ఇది జూలు విదిల్చిన భారతం!

ఇది జూలు విదిల్చిన భారతం!
  • ఇప్పుడు భారత్‌ ధృఢంగా ఉంది
  • భాజపా వచ్చేనాటికి సైనికుల వద్ద మందుగుండు కూడా లేదు
  • రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం

పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదులు పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మంది భారత జవానుల ప్రాణాలు బలిగొన్నారు. ఈ దారుణ చర్యను ప్రతి భారతీయుడు ఖండించాడు. దేశ రక్షణకు అహర్నిశలు శ్రమిస్తున్న జవానుల మీద జరిగిన హత్యాకాండ అటు పాలకులలో, ఇటు ప్రజలలో కోపాన్ని రగిలించింది. ఇంతటి రాక్షసత్వానికి తెగబడిన వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకున్నారు. పాలకులు ప్రజల మనోభావాలను అర్థం చేసుకున్నారు. ఫలితంగా పుల్వామా దుర్ఘటన జరిగిన 13 రోజుల తరువాత భారత వైమానిక దళం పాక్‌ ఆక్రమిత భారత భూభాగంలో ఉన్న తీవ్రవాద శిక్షణ శిబిరాలపై క్షిపణులతో దాడి చేసి ధ్వంసం చేసింది. పౌరులకు నష్టం వాటిల్ల కుండా జరిపిన ఈ దాడి పుల్వామా ఘటనకు ప్రతీకారం.

భారత రక్షణ శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ పుల్వామా ఘటన తరువాత జరిగిన పరిణామాలు, ప్రభుత్వ విధానాల గురించి హిందీ పత్రిక ‘పాంచజన్య’ సంపాదకవర్గంతో ముచ్చటించారు. ‘భారతదేశం మునుపటి భారతదేశం కాదు. గతంలో ఈ దేశం అనేకసార్లు ఉగ్రవాదుల ఘాతుకాలని, తీవ్రవాదుల్ని భరించింది. నేటి భారతం ఇక సహించదు. ఉగ్రవాద చర్యలకు తలపడే వారిని ఉపేక్షించదు’ అని హెచ్చరించారు. ‘ఇరుగు పొరుగు దేశాలు మన పట్ల తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తామంటే. మేము మౌనంగా కూర్చుంటామని అనుకుంటే పొరపాటే. మేము చూస్తూ ఊరుకోం. తీవ్రవాద చర్యలకు పాల్పడే వారికి సరైన జవాబివ్వ గల సామర్థ్యం ఈ దేశానికి ఉంది’ అని సీతారామన్‌ చెప్పారు.

పుల్వామాలో 40 మంది జవానుల బలిదానం, ఈ దాడికి బాధ్యత మాదే అని పాకిస్తాన్‌లో ఉన్న జైష్‌ సంస్థ ప్రకటించడం, వీర సైనికులను కోల్పోయిన భారత ప్రజల ఆక్రోశం, భారత పాలకులు మున్నెన్నడూ లేనివిధంగా దృఢంగా స్పందించడం.. ఇవన్నీ చూస్తుంటే భారత్‌ మారుతోంది అనిపిస్తోంది!

అవును భారత్‌ మారింది. ఇకపై ఈ దేశంపై దాడులు చేస్తే ఊరుకోం. అంతేకాదు తీవ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను బలహీనం చేస్తాం. ప్రస్తుతం అధికారంలో ఉన్న పాలకులు ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటున్నారు. వాటికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వానికి సైన్యానికి మధ్య సమన్వయం ఉంది. ప్రజలకూ ఈ రెండు వ్యవస్థలపై నమ్మకం ఉంది. పుల్వామా ఘటన తర్వాత ప్రజల ఆక్రోశం తారస్థాయికి చేరుకుంది. ప్రజల మనసు లలో తమ సైనికుల మీద జరిగిన దాడి పట్ల ఆవేదన ఉంది. పాకిస్తాన్‌ చర్యలపై కోపోద్రిక్తులై ఉన్నారు. 40 మంది సిఆర్‌పిఎఫ్‌ జవానులను బలి తీసుకున్న తీవ్రవాదులు పాకిస్తాన్‌ పెంచి పోషిస్తున్నవారే. అలాంటివారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రజలు భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ప్రజల భావాలను అర్థం చేసుకున్న ప్రధాని మోదీ వారికి భరోసా కల్పించారు. తీవ్రవాదుల ఈ పిరికి పంద చర్యకు తగు జవాబు త్వరలోనే ఉంటుందని దృఢంగా చెప్పారు. భారత సైనికులు చిందించిన ప్రతి నెత్తుటి బొట్టు, మన ప్రజానీకం కార్చిన ప్రతి కన్నీటి చుక్క వ్యర్థం కాదని అన్నారు. జవానుల బలిదానానికి లెక్కలు సమం చేస్తాం అని చెప్పారు. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం సంకల్పించింది. సైన్యానికి ఈ విషయంలో తీసుకోవలసిన నిర్ణయాలపై పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ప్రభుత్వం. భారతదేశం ఇప్పుడు ధృఢంగా వ్యవహరిస్తున్నది. దాని ఫలితమే ఇలాంటి నిర్ణయాలు. ఇప్పుడు ఇది నూతన భారతదేశం. ఎలాంటి తీవ్రవాద సంఘటన లను, చర్యలను ఇక సహించదు. తీవ్రవాదాన్ని పెంచి పోషించే వారిని కూడా ఉపేక్షించదు.

