Posts Tagged “11-17 March 2019”

విశ్వంలో దిక్కులు లేవు

By |

విశ్వంలో దిక్కులు లేవు

నక్షత్రకాంతులు కోటానుకోట్ల యోజనాల దూరంనుంచి వచ్చి, మనల్ని కలుస్తుంటాయి. అంత దూరంనుంచి వచ్చే ఆ నక్షత్రకాంతులు ఏఏ విచిత్ర ప్రదేశాలు దాటివచ్చాయో, దురూహ్యమైన ఆ శూన్యప్రదేశమంతా ఏమిటో, మన భూమి ఏమిటో, నక్షత్రాలేమిటో అనే విషయాలు, నిశితంగా తెలుసుకునేముందు, విశ్వంయొక్క స్థూలచిత్రం తెలుసుకోవడం అవసరం. అనంత మైన శూన్య ప్రదేశంలో కనుపించే నక్షత్రాలూ, కనుపించని నక్షత్రాలూ పరిభ్రమిస్తున్నాయి. ‘మన భూమి కనుపించని నక్షత్రం. ఎందుచేతనంటే అది ఇతర నక్షత్రాలవలె మండే గోళంకాదు. కొన్ని నక్షత్రాలు కాలక్రమంగా మండిమండి…

Read more »

ప్రపంచాన్ని కుదిపేసిన ఆ పదిహేను రోజులు

By |

ప్రపంచాన్ని కుదిపేసిన  ఆ పదిహేను రోజులు

సరిగ్గా ఒక పక్షం…. పదిహేనురోజులే. అవే నేటి ప్రపంచాన్ని కుదిపాయి. స్వతంత్ర భారతాన్ని తొలిసారి గుండె నిండుగా సంతోషపెట్టాయి. రేపటి మన చరిత్రలోనూ శాశ్వతంగా వెలుగులు విరజిమ్మబోతున్నాయి. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత్‌కీ, ఈ పదిహేను రోజుల తరువాతి భారత్‌కీ నడుమ ఎంతో వ్యత్యాసం. ఇంతకాలంగా దాయాది దేశం పాకిస్తాన్‌తో అనుసరిస్తున్న సహనశీల వైఖరిని అనివార్య పరిస్థితులలో నిర్మొహమాటంగా సడలించింది భారత్‌. కశ్మీరీల హక్కులకు మద్దతు పేరుతో మత ఛాందస వాదాన్ని ఎగదోస్తే సహించబోమనీ, కశ్మీరీల స్వతంత్ర…

Read more »

బెడిసికొట్టిన బెదిరింపు

By |

బెడిసికొట్టిన బెదిరింపు

ఈసారి పాకిస్తాన్‌ పెద్ద తప్పిదానికే పాల్పడింది. ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామాలో నలభయ్‌ మంది భారత సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల ప్రాణాలు బలిగొని కనీవినీ ఎరుగని రీతిలో విమర్శల పాలైంది. మా సహనానికీ హద్దుంటుందని భారత్‌ సరిహద్దులలోని నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ధ్వంసం చేసింది. దీనితో కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న భారత్‌ విదేశాంగ విధానం కొత్త పంథాలోకి మారిపోయింది. పుల్వామా దాడి, తదనంతరం భారత్‌ ప్రతీకార దాడి, దరిమిలా ప్రపంచ దేశాల వైఖరి పాకిస్తాన్‌ను…

Read more »

విపత్కర వాతావరణంలో విషపూరిత బాణాలు..

By |

విపత్కర వాతావరణంలో విషపూరిత బాణాలు..

పుల్వామా దుశ్చర్య, మన దేశ మెరుపు దాడులు ఘటనలను అడ్డం పెట్టుకొని అధికార పార్టీని విమర్శించడం ద్వారా విపక్షాలకు కలిగే రాజకీయ ప్రయోజనం ఏ మేరకు ? అన్నది పక్కన పెదడాం. వీరి విమర్శలు దేశ ప్రయోజనాలకు భంగకరం అన్నది సుస్పష్టం. బాధ్యత కల రాజకీయ, రాజ్యాంగ పదవులలో ఉన్న వీరు ఇటువంటి బాధ్యతారహిత ప్రకటనలు చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు; ముఖ్యంగా పాకిస్తాన్‌కు, వారు పెంచి పోషిస్తున్న ఉగ్రమూకలకు ఎటువంటి సందేశం ఇస్తునట్లు? ఊరంతా ఒకదారి…

Read more »

సిలువ మీద క్రైస్తవం

By |

సిలువ మీద క్రైస్తవం

క్రైస్తవేతరులంతా ‘పాపులు’ అని ప్రకటిస్తూ ఉంటుంది క్రైస్తవం. కేథలిక్‌ చర్చ్‌ అయితే పవిత్రత అన్నమాట పలకడానికి తాను తప్ప ఇతర మతాలలో ఏ ఒక్కటీ కూడా అందుకు అర్హత లేనిదేనని చెప్పుకుంటుంది. కానీ బయటపడిన కొన్ని వాస్తవాల పట్ల కేథలిక్‌ చర్చ్‌ కంగు తిన్నదని అనుకోలేం. ఆ పని గతంలోనే పూర్తయింది. ఆ దశ దాటిపోయి చాలా కాలమే అయింది. తప్పని పరిస్థితులలో ఇప్పుడు అవి నిజాలేనని అంగీకరిస్తోంది కేథలిక్‌ చర్చ్‌. ఆ వాస్తవాలన్నీ ఘోరమైనవి. అమానవీయమైనవి….

Read more »

స్టీఫెన్‌ హాకింగ్‌ – మరణానన్నే వెనక్కు పంపారు

By |

స్టీఫెన్‌ హాకింగ్‌ – మరణానన్నే వెనక్కు పంపారు

జీవితంలో నకారాత్మక స్థితిని (నెగెటివ్‌నెస్‌) భూతద్దంలో నుంచి చూడకుండా పాజిటివ్‌గా ఆలోచించడం; మానవాళికి ఉపయోగపడే విషయాలను, విజ్ఞానాన్ని పంచాలనే బలమైన కోరిక; దిట్టమైన ఆత్మవిశ్వాసాలే హాకింగ్‌ను 76 సంవత్సరాల పాటు జీవించేలా చేశాయి. హాకింగ్‌ తనకు సోకిన వ్యాధితో అవిశ్రాంతంగా పోరాడుతూనే తన పరిశోధనలను కొనసాగించారు. ప్రపంచానికి విలువైన జ్ఞానాన్ని అందించి వెళ్ళారు. ఆధునిక ప్రపంచంలో భౌతిక శాస్త్రవేత్తలుగా ప్రసిద్ధి చెందినవారు ఇద్దరు మాత్రమే. ఒకరు అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, మరొకరు స్టీఫెన్‌ హాకింగ్‌. న్యూటన్‌ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ…

Read more »

బలశాలి భారత్‌

By |

బలశాలి భారత్‌

పాకిస్తాన్‌ సైనికుల చేతికి చిక్కి సురక్షితంగా భారత్‌కు చేరిన మన వింగ్‌ కమాండర్‌ వర్ధమాన్‌ ఉదంతం దరిమిలా సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. పదాలు, వాక్యాలు, భావాలు వేరు వేరుగా ఉన్నా వాటన్నిటి సారం మాత్రం పాకిస్తాన్‌ బుద్ధి మారిందా, భారత్‌ దమ్ము పెరిగిందా అన్న ప్రశ్నల చుట్టూనే తిరగడం గమనార్హం. అత్యంత ఉత్కంఠ భరితంగా గడిచిన ఈ రెండు మూడు రోజుల్లో దేశ ప్రజల స్పందన, కాంగ్రెస్‌, తెదేపాల స్పందనల్లో తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది….

Read more »

నీటి సమస్యను ఎలా అధిగమించాలి – ఇజ్రాయిల్‌ నేర్పుతున్న పాఠాలు

By |

నీటి సమస్యను ఎలా అధిగమించాలి – ఇజ్రాయిల్‌ నేర్పుతున్న పాఠాలు

నీరు దేశ సంపద. వ్యక్తులది కాదు. ఇది భారతదేశం ఇజ్రాయెల్‌ నుంచి నేర్చుకోవలసిన గుణపాఠం. దేశవ్యాప్తంగా ఉన్న నదులలోని నీరు ఏ రాష్ట్రపు సొంత ఆస్తి కాదు. సమగ్ర భారతదేశానికి చెందిన జాతీయ సంపద. అది కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్రాలకు జాతీయ జల అనుసంధాన, జలాశయ నిర్మాణ ప్రక్రియల ద్వారా సరఫరా జరగాలి. అలా జరిగితే ప్రస్తుతం నీటి కోసం రాష్ట్రాల మధ్య నలుగుతున్న పోరాటాలకు తావుండదు. పైగా లాభార్జన జరుగుతుంది. మనం నివసిస్తున్న…

Read more »

ప్రదక్షిణం

By |

ప్రదక్షిణం

పుల్వామా సంఘటనకి ప్రపంచం నిర్ఘాంత పోయింది. దేశం ఆవేశంతో ఉడికిపోయింది. ఉద్రేకంతో ఎదురుదెబ్బ తీయాలని పిడికిలి బిగించింది. హింసాకాండలో కన్నుమూసిన 40 మంది వీరుల అంత్యక్రియలను చూసి 24 గంటలలో కోట్లాదిమంది కన్నీరు కార్చారు. ఆవేశం కార్యసాధకుడి ఆయుధం కాదు. ప్రతీకారం పళ్లు కొరకదు. ఒకే ఒకమాట.. అదే మొదటి మాట.. మోదీగారన్నారు ‘ప్రాణాలర్పించిన వీరుల త్యాగం ఊరికే పోదు’ అని. ఈ వాక్యాన్ని ఒక చానల్‌ పదేపదే ప్రకటించింది. ఏం చేస్తారు? ఏం చెయ్యాలి? ఎలా…

Read more »

చారిత్రక వైభవం.. ఆధ్యాత్మిక వైభోగం…

By |

చారిత్రక వైభవం.. ఆధ్యాత్మిక వైభోగం…

వాడుకలో అందరూ పిలుచుకునే యాదగిరి గుట్ట తెలంగాణ తిరుమల మాదిరిగా రూపుదిద్దు కుంటోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రిక అయిన యాదాద్రి ఇల వైకుంఠం రీతిలో హంగులు అద్దుకుంటోంది. ఇంతకు ముందు కలలో కూడా ఎవరూ ఊహించని రీతిలో యాదాద్రి అలరారబోతోంది. అతికొద్ది రోజుల్లోనే తెలంగాణ జనం కళ్లముందు సాక్షాత్క రించబోతోంది. తెలుగునాట వెలసిన నృసింహా లయాల్లో విశిష్టమైన ఈ పంచ నారసింహ క్షేత్రం యావత్‌ భారతావనిని ఆకర్షించేలా తుది మెరుగులు దిద్దుకోబోతుంది. కొండను పిండి…

Read more »