Posts Tagged “24-30 April 2017”

తీస్తా ఒప్పందం ఎందుకు కీలకం ?

By |

తీస్తా ఒప్పందం ఎందుకు కీలకం ?

బంగ్లాదేశ్‌ పై చైనా పట్టు బిగవకుండా చూడాలంటే బంగ్లాకు మన నుండి సహకారం అందించటం ఎంతో వ్యూహాత్మకమైనది. ఇంతకు ముందు బంగ్లాదేశ్‌కు అందించిన 2 బిలియన్‌ డాలర్ల సహాయంతో పాటు హసీనా ఢిల్లీ పర్యటన సందర్భంగా మరో 4.5 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయాన్ని మోది ప్రకటించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు పెంచుకోవడంలో ఇదొక కీలక అంశం అవుతుంది. దక్షిణాసియాలో భారత్‌కు సన్నిహిత మిత్రదేశం బంగ్లాదేశ్‌. ఈ మిత్రత్వం కొనసాగడం భారత్‌ వ్యూహాత్మక ప్రయోజనాల దష్ట్యా…

Read more »

దేశ ప్రయోజనాలే ముఖ్యం

By |

దేశ ప్రయోజనాలే ముఖ్యం

కేంద్రం చేపట్టిన తూర్పు దిశ విధానాన్ని (Look East Policy) పటిష్టపరచడంలో మమత చొరవ చూపినట్లయితే ‘మమత స్వంత పార్టీ ప్రయోజనాలను, స్వంత రాజకీయా లను పణంగా పెట్టి జాతీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేశారు’ అనే మంచి పేరును పొందగలరు. విదేశీ విధానం విషయంలో దేశంలోని అన్ని పార్టీలు కలిసి పనిచేస్తూ దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌హసీనా ఇటీవలి కొత్త దిల్లీ సందర్శన, ప్రధాని నరేంద్రమోదితో కలసి ఆమె కుదుర్చుకున్న…

Read more »

భారత్‌-బంగ్లా సంబంధాల పటిష్టం

By |

భారత్‌-బంగ్లా సంబంధాల పటిష్టం

‘పొరుగువారికి అగ్రతాంబూలం’ విధానాన్ని బలోపేతం చేస్తూ భద్రతను, సంప్రదాయాలను పక్కనబెట్టి, ఏప్రిల్‌ 7 నాడు ఏడు సంవత్సరాల తరువాత మొదటిసారి భారత్‌ వచ్చిన బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా వాజెద్‌ను ఆహ్వానించడానికి భారత ప్రధాని నరేంద్రమోది విమానాశ్రయం చేరుకున్నారు. మోది ఆహ్వానాన్ని మన్నించి భారత సందర్శనకు వచ్చిన బంగ్లాదేశ్‌ ప్రధాని రాష్ట్రపతి అతిథిగా రాష్ట్రపతి భవన్‌లో విడిది చేశారు. తన 2015 జూన్‌ నాటి ఢాకా పర్యటనలో 43 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న భూ సరిహద్దు ఒప్పందాన్ని…

Read more »

వ్యూహాత్మకం భారత్‌-మలేషియా భాగస్వామ్యం

By |

వ్యూహాత్మకం భారత్‌-మలేషియా భాగస్వామ్యం

భారతదేశ వ్యాపార భాగస్వాములలో ఆసియాన్‌ దేశాలలో ఇండోనేషియా, సింగపూర్‌ల తరువాత ప్రస్తుతం మలేషియానే అతి పెద్ద భాగస్వామి. మలేషియా జనాభాలో భారతీయ సంతతి  7.5 శాతం ఉన్నది. మలేషియాలోని కొన్ని వర్గాలు చైనా ప్రభావానికి గురవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోని దేశాలతో దృఢ సంబంధాలు నిర్మించుకోవడానికి భారతదేశం అన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంది. భారత ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానాన్ని పురస్కరించుకొని మలేసియా ప్రధాని నజిబితున్‌ అబ్దుల్‌ రజాక్‌ మార్చి 30 నుండి ఏప్రిల్‌ 4 వరకు భారత దేశానికి అధికారిక పర్యటనకు…

Read more »

పంజాబ్‌లో సంఘకార్య విస్తారకుడు మోరూభావు మూంజె

By |

పంజాబ్‌లో సంఘకార్య విస్తారకుడు మోరూభావు మూంజె

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ నేడు పొందుతున్న గౌరవం, ఆదరణ హఠాత్తుగా వచ్చినవి కావు. పేరు, కీర్తి ప్రతిష్టలు ఆశించని కొన్ని వందల మంది కార్యకర్తల అవిశ్రాంత కృషి ఫలితమే అవి. ముఖ్యంగా ప్రారంభ దశలో సంఘాన్ని ఎవరూ పట్టించుకోలేదు. పైగా అపనమ్మకం, వ్యతిరేకత, వెటకారం ఉండేవి. సంఘ నిర్మాత నుండి స్ఫూర్తి పొందిన అనేకమంది కార్యకర్తలు తమ జీవితాలనే సంఘ కార్యానికి అంకితం చేశారు. సౌకర్యవంతమైన, సుఖవంతమైన జీవితాన్ని , ఇంటిని వదిలి ఎక్కడో తమకు ఏమాత్రం…

