసోపేత నిర్ణయాల వేధిక.. 16వ లోక్‌సభ – సొంతబలం, సంపూర్ణ ఫలం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయ వంతంగా ఐదేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలు ఎన్ని రకాలుగా దుష్ప్రచారానికి పూనుకున్నా అవినీతికి తావులేని పారదర్శక పాలన అంటే ఏమిటో దేశ ప్రజలకు స్పష్టంగా చూపించారు మోదీ. దేశ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని, ప్రజాకర్శక విధానాల కన్నా దేశ ప్రయోజనాలకే ప్రధాన్యత ఇచ్చి నిజమైన అభివృద్దికి బాట వేశారు. 16వ లోక్‌ సభ కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో కొద్ది వారాల్లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో…

Read more »

పదజాలానికి బానిసలమా? – గురూజీ సందేశం

By |

పదజాలానికి బానిసలమా? – గురూజీ సందేశం

మార్చి 2 (మాఘ బహుళ ఏకాదశి) గురూజీ జయంతి మన దేశం ఈనాడు ప్రజాస్వామ్య వ్యవస్థను వరించింది. అయితే సామాన్య ప్రజలకు సరైన విద్యావిజ్ఞానాలు కలిగినప్పుడే అది విజయ వంతమవుతుంది. ప్రజలు అక్షరాస్యులయినంత మాత్రాన ప్రయోజనం సిద్ధించదు. మన జాతీయ జీవితానికి సంబంధించిన రాజకీయ ఆర్థిక సూత్రాల వంటి వివిధ విషయాలలో తమ పాత్ర, బాధ్యతల గురించి వారికి గుర్తింపు కలిగించాలి. అట్టి విజ్ఞానం కలిగిన ప్రజలు మాత్రమే సరైన ప్రజాప్రతినిధుల నెన్నుకోగలరు. అట్లాకాక విద్యావిహీనులు, అజ్ఞానులునైన…

Read more »

ఉగ్రవాదం కంటే హీనం!

By |

ఉగ్రవాదం కంటే హీనం!

ఉగ్రవాదులుగా చలామణి అవుతున్న పాక్‌ ప్రేరేపిత ఇస్లాం మతోన్మాదులు ఎలాగూ నెత్తురు రుచి మరిగిన పులులే. పుల్వామా ఘాతుకాన్ని చూసిన తరువాత కూడా ఈ దేశంలో నివసిస్తున్న చాలా శక్తులలో మార్పు రావడం లేదు. రుచి మరిగిన పులుల వైపు, ఆ పులులను మేపుతున్న దేశం మీదే వారు ప్రేమానురాగాలు కురిపిస్తున్నారు. ఈ నేరం నాది కాదు అని మళ్లీ అత్యంత నిర్లజ్జగా, నిర్లక్ష్యంగా పాకిస్తాన్‌ జవాబు ఇచ్చింది. ఇది పుల్వామా దాడి ఘటన మీద పాక్‌…

Read more »

రాష్ట్ర సేవికా సమితి జ్యేష్ఠ కార్యకర్త శారదాబాయి కన్నుమూత

By |

రాష్ట్ర సేవికా సమితి జ్యేష్ఠ కార్యకర్త శారదాబాయి కన్నుమూత

తెలుగు రాష్ట్రాలలో రాష్ట్ర సేవికా సమితి నిర్మాణం, అభివృద్ధికి విశేషకృషి చేసిన జ్యేష్ఠ కార్యకర్త శ్రీమతి శారదాబాయి ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 91 సంవత్సరాలు. హైదరాబాద్‌లో అలనాటి ప్రముఖ న్యాయవాదులలో ఒకరైన దత్తాత్రేయ కులకర్ణి కుమార్తె శారదాబాయిని 1952లో ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు గణపతిరావ్‌ బ్రహ్మపూర్కర్‌ వివాహం చేసుకున్నారు. అనతికాలంలోనే తండ్రి అకాల మరణం చెందారు. దీనితో నలుగురి తమ్ముళ్ల బాధ్యత శారదాబాయి స్వీకరించారు. తరువాత పదో తరగతి చదువుకుని, ట్యూషన్లు చెప్పారు….

Read more »

‘నేను’ ఎవరు?

By |

‘నేను’ ఎవరు?

(మనిషి సృష్టి ఏమిటి అని విచారించడం తన భుజంమీద తానే ఎక్కడానికి ప్రయత్నించడం) నిర్మలమైన ఆకాశపు నీలిబాటల్లో పూలు పూచినట్లు నలుదెసలా విరిసిన తారకలు మనస్సుకు అవ్యక్తానందాన్ని కలిగిస్తాయి. ఒక నవ చంద్రికా మోహన నిశా సమయంలో ఆకాశం క్రింద హాయిగా పరుండి మృదుమధురోహల్లో మగ్నమై ఈ చంద్రుడు, ఈ తారలు, ఈ వెండి జలతారు ముసుగులో వెలిసిన ఈ నిశాసుందరి, మన అందరి ఆనందం కోసమే సృష్టించబడిందని పరవశులమవుతుంటాము. వాటికి డుమువులు చేర్చి కవులు చిత్ర…

Read more »

ఎట్టకేలకు మంత్రివర్గం

By |

ఎట్టకేలకు మంత్రివర్గం

తెలంగాణలో ఎట్టకేలకు మంత్రివర్గం కొలువు దీరింది. కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత 68 రోజులకు కేబినెట్‌ ప్రమాణస్వీకారం చేసింది. మంత్రివర్గ విస్తరణలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఫిబ్రవరి 19వ తేదీ మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ పదిమందిలో నలుగురు మాజీ మంత్రులు కాగా, ఆరుగురికి కొత్తగా మంత్రి పదవులు దక్కాయి. పాత, కొత్తల మేళవింపు! నిర్మల్‌…

Read more »