Posts Tagged “01-07 April 2019”

చిత్తశుద్ధితో అభివృద్ధి

By |

చిత్తశుద్ధితో అభివృద్ధి

దేశాభివృద్ధికి పాటుపడేది భాజపా ఆధ్వర్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాలే అనే అభిప్రాయం భారతీయులలో లోతుగా పాతుకుపోయిందంటే అతిశయోక్తి కాదు. అందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ప్రస్తుత కాపలాదారు (చౌకీదార్‌) మోదీ ప్రభుత్వం కూడా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో విజయమే సాధించిందనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. దానికి నిదర్శనం 2018లో 7.4 శాతం ఉన్న వృద్ధి రేటు 2019 లో 7.8 కి పెరగనుండటమే. ఇది సాక్షాత్తూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చెప్పిన వాస్తవం. భారత ఆర్థిక వృద్ధి…

Read more »

మెరుపు దాడుల మీద ఎందుకీ శంకలు?

By |

మెరుపు దాడుల మీద ఎందుకీ శంకలు?

బాలాకోట్‌.. గత నెలరోజులుగా వార్తలలో నలుగుతున్న అంశం.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పిన అంశం.. ప్రస్తుతం మన విపక్షాలకు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్న అంశం.. ఫిబ్రవరి 14న మనదేశంలోని పుల్వామాలో మన సైనిక వాహనాలపై పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్‌ తీవ్రవాదులు బాంబుదాడులకు తెగబడి 40 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. దానికి తగిన జవాబుగా మన వైమానిక దళం ఫిబ్రవరి 26 తెల్లవారుఝామున పాకిస్తాన్‌ అధికార భూభాగంలోకి చొచ్చుకుపోయి బాలాకోట్‌లో ఉన్న తీవ్రవాద…

Read more »

యుగద్రష్ట డా|| హెడ్గెవార్‌

By |

యుగద్రష్ట డా|| హెడ్గెవార్‌

ఉగాది నాడు డాక్టర్‌జీ జయంతి సందర్భంగా డాక్టర్‌ కేశవరావు బలీరాంపత్‌ హెడ్గెవార్‌ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సంస్థాపకులు. గొప్ప విశ్వాసాన్ని గుండె నిండా నింపుకుని, సంఘ మంత్రాన్ని ప్రవచించి నిద్రాణమైన హిందూ జాతిని మేల్కొల్పినవారాయన. సంఘ తంత్రానికి వారే సృష్టికర్త. విలక్షణమైన సంఘ కార్యపద్ధతితో హిందూ జాతిని సంఘటితం చేయడంలో విజయం సాధించిన మహోన్నతుడు. అసాధ్యం సాధ్యమైంది హిందూ సంఘటన అసంభవమని, ‘హిందూ జాతికి మరణమే శరణ్యమని’, ‘దీనిని ఎవరూ రక్షించలేర’ని నిరాశలో కూరుకుపోయిన రోజులవి. డాక్టర్‌…

Read more »

ఘన చరితకు పునాది.. ఉగాది!

By |

ఘన చరితకు పునాది.. ఉగాది!

ఉగాది.. చెట్లు చిగురిస్తాయి.. వసంతం వెల్లివిరుస్తుంది.. పచ్చదనంతో, పచ్చికలతో నేల పులకరిస్తుంది.. కోకిలల కుహు.. కుహు.. రాగాలతో, బడికి సెలవు లొచ్చి ఊళ్లకెళ్లిన పిల్లల ప్రతిరాగాలతో ప్రకృతి పరవ శిస్తుంది. మామిడి పిందెలన్నీ పండటానికి సిద్ధమవు తాయి. పుల్లపుల్లగా నోరూరిస్తాయి. వేపచెట్టు సైతం శ్వేత వర్ణమై పూలు పూయిస్తుంది. మొత్తం ప్రకృతే పండుగ చేసుకుంటుంది. అందుకే ఉగాది భారత దేశానికి కొత్త సంవత్సరం అయింది. అందుకే భారతీ యులు ఉగాది ముహూర్తాన్ని శుభకార్యాల ప్రారంభానికి సరైనదిగా భావించారు….

Read more »

నీతివంతులైన సమర్థులను ఎన్నుకోవాలి!

By |

నీతివంతులైన సమర్థులను ఎన్నుకోవాలి!

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగునాట రాజకీయాలు వింత పోకడలు పోతున్నాయి. ఈ ఎన్నికల్లో తమను ఎందుకు గెలిపించాలో, గెలిపిస్తే దేశానికి, ప్రజలకు ఏమి చేస్తారో వివరించడం కన్నా కొందరిని దూషించడం, వారిని గెలిపిస్తే చిక్కులు వస్తాయని హెచ్చరించడం పైనే రాజకీయ పక్షాలు మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఒక వేలు ఇతరుల వైపు చూపితే మూడు వేళ్లు తమను చూపుతాయన్న ఇంగితం ఈ రాజకీయ పక్షాలకు లోపించినట్లుంది. మోదీని విమర్శించి, తమ ఘనత చాటుకోవాలనే…

Read more »

ఎందరో మహానుభావులు..

