Posts Tagged “19-25 November 2018”

చరిత్రకు రెండు వెన్నుపోట్లు

By |

చరిత్రకు రెండు వెన్నుపోట్లు

రెండు చేతులూ బారజాపి కమలదళాన్ని ఎదకు హత్తుకోగలరాయన. కమ్యూనిస్టు ‘సోదరుల’తో ఆప్యాయంగా కరచాలనం చేయగలరు. ‘అనివార్యతలు’ ముంచుకొస్తే కాంగ్రెస్‌ ముందు మోకరిల్లగలరు కూడా. ఇంకా… ఏడేళ్లు కలసి నడిచాక ఆ కమలంలోనే మతోన్మాదాన్ని చూస్తారు.. కమ్యూనిజం ఏమిటి అసహ్యంగా.. ఉన్నదొక్కటే.. టూరిజం అనగలరు.. ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా చీల్చినది కాంగ్రెస్‌ కాదా? అన్నదీ ఆయనే! ఇదంతా చాణక్యం అనండి, లేదా చాకచక్యం అని పేరు పెట్టుకోండి… ఎలా పిలిచినా ఇంత గొప్ప విద్య తెలిసిన ఏకైక నాయకుడు భారతదేశంలో…

Read more »

శ్రీలంక సంక్షోభం – ఎవరికి లాభం ?

By |

శ్రీలంక సంక్షోభం – ఎవరికి లాభం ?

అగ్రరాజ్యాలు అప్పనంగా పెడుతున్న పెట్టుబడులకు ప్రపంచంలోని ఎన్నో చిన్న దేశాలు ఆశపడి, చివరకు ఆ పెట్టుబడుల అప్పులను తీర్చలేక చతికిలబడిన ఉదాహరణలు ఎన్నో. అటువంటి తప్పులో ఇప్పటికీ కొన్ని చిన్న దేశాలు కాలేస్తూనే ఉన్నాయి. పైగా చైనా తన రాజ్యకాంక్షలో భాగంగా భారత్‌ చుట్టూ ఉచ్చు బిగించే కుట్రను అమలుచేయడానికి శాయశక్తులా ప్రయత్నించేందుకు అటువంటి చిన్నదేశాలను పెట్టుబడుల పేరుతో వాడుకుంటున్నది. చైనా పెట్టుబడుల కుట్రలో చిక్కుకున్న శ్రీలంక తిరిగి బయటపడినట్లు కనబడినా, అది తాత్కాలికమే అని ఇటీవల…

Read more »

ఆర్యజాతి.. శాస్త్రశోధనల వికృతి

By |

ఆర్యజాతి.. శాస్త్రశోధనల వికృతి

సంస్కృతం ఒక్క అక్షరం తెలియకపోయినా వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, భారతేతిహాసాల గురించి కొందరు దేశవిదేశ చరిత్రకారులు పరిశోధన చేయడం కనిపిస్తుంది. అలాంటివారు వెలువరించిన తీర్పులు రాజ్యమేలుతున్నాయి కూడా. ఊహాజనితమైన ఆర్యద్రావిడ సిద్ధాంతానికి వీరితోనే శక్తి చేకూరింది. ఆ శక్తే భారతభూమిలో ఒక ప్రమాదకర ధోరణికి ఆలంబ నయింది. దక్షిణాది భారతీయులు స్థానికులట. ఉత్తర భారతవాసులు దండయాత్రకు వచ్చిన ఆర్య జాతి వారట. తెల్లగా, ఎత్తుగా, అందంగా ఉండే ఉత్తర భారత ప్రజలంతా ఆర్యులనీ, ఇతర దేశాల…

Read more »

నిరాడంబరత.. నిర్మాణదక్షత…

By |

నిరాడంబరత.. నిర్మాణదక్షత…

ఇది భావురావ్‌ దేవరస్‌ శతజయంతి సంవత్సరం ఒకే కుటుంబం నుంచి వచ్చి ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా దేశానికి సేవ చేసేవారు ఎందరో ఉన్నారు. సంఘ్‌ కుటుంబం అని పిలిపించుకునే కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ తుదిశ్వాస వరకు ఆర్‌ఎస్‌ఎస్‌తోనే గడిపిన అపూర్వ స¬దరులు బాలాసాహెబ్‌ దేవరస్‌, భావురావ్‌ దేవరస్‌. ‘బాల్‌-భావ్‌’ పేరుతో అందరికీ పరిచయమే. ఇందులో అన్నగారు సరసంఘ్‌చాలక్‌ అయ్యారు. కానీ భావురావ్‌ కృషి పూలమాల మధ్య అంతస్సూత్రం వంటిది. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ను ఏర్పరిచినప్పుడు అందులో…

Read more »

కమలదళంలో కన్నడ కస్తూరి

By |

కమలదళంలో కన్నడ కస్తూరి

భారతీయ జనతా పార్టీ, భారతదేశం ఒక ఉత్తమ రాజకీయవేత్తనే కాదు, ఒక మంచి సంఘ సేవకుడిని కోల్పోయాయి. జాతీయ భావాలు కలిగిన, దూరదృష్టి కలిగిన ఒక నాయకుడిని కర్ణాటక కోల్పోయింది. బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి హుబ్బళి నారాయణ అనంతకుమార్‌ ఈ నెల 12న తుదిశ్వాస విడిచారు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అనంతకుమార్‌ (జూలై 22, 1959 – నవంబర్‌ 12, 2018) కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు. వారి కుటుంబమే ఆరెస్సెస్‌, జనసంఘ్‌…

Read more »

సాహితీ విరాణ్మూర్తి

By |

సాహితీ విరాణ్మూర్తి

తెలంగాణ సాహితీవేత్తల్లో కపిలవాయి లింగమూర్తి ప్రముఖులు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాహిత్యంలో తొలి డాక్టరేట్‌ అందుకున్న అరుదైన సాహితీవేత్త. కథ, నవల, నాటకం, కవిత్వం, చరిత్ర, బాల సాహిత్యం, వ్యాఖ్య, సంకలనం, అనువాదం, కావ్య పరిష్కారం… ఒకటేమిటి సమస్త సాహితీ ప్రక్రియల్లో రచనలు చేశారు. ఆయన రాసిన ఒక్కో రచన ఓ ఆణిముత్యంలా ప్రకాశిస్తూ ఉంటుంది. కపిలవాయి మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట తాలూకా జినకుంటలో మార్చి 31, 1928న జన్మించారు. బాల్యం నుంచే గేయాలు, ఛందో…

Read more »

టిప్పు నిప్పు ఆరేదెన్నడు ?

By |

టిప్పు  నిప్పు  ఆరేదెన్నడు ?

మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ జయంత్యుత్సవాలు ఈ సంవత్సరం కూడా రసాభాసగానే ముగిశాయి. కార్యక్రమానికి హాజరు కావలసిన ముఖ్యమంత్రి కుమారస్వామి డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఉపముఖ్యమంత్రి పరమేశ్వర కూడా రావాలి. కానీ ఆయన సింగపూర్‌లో ఉండిపోయారు. ఈ వైఖరికి మాజీ సీఎం సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాలను ఆయన అధికారంలో ఉండగా ఆరంభమైనవే. ఈ ఉత్సవాలను వ్యతిరేకిస్తూ 2015లో వీహెచ్‌పీ ఆందోళన జరిపినప్పుడు అల్లర్లు జరిగి మడికేరి అనేచోట డీఎస్‌ కట్టప్ప…

Read more »

ఈసీ విప్లవాత్మక నిర్ణయాలు..!

By |

ఈసీ విప్లవాత్మక నిర్ణయాలు..!

తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఇటు రాజకీయ పార్టీలకు, అటు ఎన్నికల సంఘానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. అంతేకాదు దేశంలోనే సరికొత్త ప్రయోగాలకు తెలంగాణ రాష్ట్రం వేదిక కానుంది. ఈ మేరకు ఎలక్షన్‌ కమిషన్‌ పలు ప్రతిపాదనలపై విస్తృతంగా సమాలోచనలు చేస్తోంది. దేశంలోనే ప్రప్రథమంగా ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి సాధ్యాసాధ్యాలపై చర్చలు సాగిస్తోంది. ఒకవేళ ఈ వినూత్న ప్రయోగాలు సఫలమైతే భవిష్యత్తులో దేశమంతటా అమలు చేసేందుకు కూడా సంసిద్ధమవుతోంది. సీసీ కెమెరాల ఏర్పాటు!? తెలంగాణలో డిసెంబర్‌…

Read more »

అప్పుడు లేని శ్రద్ధ ఇప్పుడెందుకు ?

By |

అప్పుడు లేని శ్రద్ధ ఇప్పుడెందుకు ?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్యాబినెట్‌ను విస్తరించారు. భారతీయ జనతా పార్టీ నుండి చంద్రబాబు మంత్రి వర్గంలో చేరిన ఇద్దరు మంత్రులు డా||కామినేని శ్రీనివాసులు, మాణిక్యాలరావు రాజీనామాల తరువాత కేబినెట్‌ విస్తరణ ఉంటుందని చెబుతున్న బాబు దానిని ఇప్పుడు పూర్తిచేశారు. ఇంతవరకు శాసన మండలి ఛైర్మన్‌గా ఉన్న ఫరూక్‌ని మంత్రి వర్గంలోకి తీసుకుని కేబినెట్‌ పదవి కట్టబెట్టారు. ఖాళీ అయిన మండలి ఛైర్మన్‌ పదవిని షరీఫ్‌కి కట్టబెట్టి, పార్టీ విప్‌గా చాంద్‌ బాషాను నియమించారు. మరొక మంత్రి పదవి ఇటీవల…

Read more »

కొక్కొరో.. క్కో..

By |

కొక్కొరో.. క్కో..

పొత్తుల పీకులాట…! కొంగరకలాన్‌ సభ తర్వాత ఖంగుతిన్న కేసీఆర్‌ ఏం చేయాలని ఇంట్లో మంతనాలు జరుపుతుంటే చంద్రబాబు రూపంలో ‘దశమ గ్రహ ప్రచారం’ చేయడానికి కాంగ్రెసు వారే పాతకాపును పళ్లెంలో పెట్టి ప్రగతి భవన్‌కు పంపారు. దాంతో కాంగ్రెసు మెల్లమెల్లగా పైచేయి అవుతుందని గమనించిన కేసీఆర్‌కు కాంగ్రెసును మెత్తని బట్టలో వేసి చంద్రబాబుపై బాదడం సులువు అయ్యింది. కాంగ్రెసు వారు ఎప్పుడూ ఇంతే. శత్రుపక్షాలకు ఆయుధాలు నూరి ఇవ్వడమంటే వారికి మహా సరదా! కేసీఆర్‌ ఎన్నో పథకాలు…

Read more »