Posts Tagged “07-13 Junary 2019”

వారేమనుకుంటున్నారు!?

By |

వారేమనుకుంటున్నారు!?

కశ్మీర్‌ లోయలో యువత ఏమనుకుంటోంది? వారి మనోభావా లేమిటి? ఆర్టికల్‌ 370, కశ్మీరియత్‌, వేర్పాటువాదం, ఉగ్రవాదం, ఇస్లామిక్‌ ఉన్మాదం వంటి అంశాలపై కశ్మీరీ జనమానసం ఏమంటోంది? తమాషా ఏమిటంటే గుప్పెడు మంది హురియత్‌ నేతలు, వేర్పాటును నమ్ముకున్న రెండు ప్రాంతీయ పార్టీలు, ఏకే 47 భుజాన మోసే ఉగ్రవాదులు, మైకులు పెట్టి మోతలు మోగించే కొందరు మీడియా వీరులు కశ్మీర్‌ గురించి మాట్లాడే గొంతుకలై పోయారు. కానీ సగటు కశ్మీరీ గుండె గొంతుక ఏమంటోంది? కశ్మీర్‌ జన…

Read more »

జీవనస్రవంతి-35

By |

జీవనస్రవంతి-35

: జరిగిన కథ : భయపడుతున్న శిరీషకు స్రవంతి ఫోన్‌ చేసి పేపర్లో వార్తలు నిజాలు అనుకోవద్దు అని చెప్పి, అరగంటకు ముందే ఆమె వద్దకు చేరింది. శిరీష చూపించిన దుర్వార్త చూసి స్రవంతి బాధపడింది. శిరీష తనకూ ఆ కష్టం వస్తుందేమో అని భయపడింది. తాను నానీని ప్రేమిస్తుంటే, ప్రదీప్‌ తన వెంట పడుతున్నాడని, తనకు దక్కని సిరి మరెవ్వరికీ దక్కనీను అన్నాడని చెప్పింది. ఇద్దరూ ఈ విషయాన్ని జీవన్‌కి చెబుతామని నిర్ణయిం చారు. జీవన్‌…

Read more »

దారి ఎటు?

By |

దారి ఎటు?

వీధి లైట్ల వెలుగు మిరుమిట్లు గొలిపే కొండచిలువలా వెన్నెలను మింగేస్తున్న క్షణం. సావధానంగా నడిచి నడిచి సిమెంట్‌ బెంచీ మీద కూచున్నాను. పూర్ణ చంద్రుడు సరిగ్గా నడి నెత్తిన ఉన్నాడు. అసలు ఎన్నాళ్లైందో ఇలా సావకాశంగా రెండడుగులు నడిచి. కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలితో కనురెప్పలపై సుతారంగా వత్తుకున్నాను. ఎందుకో ఉన్నట్టుండి మనసులో దుఃఖం పొంగి వచ్చింది. ఈ నిశ్శబ్దపు నడి రాత్రి నగరం రోడ్ల మీద నదిలా పారుతున్న వెలుగు వెల్లువలో దిగులు…

Read more »

కింగ్‌ ఆఫ్‌ క్రికెట్‌

By |

కింగ్‌ ఆఫ్‌ క్రికెట్‌

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ 2018 సంవత్సరాన్ని అత్యంత విజయ వంతంగా ముగించాడనే చెప్పాలి. ఫార్మాట్‌ ఏదైనా పరుగుల మోతలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా, స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా కొహ్లీ అత్యుత్త మంగా రాణించిన ఏడాదిగా 2018 భారత క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోతుంది. ఆధునిక క్రికెట్లో తిరుగులేని మొనగాడిగా పేరు తెచ్చుకున్న విరాట్‌ సాంప్రదాయ టెస్ట్‌ క్రికెట్‌, ఇన్‌స్టంట్‌ వన్డే, ధూమ్‌ధామ్‌ టీ-20 క్రికెట్‌.. ఫార్మాట్‌…

Read more »

2018 తెలుగు చిత్రసీమ విహంగ వీక్షణం

By |

2018 తెలుగు చిత్రసీమ విహంగ వీక్షణం

చూస్తూ చూస్తూ నూతన ఆంగ్ల సంవత్సరాదిలోకి అడుగు పెట్టేశాం. గడిచిన ఏడాదిలో తెలుగు చిత్రసీమలో ఎన్నో వింతలు, ఎన్నో విచిత్రాలు, మరెన్నో వివాదాలు. అగ్రకథానాయకులకు ఈ యేడాది చుక్కలు కనిపించాయి. సరికొత్త కథానాయకులకు విజయాలు దక్కాయి. ఊహించని వివాదాలు కొన్ని చెలరేగగా, ఊహకందని మరణాలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. గడిచిన సంవత్సరంలో దాదాపు 170 స్ట్రయిట్‌ సినిమాలు, 60 వరకూ అనువాద చిత్రాలు తెలుగు వారిని పలకరించాయి. అయితే సీనియర్‌ హీరోలు చిరంజీవి, వెంకటేశ్‌ నటించిన సినిమాలేవీ…

Read more »

ఎన్ని ప్రచురణలు వచ్చాయి!?

