Posts Tagged “08-14 July 2019”

అవినీతి భక్షిస్తుంది

By |

అవినీతి భక్షిస్తుంది

అవినీతికి పాల్పడటం, అలా లభించిన హోదా, అధికారాన్ని అనుభవించడం మొదట్లో చిన్నపిల్లవాడు పంచదార తిన్నంత హాయిగా ఉంటుంది. తరువాత ఆ అవినీతికి అలవాటు పడి, మానుకోలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ అవినీతే భస్మాసుర హస్తంగా మారుతుంది. ప్రజాగ్రహమై కబళిస్తుంది. ఇక అప్పుడు ఎవరైనా, ఎంతటి నాయకుడైనా ఆ ఆగ్రహానికి గురయి, భస్మం కాక తప్పదు. చరిత్ర అనే మట్టితో కలిసి కొట్టుకుపోక తప్పదు. ప్రస్తుతం బెంగాల్‌లో నడుస్తున్న కట్‌మనీ వ్యవహారం మమత పట్ల భస్మాసుర హస్తమే…

Read more »

పైకి పెద్దతనం.. చేసేది కర్రపెత్తనం

By |

పైకి పెద్దతనం.. చేసేది కర్రపెత్తనం

తన కొంపను పట్టించుకోని పెద్ద మనిషి ఊర్లో వారికి సుద్దులు చెప్పడానికి వచ్చాడట.. ఇలాంటి వారు మనకు సమాజంలో కనిపిస్తూనే ఉంటారు. ఇతరుల ఇళ్లలో ఏం జరుగుతుందోననేది తెలుసుకోవ డానికి చూపించే ఆసక్తిని తమ ఇంటిని తీర్చి దిద్దుకుందాం అనే విషయంలో మాత్రం చూపించరు వీరు. సరిగ్గా అమెరికా తీరు కూడా ఇలాగే ఉంది. తన దేశంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న జాత్యంహకారం, గన్‌కల్చర్‌, హత్యలు, లైంగిక దోపిడీల గురించి మాట్లాడదు అమెరికా. కానీ ఇతర దేశాల్లో…

Read more »

మాటతప్పితే ఇబ్బందులూ తప్పవు

By |

మాటతప్పితే ఇబ్బందులూ తప్పవు

గత ఐదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించింది. దీనితోపాటు దేశ భద్రత విషయంలో రాజీలేని పోరాటం చేసింది. ఫలితంగా ప్రజలు మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమిని రెండోసారి భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ అద్భుత విజయం తర్వాత ప్రపంచ దేశాలన్ని మోదీని అభినందించాయి. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపాడు. ఇరుదేశాల మధ్య చర్చలు పునరుద్ధరించడానికి ఇమ్రాన్‌ మోదీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఇమ్రాన్‌ఖాన్‌ ఆహ్వానాన్ని మోదీ మన్నిస్తారని…

Read more »

వ్యాసాయ… విష్ణురూపాయ

By |

వ్యాసాయ… విష్ణురూపాయ

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌ || వశిష్ఠ మహర్షికి ముని మనుమడు, శక్తికి మనుమడు, పరాశరునకు పుత్రుడు, శుక మహర్షికి తండ్రియైన తపోనిధుడు, కల్మష రహితుడైన వ్యాసునకు నమస్కారం అని ప్రతి భారతీయుడు ప్రతినిత్యం నమస్కరించవలసిన వ్యక్తి వేదవ్యాసుడు. కనీసం సంవత్సరంలో ఒక్కరోజైనా ఆ మహర్షిని స్మరించి ఋణం తీర్చుకోవాలి. అటువంటి రోజే ఆషాఢ పూర్ణిమ లేక గురుపూర్ణిమ. వ్యాస పూర్ణిమగా లోక ప్రసిద్ధి. ఆషాఢ పూర్ణిమనాడు వ్యాసుల…

Read more »

బోనాలెత్తితిమమ్మా.. దయచూడగ రావమ్మా..

By |

బోనాలెత్తితిమమ్మా.. దయచూడగ రావమ్మా..

”యాదేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా! నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!” సర్వ ప్రాణుల్లోనూ మాతృరూపంగా ఉన్న ఆ జగన్మాతకు నమస్కారములు అని చెప్పడమే ఈ శ్లోక భావం. సకల ప్రాణులకూ తల్లే మూలం అని దీని పరమార్థం. మాతృశబ్దం ఎంత గొప్పదో అంత బాధ్యతాయుతమైనది. బిడ్డలకు జన్మనివ్వడమే కాదు, వారిని తల్లి పెంచి పోషిస్తుంది. అందుకే సకల చరాచర సృష్టిలో జీవులన్నీ తల్లినే ఆశ్రయిస్తాయి. సర్వలోకాలకు తల్లి ఆ జగజ్జనని. ఆదిపరాశక్తి కాబట్టే…

Read more »

