Posts Tagged “11-17 February 2019”

రైతుకు పట్టం

By |

రైతుకు పట్టం

మనది గ్రామీణ భారతం. ఇది రైతన్నల భారతం. 70 శాతం మంది వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న ప్రజల నేల ఇది. అందుకే గ్రామాలు స్వయంసమృద్ధి చెందాలని, అప్పుడే మన దేశం మళ్లీ రామరాజ్యాన్ని తలపించగలదని జాతిపిత మహాత్మా గాంధీ ఎన్నోసార్లు చెప్పారు. అది ఆయన కల. కాని ఆయన పేరు పెట్టుకున్న కాంగ్రెస్‌ నాయకులు, ప్రధానమంత్రులు, వారి ప్రభుత్వాలు ఆ దిశగా ఏవో మొక్కుబడి ప్రయత్నాలు చేశాయే తప్ప కర్షకుడికి నిజమైన భరోసానిచ్చే విధానాలను ఎప్పుడూ రూపొందించలేదు….

Read more »

‘మదర్సాలతో ముప్పు!’

By |

‘మదర్సాలతో ముప్పు!’

మదర్సాలంటే ఇస్లాం మత వ్యవస్థలో పాఠశాలలు. అక్కడ ప్రధానంగా మత బోధ జరుగు తుందన్నది ఓ బహిరంగ రహస్యం. మత గురువులను, పురోహితులను అవి తయారుచేస్తాయి. ఇటీవలి కాలంలో ఈ విషయాన్ని అంగీకరించడానికి చాలామంది ముస్లింలు వెనుకాడడం లేదు కూడా. కానీ మదర్సాలు ఇలాంటి బోధనలకే కట్టుబడి ఉన్నాయా? లేదు. భారతదేశంలోని మదర్సాల మీద రాను రాను పెరుగుతున్న ఆరోపణలు కలవర పరిచేవిగా కూడా ఉన్నాయి. ఆ విద్యాలయాలు తీవ్ర ఆరోపణలతో అపకీర్తిని మూట కట్టుకుంటున్నాయి. ఏ…

Read more »

ఎందుకీ రగడ ?

By |

ఎందుకీ రగడ ?

ఫిబ్రవరి 3 ఆదివారం రాత్రి హఠాత్తుగా ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రినన్న వాస్తవం మరిచిపోయారు. 8వ తేదీవరకు నిరసన శిబిరం నుంచే పాలన సాగుతుందని హుంకరించారు. కానీ 5వ తేదీ చీకట్లు పడుతుండగానే మళ్లీ అంతే హఠాత్తగా దీక్ష ముగిసిందని మూటా ముల్లే సర్దేశారు. ఇదంతా ఎందుకు? ఎవరి కోసం? పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత నిర్వాకమిది. ప్రహసనాన్ని మించినది. ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి మొదలైన ఆ ‘సంక్షోభ సూచన’ క్రమాన్ని గమనిస్తే ప్రజాస్వామ్యం పట్ల కనీస…

Read more »

ఆ వ్యతిరేకత ఎవరిమీద?

By |

ఆ వ్యతిరేకత ఎవరిమీద?

నడుస్తున్న చరిత్ర దేశానికీ, జాతికీ స్ఫూర్తిదాయకంగా, ప్రేరణగా ఉండాలి. అప్పుడే యావత్‌ జాతి ముఖ్యంగా యువత, విద్యార్థులు దేశ భవిష్యత్తుకు పునాదులుగా ఉండగలరు. కానీ ప్రపంచంలో అన్ని రంగాల్లో ముందడుగు అగ్రరాజ్యాలకు దీటుగా సాగుతున్న భారత్‌ ప్రస్తుతం కొన్ని అవాంఛనీయ పరిస్థితులలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. ఆ పరిస్థితులు చాలా కోణాల నుంచి ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులను విధ్వంసకర ఆలోచనల వైపు మళ్లించడం అందులో ప్రధానమైనది. ఈ వ్యతిరేకత ఎవరి మీద? ఎందుకు? ఇది నిజంగానే రాజకీయమా? భావ…

Read more »

దివాకర నమస్తుభ్యం.. ప్రభాకర నమోస్తుతే

By |

దివాకర నమస్తుభ్యం.. ప్రభాకర నమోస్తుతే

యశోధర్ముడనే రాజుకి వార్ధక్యంలో రోగగ్రస్తుడైన కుమారుడు జన్మించాడు. కుమారుని రోగానికి కారణమేమిటని రాజు పండితులని అడిగాడట. ‘నీ కుమారుడు గత జన్మలో మహా ధనికుడు, పరమ లోభియైన వర్తకుడు. ఏనాడూ ఓ చిల్లిగవ్వను కూడా దానం చెయ్యలేదు గానీ,  అతను అదృష్టవశాన రథ సప్తమి వ్రతం చూశాడు. దాని పుణ్యఫలంగానే ఈ జన్మలో నీ కుమారుడిగా జన్మించే అదృష్టం వరించింది, ఇతనితో రథసప్తమి వ్రతం చేయించండి’ అని పండితులు చెప్పారట. ఉత్తరాయణంలో వసంతపంచమి తర్వాత రెండు రోజుల్లో…