Read more »

దూకుతున్న ఉత్తర కొరియా

By |

దూకుతున్న ఉత్తర కొరియా

– ఉత్తర కొరియాను అర్థం చేసుకోలేని యుఎస్‌, చైనాలు – గత్యంతరం లేకే ఉ.కొరియాతో చైనా స్నేహం – చైనాతో స్నేహం ఇష్టంలేని ఉ.కొరియా – పరిస్థితి విషమిస్తే ఈశాన్య ఆసియాకు ముప్పే..! ఇటీవలే రాకెట్‌ ఇంజన్‌ను విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా ఖండాంతర ప్రాక్షేపిక క్షిపణిని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఉత్తర కొరియా విచ్చల విడిగా చేస్తున్న క్షిపణి పరీక్షలు వేగవంతమవుతూ ఈ ప్రాంతంలో భద్రతకు రాబోయే పెను ముప్పుకు దుశ్శకునంగా నిలుస్తున్నాయి….

Read more »

ఎన్నికల సంఘానికే లంచం?

By |

ఎన్నికల సంఘానికే లంచం?

తమిళనాడు శాసనసభా నియోజకవర్గం ఆర్‌.కె.నగర్‌ ఎన్నికను రద్దు చేశారు. ఎన్నికలు జరుగవలసిన కొద్దిరోజుల ముందు ఎన్నికల కార్యక్రమాన్ని రద్దు చేయటం బహుశ ఇదే ప్రథమం కావచ్చును. ఎన్నికలలో ధన ప్రవాహం సామాన్యమైపోయిన ఈ రోజులలో ఆర్‌.కె.నగర్‌లో ధన ప్రవాహం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. సాధారణంగా ధన ప్రవాహం ఎన్నికలకు ముందు రెండు మూడు రోజులలో కనపడుతుంది. అదీ రహస్యంగానే ఉంటుంది. కాని ఈసారి ఓ వారం రోజులు ముందుగానే ఏ మాత్రం రహస్యాన్ని పాటించకుండా ధనం ప్రవాహమై…

Read more »

ఎన్నికలపై కెసిఆర్‌ గురి

By |

ఎన్నికలపై కెసిఆర్‌ గురి

మరో రెండేళ్లకు 2019లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ముందు నుండే గురిపెట్టినట్లు స్పష్టంగా కనబడుతున్నది. అనూహ్యంగా రాష్ట్రంలోని రైతులందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉచితంగా ఎరువులు అందజేస్తామని ప్రకటించడం ఈ దిశలో తీసుకున్న ఒక సంచలనాత్మక నిర్ణయమే. ఈ నిర్ణయం ఉద్దేశ్యం ఏమైనప్పటికి ఒక విధంగా ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేసినట్లు కనబడుతున్నది. తెలివిగా ఎన్నికల ముందు 2018 నుండి అమలులోకి వచ్చే విధంగా, సంవత్సరం కన్నా ముందే ఈ నిర్ణయం…

Read more »

తెలుగు రాష్ట్రాలలో మిర్చి రైతుల దిగాలు

By |

తెలుగు రాష్ట్రాలలో మిర్చి రైతుల దిగాలు

ఆరుగాలం కష్టపడి పండించిన మిరపకు అకస్మాత్తుగా ధరలు పడిపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు దిగులు పడుతున్నారు. గత సంవత్సరం కన్నా దాదాపు సగానికి ధర పడిపోవడంతో పలు చోట్ల రైతులు దిక్కు తోచక తమ పంటలను తామే కాల్చుకున్న సంఘటనలు జరిగాయి. ఈ సంవత్సరం మిర్చి పంట విస్తారంగా పండడంతో దళారులు కూడబలుక్కొని ధరను తగ్గించి వేసినట్లు కనబడుతున్నది. కిలో మిర్చి విత్తనాలను లక్ష రూపాయలకు పైగా వ్యయంతో బ్లాక్‌ మార్కెట్‌లో సహితం కొనుగోలు చేసి…

Read more »

చంద్రగిరి కోట

By |

చంద్రగిరి కోట

చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండల కేంద్రంలో తెలుగుజాతి గత చరిత్రకు ఆధారభూతమైన, అవశేషంగా మిగిలి ఉన్న కట్టడం ‘చంద్రగిరి దుర్గం’. ఈ దుర్గాన్ని శ్రీకృష్ణదేవరాయల కాలం (1640) లో నిర్మించారు. చంద్రగిరి కృష్ణ దేవరాయల మంత్రి సాళ్వ తిమ్మరుసు జన్మస్థలం . విజయనగర రాజుల మూడవ రాజధానిగా విరాజిల్లింది. చంద్రగిరి పట్టణంలో యాదవ రాయల వంశస్థులు చంద్రగిరికోటను శతృ దుర్భేద్యంగా నిర్మించటం విశేషం. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం పర్యాటకులను తిరుమల తర్వాత…

Read more »