By |

ఎందరో మహానుభావులు..

ఏప్రిల్‌ 6, 1980న ముంబయ్‌ (అప్పుడు బొంబాయి) నగరంలో ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీలో ఎందరో రాజనీతిజ్ఞులు కనిపిస్తారు. బీజేపీ ఎన్నికలలో పోటీ చేస్తుంది. కానీ ఎన్నికలు ఒక్కటే ఈ పార్టీ పరమావధి కాదు. సాంస్కృతిక జాతీయవాదం పునాదిగా రాజకీయాలు సాగించే పార్టీ ఇది. నాయకులు కూడా ఆ సిద్ధాంతానికి బద్ధులైనవారే వచ్చారు. ఈ దేశ ప్రధానులందరిలో ఎంతో విశిష్టమైన వ్యక్తి అటల్‌ బిహారీ వాజపేయి. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి జనసంఘ్‌కు, అక్కడ నుంచి బీజేపీకి వచ్చారు….

Read more »

సఫల దౌత్యం- డోక్లాం విజయం

By |

సఫల దౌత్యం- డోక్లాం విజయం

మునుపెన్నడూ లేనివిధంగా మోదీ ప్రభుత్వం ప్రపంచ దేశాలతో సంబంధాలను మెరుగు పరచుకునేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితా లిస్తున్నాయి. ముఖ్యంగా దేశభద్రత విషయంలో ఈ అంతర్జాతీయ సంబంధాలు బాగా ఉపయోగ పడుతున్నాయి. చైనా మన దేశ సరిహద్దు ప్రాంత మైన డోక్లాంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నిం చినప్పుడు ఆ దేశాన్ని అడ్డుకోవడం, యూరీ, పుల్వామా దాడులు, భారత దళాలపై ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదుల దాడులను ఖండించక తప్పని పరిస్థితిని చైనాకు కలిగిం చడం వంటివి మోదీ ప్రభుత్వపు విజయాలే. జూన్‌…

Read more »

మోదీ లక్ష్యం రైతుకు రెండింతల ఆదాయం

By |

మోదీ లక్ష్యం రైతుకు రెండింతల ఆదాయం

భారతదేశంలో 60 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్రామాలలో యువతకు, రైతులకు, రైతు కూలీలకు ఉపాధిని కల్పించే ఉత్తమ గ్రామీణ పరిశ్రమ వ్యవసాయమే. వ్యవసాయ ఉత్పత్తులు మానవాళి మనుగడకు, పరిశ్రమలకు ముడిసరుకు సరఫరా చేయుటకు, తద్వారా గ్రామీణ భారతావని ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. అందుకే వ్యవసాయం, గొడ్డు-గోదా, ఆవు-దూడ సంరక్షణ మన సంస్కృతిలో భాగం అయ్యాయి. అందుకే పెద్దలంటారు భారతదేశ ప్రగతిని పల్లెల్లో దర్శించవచ్చు అని. కానీ ఇంతటి మ¬న్నతమైన, గౌరవ ప్రదమైన, జీవనాధారమైన మన…

Read more »

శ్రీ వికారినామ సంవత్సర రాశిఫలాలు-2019

By |

శ్రీ వికారినామ సంవత్సర రాశిఫలాలు-2019

గ్రహసంచారం: ఈ ఏడాది గురుడు ఏప్రిల్‌ 22 వరకు ధనుస్సులోనూ తదుపరి నవంబర్‌ 4 వరకు వృశ్చికరాశి, తదుపరి సంవత్సరాంతం వరకు ధనుస్సులోనూ సంచారం. శని వచ్చే జనవరి 24వరకు ధనుస్సు రాశిలోనూ, తదుపరి మకర రాశిలో సంచారం. ఇక రాహుకేతువులు సంవత్సరమంతా మిథునం, ధనుస్సు రాశుల్లో సంచరిస్తారు.  మేషం  అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం వీరికి కొంతవరకు గురుబలం, సంవత్సరాంతంలో శనిబలం ఉంటుంది. రాహుకేతువుల బలం లేదు. గత ఏడాదికంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు….

Read more »

పోరుబాట వదిలి పోటీకి…

By |

పోరుబాట వదిలి పోటీకి…

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన రైతులు తమ డిమాండ్‌ల సాధనకు ఈ ఎన్నికలనే అస్త్రంగా ఎంచుకున్నారు. పండించిన పంటకు గిట్టుబాట ధర కల్పించాలనే డిమాండ్‌తో తీవ్రస్థాయిలో ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయేసరికి పసుపు, ఎర్రజొన్న రైతులు ఎన్నికల బాటపట్టారు. పెద్దఎత్తున నామినేషన్ల పర్వానికి తెరదీశారు. గతంలో వీరు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నాయకులకు తమ గోడును వినిపించేందుకు అసెంబ్లీ ముట్టడికీ విఫలయత్నం చేశారు. రహదారులను నిర్బంధించి వంటా…

Read more »