By |

ఎన్ని ప్రచురణలు వచ్చాయి!?

‘ధూమ కేతువు కేతువనియో, మోము చంద్రుండలిగి చూడడు’ అని గురజాడ అప్పారావు ఇల్లాలు పొలయలుక తీర్చే చరణాలు రాశాడు. పొలయలుక అంటే ఏమిటో పాత ప్రబంధాలు అక్కర లేదు, కన్యాశుల్కం చూసినా తెలుస్తుంది. గురజాడ అప్పారావు మేధావి, హేతువాది, తార్కికుడూనూ కదా! రాహుకేతువులూ, సూర్యచంద్ర గ్రహణాలూ కవిత్వం చేసుకున్నాడేమిటి? అనుకో వచ్చు ఎవరైనా? కాని ‘కాదేదీ కవిత కనర్హం’ అన్నాడు కదా ఆయన మానసపుత్రుడు శ్రీశ్రీ. బ్రహ్మ మానసపుత్రులు లాగా అభ్యుదయ సామాజిక విప్లవ కవితా సృష్టికి…

Read more »

నోరూరించే రకరకాల

By |

నోరూరించే రకరకాల

గులాబ్‌జామ్‌లు పనీర్‌ గులాబ్‌జామ్‌ కావల్సిన పదార్థాలు పనీర్‌ : అరకప్పు కోవా : కప్పు బేకింగ్‌ పొడి : పావుచెంచా మైదా : నాలుగు టేబుల్‌ స్పూన్లు పాలు : అరకప్పు నెయ్యి : వేయించడానికి సరిపడా చక్కెర : రెండు కప్పులు నీళ్లు : రెండు కప్పులు యాలకులపొడి : కొద్దిగా. తయారీ ఓ గిన్నెలో కోవా, పనీర్‌, బేకింగ్‌ పొడి, మైదా తీసుకుని పాలతో పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి కరిగించి ఈ…

Read more »

అర్థమయ్యేలా చెబుతాం !

By |

అర్థమయ్యేలా చెబుతాం !

భారతీయ సనాతన ధర్మం ఇంకా పదిలంగా ఉందంటే దానికి కారణం ఉమ్మడి కుటుంబ వ్యవస్థే. హిందూ సంప్రదాయంలో మహిళకు సముచిత గౌరవం ఉంటుంది. భర్తకు తగిన భార్యగా, పిల్లల్ని సన్మార్గంలో నడిపించే తల్లిగా, బాధ్యతల్ని నెరవేర్చే కోడలిగా, పెళ్లికి ముందు తల్లిచాటు బిడ్డగా.. ఇలా ప్రతి అమ్మాయి తన జీవితంలో కీలక దశలను.. అందులో తన బాధ్యతలను నెరవేరుస్తుంది. అయితే ఈ దశలన్నింటినీ సక్రమంగా నిర్వర్తించాలంటే చిన్నప్పటి నుంచే వారు జీవిత పాఠాల్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిని…

Read more »

అరిసెలతో ఆరోగ్యం

By |

అరిసెలతో ఆరోగ్యం

హిందూ పండుగలలో అతి పెద్ద పండుగ సంక్రాంతి. నెల రోజుల పాటు సాగే ఈ పండుగ చివరి మూడు రోజులు భోగి, సంక్రాంతి, కనుమలతో; ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్లతో, చుట్టాలతో, చక్కని పిండివంటలతో, ఘుమఘుమ లాడే సువాసనలతో ఘనంగా ముగుస్తుంది. హిందూ సంప్రదాయంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. సంక్రాంతి పండుగ ప్రత్యేకత ఏంటంటే ఇంటి లోపల అరిసెలు, ఇంటి బయట ముగ్గులు. సంక్రాంతి పండుగ రోజుల్లో ఈ రెండూ లేని ఇల్లు ఉండదు….

Read more »

కొక్కరో… క్కో..

By |

కొక్కరో… క్కో..

ఇంకెన్నాళ్లీ నాటకం !? ఇటీవల నసీరుద్దీన్‌ షా అనే ప్రముఖ హిందీ నటుడు ఓ దుర్వాఖ్య చేసాడు. ముసలితనం వచ్చాక ఈ దేశంలో జీవించాలంటే నాకు భయం వేస్తుంది; నా పిల్లలకు రక్షణ లేదు’ అని వ్యాఖ్యానించి తన దుర్బుద్ధి చాటుకున్నాడు. ఈ దేశంలో మహమ్మదాలీ జిన్నా మొదలుకొని ఈ అంటు జాడ్యం నసీరుద్దీన్‌ షా వరకు కొనసాగుతూనే ఉంది. మొన్నటికిమొన్న హమీద్‌ అన్సారీ అనే నాయకుడు ఉపరాష్ట్రపతి పదవి 5 ఏళ్లు బాగా అనుభవించి పోతూ…

Read more »