Posts Tagged “10-16 June 2019”

భారత్‌ చిరునామా

By |

భారత్‌ చిరునామా

భుజ్‌ భూకంప బాధితుల సహాయక చర్యల కోసం ఆయన గుజరాత్‌ వెళ్లారు. ఆపై గుజరాత్‌, భారత రాజకీయాలలో ఆయనే ఒక భూకంపం సృష్టించారు. ఆయన పేరే నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ. చరిత్రాత్మక విజయంతో రెండోసారి ప్రధాని పదవి చేపట్టిన బీజేపీ నేత. కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్‌ నుంచి బంగాళం వరకు ఒకే రాజకీయ నేతను ఆరాధించిన సందర్భాలు మన చరిత్రలో చాలా అరుదు. మరొక మాటలో చెప్పాలంటే భారతావని మొత్తం ఒకే నేత వెంట…

Read more »

వంగభూమిలో భంగపడ్డ దీదీ!

By |

వంగభూమిలో భంగపడ్డ దీదీ!

వంగభూమిలో కమలం అనూహ్యంగా వికసించింది. పశ్చిమ బెంగాల్‌లో తనకు ఎదురే లేదు అన్నట్లు ప్రధాని మోదీతో పాటు బీజేపీతో కయ్యానికి దిగిన మమతా బెనర్జీ ఘోరంగా భంగపడ్డారు. కేంద్రంతో అనుసరించిన ఘర్షణ వైఖరికి తగిన మూల్యమే చెల్లించుకున్నారు. మమత దీదీ అహంకారాన్ని దెబ్బ తీస్తూ బెంగాల్‌ ఓటర్లు బీజేపీకి ఏకంగా 18 సీట్లు కట్టబెట్టారు. టీఎంసీకి 12 సీట్లు కోత పెట్టారు. మమత అనుసరించిన మైనారిటీ సంతుష్టీకరణ, హిందూ వ్యతిరేక రాజకీయాలను లోక్‌సభ ఎన్నికల ఫలితాల రూపంలో…

Read more »

మోదీ వెంట నడిచిన మైనారిటీలు

By |

మోదీ వెంట నడిచిన మైనారిటీలు

భారతీయ మేధావులది ఒక వింత మన్తత్వం. మార్పు అనేది ఉంటుందంటే వీరు నమ్మలేరు. అందులో సెక్యులర్‌ ముసుగులో అవాంఛనీయ శక్తుల కోసం పనిచేసే హిందువుల మనస్తత్వం మరీ వికృతం. ముస్లింలు తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారంటే వీరు కొద్డిగా అంగీకరించలేరు. ఆ సంగతి ఆలోచించేందుకు కూడా అంగీకరించరు. ముస్లింలు భారతీయ జీవన స్రవంతిలోనే తాము ఉన్నట్టు ప్రకటించుకోవడానికే మొగ్గు చూపుతున్నారని ఎవరైనా అంటే, వెంటనే వారి నోరు నొక్కేస్తారు. బీజేపీకీ, ముస్లింలకూ మధ్య ఒక శాశ్వత శత్రుత్వం ఉండాలని…

Read more »

నరేంద్ర మోదీ కొత్త కొలువు

By |

నరేంద్ర మోదీ కొత్త కొలువు

భారతదేశం పటం తీసుకుని నరేంద్ర మోదీ కొత్త మంత్రివర్గ సభ్యుల నియోజక వర్గాలను భౌగోళికంగా గుర్తిస్తే ఒక అద్భుతం కళ్లకు కడుతుంది. ఆ సేతుశీతాచల పర్యంతం ఆ నియోజకవర్గాలు విస్తరించి ఉంటాయి. అది మోదీ మంత్రివర్గ కూర్పులోని నేర్పు. అంతేకాదు, ఇదే మరొక తిరుగులేని వాస్తవాన్ని కూడా వెల్లడిస్తుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, బంగాళం నుంచి గుజరాత్‌ వరకు తన ఉనికిని తిరుగులేకుండా చాటుకుంటున్నది. ఇప్పుడు భారతావని అంతటా రెపరెపలాడుతున్నది…

Read more »

స్వాభిమానానికి పట్టాభిషేకం

By |

స్వాభిమానానికి పట్టాభిషేకం

జూన్‌ 15 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, హిందూ సామ్రాజ్య దినోత్సవం సమీపగతం నుంచి భారతీయులు ఇప్పటికీ ఒక సమర గీతిక వింటూనే ఉంటారు. విని ఉప్పొంగిపోతారు. హిందూ సామ్రాజ్య దినోత్సవాన్నీ, ఆ ఉత్సవం వెనుక ఉన్న మహోన్నత కృషినీ, ఆశయాన్నీ, నాటి చారిత్రక పరిస్థితులనీ మన కళ్లకు కట్టే గీతమది. ఆ గీతికలో కథానాయకుడే ఛత్రపతి శివాజీ మహరాజ్‌. శివాజీ పట్టాభిషేక మ¬త్సవం జరిగిన తేదీనే (జూన్‌ 6,1674 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి) ఇప్పటికీ మనం హిందూ…

Read more »

అందమైనది బాల్యం.. వీరికేమో బలిపీఠం

By |

అందమైనది బాల్యం.. వీరికేమో బలిపీఠం

జూన్‌ 12 ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం బాల్యం.. జీవితంలో అదో అపూర్వ ఘట్టం. జీవిత చరమాంకం దాకా తీపి గురుతులను మరిచిపోలేని మధుర జ్ఞాపకం. పొత్తిళ్ల నుంచి మొదలుకొని తనంతట తానుగా అడుగులు వేస్తూ నడవడం.. ఆ తర్వాత యుక్తవయస్సు వచ్చేదాకా.. అమ్మ కొంగుచాటున, నాన్న వేలు పట్టుకొని ఎదగడం.. అందుకే ఆ కాలం ఎంతో మధురం. పూర్తిగా ఎదుటివాళ్లమీదనే ఆధారపడి కష్ట నష్టాలు తెలియకుండా, బాధ్యతలు లేకుండా హాయిగా గడిచిపోయే వయసు బాల్యం….

Read more »

తెలుగు తేజం విశ్వవ్యాప్తర కావాలి !

By |

తెలుగు తేజం విశ్వవ్యాప్తర కావాలి !

‘తాడు యిరిగింది భాయ్‌, కర్ర తెగింది భయ్యా’ అని ఉర్దూ ఇంటి భాషగా కలిగిన ముస్లిము పిల్లలు అన్నప్పుడు తెలుగు పిల్లలు ముసిముసిగా నవ్వుకోవడం తెలుగునాట పల్లెల్లో చాలామంది తెలుగు పిల్లలకు అనుభవమే. ఆ తెలుగు పిల్లలే పెరిగి పెద్దయ్యాక ఉద్యోగ రీత్యా భాగ్యనగరానికి వచ్చి ఉంటూ నూతనంగా పరిచయమైన ముస్లిమ్‌ మిత్రులతో ‘భూక్‌లగ్తాహై భాయ్‌’ అన్నప్పుడు ముస్లిము మిత్రులు ముసిముసిగా నవ్వుకోవడం కూడా పరిపాటే. భావము, భాష సరయినవే అయినా నవ్వులు పూయించిన వ్యాకరణదోషం రెండు…

Read more »

నూతన మంత్రులు వీరే..

By |

నూతన మంత్రులు వీరే..

నరేంద్రమోదీ (ప్రధానమంత్రి) : ప్రజావినతులు, ఫించన్ల శాఖ, ఆటామిక్‌ ఎనర్జీ, స్పేస్‌ విభాగాలు, మంత్రులెవరికీ కేటాయించని ఇతర శాఖలు. రాజ్‌నాథ్‌సింగ్‌ : రక్షణశాఖ నిర్మలా సీతారామన్‌ : ఆర్థికశాఖ అమిత్‌ షా : హోం శాఖ సుబ్రమణ్యం జైశంకర్‌ : విదేశాంగశాఖ సదానందగౌడ : రసాయన, ఎరువుల శాఖ రామ్‌విలాస్‌ పాసవాన్‌ : వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు నితిన్‌ గడ్కరీ : రోడ్డు రవాణా, చిన్నమధ్యతరహా పరిశ్రమలు నరేంద్రసింగ్‌ తోమర్‌ : వ్యవసాయం, రైతుల సంక్షేం,…

Read more »

ప్రజాస్వామ్య స్ఫూర్తికి గీటురాయి

By |

ప్రజాస్వామ్య స్ఫూర్తికి గీటురాయి

గాంధీజీ జీవితాన్ని చూస్తే అలాంటి వ్యక్తి ఈ భూమ్మీద నడయాడాడా అనిపిస్తుంది అన్నారు అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌. నరేంద్రమోదీ మంత్రి వర్గంలో సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతాప్‌ చంద్ర సారంగిని చూసినా ఇదే అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు అసలు ఎంపీ కాగలడా? ఎంపి అయినా కేంద్రంలో మంత్రికాగలరా? అని! కానీ ఇది నిజం! సారంగికి ఒక పూరిల్లు మాత్రం ఉంది. ఆయన వాహనం సైకిల్‌. రెండు పర్యాయాలు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ నిరాడంబర జీవితం…

Read more »

లెంపలేసుకున్న ‘టైమ్‌’

By |

లెంపలేసుకున్న ‘టైమ్‌’

మీడియా, మరీ ముఖ్యంగా విదేశీ మీడియా భారత ప్రధాని, బీజేపీ ప్రముఖుడు నరేంద్రమోదీ పట్ల ఎలాంటి పక్షపాత వైఖరి, తొందరపాటు ధోరణి, దుందుడుకు వైఖరి అవలంబిస్తున్నదో మరోసారి రుజువైంది. భారతీయ మీడియాలో ఒక వర్గాన్ని మించి ఆ మీడియా వ్యవహరించడమే దారుణం. న్యూయార్క్‌ కేంద్రంగా వెలువడే ‘టైమ్‌’ వారపత్రికకు అంతర్జాతీయంగా పరువు మర్యాదలు ఉన్నాయి. ఆ పత్రిక కూడా దిగజారుడుగా వ్యవహరించింది. టైమ్‌ వ్యవహారం దిగజారుడుతనమేననడానికి ఆ పత్రికే తనకు తానే రుజువులు ఇచ్చింది. మోదీ భారత…

Read more »