Posts Tagged “22-28 April 2019”

‘బాగ్‌’ మారణ హోమానికి మరోసారి ‘విచారం’ క్షమాపణలకు ఇంగ్లండ్‌ ససేమిరా!

By |

‘బాగ్‌’ మారణ హోమానికి మరోసారి ‘విచారం’  క్షమాపణలకు ఇంగ్లండ్‌ ససేమిరా!

”జలియన్‌వాలా బాగ్‌ దురా’గతం’ గురించి మరోసారి విచారం వ్యక్తం చేయగలం! క్షమాపణ చెప్పలేం!” ఆ ఘోర దురంతం జరిగిన వందేళ్ల తరువాత, ఇంగ్లండ్‌ పార్లమెంట్‌ నుంచి ఆ దేశ ప్రధాని థెరిసా మే వినిపించిన సందేశం ఇదే. కారణం- ఇలాంటి క్షమాపణలతో కొన్ని ఆర్థికాంశాలు ముడిపడి ఉంటాయట. వీటికి క్షమాపణలు చెబితే పరిహారాలు చెల్లించేందుకు సిద్ధపడాలి. కాబట్టి మేం విచారం వ్యక్తం చేయడంతో సరిపెడతాం, మీరు దానితో సంతృప్తి పడండి అని హితవు చెప్పారు థెరిసా మే….

Read more »

జమ్మూ హిందువుల పైనా పాక్‌ గురి!

By |

జమ్మూ హిందువుల పైనా పాక్‌ గురి!

కశ్మీర్‌ లోయ నుంచి హిందూ పండిట్లను తరిమేశారు. విడిచి వెళ్లకపోతే చంపేశారు. ఇప్పుడు జమ్మూలో నివసిస్తున్న హిందువులకు కూడా అలాంటి గతే పట్టబోతున్నదా? ముస్లింలు అధికంగా ఉండే కశ్మీర్‌ లోయ నుంచి, ఇప్పుడు హిందూ జనాభా అధికంగా ఉండే జమ్మూ మీద కూడా ఉగ్రవాదం తన పంజాను విసరబోతున్నదా? ఇటీవల జరిగిన చంద్రకాంత శర్మ అనే రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) నాయకుడి హత్య ఈ విషయాన్నే ధ్రువపరుస్తున్నది. జమ్మూ నుంచి కూడా హిందువులను తరిమికొట్టి, అది…

Read more »

రామాయణం- ఆధునిక జీవనం

By |

రామాయణం- ఆధునిక జీవనం

భారతీయ సంస్కతికి మూలస్తంభాల వంటి గ్రంథాలు మూడున్నాయి. అవే రామాయణ, భారత, భాగవతాలు. వీటిలో భారతం మన నిజ జీవితం. రామాయణం ఆదర్శజీవితం. భాగవతం దివ్య జీవితం. మనం నిజ జీవితంలో ఎన్ని రకాల రాగద్వేషాలతో కొట్టుకు పోతున్నామో భారతం చెబుతుంది. మనం ఎంత ఆదర్శప్రాయమైన జీవితం గడపవచ్చో రామాయణం తెలియజేస్తుంది. ఏ రకంగా జీవిస్తే మనం దివ్య జీవితం గడపగలుగుతామో భాగవతం బోధిస్తుంది. ఆయా గ్రంథాలలో పాత్రలు, ప్రవత్తులు, కథలు, సందర్భాలు అన్నీ ఈ ఆశయాలకి…

Read more »

వారివైపే విజయ సంకేతాలు

By |

వారివైపే విజయ సంకేతాలు

2019 సార్వత్రిక ఎన్నికలను మొత్తం ఏడు దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశలో 91 స్థానాలకు ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగ్గా, రెండో దశలో 97 స్థానాలకు ఏప్రిల్‌ 18న, మూడో దశలో 115 స్థానాలకు ఏప్రిల్‌ 23న, నాలుగోదశలో 71 స్థానాలకు ఏప్రిల్‌ 29న, ఐదో దశలో 51 స్థానాలకు మే 6న, ఆరో దశలో 59 స్థానాలకు మే 12న, ఏడో దశలో మిగిలిన 59 స్థానాలకు మే19 న ఎన్నికలు జరుగుతాయి. సమస్యాత్మక మరియు…

Read more »

గణనీయంగా తగ్గిన పోలింగ్‌ శాతం

By |

గణనీయంగా తగ్గిన పోలింగ్‌ శాతం

– రాజధాని చరిత్రలోనే అత్యల్పం ! తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ శాతం ఈసారి గణనీయంగా తగ్గిపోయింది. ఈ నెల 11వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన మొదటి విడత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. 9శాతం తక్కువగా.. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శాతంతో పోలిస్తే.. ఏకంగా 13శాతం తగ్గిపోయింది. పోలింగ్‌ శాతాల్లో ఈ స్థాయిలో తేడా నమోదు కావడం వెనుక…

Read more »

ఘర్షణలకు బాధ్యులెవరు ?

By |

ఘర్షణలకు బాధ్యులెవరు ?

పోలింగ్‌ రోజున ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రణరంగమే అయింది. పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలు కురుక్షేత్రాన్ని తలపించాయి. బాధ్యత గల శాసన సభాపతి సైతం పోలింగ్‌ బూత్‌లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వార్తలు రాగా, సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఎన్నికల కమిషనర్‌ను పోలింగ్‌కు ముందురోజు కలిసి బెదిరించినట్లుగా మాట్లాడారనే అపప్రథను మూటకట్టుకున్నారు. అనేకచోట్ల పార్టీల అభ్యర్థులు ఈవీఎంలను ధ్వంసం చేయగా, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిచి పోలింగ్‌కు అంతరాయం కలిగించారు. ఒకరిపై ఒకరు కత్తులు, రాళ్ల దాడులకు పాల్పడ్డారు….

Read more »

చేను గట్టున నడుస్తున్న పద్యం

By |

చేను గట్టున నడుస్తున్న పద్యం

‘కవిత్వం రాయటమంటే ఖడ్గంతో సహజీవనం చెయ్యటం మొద్దుబారటానికీ వీల్లేదు మోడుగా మిగలటానికీ వీల్లేదు…’ నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగులో వినిపిస్తున్న గొంతు కె. శివారెడ్డి. ఈ పద్యం ఆయనకు ప్రతిష్టాత్మ కమైన సరస్వతీ సమ్మాన్‌ పురస్కారం తెచ్చిన ‘పక్కకు ఒత్తిగిలితే’ లోనిదే. ఆంగ్ల సాహిత్యం చదివి, అదే అంశాన్ని విద్యార్థులకు బోధించినా శివారెడ్డి తన మూలాలను విస్మరించలేదు. నాగలి పట్టే రైతు, నాగేటి చాళ్లలో దిగే వరినాట్లు, పంట గట్టు మీద వాలే పక్షి, వరికంకులతో పైర గాలుల…

Read more »

పుస్తకాల పండుగ

By |

పుస్తకాల పండుగ

(ఏప్రిల్‌ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం) ప్రపంచం గతిని మార్చింది -పుస్తకం. మానవాళికి ఆలోచించడం నేర్పింది – అక్షరం. పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవను అంచనా వేయడం ఆకాశాన్ని కొలవడం వంటిదే. పుస్తకాలు లేని ప్రపంచాన్ని ఊహించాలంటేనే పరమ చేదుగా ఉంటుంది. అందుకే పుస్తకాన్ని ప్రపంచ ప్రజలంతా ఒకే క్షణంలో ఆరాధించే ఒక కార్యక్రమాన్ని యునెస్కో రూపొందించింది. అదే ప్రపంచ పుస్తక, కాపీరైట్‌ దినోత్సవం. ఏప్రిల్‌ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. ఈ తేదీని ప్రపంచ సాహిత్యానికి…

Read more »

వేసవిలో తినకూడని పదార్థాలు

By |

వేసవిలో తినకూడని పదార్థాలు

వేసవిని తట్టుకోవడానికి మనం నీరు ఎక్కువగా తాగుతాం. అలాగే నీటితో పాటు కొబ్బరినీరు, నిమ్మరసం, చెరకు రసం, పళ్ల రసాలు వంటి సంప్రదాయ పానీయాలూ తీసుకుంటాం. ఇవన్నీ వేసవిలో తీసుకోదగిన పానీయాలు. మరి ఎండాకాలంలో తినకూడని వస్తువుల గురించి కూడా తెలుసుకుందాం. వేసవిలో తినకూడని వస్తువులు, తాగకూడని పానీయాలలో ముఖ్యంగా కూల్‌డ్రింకులు, ఐస్‌క్రీములు ఉంటాయి. ఈ విషయంపై అనేకమందికి అవగాహన ఉంది. కూల్‌డ్రింకులు, ఐస్‌క్రీములతోపాటు మరికొన్ని తినకూడని పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక నూనె వేసవిలో…

Read more »

డ్రోన్‌లు-ఆవిష్కరణ, అభివృద్ధి, ప్రయోగాలు

By |

డ్రోన్‌లు-ఆవిష్కరణ, అభివృద్ధి, ప్రయోగాలు

శత్రుదేశాలతో తలపడడానికి.. ఇతర దేశాలపై యుద్ధం చేసి, వాటిని తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి.. యుద్ధ సమయంలో తమ సైని మరణాలను తగ్గించుకోవడానికీ.. శత్రుసేనల ఉనికిని కనిపెట్టడానికీ.. ఎంతో శాస్త్ర పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు కావాలి. యుద్ధానికి ముందు, యుద్ధ సమయంలో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో అత్యంత ఉపయోగకరమైన పరికరం UAV-Unmanned Aerial Vehicle. దీన్నే సామాన్య పరిభాషలో Drone అంటాము. ఇక ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన, అద్భుతమైన టెక్నాలజీ కల దేశం ఇజ్రాయెల్‌. టెక్నాలజీ విషయంలో…

Read more »