Posts Tagged “04-10 June 2018”

పెట్రోలు అధిక ధరలకు రాష్ట్రాల బాధ్యత ఎంత ?

By |

పెట్రోలు అధిక ధరలకు రాష్ట్రాల బాధ్యత ఎంత ?

పెట్రోలు, డీజిల్‌ ధరలు గడచిన 2, 3 నెలల్లో అధికంగా పెరిగాయి. ఈ పెరుగుదలకు కేవలం మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలూ, విపక్షాలు అంటున్నాయి. ఇంధన పెరుగుదల విషయంలో వాస్తవం ఏమిటి ? కేవలం కేంద్రానిదే బాధ్యతా ? ఇందులో రాష్ట్రాల పాత్ర ఎంత ? అన్నదే ఈ వ్యాస సారాంశం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో ఆ భారాన్ని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు వినియోగదారులపై మోపుతున్నాయి. నష్టాల్లో ఉన్న…

Read more »

ఇది జిజియా పన్ను వంటిదే

By |

ఇది జిజియా పన్ను వంటిదే

ఇటీవల విజయవాడ విద్యాధరపురంలో 80 కోట్ల ఖర్చుతో ఆరు అంతస్తుల హజ్‌ భవవాన్ని నిర్మించడానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఒక్క విజయవాడలోనే కాదు, కడపలో కూడా మరో హజ్‌హౌస్‌ కడతానని, హైదరాబాద్‌తో సహా ముస్లింలకు మూడు హజ్‌హౌస్‌లు కట్టించిన ఘనత తనదేనని సగర్వంగా చెప్పుకున్నారు. అల్లాఉద్దీన్‌ ఖిల్జీ సేనాని మాలిక్‌ కాఫూర్‌ కాకతీయ సామ్రాజ్యాన్ని తుదముట్టించాడు. ఒక తుఫాన్‌లాగా మధురై వరకు వెళ్ళి తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఈ అవకాశాన్ని చూసుకుని…

Read more »

భారత, రష్యా సంబంధాల్లో కొత్త అధ్యాయం… సోచి సమావేశం

By |

భారత, రష్యా సంబంధాల్లో కొత్త అధ్యాయం… సోచి సమావేశం

‘అధ్యక్షుడు పుతిన్‌తో సంభాషణలు ఎంతో ఫలవంతంగా సాగాయి. ఇండో-రష్యా సంబంధాలతోపాటు ప్రపంచ విషయాల గురించి కూలంకషంగా చర్చించాం. భారత, రష్యాల మధ్య స్నేహం కాల పరీక్షను తట్టుకుని నిలిచింది. రాబోయే రోజుల్లో ఈ సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయి’ – ప్రధాని మోదీ ఆసియా ప్రాంతంలో ప్రస్తుతం దౌత్యేతర సంభాషణలు నడుస్తున్నాయి. వివిధ దేశాధినేతలు ఎలాంటి ఎజెండా లేకుండా నేరుగా కలుసుకుని మాట్లాడుకుంటున్నారు. తమ మధ్య స్నేహ సంబంధా లను మెరుగుపరచు కుంటున్నారు. కొరియా దేశాధినేతల మధ్య,…

Read more »

టిటిడి రాష్ట్ర ప్రభుత్వ జాగీరా ?

By |

టిటిడి రాష్ట్ర ప్రభుత్వ జాగీరా ?

రెండు దశాబ్దాల కిందటి మాట. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా ‘అన్నమయ్య’ సినిమా తీస్తున్నారు. దాని షూటింగ్‌ను తిరుమల కొండల మీద జరుపుకోవటానికి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు అనుమతి కోరారు. ఇ.ఒ. ఆ విషయం ట్రస్టు బోర్డు ముందు పెట్టారు. కమర్షియల్‌ కార్యకలాపాలను కొండమీద అనుమతించేది లేదని టిటిడి బోర్డు కరాఖండిగా తిరస్కరించింది. ఇంకోసారి ఆలోచించమని సినిమా వాళ్లు అడిగారు. ఇంకోసారి బోర్డు అదే సమాధానం చెప్పి ససేమిరా అంది. దాంతో నిర్మాత తెలివి తెచ్చుకుని ‘కరెక్ట్‌ రూట్‌’లో…

Read more »

ఇతర ప్రభుత్వాల కంటే మోదీ ప్రభుత్వమే బెటర్‌

By |

ఇతర ప్రభుత్వాల కంటే మోదీ ప్రభుత్వమే బెటర్‌

మనకు మనమే శత్రువులం, రాజకీయ నాయకులందరూ గజ దొంగలు, దోపిడీగాళ్ళు, మాయగాళ్ళు అనే అభిప్రాయం ప్రజలందరిలో బలంగా నాటుకొని ఉన్న స్థితిలో రంగంలోకి వచ్చిన మోదీ కొత్త ఆశలు రేకెత్తించారు. తన సహజ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోగల ఒక బృహత్‌ ప్రయత్నాన్ని ఈ జాతి చేయగలదనే నమ్మకం కలిగించారు. గ్రూపులు, వర్గాలు, ముఠాలుగా వ్యవహరిస్తున్న స్వార్థపర రాజకీయ నాయకులు సాగిస్తున్న అతుకుల బొంత రాజకీయాలతో ఇక్కడ కుమ్మరించిన విద్వేష భావాలను ప్రక్షాళనం చేయగల మొనగాడు అవతరించాడనే భావన…

Read more »

ప్రజలు మనోధైర్యం తెచ్చుకోవాలి !

By |

ప్రజలు మనోధైర్యం తెచ్చుకోవాలి !

బలికోసం దేవుడు గుర్రాన్నో, ఏనుగునో, బెబ్బులినో కోరడని; మేకపిల్ల లారటి దుర్బలులనే బలి తీసుకుంటాడని ఓ నానుడి. ఈ మే 28న విజయవాడలో జరిగిన తెదేపా మహానాడు క్రతువు కూడా ఓ దుర్బలుడి బలితో పరిసమాప్తమైరది. పార్టీకి నష్టర కలిగిరచే చర్యలకు పాల్పడిన వారు తెదేపాలో చాలామందే ఉన్నారు. కర్నాటకలో బిజెపి ఓటమికి తిరుపతి వెరకన్న చౌదరి ఆగ్రహమే కారణం అరటూ వెరకటేశ్వర స్వామికి కూడా కులం అరటగట్టి, పార్టీకి ప్రజల ఛీత్కారాన్ని కొనితెచ్చిన పార్లమెరటు సభ్యుడు;…

Read more »

సంఘ శిక్షావర్గలు 2018

By |

సంఘ శిక్షావర్గలు 2018

ప్రథమవర్ష – తెలంగాణ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ – తెలంగాణ ప్రాంత ప్రథమవర్ష హైదరాబాద్‌, ఘట్‌కేసర్‌, అన్నోజిగూడలోని శ్రీ విద్యావిహార్‌ పాఠశాలలో మే 6 నుండి 25 తేదీ వరకు జరిగింది. ఈ వర్గకు వర్గాధికారిగా ప్రముఖ బిల్డర్‌, నల్గొండ, లక్ష్మణరావు, వర్గ కార్యవాహగా ఇందూర్‌ విభాగ్‌ సంఘచాలక్‌ జనగాం నరేంద్ర, వర్గ సహకార్యవాహగా ఖమ్మం విభాగ్‌ సహకార్యవాహ రాంచంద్రరావు వ్యవహరించారు. 25న జరిగిన వర్గ ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిబిఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ…

Read more »

పరిస్థితులు సృష్టించుకున్నారా ? యాదృచ్ఛిక నిర్ణయమేనా ?

By |

పరిస్థితులు సృష్టించుకున్నారా ? యాదృచ్ఛిక నిర్ణయమేనా ?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఎన్నో సార్లు అది నిరూపితం అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలోనూ జంపింగ్‌ జపాంగ్‌ల చరిత్ర ఇదే విషయాన్ని రుజువు చేసింది కూడా. ముందురోజు ఎదుటి పార్టీ వాళ్లను మాటలతోనే చీల్చి చెండాడిన ఓ నాయకుడు మరుసటిరోజే ఆ పార్టీ కండువాను జనం సమక్షంలో కప్పుకోవడం తెలుగునాట సర్వసాధారణమే. అలాంటి నాయకుల గురించి సందర్భం వచ్చినప్పుడల్లా జనమే మాట్లాడుకుంటారు. తానుండే పార్టీలో మాట చెల్లుబడి అయితేనే సరి.. తన డిమాండ్లు నెరవేర్చితేనే…

Read more »

నాడు తండ్రి.. నేడు తనయుడు..

By |

నాడు తండ్రి.. నేడు తనయుడు..

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన కర్నాటక ఎన్నికలు ముగిశాయి. బిజెపియేతర పక్షాలన్నీ ఏకమై బిజెపిని అధికారానికి దూరం చేయడం కోసం ప్రయత్నాలు సాగించాయి. ఫలితంగా అతి పెద్ద పార్టీగా అవతరించిన బిజెపి ప్రతిపక్షంలో ఉంది. అతి తక్కువ స్థానాలు సాధించి మూడవ స్థానంలో నిలిచిన జనతాదళ్‌ (ఎస్‌) కు ముఖ్యమంత్రి పదవి దక్కింది. రెండవ స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. 1996 చరిత్ర పునరావృతం అయింది. 1996లో లోక్‌సభకు జరిగిన ఎన్నికలలో అతి…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఢిల్లీ తగ్గని మోదీ చరిష్మా ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన కొన్ని ఉపఎన్నికల్లో బిజెపి ఓడిపోవడం, కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించినా కాంగ్రెస్‌, జెడి(ఎస్‌)ల అవకాశవాద పొత్తుతో ప్రభుత్వ ఏర్పాటుకు దూరం కావడంతో దేశవ్యాప్తంగా మోదీ చరిష్మా మసకబారు తోందంటూ కొన్ని సర్వేలు పనిగట్టుకొని చేసిన ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లోనూ మోదీ ప్రభంజనం తప్పదంటూ తాజాగా టైమ్స్‌ గ్రూప్‌ మెగా సర్వే స్పష్టం చేసింది. మే నెల 23 నుంచి 25 వరకు…

Read more »