Posts Tagged “17-23 October 2016”

లలితా సహస్రనామ భాష్యం

By |

లలితా సహస్రనామ భాష్యం

కాస్తంత ఆధ్యాత్మిక స్పృహ ఉన్న వారెవరైనా జీవితంలో ఒక్కసారైనా టచ్‌ చేయకుండా ఉండని అంశం లలితా సహన్రామ సౌరభం. ఈ నామాల్లో ఉన్న గొప్పదనమేమిటంటే కేవలం భాషాపరంగా ఉన్న కొత్త పదాలు అవగతమవడమే కాకుండా నిత్య జీవన శైలికి ఉపయోగపడే లోతైన అర్థాలు ఉండడం. మరి దాన్ని విశ్లేషించి నూతన కోణాలు ఆవిష్కరించే దిశగా లలితా సహస్రనామభాష్యం (శ్రీ వేంకటేశ్వరా భక్తిఛానల్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 9.30కి వస్తున్నది) నడుస్తోంది. అందులోనూ ఈ భాష్యం…

Read more »

పొంచి ఉన్న ప్రమాదం చైనా

By |

పొంచి ఉన్న ప్రమాదం చైనా

చైనా.. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఆసియా దిగ్గజంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నది కూడా. అదే సమయంలో భారత్‌ను కట్టడి చేసే ప్రయత్నం కూడా అంతే వేగంగా చేస్తున్నది. ఒకవంక తన నీటి అవసరాలను తీర్చుకుంటూ, తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదుగుతూ, మరోవంక భారత అభివృద్ధికి వ్యతిరేకంగా భారత్‌ చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తున్నది. నీటి వనరులకై పోరాటం ప్రపంచ జనాభాలో చైనాది 46 శాతం. ఈ 46 శాతం మందికి…

Read more »

విమర్శలకు ఇదా సమయం..?

By |

విమర్శలకు ఇదా సమయం..?

స్వాతంత్య్రానంతర భారతదేశం గురించి విన్ట్సన్‌ చర్చిల్‌ ఆనాడు అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. – ”భారతదేశంలో అధికారం జులాయిలు, పోకిరీలు, దోపిడి దారుల చేతిలోకి వెళ్తుంది. భారతీయ నాయకులుగా తెలివి తక్కువవారు, నాణ్యత లేనివారు ఉంటారు. తీయని మాటలు చెపుతారు. హృదయం తెలివి రహితంగా ఉంటుంది. వారు అధికారం కొరకు తమలో తాము కుమ్ములాడుకుంటారు. రాజకీయ కుమ్ములాటలలో భారతదేశం మళ్ళీ వారి చేజారిపోతుంది”. భారతదేశం పట్ల చర్చిల్‌ వంటి జాత్యహంకారి చేసిన వ్యాఖ్యలు కటువైనవే అయినా దురదృష్టవశాత్తు నిజం…

Read more »

ప్యారిస్ వాతావరణ ఒప్పందానికి భారత్ ఆమోదం

By |

ప్యారిస్ వాతావరణ ఒప్పందానికి భారత్ ఆమోదం

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత్‌ అంతర్జాతీయ అహింస దినోత్సవాన్ని, జాతిపిత మహాత్మాగాంధీ జన్మ దినోత్సవాన్ని ప్యారిస్‌ వాతావరణ మార్పు ఒప్పందాన్ని ఆమోదించడం ద్వారా జరుపుకొంది. భారత్‌ ఈ వాతావరణ ఒప్పందాన్ని ఆమోదించిన 62వ దేశం అయింది. కోజికోడ్‌లో జరిగిన బిజెపి జాతీయ మండలి సమావేశంలో ఈ ఒప్పందంపై అక్టోబర్‌ 2న సంతకం చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ”విధ్వంసం లేకుండా స్థిరమైన అభివద్ధి మార్గాన్ని దేశం అనుసరిస్తున్నది” అని సంకేతం ఇచ్చారు. ప్యారిస్‌ వాతావరణ ఒప్పందం…

Read more »

లక్ష్మీ కటాక్షం

By |

లక్ష్మీ కటాక్షం

శ్రీలక్ష్మీదేవి భక్త సులభురాలు. కోరిన వారిని కటాక్షిస్తుంది. తనను ఆరాధించే వారిలో ఎన్ని దుర్గుణాలున్నా వారిని అనుగ్రహిస్తుంది. అయితే తనను అలక్ష్యం చేసేవారి నుంచి తక్షణం వదిలి వెళ్ళిపోతుంది. శ్రీలక్ష్మీదేవి పుట్టుక గురించి పురాణేతి హాసాల్లో ఒక కథ ఉంది. ఒక పర్యాయం దూర్వాస ముని ఇంద్రుని శపిస్తాడు. రాక్షసులు దండెత్తి ఇంద్రుని స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు. అంతటితో ఇంద్రుని ఐశ్వర్యం నశించింది. దీనితో దేవేంద్రుడు బ్రహ్మదేవుని ముందు మొరపెట్టు కుంటాడు. ”శ్రీమహావిష్ణువు కాక వేరేవ్వరూ నీకు…

