మోదీ వెంట నడిచిన మైనారిటీలు

మోదీ వెంట నడిచిన మైనారిటీలు

భారతీయ మేధావులది ఒక వింత మన్తత్వం. మార్పు అనేది ఉంటుందంటే వీరు నమ్మలేరు. అందులో సెక్యులర్‌ ముసుగులో అవాంఛనీయ శక్తుల కోసం పనిచేసే హిందువుల మనస్తత్వం మరీ వికృతం. ముస్లింలు తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారంటే వీరు కొద్డిగా అంగీకరించలేరు. ఆ సంగతి ఆలోచించేందుకు కూడా అంగీకరించరు. ముస్లింలు భారతీయ జీవన స్రవంతిలోనే తాము ఉన్నట్టు ప్రకటించుకోవడానికే మొగ్గు చూపుతున్నారని ఎవరైనా అంటే, వెంటనే వారి నోరు నొక్కేస్తారు. బీజేపీకీ, ముస్లింలకూ మధ్య ఒక శాశ్వత శత్రుత్వం ఉండాలని వీరు కోరుకుంటున్నారు. కానీ హిందూ -ముస్లిం సంబంధాలు ఒక చట్రం నుంచి బయట పడుతున్నాయి. బీజేపీ ముస్లిం వ్యతిరేక రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నదన్న ముద్రను 2019 ఎన్నికలలో ఆ పార్టీ చాలా వరకు చెరిపివేయ గలిగింది. దీనికి బలమైన రుజువే ఉంది. 2008లో నాటి యూపీఏ ప్రభుత్వం భారతదేశంలో ముస్లింలు కేంద్రీకరించి ఉన్న జిల్లాలు అంటూ 90 జిల్లాలను గుర్తించింది. ఇందులో ఉన్న 79 లోక్‌సభ నియోజక వర్గాలలో బీజేపీ 41 స్థానాలు గెలిచింది. 2014 ఆ 79 సీట్లలో బీజేపీ గెలిచినవి ఏడు మాత్రమే. ఇవే నియోజక వర్గాలలో కాంగ్రెస్‌ ఫలితాలు చూద్దాం. 2014లో వాటిలో కాంగ్రెస్‌ 12 స్థానాలు గెలిచింది. ఇప్పుడు అవి సగానికి తగ్గాయి. ముస్లింలు ఉన్నా ఈ జిల్లాలు అభివృద్ధి చెందాయి కాబట్టి బీజేపీకి ఓటు వేశారని అనుకోనక్కరలేదు. ఇవి ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయి. దీనిని బట్టే కొంచెం నిజాయితీ కలిగిన విశ్లేషకులు 2019 ఎన్నికలలో ముస్లింలంతా కలసి కట్టుగా ఒకే పార్టీకి ఓటు వేశారని తీర్మానించడం సరికాదని చెబుతున్నారు. అయినా ఇప్పటికీ ఒకే పాట వినిపిస్తున్నది- బీజేపీ ముస్లిం వ్యతిరేక రాజకీయం పక్షం.

ఈ మనస్తత్వం ఎందుకు? ఈ వాదనలు దేనికి? వీరికి భారతదేశం ప్రశాంతంగా ఉండడం ఇష్టం ఉండదు. ప్రశాంతంగా ఉంటే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. దానిని వీరు భరించలేరు. ఎందుకు? గతంలో మార్క్సిజం చెప్పిన వర్గపోరాటం దారుణంగా విఫలం కావడంతో (ప్రపంచమంతటా), ఇప్పుడు కింది కులాలను అగ్రకులాల మీదకు ఉసిగొల్పి, ముస్లింలను హిందువుల మీదకు ఉసిగొల్పి ఆ ఘర్షణలలో వర్గ పోరాటాన్ని చూసుకోవాలని వీరి ఆశ. అందులో భాగమే ముస్లిం ఓటర్లకు హిందూ బూచిన నిరంతరం వీరు చూపిస్తున్నారు. ఇందు కోసమే కొన్ని రాజకీయ పార్టీలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. ఈ దేశంలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రపంచంలో చాలా ముస్లిం దేశాలలో ఉన్న ముస్లింల కంటే ఈ దేశంలో వారి జనాభా కొంచెం ఎక్కువే. ఇందుకు ఆనేక చారిత్రక కారణాలు ఉన్నాయి. ఈ దేశంలో 1857 కంటే ఎంతో ముందు కాలం నుంచే మత కల్లోలాలు ఉన్నాయి. ఆ సంగతి విస్మరించి, బీజేపీ పుట్టిన తరువాత ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని వాదించడం అచారిత్రకం కాదా? మత ఘర్షణలన్నీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కారణంగానే జరుగుతున్నాయని తీర్పులు ఇవ్వడం అశాస్త్రీయం కాదా? ఎప్పుడు ఎన్నికలు జరిగినా ముస్లింలకు హిందూ బూచినీ, లేదా బీజేపీ బూచినీ చూపించడం రివాజుగా మారింది. ఈ దేశంలో ముస్లిం ఓటు బ్యాంక్‌ ద్వారా కొన్ని దశాబ్దాలు పబ్బం గడుపుకున్న కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, కొందరు సోషలిస్టులు ఆ వర్గానికి చేసినదేమీ లేదన్నది చేదు నిజం. కాంగ్రెస్‌ మైనారిటీలను అచ్చంగా ఓటు బ్యాంక్‌గానే ఉపయో గించుకుంది. ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. ముస్లింలు వాస్తవాలను తెలుసుకుంటున్నారు. ఉగ్రవాద సంస్థలను, దుష్చ్రచారాలను నమ్మి దుందుడుకు చర్యలకు దిగే ముస్లింల సంగతి వేరు. సాధారణ ముస్లిం వాస్తవాలను గమనిస్తున్నాడు. ఇటీవలి కాలంలో ముస్లిం ఓటు బ్యాంక్‌ తన స్వరూపాన్ని కోల్పోవడం అందులో భాగమే.

2014, 2019 లోక్‌సభ ఎన్నికలలో ముస్లింలు అధిక సంఖ్యలో బీజేపీకి ఓటు వేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను లోక్‌సభలో ముస్లింల ప్రాతినిధ్యం, ముస్లిం ఓటర్లు అనే కోణం నుంచి పరిశీలిస్తే కొన్ని అంశాలు, విశేషాలు బోధపడతాయి. బీజేపీకీ, ముస్లింలకు బద్ధవైరం అన్న వాదన బలం కోల్పోతుంది కూడా. అంటే ఇంతకాలం కొన్ని టీవీ చానెళ్లు, అందులో స్వయం ప్రకటిత మేధావులు చేస్తున్న వాదనలు వీగిపోతాయి. సాధారణంగా ముస్లింలంతా కలసి ఒకే మాట మీద నిలబడి, ఎంపిక చేసుకున్న పార్టీకి ఓటు వేస్తారన్న అభిప్రాయం ఉంది. ఈ ఎన్నికలలో ముస్లింలంతా గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటు వేయలేదు. నిజానికి ముస్లింలంతా ఒకే పార్టీకి ఓటు వేశారన్న, లేదా వేస్తారన్న వాదనకి సమీప గతంలోనే తగిన రుజువులు లేవు. 2014, 2019 ఎన్నికలే ఇందుకు సాక్ష్యం. ముస్లింలు ఓటు వేసే ధోరణికి సంబంధించి 2014లోనే మార్పు ప్రారంభమైంది. 2019లో ఆ మార్పు సుస్థిరమైనట్టు కనిపిస్తుంది కూడా. ఈ ఎన్నికలలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 62 చోట్ల గెలిచింది. ఆ పార్టీకి 49.6 శాతం ఓట్లు వచ్చాయి. వీటిలో చాలా నియోజకవర్గాలలో ముస్లింలు 40 శాతానికి మించి ఉన్నారు. ఈ నియోజక వర్గాలలో ముస్లిమేతరులను పోటీకి నిలిపి బీజేపీ గెలిపించుకుంది. ముజఫరా నగర్‌లో కొద్దికాలం క్రితం మత ఘర్షణలు జరిగాయి. ఓటర్లు మతాలు పునాదిగా రెండుగా చీలిపోయాయి. కానీ ఈ స్థానంలో బీజేపి అభ్యర్థి సంజీవ్‌కుమార్‌ బల్యాన్‌ గెలిచారు. ఆయనకు 5,73,780 (49.46శాతం) ఓట్లు వచ్చాయి. ఇక్కడే రాష్ట్రీయ లోక్‌దళ్‌ తరఫున పోటీ చేసిన అజిత్‌ సింగ్‌కు 5,67,254 ఓట్లు దక్కాయి. ఇవన్నీ ప్రధానంగా బీజేపీ పట్ల అసంతృప్తి ఉన్న జాట్‌లవే.

పశ్చిమ బెంగాల్‌లో మాల్డా ప్రాంతంలోని అట్టార్‌ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువ. కానీ అక్కడ బీజేపీ బరిలోకి దింపిన ఖాగెన్‌ మార్ము గెలిచారు. బీజేపీ అభ్యర్థికి 37.61 శాతం ఓట్లు, టీఎంసీ అభ్యర్థి ఇషాఖాన్‌ చౌధురికి 22.53 శాతం ఓట్లు వచ్చాయి. అంటే ముస్లింలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో తృణమూల్‌ నిలిపిన ముస్లిం అభ్యర్థి బీజేపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. బెంగాల్‌లో కొన్ని నియోఎజక వర్గాలలో కూడా ఇలాంటి వింతలే కనిపించాయి.

2009కి ముందు దేశంలో హిందూ ఓటు కులాల వారీగా విడిపోయి ఉండేది. అయితే రాను రాను పెరిగిన హిందూ చైతన్యం, జాతీయ అంతర్జాతీయ పరిణామాలు ఓటింగ్‌ మీద ప్రభావం చూపించాయి. 2014 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఆరుగురు ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపింది. ముగ్గురు కశ్మీర్‌ నుంచి, ఇద్దరు పశ్చిమ బెంగాల్‌ నుంచి, ఒకరు లక్షద్వీప్‌ నుంచి పోటీ చేశారు. అయితే ఏ ఒక్కరు గెలవలేదు.

2019 ఎన్నికలలో బీజేపీ ఒక్క ముస్లింను కూడా అభ్యర్థిగా బరిలోకి దింపలేదు. కానీ ముస్లిం ఓటర్లు హిందూ అభ్యర్థులకే ఓటు వేశారు. పదిహేడో లోక్‌సభకు మొత్తం 27 మంది ముస్లింలు ఎంపికయ్యారు. కానీ వీరిలో ఎవరూ బీజేపీ నుంచి విజయం సాధించలేదు. కా బట్టి దీనర్థం ముస్లింలు బీజేపీకి ఓటు వేయలదని చెప్పడం సాధ్యం కాదు. లోక్‌నీతి, సీఎస్‌డిఎస్‌ సంస్థ సర్వే ప్రకారం 2014లో బీజేపీకి వచ్చిన ముస్లిం ఓట్ల శాతం బాగా పెరిగింది. బీజేపీకి పడిన ముస్లింల ఓట్ల శాతం రెట్టింపు అయింది. కాంగ్రెస్‌కు తగ్గింది. 2009లో నాలుగు శాతంగా ఉన్న బీజేపీ ముస్లిం ఓట్ల వాటా, 2014లో 9 శాతానికి చేరింది.

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 543 లోక్‌సభ నియోజక వర్గాలలో 29 స్థానాలలో ముస్లింలు 40 శాతానికి మించి ఉన్నారు. ముస్లింలు అత్యధికంగా జమ్మూకశ్మీర్‌, ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లతో వంటి చోట ఇలాంటివి 27 నియోజకవ ర్గాలు ఉన్నాయి. మిగిలిన రెండు లక్షద్వీప్‌, హైదరాబాద్‌లలో ఉన్నాయి.

దేశంలో ముస్లింలు చెప్పుకోదగిన సంఖ్యంలోనే ఉన్నప్పటికీ వారంతా చెదురుమదురుగా ఉండడంతో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కూడా ముస్లింలకు పార్లమెంటులో దక్కవలసినంత ప్రాధాన్యం దక్కడం లేదన్న అభిప్రాయం ఉంది. 2014 ఎన్నిలలో ఆ 29 ముస్లిం నియోజకవర్గాలలో ఏడింటిని బీజేపీ గెలిచింది. వీరెవరూ ముస్లింలు కారు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ఐదు స్థానాలను కూడా 2014లోనే బీజేపీ ఉత్తర ప్రదేశ్‌ నుంచి గెలుచుకుంది. కానీ 2009లో బీజేపీ అక్కడ రెండు స్థానాలు (ముస్లిం నియోజకవర్గాలలో) గెలుచుకుంది.

ముస్లింలు అంతో ఇంతో పెద్ద సంఖ్యలో ఉన్న నియోజక వర్గాలు కూడా తక్కువేమీ కాదు. ముస్లింలు 30 నుంచి40 శాతం ఉన్న నియోజక వర్గాలు 19 ఉన్నాయి. 20 నుంచి 30 శాతం ముస్లిం ఓట్లు ఉన్న నియోజక వర్గాలు 48. ఇలాంటి 68 స్థానాలలో బీజేపీ తన బలం చాటుకోగలిగింది. 2014 ఎన్నికలలో వీటిలో 39 మాత్రమే బీజేపీ వశమైనాయి.

విదేశాలకు దండయాత్రలకు వెళ్లి కబళించడం భారతదేశ చరిత్రలో లేదు. మతాలు మార్చిన చరిత్ర అసలే లేదు. వర్తమాన భారతంలో ముస్లింలను ఏకపక్షంగా ఊచకోత కోసిన సంఘటనలు, మతం మార్చిన దుర్ఘటనలు కూడా లేవు. మేధావి బిరుదాంకి తులు ఈ విషయాన్ని పదే పదే వల్లింస్తున్నారు కాబట్టి కొందరు విశ్లేషకులు ఈ వాస్తవాలు వెల్లడించారు. భారతీయులు ఎవరైనా బీజేపీకి మిత్రులే.

– జాగృతి డెస్క్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *