Archive For The “స్పూర్తి” Category

నడిచే రామకోటి పుస్తకాలు

By |

నడిచే రామకోటి పుస్తకాలు

కారడవిలో ఒంటరిగా పడున్నాడతడు. ముఖం చూస్తే ఏడ్చి ఏడ్చి సొలసినట్టు తెలుస్తోంది. కన్నీళ్ల చారికలు కనిపిస్తున్నాయి. అతను ఆహారం మానేసినట్టు బక్కచిక్కిన దేహం చెప్పకనే చెబుతోంది. అలా ఎన్ని రోజులు పడున్నాడో తెలియదు. అతని పెదవులు వణుకుతున్నాయి. కాదు కాదు కదులుతున్నాయి. ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ‘రాం… రాం … రాం…’ మరో మాట లేదు. ఒక్క ‘రాం రాం రాం’ తప్ప. అతని పేరు పరశురాం. ఊరు ఛపారా. రాయగఢ్‌ జిల్లా. రాముడంటే అతనికి ఎంతో…

Read more »

తండ్రి బాటలోనే…!

By |

తండ్రి బాటలోనే…!

– ఉన్నతోద్యోగం వదిలి.. సేంద్రియ వ్యవసాయం వైపు.. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. ఆరోగ్యం విలువ అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రమే తెలుస్తుందంటారు. అది నిజమే. అజ్మీర్‌లో నివసిస్తున్న పూల్‌చంద్‌కి తన కూతురు అంకిత కామెర్ల వ్యాధికి గురైనప్పుడే ఆరోగ్యం విలువ తెలిసింది. పూల్‌చంద్‌ సాధారణ రైతు కుటుంబంలోనే జన్మించినప్పటికీ ఉన్నత చదువులు చదివి డీడబ్ల్యూడీలో ఇంజనీర్‌గా స్థిరపడ్డాడు. ఇద్దరు కూతుళ్లు. అంకిత, ప్రణవి. అప్పుడు అంకిత వయస్సు మూడేళ్లు. కామెర్ల వ్యాధితో తీవ్రంగా బాధపడుతోంది. జబ్బు నయం…

Read more »

కార్పొరేట్‌ ఉద్యోగాలు వదిలేశారు చీకటి బతుకుల్లో వెలుగులు నింపారు!

By |

కార్పొరేట్‌ ఉద్యోగాలు వదిలేశారు చీకటి బతుకుల్లో వెలుగులు నింపారు!

‘సామాజిక చైతన్యం ఉంటే చాలు విజయాలు సాధించవచ్చు’ అనే విషయాన్ని ఆ ఇద్దరు యువకులు మరోసారి నిరూపించారు. అంధకారంలో ఉన్న గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. భారతదేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం లభించిందని ఇటీవలి నివేదిక తెలుపుతోంది. కాని అనేక ఇళ్ళకు ఇంకా విద్యుత్‌ సౌకర్యం రావాల్సి ఉంది. ఈ పరిస్థితులను చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? కొందరు ‘అయ్యో.. పాపం’ అని ఆవేదన చెందుతారు. మరికొందరు ‘దేశంలో ఇప్పటికీ గ్రామాలు ఉన్నాయా?’…

Read more »

‘మీతోనే ఉంటాను సాబ్‌..’

By |

‘మీతోనే ఉంటాను సాబ్‌..’

‘రావోయ్‌ కలిసి క్రికెట్‌ ఆడుకుందాం’ అడిగాడు సీనియర్‌ పోలీస్‌ అధికారి శైలేంద్ర మిశ్రా. ఎందుకంటే తన బాడీగార్డ్‌కి క్రికెట్‌ అంటే ఎంత ఇష్టమో అతనికి తెలుసు. ముంబాయి ఇండియన్స్‌ అతని ఫేవరేట్‌ టీమ్‌. సచిన్‌ అంటే ప్రాణం. ‘సర్‌ మనిద్దరిలో ఒకరే ఆడగలం. మీరు ఆడితే నేను కాపలాగా నిలబడతాను. మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత’ అని ఆ పోలీసు కానిస్టేబుల్‌ జవాబిచ్చాడు. అతని పేరు జావేద్‌ అహ్మద్‌ దార్‌. ఏళ్ల తరబడి జావేద్‌ దార్‌, శైలేంద్ర…

Read more »

సంకల్ప బలమే నిలబెట్టింది…

By |

సంకల్ప బలమే నిలబెట్టింది…

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులవుతారు.. ఇది కేవలం సినిమా పాట మాత్రమే కాదు. ఇదే జీవిత సత్యం. కష్టపడితే సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. ఇందుకు ఉదాహరణ సన్మతి జీవితమే. సమాజం మొత్తం తనను చిన్నచూపు చూసినా సంకల్ప బలంతో తన అంగవైకల్యాన్ని అధిగమించి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్ది అందరికీ ఆదర్శప్రాయురాలైంది. సన్మతి వెన్నెముక సరియైన స్థితిలో లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. అయినా ఆమె కుంగిపోలేదు. ధైర్యంగా…

Read more »

మోహన్‌లాల్‌ కశ్మీరీ అలియాస్‌ ఆగా హసన్‌ జాన్‌

By |

మోహన్‌లాల్‌ కశ్మీరీ అలియాస్‌ ఆగా హసన్‌ జాన్‌

అఫ్గన్లను అడిగితే ఆయన పేరు మీర్జా కులీ కశ్మీరీ అని చెబుతారు. బ్రిటీషర్లకు, అఫ్గన్లకు మధ్య జరిగిన యుద్ధాల్లో ఆయన బ్రిటీషర్ల కోసం గూఢచర్యం చేశాడు. అఫ్గన్లను ఓడించేందుకు ప్రయత్నించాడు. తరువాత ఇరు సైన్యాల మధ్య సంధి చేయడంలో కీలక పాత్ర వహించాడు. ఇరానియన్లను ఆయన గురించి అడగండి! ఆయన పేరు ఆగా హసన్‌ జాన్‌ కశ్మీరీ అని చెబుతారు. ఆగా హసన్‌ జాన్‌ పర్షియన్‌ భాషలో ఉద్దండుడని ఆయన చరిత్రంతా చెబుతారు. కానీ ఆయన అసలు…

Read more »

కుమారులను ఉన్నతాధికారులుగా నిలబెట్టి పారిశుద్ధ్య కార్మికురాలు

By |

కుమారులను ఉన్నతాధికారులుగా నిలబెట్టి పారిశుద్ధ్య కార్మికురాలు

నిరంతరం కష్టపడాలే గాని ఎంత చిన్న పనిలో ఉన్నప్పటికీ ఎంతో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చు. అదే మాటను నిరూపిస్తున్నారు బిహార్‌కు చెందిన మహిళ. ఆమె వీధులు శుభ్రం చేసే పని చేస్తూ తన కుమారులను మంచి చదువులు చదివించి, ఉన్నత స్థానంలో నిలిపారు. ఆమె పదవీ విరమణ రోజున ఆ కుమారులు తన పాదాలను స్పృశించి, తనను, తన కష్టాన్ని నలుగురి ముందు స్మరిస్తే ఉబ్బితబ్బిబ్బయ్యారు. జీవితమంతా పడిన తన కష్టం మొత్తాన్ని మరచిపోయారు. ఆమె గురించే…

Read more »

వినూత్న ఆలోచనకు ప్రశంసల వెల్లువ

By |

వినూత్న ఆలోచనకు ప్రశంసల వెల్లువ

– ‘స్వచ్ఛ బండి’ తో పరిసరాలన్నీ శుభ్రం – ఇది పదిహేనేళ్ల బాలుడి సత్తా – ప్రతిభకు వయస్సుతో సంబంధం లేదని నిరూపించిన సికాంతో అవసరాలు ఆవిష్కరణకు దారితీస్తాయి. ‘స్వచ్ఛ బండి’ ని ఆవిష్కరించిన మధురకు చెందిన సికాంతో మండల్‌కు ఈ వాక్యం సరిగ్గా సరిపోతుంది. కేవలం 15 సంవత్సరాల ఈ బాలుడు ‘స్వచ్ఛ బండి’ పేరుతో అత్యాధునిక చెత్త సేకరణ వాహనాన్ని కనిపెట్టాడు. ఇది మార్కెట్‌లో ప్రస్తుతమున్న చెత్త సేకరణ వాహనాల కంటే చాలా భిన్నమైనది….

Read more »

కశ్మీరీ హిందువుల కోసం ప్రాణాలర్పించిన గురువు

By |

కశ్మీరీ హిందువుల కోసం ప్రాణాలర్పించిన గురువు

పండిత్‌ కృపారామ్‌ రెండు చేతులు జోడించి గురువు వైపే భక్తి శ్రద్ధలతో చూస్తున్నాడు. ఆయన వెంట వచ్చిన వారంతా కన్నీటితో గురువు వైపే చూస్తున్నారు. ‘గురుదేవా.. మా పరిస్థితి దయనీయంగా ఉంది. బతుకు దుర్భరమై పోయింది. మా ధర్మాన్ని మేము పాటించలేకపోతున్నాం. మమ్మల్ని ఇస్లాంలో చేరమని బలవంతపెడుతున్నారు. నానా అత్యాచారాలకు గురిచేస్తున్నారు’ వేదికపై గురువు కూర్చున్నారు. అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యానముద్రలో ఉన్నారా గురువు. పండిత్‌ కృపారామ్‌ మాటలు విని కళ్లు తెరిచారు. కహ్లూర్‌ లోని చక్‌నన్కీలో…

Read more »

ఐఐటి విద్యార్థుల ప్రతిభ…

By |

ఐఐటి విద్యార్థుల ప్రతిభ…

సహజ వనరుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. కాని నేడు వాటికి రక్షణ లేకుండా పోతోంది. అభివృద్ధి పేరుతో సమాజం ప్రకృతి వినాశనం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే కొందరు విద్యార్థులు మాత్రం ప్రకృతిని రక్షించేందుకు.. పర్యావరణ సమతుల్యాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నారు. తమ ప్రయోగాల ద్వారా సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడంతోపాటు వ్యర్థాల పునర్వినియోగం ద్వారా ప్రకృతిని కాపాడేందుకు తమ వంతుగా పాటుపడుతున్నారు. సాంకేతిక విద్య సహకారంతో, సూర్యరశ్మి సౌజన్యంతో ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి…

Read more »