పుల్వామా తరహా ఆత్మాహుతి దాడులు గతంలోనూ చాలా జరిగాయి. ఇలాంటివి ముందు ముందు జరక్కుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి?

మీతో నేను ఏకీభవిస్తున్నాను. ఇంతకుముందు ఇలాంటి దాడులు జరిగాయి. ఇకముందు పాకిస్తాన్‌ ఇలాంటి దాడులకు పూనుకోలేకపోవచ్చు. కానీ ఇదే చివరి దాడి అని కూడా చెప్పలేం. కాబట్టే ఊరికే ఉండబోం. ఇకముందు పుల్వామా లాంటి దాడులు జరుగకుండ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసు కుంటున్నాం. మన సైనికుల ప్రాణాలు కాపాడుతాం. పుల్వామా దాడి జరిగిన మరుసటి రోజునే ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో సంబంధిత మంత్రులు, రక్షిణాధికారుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో భవిష్యత్‌ చర్యలపై చర్చ జరిగింది. నిర్ణయాలూ జరిగాయి. ఫలితంగా ఒకవైపు పాకిస్తాన్‌ భూభాగంలో ఉన్న తీవ్రవాదుల శిక్షణా స్థావరాలపై మెరుపుదాడులు, మరోవైపు ప్రపంచ దేశాలలో పాకిస్తాన్‌ను ఏకాకి చేయడం ఈ రెండు పనులు పూర్తి చేశాం. ఈ సందర్భంలో మీకు నేనొక విషయం గుర్తు చేయాలి. మోదీ ప్రధాని అయిన వెంటనే ప్రథమంగా పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పే ప్రయత్నాలు ప్రారంభించారు. అవే ఇప్పుడు ఫలితాలిస్తున్నాయి.

అటల్‌జీ అంటుండేవారు ‘స్నేహితులను ఎన్నుకోగలవు కాని ఇరుగు పొరుగు మార్చుకోలేవు’ అని. కాబట్టి పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడమే మంచిమార్గం. మోదీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పొరుగు దేశాల నేతలందరిని ఆహ్వానించారు. అప్పటినుండి ఆయా దేశాలతో సత్సంబంధాలు నెరపుతూనే ఉన్నారు. ఆయన అంతటి సమర్ధుడు కాబట్టే పాకిస్తాన్‌పై మెరుపుదాడులకు ఆదేశం ఇవ్వగలిగారు. పొరుగు దేశం ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా భారత్‌ కిమ్మనకుండా ఉండిపోయే దేశం కాదిప్పుడు. తీవ్రవాద చర్యలకు పాల్పడితే తగిన బుద్ధి చెప్పగల ధైర్యం, స్థైర్యం ఉన్న దేశంగా మారింది. ప్రస్తుతం ఉన్న నాయకత్వం కూడా అలాంటిదే. మేము పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెరపడంలో ఎలా ఉండ గలమో; తేడా వస్తే, అరాచక చర్యలకు పాల్పడితే తగురీతిలో బుద్ధి కూడా చెప్పగలం. అరాచక చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించం. అంత ర్జాతీయంగా పాక్‌ను ఒంటరి చేసే ప్రక్రియ నడుస్తూనే ఉంది! ఈ విషయంలో మనం సత్ఫలితాలు అందుకుంటున్నాం.

పఠాన్‌కోట్‌ దాడి, ఉరి దాడి, ముంబయి తాజ్‌ హోటల్‌పై దాడి, ఇప్పుడు పుల్వామా దాడి. ప్రతిసారి పాకిస్తాన్‌ ఒకే పాట పాడుతోంది. ఈ దాడులతో, దాడిచేసిన వ్యక్తులతో మాకేమి సంబంధం లేదంటోంది. ప్రతిదాడి తర్వాత భారత్‌ పాకిస్తాన్‌కు తగు సాక్ష్యాధారాలను అందజేసింది. నేడు ప్రపంచ దేశాలకు కూడా పాకిస్తాన్‌ దేశంలో తీవ్రవాదుల శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయని తెలిసిపోయింది. అయినా పాకిస్తాన్‌ బుకాయిస్తోంది.

పాక్‌ నిజ స్వరూపాన్ని ప్రపంచ దేశాలకు తెలియ జెయ్యడానికి మీరెలాంటి చర్యలు తీసుకోనున్నారు?

అవును మీరు చెప్పినట్లుగా ప్రతీ దాడి తరువాత పాకిస్తాన్‌ రుజువులు అడుగుతోంది. మేము ప్రతిసారీ అందజేస్తున్నాం. మేమే కాదు ఇంతకు ముందున్న సంకీర్ణ ప్రభుత్వాలు కూడా అందజేశాయి. కాని పాకిస్తాన్‌ ప్రభుత్వం వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనివల్ల పాకిస్తాన్‌ వైఖరి స్పష్టం అవుతోంది. తన దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్న తీవ్రవాదులు హాఫీజ్‌ సయీద్‌, మౌలానా అజర్‌ మసూద్‌లపై చర్యలు తీసుకోవడానికి ఆ దేశం సుముఖంగా లేదు.

అందుకే అంతర్జాతీయంగా ఈ విషయాల్ని బహిర్గతం చేస్తున్నాం. తీవ్రవాదులు అని తెలుస్తున్న ప్పటికీ వారిపై పాకిస్తాన్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విభిన్న అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేస్తున్నాం. ఇక పాకిస్తాన్‌కు అందుతున్న ఆర్థిక సహాయం, తీవ్రవాదులకు అందుతున్న ఆర్థిక మూలాల గురించి ప్రపంచ దేశాలకు చెపుతున్నాం. మేము ఖీూుఖీకి అన్ని వివరాలు అందజేశాం. ఫలితం- నేడు పాకిస్తాన్‌ ఒంటరి అయింది. ప్రస్తుతం ‘+తీవవ’ లిస్టులోకి వెళ్లింది. కాని పాకిస్తాన్‌ చర్యలకు గమనిస్తే దానిని ‘బ్లాక్‌ లిస్టు’లో చేర్చాల్సిందే. ఈ దిశలో మేము గట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఇక మూడవ విషయం పాకిస్తాన్‌ పోషిస్తున్న తీవ్రవాద కూటములు, తీవ్రవాదుల గురించి ప్రపంచ దేశాలకు వివరిస్తున్నాం. మరో ఆశ్చర్యకరమైన విషయ మేమంటే ఖచీూ లో 1986 నుండి ఇప్పటివరకు ‘టెర్రర్‌’ అనే పదాన్ని నిర్వచించలేకపోతున్నారు. పాకిస్తాన్‌ దీనివలన లబ్ధి పొందుతోంది.

టెర్రర్‌ అనే పదాన్ని వారు నిర్వచించలేదు. కాబట్టే పాకిస్తాన్‌ తమ దేశంలో నడుస్తున్న లష్కర్‌-ఎ-తోయిబా, జమాత్‌-ఉద్‌-దవా, జైష్‌-ఏ- మహమ్మద్‌ వంటి తీవ్రవాద సంస్థలను సామాజిక, స్వచ్ఛంద సంస్థలుగా చూపిస్తోంది. అంతేకాకుండా వాటికి ఆర్థిక సహాయం అందేలా చూస్తోంది. ఈ అన్ని విషయాలు ఖచీూ గమనిస్తోంది. పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచడానికి ప్రధాని మోదీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్తాన్‌ మిత్ర దేశాలకు కూడా పాక్‌ నిజ స్వరూపాన్ని విశదపరుస్తున్నాం. నేటి పాకిస్తాన్‌ పరిస్థితులు గమనిస్తే మీకు ఈ విషయం స్పష్టమవుతుంది.

భారతదేశం ఈసారి కూడా పుల్వామా ఘటన రుజువులు పాకిస్తాన్‌కు అందజేయనుందా?

