Posts Tagged “24-30 September 2018”

మన ఐక్యతే మన బలం

By |

మన ఐక్యతే మన బలం

అవగాహన, సంస్కరణ, పురోగతి కోసం షికాగోలో ప్రపంచ హిందూ సదస్సు ‘ఓ హిందూ! మేలుకో!’ అన్న స్వామి వివేకానందుని పిలుపునకు మేల్కొని వచ్చిన హిందూ జనవాహినితో నిండినట్టే కనిపించింది షికాగో నగరం. ఈ సెస్టెంబర్‌ 7,8,9 తేదీలలో అక్కడే రెండవ విశ్వహిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. మళ్లీ ఒక్కసారి ప్రపంచదేశాలు ఆ నగరం వైపు చూశాయి. 125 ఏళ్ల క్రితం ఈ నగరం నుంచే వివేకానందుడు చేసిన గర్జనతో ప్రపంచం అటు దృష్టి సారించింది. మళ్లీ ఇప్పుడు….

Read more »

ఏడు వేధికలు

By |

ఏడు వేధికలు

విశ్వహిందూ గోష్టిని సమగ్రంగా నిర్వహించడానికి ఏడు వేదికలుగా విభజించారు. సెప్టెంబర్‌ 7,8,9 తేదీలలో అమెరికాలోని షికాగో నగరంలో జరిగిన ఈ గోష్టి ప్రధాన ఉద్దేశం హిందూ ఐక్యతను గుర్తు చేయడమే అయినా, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన హిందువులు తమ తమ భావాలను, అనుభవాలను ఇతరులకు అందిచడం కూడా అందులో భాగమే. అందుకే గోష్టిని ఏడు భాగాలుగా విభజించారు. వాటి పరిచయం క్లుప్తంగా. ప్రపంచ హిందూ ఆర్థిక వేదిక ప్రపంచంలో నేడు కార్యనిర్వహణాధికారులుగా, వాణిజ్య వేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా,…

Read more »

కమలం వికసించా వచ్చు….!

By |

కమలం వికసించా వచ్చు….!

‘అంత శ్రద్ధగా పేపరు చదువుతున్నారు గదా! ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అనుకొంటున్నారో చెప్తారా?’ ‘నీ ప్రశ్న కొంచెం డొంక తిరుగుడుగా ఉంది. నువ్వు అడుగుతున్నది – ఎవరు గెలుస్తారనా? ఎవరు గెలుస్తారని ఎవరెవరు ఏమనుకుంటున్నారనా?’ ‘ఎన్నికలు ఇంకో రెండు మూడు నెలల తరవాత గానీ జరగవు. కాబట్టి ఎవరు గెలుస్తారని అనుకుంటు న్నారన్నదే ఇప్పటి విషయం. ‘అయితే ముందు నేనడిగే మూడు ప్రశ్నలకు జవాబులు చెప్పాలి!’ ‘మీరు తిరిగి నాకే పరీక్ష పెడ్తున్నారు!…

Read more »

చైనా నయా వలసవాదాన్ని అడ్డుకున్న మలేషియా

By |

చైనా నయా వలసవాదాన్ని అడ్డుకున్న మలేషియా

వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ (OBOR) ను చైనా కొత్త పేరుతో బెల్ట్‌ రోడ్‌ పధకం (BRI) అని పిలుస్తోంది. దీని ద్వారా చైనా ఆర్ధిక సామ్రాజ్యవాద విధానపు వలలో చిక్కి అనేక దేశాలు విలవిలలాడుతున్నాయి. ఈ పధకాల వల్ల తమతో కలిసే దేశాలకు లాభమే చేకూరుతుంది తప్ప నష్టం లేదని చైనా చెపుతున్నా, నిజానికి చైనా అమలుచేస్తున్న ఈ కొత్త తరహా ‘అప్పుల ఊబి దౌత్యవిధానం’ వల్ల ఆయా దేశాలు కుదేలవుతున్నాయి. చైనాకు తమ హంబన్‌తోట…

Read more »

కవన కుతూహల భీమన్న

By |

కవన కుతూహల భీమన్న

‘గోచిపెట్టుట నేర్చుకొనగానె బిడ్డకు చేతికి కర్రిచ్చు రైతులార! నడవ నేర్చినతోనె బుడతను గొంపోయి పాలేరు దనముంచు మాలలార! పసిబిడ్డ తెచ్చు సంపాదన కాశించి మనుగడలే మాపు జనకులార! వంటయిల్లే ప్రపంచమ్ముగా చేసి తనయల మెడకోయు తల్లులార! జాతి శక్తివిహీనమై చచ్చుచుండ కనులను మూసికొంటిరే గాఢనిద్ర శక్తికంతకు మూలము చదువుకాన చదువ బంపుడు మీ తనూజాళినింక’ మానవజాతి పురోగమనానికి జ్ఞానం ఎంత ఆవశ్యకమో కొన్ని దశాబ్దాల క్రితమే గుర్తించిన కవి బోయి భీమన్న. పైన చెప్పుకున్న పద్యం ఆయనదే….

Read more »

చదువులకు సెక్యులర్‌ చెదలు

By |

చదువులకు సెక్యులర్‌ చెదలు

పెక్యులరిజం-14 కమలాక్షునర్చించు కరములు కరములు.. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు.. శ్రీ రఘురామ చారు తులసీదళ దామ.. సారపు ధర్మమున్‌ విమల సత్యము.. పాతతరం వాళ్లు చిన్నప్పుడు హైస్కూలు తెలుగు వాచకాల్లో చదివి, ఇప్పటికీ నెమరు వేసుకుంటున్న పద్యాలివి. ఆ కాలాన సోషల్‌ స్టడీస్‌లో ఇండియాను ‘హిందూదేశం’ అనేవారు. గుప్తుల కాలపు స్వర్గయుగం గురించి, బహమనీ సుల్తాన్ల మీద కృష్ణదేవరాయలు, అక్బర్‌ మీద రాణాప్రతాప్‌, ఔరంగజేబు మీద ఛత్రపతి శివాజీ చేసిన యుద్ధాల గురించి పాఠాలు…

Read more »

నాటి భారతంలో నేటి ర్యాగింగ్‌

By |

నాటి భారతంలో నేటి ర్యాగింగ్‌

మహాభారతం రచిస్తూ దాని పరిధి గురించి వ్యాసుడొక మాటన్నాడు. ధర్మేచార్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర; యన్నేహాస్తి నతత్‌ క్వచిత్‌|| అంటే – ధర్మార్థ కామమోక్షాలకు సంబంధించి ఈ భారతంలో ప్రస్తావించని విషయం లేదు. ఇందులో లేని విషయాలు లోకంలో కూడా లేనట్లే – అని అర్థం. మానవ జీవితంలో ఏ విషయమైనా ధర్మానికో, అర్థానికో, కామానికో, మోక్షానికో సంబం ధించినదై ఉంటుంది. అందువల్ల మహాభారతంలో మానవ జీవితాలకు సంబంధించి ప్రతి విషయం ప్రత్యక్షంగానో…

Read more »

‘యజ్ఞన్న’ సామాజిక యజ్ఞం

By |

‘యజ్ఞన్న’ సామాజిక యజ్ఞం

ఆర్‌ఎస్‌ఎస్‌ జ్యేష్ఠ కార్యకర్త, కర్నూలు విభాగ్‌ మాజీ సంఘచాలకులు ఎండివై రామమూర్తి (84) సెప్టెంబర్‌ 13న కర్నూలులో తుది శ్వాస విడిచారు. కర్నూలు జిల్లాలో సంఘ విస్తరణకు ఆయన విశేష కృషి చేశారు. ‘యజ్ఞన్న’ గా ప్రసిద్ధులైన ఆయన పూర్తి పేరు మేడూరి దీక్షితుల యజ్ఞ రామమూర్తి. కర్నూలు-శ్రీశైలం రహదారిలో ఉన్న ఆత్మ కూరులో మే 1, 1934న రామమూర్తి జన్మించారు. తల్లితండ్రులు మేడూరి దీక్షితుల రామయ్య, శ్రీమతి మేడూరి సుబ్బమ్మ. అక్కడే ‘శేతురావు బడి’ అనే…

Read more »

స్తబ్దుగా గులాబీ.. హుషారులో కమలం..

By |

స్తబ్దుగా గులాబీ..  హుషారులో కమలం..

తెలంగాణలో ముందస్తు ఎన్నికల శంఖారావం మోగిన తర్వాత పరిణామాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. జనంలో ముఖ్యంగా ఓటర్లలో పలు సందేహాలకు కారణమవుతున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్నాయన్నట్లుగా అసెంబ్లీ రద్దునాడే ప్రకటన చేసిన కేసీఆర్‌ ఆ తర్వాత స్తబ్దుగా ఉండిపోయారు. హుస్నాబాద్‌ సభ మినహా ప్రగతిభవన్‌ నుంచి అడుగు కూడా బయటపెట్టడం లేదు. దేశంలోనే అత్యంత పెను విషాదంగా నమోదైన కొండగట్టు ఘాట్‌రోడ్డుపై ప్రమాదంలో 62మంది అమాయకులు బలైనా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ¬దాలో ఉన్న కేసీఆర్‌ వారిని పరామర్శించలేదు. ఈ…

Read more »

బాబు క్లీన్‌ బౌల్డ్‌

By |

బాబు క్లీన్‌ బౌల్డ్‌

వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబుకు మహారాష్ట్ర ధర్మాబాద్‌ న్యాయస్థానం పంపిన నాన్‌ బెయిల్‌ వారెంట్‌ గురించి తెలుగు తమ్ముళ్లు, మీడియా చేస్తున్న గందరగోళం అంతా ఇంతా కాదు. ఇదంతా ప్రధాని మోదీ, అమిత్‌ షా, కెసిఆర్‌లు చేస్తున్న కుట్ర అని అరుస్తున్నారు. చంద్రబాబుని అరెస్టు చేస్తే దేశవ్యాప్తంగా ప్రజలు ఉద్యమాలు చేస్తారని బీరాలు పలుకుతున్నారు. అయితే చంద్రబాబుకు వచ్చిన నాన్‌బెయిల్‌ వారంటుకు మోదీకి సంబంధం ఏమిటని ప్రజలు తికమక పడుతున్నారు. రాజకీయ…

Read more »