Read more »

మాల్యా ఆటకట్టు

By |

మాల్యా ఆటకట్టు

ఇంకా కొంత సమయం పడితే పట్టవచ్చు. కానీ విజయ్‌ విఠల్‌ మాల్యా అనే పెద్ద ‘ఆర్థిక నేరగాడు’ త్వరలో భారతదేశానికి రావడం ఖాయమని నాలుగో తేదీ తేలిపోయింది. ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌కు సమీపంలో తన ఎస్టేట్‌లో దర్జాగా గడుపుతున్న ఈ మద్యం వ్యాపార దిగ్గజం ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని ఇంగ్లండ్‌ కోర్టులు కూడా విశ్వసించక తప్పలేదు. కానీ చివరిసారిగా ఇంగ్లండ్‌ కోర్టులో వాదన వినిపించుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ తతంగం అంతా పూర్తయ్యి,…

Read more »

శబరిమల ఆందోళనకు మద్దతిద్దాం

By |

శబరిమల ఆందోళనకు మద్దతిద్దాం

శబరిమలలో హిందూ సమాజం మనోవేదనకు గురవుతోందని, అందుకు అక్కడి వామపక్ష ప్రభుత్వమే కారణం అని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్‌సంఘచాలక్‌ డా.మోహన్‌ భాగవత్‌ ఆందోళన వ్యక్తపరిచారు. అక్కడి హిందువులు చేస్తున్న ఆందోళన మిగతా హిందూ సమాజం మొత్తానికి సంబంధించినది అని, వారికి మనందరం మద్ద తివ్వాలి అని ఆయన అన్నారు. ఫిబ్రవరి 1,2 తేదీ లలో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ధర్మసమ్మేళనం (ధర్మ సంసద్‌) లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని…

Read more »

సంచార ఉపగ్రహాలు

By |

సంచార ఉపగ్రహాలు

నేడు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక ప్రసారాల యుగం నడుస్తున్నది. సాంకేతికతను మన జీవితంలో భాగం చేసుకున్నాము. ఈ సాంకేతిక ప్రసారాల వ్యవస్థకు మూలం మానవుడు తయారుచేసిన కృత్రిమ ఉపగ్రహాలు. వాటి గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం. గత 50 సంవత్సరాలలో జరిగిన సాంకేతిక విప్లవాలలో గణనీయమైనది పలు ప్రయోజనాలకై అంతరిక్షంలోని పంపబడుతున్న కృత్రిమ భూ ఉపగ్రహాలు (శాటిలైట్స్‌). మన నక్షత్రం సూర్యుడు. సూర్యుని చుట్టూ తిరిగే 9 గ్రహాలలో భూమి మూడవది. భూమికి ఉపగ్రహం చంద్రుడు. భూమి నుండి…

Read more »

పార్లమెంట్‌లో ‘డైనమైట్‌’

By |

పార్లమెంట్‌లో ‘డైనమైట్‌’

ఇరవై ఒక్క మాసాలు దేశాన్ని అంధకారంలో మగ్గేటట్టు చేసిన ఆంతరంగిక అత్యవసర పరిస్థితి 1977 జనవరిలో తొలగిపోయింది. లోక్‌సభకు ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెసేతర పక్షాల కలయికతో జనతా పార్టీ అవిర్భవించింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఆయనను బరిలోకి దించారు. ఆ ఎన్నికలు స్వతంత్ర భారత చరిత్రలోనే కీలకమైనవి. ఊహించినట్టే వాటి ఫలితాలు భారత రాజకీయాలకి కొత్త దిశను నిర్దేశించాయి. కానీ, ముజఫర్‌పూర్‌ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి జాడ లేదు. ఒక…

Read more »

నిరంతర ప్రేరణ పిళ్లా రామారావు

By |

నిరంతర ప్రేరణ పిళ్లా రామారావు

ఆయన వయసు అప్పటికి 92 ఏళ్లు. సంఘ్‌ కార్యక్రమాలలో నిక్కరు బదులు ప్యాంట్‌ ధరించే పద్ధతి ప్రవేశించింది. ఆ వేషధారణతోనే ఆయన శాఖా కార్యక్రమానికి హాజరయ్యారు. పైగా జీవితంలో మొదటిసారిగా ప్యాంటు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనే విశాఖ ప్రముఖులు, తెలుగు ప్రాంతంలో ఆరంభం నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ కోసం అవిరళరగా శ్రమించిన పిళ్లా రామారావు. ఒక నిబద్ధతతో, కర్తవ్య నిష్టతో ఆర్‌ఎస్‌ఎస్‌ వెంట నడిచిన రామారావుగారు (95) ఫిబ్రవరి 3, 2019న విశాఖపట్నంలో వారి స్వగృహంలో తుదిశ్వాస…

Read more »