శ్రీనగర్‌లో అమిత్‌షా వ్యూహాత్మక అడుగులు

By |

శ్రీనగర్‌లో అమిత్‌షా వ్యూహాత్మక అడుగులు

మానవ దేహారోగ్యాన్ని తరుణ వ్యాధులు, దీర్ఘ వ్యాధులు చికాకు పంచినట్లే తాత్కాలిక, దీర్ఘకాలిక సమస్యలు దేశ ప్రగతిని కుంటుపరుస్తాయి. చిట్కా వైద్యంతో దీర్ఘ వ్యాధులను నివారించాలని చూసినప్పుడు దేహంలో కీడు సంభవించినట్లే దీర్ఘకాల సమస్యలను అడ్డదారుల్లో పరిష్కరించాలని ప్రయత్నించినప్పుడు దేశంలో విపరీత పరిణామాలు సంభవిస్తాయి. హైదరాబాద్‌ తదితర సంస్థానాల విలీనం విషయంలో నాటి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వ్యాధి మూలాలకు చికిత్స చేసినట్లు సామ, దాన, భేద దండోపాయాలను ప్రయోగించి నేరుగా సంస్ధానాధిపతులను ఒప్పించి నిర్వివాద…

Read more »

తొలి పర్వదినం

By |

తొలి పర్వదినం

సనాతన భారతీయ సంప్రదాయంలో ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంది. వాటి ఆచరణ వెనుక ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య రహస్యం కూడా తప్పకుండా ఉంటుంది. మన పండుగలన్నీ తిథుల ప్రకారమే ఉంటాయి. ప్రతి తిథిలో ఏదో ఒక పండుగ ఉంటుంది. అలాగే మనం కూడా ఏ పనిచేసినా తిథుల ప్రకారమే చేస్తాం. అదేవిధంగా ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి హిందువులకు పర్వదినం. దీనికి ఎంతో విశిష్టత ఉంది. మన పంచాంగం ప్రకారం నెలకు రెండు…

Read more »

రాకెట్ల నుండి రక్షణకై గగనతలంలో ఉక్కు కవచం

By |

రాకెట్ల నుండి రక్షణకై  గగనతలంలో ఉక్కు కవచం

అనతికాలంలోనే అమెరికన్‌ సేనలు ఆఫ్ఘనిస్తాన్‌ నుండి తిరోగమిస్తాయి. తాలిబాన్‌ ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వంలో భాగస్వామి కాబోతోంది. జిహాద్‌ చేస్తున్న తాలిబాన్‌ ఆత్మాహుతి దళాలు తమ యుద్ధ శక్తిని మరోదేశంలో చూపిస్తాయి. ఆ మూకలు పాకిస్తాన్‌ సహాయ సహకారంతో కాశ్మీర్‌పై విరుచుకుపడతాయి. ఇంతవరకూ పాకిస్తాన్‌ ప్రేరిత ఉగ్రవాదులు భౌతికంగా కాశ్మీర్‌లో చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇకముందు, పూర్వంలాకాక పాకిస్తాన్‌ ఆక్రమిత, విస్ఫోటకాలను పంపి, ధన, ప్రాణ నష్టం కలిగించబోతున్నారు. క్షిపణి వాహక విస్ఫోటకాల నుండి మన ఆవాసాలనూ, సైనిక తదితర…

Read more »

సుధాకర్‌ పైప్స్‌ అధినేత కన్నుమూత

By |

సుధాకర్‌ పైప్స్‌ అధినేత కన్నుమూత

ప్రముఖ పారిశ్రామికవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, సుధాకర్‌ పీవీసీ పైప్స్‌ అధినేత, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మీలా సత్యనారాయణ (89) అనారోగ్యంతో కన్నుమూశారు. వద్ధాప్యం వల్ల ఉత్పన్నమైన అనారోగ్య సమస్యలతో పక్షం రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్‌ 25న తుదిశ్వాస విడిచారు. నిరుపేద కుటుంబంలో జన్మించి శ్రమనే నమ్మి నిరంతరం పరిశ్రమించి పారిశ్రామికవేత్తగా ఎదిగారు మీలా సత్యనారాయణ. స్వాతంత్య్రం అనంతరం రెండు పర్యాయాలు మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేసి వేతనంతోపాటు ఎలాంటి సదుపాయాలను వినియోగించుకోకుండా…

Read more »

సమాచారం – ప్రసారం

By |

సమాచారం – ప్రసారం

పూర్వం కాశీయాత్రకు వెళ్లినవాడు కాటికి వెళ్లినవాడితో సమానం అనేవారు. అలాగే మక్కా యాత్రకు వెళ్లినవాడు తిరిగి వచ్చిన దాఖలాల్లేనట్లే చెప్పుకుంటారు. మనిషి తన తెలివితేటల ద్వారా నేటి సమాచార సాధనాలను సృష్టించాడు. మరి ప్రకృతిలో ఈ సమాచార ప్రసారం ఎలా జరుగుతుంది? కొంచెం ఉత్సాహాన్ని కలుగజేసే ప్రశ్న ఇది. మీరు చిన్నప్పుడు పంచతంత్ర కథలను వినే ఉంటారు. వినే ఉంటారు అని ఎందుకంటున్నానంటే కథలు వినటానికి బాగుంటాయి చదవటం కన్నా. వాటిలో ఒకటి చీమ, పావురం, వేటగాళ్ల…

Read more »