Read more »

గోరు చిక్కుడు సాగు

By |

గోరు చిక్కుడు సాగు

మనం సాగు చేసే పంటల్లో చాలా వరకు మన ఆహార అవసరాలకు ప్రధానంగా ఉపయోగ పడుతుంటాయి. మానవ మనుగడకు ఈ ఆహార పంటలు ఎంత ముఖ్యమో, అంతే ప్రాముఖ్యతతో పలు పంటల ఉత్పత్తులు పరిశ్రమల ఉపయోగానికి, ఇతర విలువ ఆధారిత ఉప ఉత్పత్తుల తయారీకి ఉపయుక్తమై వాణిజ్య పంటలుగా కూడా గుర్తింపబడి, రైతుల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడడం ముదావహం. ఆ కోవకు చెందిన పంటే ‘గోరు చిక్కుడు’. చిక్కుడు జాతికి చెందిన ఈ గోరు చిక్కుడు, కూరగాయ…

Read more »

ముస్లిం స్త్రీలకు అన్యాయం

By |

ముస్లిం స్త్రీలకు అన్యాయం

ముస్లిం మతానుయాయులు తమ వ్యక్తిగత విషయమంటూ పౌరస్మృతిని సామాజిక సమానతా సూత్రాలకు, సామాజిక న్యాయానికి, స్త్రీ పురుష సమానతకు, రాజ్యాంగబద్ధతకు వ్యతిరేకంగా వాదిస్తూ, తమ అసహజ ధోరణిని ప్రదర్శిస్తూ వస్తున్నారు. దాని కారణంగా స్త్రీలకు అన్యాయం జరుగుతూ వస్తున్నది. భారతీయ పౌరస్మృతిలో స్త్రీలు సంపాదించుకొన్న స్వేచ్ఛను, సమానాధికారతను చూసి తమకు ఆ స్వేచ్ఛ లేదనే బాధతో కొందరు ముస్లిం మహిళలు మన ప్రధాన న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తమకు న్యాయం చేయమని అభ్యర్థించారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు షబానా…

Read more »

ఇస్రోతో భాగస్వామ్యం దిశగా తెలంగాణా సర్కార్

By |

ఇస్రోతో భాగస్వామ్యం దిశగా తెలంగాణా సర్కార్

అన్ని రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం వినూత్న పాలనకు శ్రీకారం అతిపెద్ద అంకుర కేంద్రంగా టి-హబ్‌ రెండో దశ అంతరిక్ష పరిజ్ఞానంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా పేరొందింది. మరే దేశానికీ తీసిపోని రీతిలో చాలా తక్కువ వ్యయానికి విశేష సేవలను అందిస్తున్నది. అత్యాధునికమైన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం శాస్త్ర పరిశోధనలకు పరిమితం చేయకుండా, ప్రభుత్వ పాలనలో సామాన్య ప్రజలకు మేలు కలిగే విధంగా, వారి జీవన ప్రమాణాలను పెంచే దిశలో ఉపయోగించుకొనే ప్రయత్నాలను పలు రాష్ట్ర ప్రభుత్వాలు…

Read more »

తెలుగు రాష్ట్రాలలో వామపలు ఉన్నాయా..!

By |

తెలుగు రాష్ట్రాలలో వామపలు ఉన్నాయా..!

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయా లలో క్రియాశీల పాత్ర పోషించిన వామపక్ష పార్టీలు, రోజు రోజుకు క్షీణించి పోతూ ఇప్పుడు తమ ఉనికికోసం ప్రాకులాడే పరిస్థితులకు చేరుకున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో 1955లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ముందుగానే తమ మంత్రి వర్గాన్ని ప్రకటించి, ప్రపంచం లోనే ప్రజా స్వామ్య ఎన్నికల ద్వారా తొలి వామపక్ష ప్రభుత్వం ఏర్పాటు చేసుకోబోతున్నామని సంబరపడిన కమ్యూనిస్ట్‌ పార్టీ కలలు కాంగ్రెస్‌, ఇతర పక్షాలు ఉమ్మడిగా ఢీకొనడంతో భగ్నం అయ్యాయి. అప్పటి…

Read more »

ఈ వారం రాష్ట్రాల వార్తలు

By |

ఈ వారం రాష్ట్రాల వార్తలు

నల్లధనం గుట్టు రట్టు నాలుగు నెలలపాటు కొనసాగిన ఆదాయ వెల్లడి పథకం ( ఐడిఎస్‌) కింద కోట్ల రూపాయల విలువైన నల్లధనం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం గడువు సెప్టెంబర్‌ 30తో ముగిసింది. మొత్తం 65,250 కోట్ల రూపాయలు సేకరించినట్టు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. 8,000 కోట్లను హెచ్‌ఎస్‌బిసి జాబితా ద్వారా గుర్తించినట్టు చెప్పారు. పన్ను ఎగవేతదారుల నుంచి 16వేల కోట్ల రూపాయలను ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఆదాయ…

Read more »