అలా చేస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది

అలా చేస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది

మన దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే ముందుగా గ్రామీణ భారతం సుసంపన్నం కావాలి. గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మూలాధారం వ్యవసాయమే.

వ్యవసాయ రంగంలో పాడిపంటకు అధిక ప్రాధాన్యముంది. రైతులు సంక్షేమంగా ఉండాలంటే పంటలతో పాటు ‘పాడి’ ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.

పాడిపంటల వల్లే వ్యవసాయరంగం ముందు కెళ్తుందని ఇటీవల నిర్వహించిన పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. ఆర్థిక పరిపుష్టికి, ఉపాధి కల్పనకు, ఆరోగ్యవంతమైన జీవితానికి, పిల్లల మనోవికాసానికి పాల ఉత్పత్తి గణనీయంగా తోడ్పడుతుంది.

పశుసంపదలో ప్రపంచంలో మనదేశం గణనీయమైన స్థానంలో (1/5 వంతు) ఉన్నప్పటికి వార్షిక పాల ఉత్పత్తిలో (ప్రస్తుతం సుమారు 160 మి. టన్నులు) మాత్రం వెనుకబడి ఉన్నాం.

భారతదేశంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా వార్షిక పాల వినియోగం 2022 నాటికి 300 మిలియన్‌ టన్నులుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ అంచనా మేరకు పాల ఉత్పత్తిని పెంచాలంటే మౌలికంగా గేదెలను, ఆవులలో జన్యుపరంగా వృద్ధిచేసి తద్వారా పాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరముంది. అదేవిధంగా పశువులకు అందించే ఆహారంలో పోషక విలువలతో కూడిన పచ్చి పశుగ్రాసాల శాతాన్ని కూడా గణనీయంగా పెంచాలి.

ప్రస్తుతం మనదేశంలో పాలిచ్చే పశువులకు ఎండుగడ్డి, పచ్చి పశుగ్రాసం తగినంతగా అందుబాటులో ఉండటం లేదు. మేలైన అధిక పాలిచ్చే ఉన్నత శ్రేణి దేశీ పాడి పశువులు కూడా మనదేశంలో తగినన్ని లేవు.

మంచి పోషక విలువలతో కూడిన పచ్చి పశుగ్రాసాల వినియోగం వల్ల పాల ఉత్పత్తి పెరగడంతో పాటు పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పచ్చి పశుగ్రాసం మేలైన దూడల ఎదుగుదలకు తోడ్పడుతుంది. వాటి ఎంపికలో కూడా అది పరోక్షంగా సహకరిస్తుంది.

పోషక పదార్థాలతో కూడిన మేలైన పశుగ్రాసాలను సాగుచేసి పశువులకు అందించే దాణాలో వాటిని విరివిగా వాడి గేదెలు, ఆవులకు అధిక ప్రోటీన్లు అందించొచ్చు. ఇతర ముడి దాణాల వినియోగాన్ని కూడా తగ్గించుకొని డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

పశుగ్రాసాల సాగులో ముఖ్యంగా చిక్కుడు జాతి పంటలను సాగు చేయడం వల్ల భూసారం దెబ్బతినదు. పచ్చి పశుగ్రాసాల వినియోగం వల్ల మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు నాణ్యమైన పాల ఉత్పత్తుల వల్ల ఆదాయం కూడా పెరుగుతుంది. పాల ఉత్పత్తులను తగినంతగా పెంపొందించుటకు అవసరమైన పశుగ్రాసాల సాగు విస్తీర్ణాన్ని, మొత్తం సాగు విస్తీర్ణంలో 10 శాతం వరకు పెంచేందుకు ప్రస్తుతం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పశుగ్రాసాల సాగు వల్ల వాతావరణం కాలుష్యం కాదు.