చూడండి! దీనిగురించి బహిరంగంగా నేను మీకు చెప్పలేను. కాని పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాలలో ఒంటరి చేయడానికి మేము అన్ని స్థాయిలలో ప్రయత్నాలు చేస్తునాం.

హఫీజ్‌ సయీద్‌, అజర్‌ మసూద్‌, దావూద్‌ ఇబ్రహీం లాంటి తీవ్రవాదులు, తీవ్రవాద ముఠాలు పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా?

ప్రజలు కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగు తున్నారు. నేను దేశ ప్రజలకు విశ్వాసం కల్పిస్తున్నాను. ప్రధానమంత్రి మోదీ స్వయంగా ప్రజల కన్నీరు వ్యర్థంగా పోదని అన్నారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తామని అన్నారు. ఈ ప్రభుత్వం తీవ్రవాదుల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తుంది.

కశ్మీర్‌లో జరుగుతున్న అక్రమ చొరబాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

కశ్మీర్‌లో జలమార్గంలో, భూమార్గంలో పలు విధాలుగా కొనసాగుతున్న అక్రమ చొరబాట్లను అడ్డుకునేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. సరిహద్దు దళం (దీూఖీ) మన సరిహద్దులను వేయికళ్లతో కాపాడుతోంది. మన రక్షణ బలగాలలో ఏ ఒక్క సైనికుడు మరణించినా మనకు బాధ కలుగుతుంది. కాని మన దేశంలోని కొందరు రాజకీయ నాయకులు ఏదైనా ఒక దుర్ఘటన జరిగి ఎవరైనా ప్రాణాలు కోల్పోయినప్పుడు రక్షణ దళాల గురించి రకరకాల ప్రశ్నలు, సందేహాలు వ్యక్తపరు స్తారు. మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రక్షణ దళాలే ఇంతకుపూర్వం ఎన్నో ఉగ్ర దాడులను విఫలం చేశాయి. మన సైనిక, రక్షణ దళాలు శక్తివంతంగా పనిచేస్తున్నాయి.

మనదేశం తీవ్రవాద సమస్యను ఎంతోకాలంగా ఎదుర్కొంటున్నది. ప్రభుత్వ రంగంలో వివిధ క్షేత్రాలలో అధికారులను నియమించేటప్పుడు ఆయా రంగాలలో వారి విశేష అనుభవాలను పరిశీలిస్తారు. అదేవిధంగా జమ్ము-కశ్మీర్‌లో ఉగ్రవాద వేర్పాటు వాద సంఘటనల దృష్ట్యా ఆయా విషయాలలో అనుభవమున్న అధికారులను నియమిస్తున్నారా?

మిగతా క్షేత్రాలలో నియామకాలు జరిగేటప్పుడు ఆయా వ్యక్తుల అనుభవాలను ఎలా పరిగణిస్తామో అలాగే సైన్యంలోని అధికారులను, సైనిక బలగాలను నియమించేటప్పుడు వారివారి అనుభవాలను పరిశీలిస్తాం. జమ్ము-కశ్మీర్‌ సైనికులు, పోలీసులు, అర్థ సైనిక బలగాలు, స్థానిక ఏజెన్సీ వ్యక్తులు అందరూ కలిసి సమన్వయంతో పనిచేస్తారు. వీరందరి సేవలను ప్రభుత్వం ప్రశంసిస్తుంది కూడా. ఈసారి అమర్‌నాథ్‌ యాత్ర చాలారోజులపాటు జరిగింది. కాని ఒక దుర్ఘటన కూడా జరగకుండా యాత్ర ముగిసింది. కారణం రక్షణ దళాల నిర్విరామ కృషే. దురదృష్టమేమంటే రక్షణ దళాల సేవలను మనం వెంటనే మర్చిపోతున్నాం.

జమ్ముకశ్మీర్‌లో సామాజిక మాధ్యమాలలో ముఖ్యంగా వాట్సప్‌ గ్రూపులలో ప్రతి 3 గ్రూపులకు ఒక గ్రూపు ‘అడ్మిన్‌’ పాకిస్తానీయుడు అని తెలుస్తోంది. సోషల్‌ మీడియా ద్వారా కశ్మీర్‌లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని మీరు ఎలా అడ్డుకుంటారు?

ఈ విషయంలో మా ఏజెన్సీలు అధ్యయనం చేస్తున్నాయి. మరోవైపు సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు వివిధ మాధ్యమాల ద్వారా జరుగుతున్న దుష్ప్రచారం, జరుగబోయే నష్టాన్ని వివరిస్తూ, ఎలాంటి అపోహలు కలిగించే వార్తలను ‘షేర్‌’ చేయవద్దని, అలాంటి వాటిని ప్రోత్సహించ వద్దని చెపుతున్నాం. వాట్సప్‌లో వచ్చే వీడియోలను చూడగానే నమ్మవద్దని, నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెపుతూ ప్రజలలో అవగాహన కలిగిస్తున్నాం. వాట్సప్‌లో ఇలాంటి సందేశాలను భారతీయులు కాని వారే పోస్టు చేస్తున్నారు. ప్రభుత్వం వారిపై నిఘా పెట్టింది.

మన రక్షణ శాఖను ఇంతకుముందటి పాలకులు నిర్లక్ష్యం చేశారు. సైనికులకు అవసరమైన ఆయుధాలు, బులెట్‌ప్రూఫ్‌ జాకెట్‌లు, మందుగుండు సామాగ్రి, యుద్ధ విమానాలు ఇలా ఎన్నెన్నో రంగాలలో నిర్లక్ష్యం చేశారు. ఇవాళ రక్షణ శాఖ స్థితి ఎలా ఉంది?

మేము 2014లో అధికారంలోకి రాగానే రక్షణ శాఖకు చెందిన కొన్ని విషయాలపై సమీక్షించాము. అనుకోకుండా యుద్ధమే వస్తే మన సైనికులకు 10 రోజులకు సరిపడ మందుగుండు మాత్రమే అందుబాటులో ఉంది. సైనికులకు బులెట్‌ప్రూఫ్‌ జాకెట్‌లు కూడా లేవు. రక్షణ శాఖకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినా సైనికుల అవసరాలు తీరలేదు. మరోవైపు మన యుద్ధ విమానాల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. మన ఇరుగు పొరుగు దేశాలేమో సైనికశక్తిని పెంచుకునే దిశలో ముందున్నాయి. మేము అధికారంలోకి వచ్చాక వాయుసేన తనకు అవసరమైన విమానాలను కొనుగోలు చేయమని అనుమతించాం. ఇలా కావలసిన వాటికి నిధులు కేటాయించాం. మందుగుండు, ఇతర అవసరాలకు భారీగా నిధులు కేటాయించాం. ఇంతకుముందున్న ప్రభుత్వం కేవలం కాగితాలపైనే లెక్కలు చూపించింది. ఆచరణ శూన్యం. మేము ఆచరించి చూపాం. సైనిక బలగాలను శక్తిమంతం చేశాం. ఇక ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.

కొందరు రాజకీయనాయకులు రక్షక బలగాల మధ్య విబేధాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మరికొందరు సామాజిక మాధ్యమాల ద్వారా సైనికుల మనోబలాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా చింతించవలసిన విషయం. దీనిపై మీరేమి చెప్తారు ?

నిజమే అది చింతించవలసిన విషయమే. కొందరు రక్షణ బలగాల మధ్య అగాధాలు సృష్టించా లని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. పుల్వామాలో చనిపోయిన సైనికులలో ఫలానా జాతి వారున్నారని ఒక పత్రిక ప్రచురించింది. నిజానికి సైనిక బలగాలలో ఇలాంటి ఆలోచనే ఉండదు. ఇలాంటి వార్తలు ప్రచురించేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు మీడియా సంయమనం పాటించి పాఠకులకు, శ్రోతలకు, వీక్షకులకు ఎలాంటి వార్తలు అందించాలో అలాంటివే అందించే ప్రయత్నం చేయాలి. ప్రజల మనోభావాలు దెబ్బతినే వార్తలు ప్రసారం చేయకూడదు.

లద్దాక్‌లోని పశువుల కాపరులు అక్రమ చొరబాటు దారుల సమాచారం ప్రభుత్వానికి అందించేవారు. ఇప్పుడు వారే సరిహద్దులు దాటి వెళ్లిపోతున్నారని తెలిసింది. దీనికి మీ సమాధానం ?

మీరంటున్న విషయం మా దృష్టికీి వచ్చింది. భారత సైన్యం తమ గూఢచారి విభాగం ద్వారా అందిన విషయాలను విశ్లేషించి, ఇలాంటి విషయాలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకుంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం సైన్యానికి పూర్తిగా సహకరిస్తుంది.

– పాంచజన్య వారపత్రిక నుండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *