Posts Tagged “02-08 April 2018”

అందరికీ ఆరోగ్యం

By |

అందరికీ ఆరోగ్యం

‘అందరికీ అందుబాటులో ఆరోగ్యం’ (యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజి – ఖనజ) అనేది ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు. ఎంతో ప్రాచీనమైన వైద్య విధానం కలిగిన మనదేశంలో ఇప్పటికీ వైద్యం అందరికీ అందుబాటులో లేకపోవడం శోచనీయం. ఈ సమస్య తీరిన రోజునే మనం నిజమైన అభివృద్ధిని సాధించినట్లు. దీనికోసం ప్రభుత్వమూ, ప్రజలూ ఎంతో శ్రమ చేయవలసి ఉన్నది. 1948 ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభమైంది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆ…

Read more »

అదేనా ‘బాగుండటం’ అంటే..?

By |

అదేనా ‘బాగుండటం’ అంటే..?

– కేరళలో ఎస్‌సిలపై దాడులు – పట్టించుకోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం – న్యాయస్థానాల మొట్టికాయలు కేరళలో 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎమ్‌ ఆధ్వర్యంలో ఏర్పడిన లెఫ్ట్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ తన ఎన్నికల వాగ్దానాలలో ఎల్‌డిఎఫ్‌ గెలిస్తే అంతా మంచే జరుగుతుందని చెప్పింది. దాంతో ప్రజలు ఎల్‌డిఎఫ్‌ను గెలిపించారు. కాని ఎల్‌డిఎఫ్‌ తను చేసిన వాగ్దానాన్ని మరిచిపోయింది. పైపెచ్చు రాజకీయ ప్రత్యర్థులను హత్య చేస్తున్నారు. ఒకపక్క న్యాయస్థానాల నుండి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వానికి మందలింపులు వస్తుంటే, మరోపక్క లంచగొండి…

Read more »

మళ్ళీ పుతిన్‌ గెలుపు దేనికి మలుపు ?

By |

మళ్ళీ పుతిన్‌ గెలుపు దేనికి మలుపు ?

నాలుగవసారి అధ్యక్షుడిగా గెలిచిన పుతిన్‌ 2024 వరకు ఆ పదవిలో ఉంటారు. ఈ గెలుపు అనేక సందేహాలకూ తావిస్తోంది. భవిష్యత్తులో రష్యాలో కూడా చైనాలో మాదిరిగానే అధ్యక్షుడికి శాశ్వత, అపరిమిత అధికారాలు కట్టబెట్టే ప్రమాదం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ నాలుగవ సారి ఎన్నికయ్యారు. ‘నిరంకుశ, రాచరిక’ ధోరణి ప్రదర్శిస్తారని పుతిన్‌పై యూరోప్‌ దేశాలు విమర్శలు కురిపిస్తున్నా, రష్యా ప్రజానీకం మాత్రం ఆయనకే పట్టం కట్టారు. ఇటీవల జరిగిన…

Read more »

అందుకు శాయశక్తులా కృషి చేస్తాం

By |

అందుకు శాయశక్తులా కృషి చేస్తాం

జాగృతి నిర్వహించిన ముఖాముఖిలో బిజెపి నేత రామ్‌ మాధవ్‌ ఇటీవల ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ కొత్త చరిత్ర సృష్టించింది. కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన త్రిపురలో కమలం ఘనవిజయం సాధించడంతో పాటు, మేఘాలయ, నాగాలాండ్‌లలో ప్రభుత్వాన్ని మిత్రపక్షాలతో కలిసి ఏర్పాటు చేసింది. దీనితో ఒక్క మిజోరాం తప్ప మిగతా అన్ని ఈశాన్య రాష్ట్రాలూ బిజెపి ఖాతాలో చేరాయి. ఈ ఘనమైన, చారిత్రాత్మకమైన విజయం వెనుక వేలాది కార్యకర్తల త్యాగాలు, తపస్సు…

Read more »

పశుగ్రాసాల సాగుతో పాల ఉత్పత్తిని పెంచుదాం !

By |

పశుగ్రాసాల సాగుతో పాల ఉత్పత్తిని పెంచుదాం !

రైతులు పాల ఉత్పత్తిని పెంచేందుకు అధిక మొత్తంలో పశుగ్రాసాల సాగు చేయాల్సి ఉంటుంది. నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పశువులకు దాణాగా అందించినప్పుడే మనదేశంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. పశుగ్రాసం రకాలు : సాలీన పచ్చిగడ్డి లభ్యతకు సూచనలు: పది పాడి పశువులు, 5 దూడలకు సగటున ఒక సంవత్సరానికి కావలసిన పచ్చిగడ్డి 173 టన్నులు. అంటే ప్రతిరోజు ఒక పశువుకు 40 కిలోలు, ఒక దూడకు 15 కిలోల పచ్చిగడ్డి అవసరమవు తుందన్నమాట….

Read more »

న్యాయానికి సహజ న్యాయం జరగాలి !

By |

న్యాయానికి సహజ న్యాయం జరగాలి !

శ్రీరామ చంద్రుడు తన ధనుస్సు కొనను నేలపై ఆన్చినప్పుడు ఆనుకోకురడా ఓకప్పకు నొప్పి కలిగింది. ఆ తరువాత ఆయన చూసి, అరరే, పొరపాటు జరిగింది. ధనుస్సు మోపుతురడగానే ఎందుకు చెప్పలేదు, ముప్పు తప్పేది కదా ! అని రాముడు అంటే ‘రామా ఇతరుల వల్ల ఆపద కలిగితే ‘రామా!’ అని నిన్ను స్మరించుకుని ఆపదలు బాపుకొంటున్న నాకు సాక్షాత్తు నీ వల్లనే ఆపద వాటిల్లితే ఎవరిని వేడుకోను ఏమని వేడుకోను!’ అన్నదట! అది రామరాజ్యం నాటి మాట….

Read more »

వృద్ధాశ్రమంలో వృద్ధులను చంపి.. అవయవాలను అమ్మి..

By |

వృద్ధాశ్రమంలో వృద్ధులను చంపి.. అవయవాలను అమ్మి..

సేవ పేరుతో వృద్ధాశ్రమాలు స్థాపించి అమాయకులైన బీదవారిని, గుడ్డివాళ్ళను, ముసలివాళ్ళను అన్నం పెడతామని, వైద్యం అందిస్తామని ఆశపెట్టి ఆశ్రమానికి తీసుకువచ్చి, చివరకు తిండిపెట్టకుండా కడుపులు మాడ్చి, విలవిలలాడి చనిపోయిన తర్వాత వారి అవయవాలు అమ్ముకొనే వ్యాపారం చేస్తున్నాయి క్రైస్తవ సంస్థలు. ఈ మధ్యే తమిళనాడులో చెన్నైకి 75 కి.మీ. దూరంలో ఉన్న కాంచీపురం జిల్లా ‘సలవక్కం’లో ఇటువంటి దురాగతానికి పాల్పడిన ఒక క్రైస్తవ సంస్థ బండారం బయటపడింది. ఫిబ్రవరి 2వ తేదీన సాయంత్రం 3 గంటల ప్రాంతంలో…

Read more »

తాడేపల్లి కృష్ణమూర్తి కన్నుమూత

By |

తాడేపల్లి కృష్ణమూర్తి కన్నుమూత

ఆర్‌.ఎస్‌.ఎస్‌. జ్యేష్ట కార్యకర్తలలో ఒకరైన తాడేపల్లి వేంకట కృష్ణమూర్తి (71) 2018 మార్చి 24న గుండెపోటుకు గురై భాగ్యనగర్‌లోని మల్కాజిగిరి దీనదయాళ్‌నగర్‌లో వారి స్వగృహంలో స్వర్గస్తులయ్యారు. తాడేపల్లి వేంకట చలపతిరావు, రాజ్యలక్ష్మి దంపతులకు మొత్తం 7 గురు సంతానంలో రెండవ కుమారుడిగా 14 జనవరి 1947 విజయవాడలో కృష్ణమూర్తి జన్మించారు. కృష్ణమూర్తి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌లో 1968 నుండి 1971 వరకు నెల్లూరులో ప్రచారక్‌గా పనిచేశారు. ఆ తరువాత కొన్నాళ్ళు విజయవాడలోనే జాగృతి వారపత్రిక ఆధ్వర్యంలో నడిచిన…

Read more »

జమిలి ఎన్నికలపై విస్తృత చర్చ అవసరం

By |

జమిలి ఎన్నికలపై విస్తృత చర్చ అవసరం

‘ఒక దేశం ఒకే ఎన్నిక’ అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు దేశంలో పరిపాలన విషయంలో ఒక పెద్ద చర్చకు నాందీ ప్రస్తావన వంటిదని, ప్రభుత్వ పాత్ర, ప్రజల బాధ్యతలపై విస్తృతమైన, నిజాయితీతో కూడిన చర్చ జరగవలసిన అవసరం ఉందని ప్రముఖ పాత్రికేయుడు, రాజ్యసభ సభ్యుడు స్వపన్‌ దాస్‌ గుప్త అన్నారు. జాతీయ తెలుగు వారపత్రిక జాగృతి, సెంటర్‌ ఫర్‌ లీడర్‌ షిప్‌ అండ్‌ గవర్నెన్స్‌ సంస్థలు సంయుక్తంగా అమీర్‌పేటలోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌…

Read more »

మూడోఫ్రంట్‌ మూన్నాళ్ల ముచ్చటేనా ?

By |

మూడోఫ్రంట్‌ మూన్నాళ్ల ముచ్చటేనా ?

పవార్‌ అవరోధం.. కారత్‌ విశ్లేషణం.. తెలంగాణ సిఎం కెసిఆర్‌ థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దాదాపు మూడు వారాలుగా నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, అనుభవజ్ఞులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కెసిఆర్‌ జాతీయ రాజకీయాలకు అవసరమైన వ్యూహాలు, నెలకొన్న సమస్యలు, వివిధ రాష్ట్రాలను అనుసంధానం చేసుకోవడానికి కావాల్సిన పరిస్థితుల గురించి ముమ్మరంగా హోమ్‌వర్క్‌ చేశారు. ఈ క్రమంలోనే కోల్‌కతా వెళ్లి పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. కెసిఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ ప్రకటన చేశాక…

Read more »