ప్రస్తుతం మనదేశంలో చిన్న చిన్న కుటుంబాల నుంచే 80 శాతం మేర పాల ఉత్పత్తి జరుగుతోంది. ఈ చిన్న కుటుంబాలకు సరాసరి 1-2 పాలిచ్చే గేదేలు/ఆవులు మాత్రమే ఉండటం గమనార్హం. ప్రస్తుతం పలు చోట్ల ఒక్కో పాడి పశువు రోజుకు 4-7 లీటర్ల పాలను మాత్రమే ఇస్తోంది. ఈ ఉత్పత్తి స్థాయిని గణనీయంగా పెంచేందుకు పాడి గేదెలు/ఆవులకు మంచి పోషక విలువలతో కూడిన పశుగ్రాసం అందించాలి. పాల ఉత్పత్తిదారులకు పాల ఉత్పత్తులను పెంపొందించుటకు అవసరమైన మెళకువలను నేర్పించి, ఆచరింపజేసి ఉత్పత్తులను పెంచాలి.

అనువైన రకాలు:

జొన్న: ఏక కోత రకాలు – పి.సి.- 6, పి.సి. – 9, సి.ఎస్‌.వి. 30 ఎఫ్‌

పలు కోత రకాలు – పి.సి.- 23, ఎం.పి.చారి, ఎస్‌.ఎస్‌.జి.59-3

పలు కోత హైబ్రిడ్లు – సి.ఎస్‌.హెచ్‌.-24 ఎం.ఎఫ్‌,

గడ్డి, గింజ రకాలు – పి.ఎస్‌.వి. – 31, పి.ఎస్‌.వి.-56

బహు వార్షికాలు – కె.ఎఫ.్‌ఎన్‌.- 29, కె.ఎఫ్‌.ఎస్‌.- 31

మొక్కజొన్న: ఆఫ్రికన్‌టాల్‌, జె -1006

సజ్జ : పలు కోతరకాలు- మోతి బాజ్రా, జైయింట్‌ బాజ్రా, బైఫ్‌ బాజ్రా, రాజ్‌కో బాజ్రాలు

ఓట్స్‌ : కెంటో, ఒ.ఎస్‌.-6, ఆర్‌-ఒ-18

బొబ్బెర్లు / అలసందలు: విజయ, ఎం.పి.సి-5286, ఇసి-4216, బుందేల్‌ లిబియా -1, బుందేల్‌ లిబియా-2

బాజ్రానేపియర్‌ హైబ్రిడ్లు: ఎ.పి.బి.ఎన్‌.-1, కో-4, కో-5, బిఎన్‌్‌హెచ్‌-10 పూలె జయంత్‌

అంజన్‌గడ్డి : సివిజెడ్‌ ఆర్‌.ఇ- 75, 76; ఇ.జి.ఎఫ్‌.ఆర్‌.ఐ- 3108, 3813

గినీగడ్డి: హమిల్‌, మాకుని, కో.జి.జి-3, డి.జి.జి-1

లూసర్న్‌ : ఏకవార్షికాలు- ఆనంద్‌-1, ఆనంద్‌-2,

బహు వార్షికాలు – ఆర్‌.ఎల్‌.-88, టి-9, కో-1

స్టైల్‌: హమటా, సియాబియానా, స్కాబ్రా గ్వానెన్సిస్‌

దశరథ గడ్డి: (హెడ్జ్‌ లూసర్న్‌): వేలిమసాల్‌

పశుగ్రాసాల సాగుకు అనువైన పంటలు, రకాలు

పశుగ్రాసాలు ఏక వార్షికాలు బహు వార్షికాలు

ధాన్యపు జాతి గ్రాసాలు జొన్న కోఎఫ్‌ఎన్‌ – 29

మొక్కజొన్న, కోఎఫ్‌ఎన్‌ – 31

సజ్జ, ఓట్స్‌

పప్పుజాతి గ్రాసాలు బొబ్బెర్లు లూసర్న్‌

ఉలవలు స్టైలో

గోరు చిక్కుడు దశరథ గడ్డి

పిల్లి పెసర, క్లైటోరియా

జనుము

గడ్డిజాతి పశుగ్రాసాలు బాజ్రానేపియర్‌

హైబ్రిడ్లు

గినీగడ్డి

పారాగడ్డి

ధీనానాధ్‌ గడ్డి

అంజన్‌గడ్డి

రోద్స్‌ గడ్డి

క్రైసోపోగాన్‌

సెహిమా గడ్డి

సిగ్నల్‌ గడ్డి

చెట్లలో పశుగ్రాసానికి అనువైనవి సుబాబుల్‌

అలిసె

యెప్పి

గంగరావి

మునగ

మల్బరి

మాద్రి

– ప్రొ.పి.రాఘవరెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, 9989625230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *