Archive For The “పుస్తక సమీక్ష” Category

కుహనా మేధావులకు చెంపపెట్టు సమాధానాలు

By |

కుహనా మేధావులకు చెంపపెట్టు సమాధానాలు

ఘటం భింద్యాత్‌ ఫటం ఛింద్యాత్‌ కుర్యాత్‌ గార్ధభ రోహణమ్‌ | ఏనకేన ప్రకారేణ ప్రసిద్ధ పురుషోభవ || ఇదొక సంస్కృత శ్లోకం. ‘ఎలాగోలా అందరి కళ్లల్లో పడు, ప్రసిద్ధుడవవ్వు, దానికోసం నడిరోడ్లపై కుండలు బ్రద్దలు కొట్టు, గుడ్డలు చించుకో, గాడిద ఎక్కి ఊరేగు!’. ఇదీ దాని అర్థం. శ్లోకంలో పేర్కొన్న ‘ప్రసిద్ధ’ పురుషులకి మనదేశంలో లోటు లేదు. ‘అందరిదీ ఓదారి – ఉలిపిరి కట్టది మరోదారి’ సామెత మాదిరిగా ఉంటుంది వీరి వ్యవహారం. జాతీయవాదానికి వ్యతిరేకులైన వీరిని…

Read more »

ఇదేనా రేపటి చరిత్ర!

By |

ఇదేనా రేపటి చరిత్ర!

‘ఇవాళ్టి రాజకీయాలే రేపటి చరిత్ర’ అంటాడు కాలింగ్‌వుడ్‌. రాజకీయం వ్యవస్థను శాసిస్తుంది. తీర్చిదిద్దే బాధ్యత కూడా దానిదే. కాబట్టి రాజకీయాలు లేని సమాజాన్ని ఊహించలేం. మనందరినీ నడిపించేదీ రాజకీయమే. కాబట్టే రేపటిచరిత్ర అంటే ఇవాళ్టి రాజకీయాలు అంటూ సూత్రీకరించవలసి వచ్చింది. ఇక్కడే ఒక ప్రశ్న- ఈ సూత్రీకరణ ప్రకారం రేపటి భారతీయ చరిత్ర ఎలా ఉండబోతోంది? ఇది తలుచుకుంటే అనంతమైన క్షోభ తప్పదు. కారణం- ఇవాళ్టి భారత రాజకీయాలు, వాటి వికృత రూపం. సరిగ్గా ఆ రాజకీయాల…

Read more »

భావ విహంగాలు పలికిన అక్షరాలు

By |

భావ విహంగాలు పలికిన అక్షరాలు

‘కావివి కేవల శిల్పాల్‌, /కావివి పాషాణ ములును; కావివి బొమ్మల్‌/కావా ఇవి ముమ్మాటికి/చావని చరితపు వెలుగులు, శాంతి జ్యోతుల్‌?’ ఇది ‘హంపీ దిద్దిన అక్షరాలు’ (కవితా సంకలనం)లో కనిపించే ఒక పద్యం. హంపీ విజయనగరాన్ని చూసిన వారెవరికైనా అపారమైన దుఃఖం కలుగుతుంది. ఈ కవి కూడా అలాగే దుఃఖించారు. ఫలితమే ఆ పద్య మాలిక. శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం గారి ‘హంపీ దిద్దిన అక్షరాలు’ నిజానికి ఛందోబద్ధ పద్యాలతో కూర్చిన కావ్యం మాత్రమే కాదు. ఇదొక కదంబం….

Read more »

రమణులవారు… రామయోగి…

By |

రమణులవారు… రామయోగి…

భారతభూమికి ఆధ్యాత్మిక గుబాళింపు యోగుల పుణ్యమే. స్వాములు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఇంకా ఎందరో మహానుభావులు ఉన్నా యోగుల ఆధ్యాత్మిక సేవ ప్రాతఃస్మరణీయమైనది. ఆచరణతో ఆధ్యాత్మిక చింతనను అందరికీ పంచినవారు వారే. నిరాడంబరత, అందరికీ ఆచరణ సాధ్యమనిపించే ధార్మిక పంథా, అన్నింటికీ మించి, సాధనతో వచ్చిన అసాధారణ అనుభవాల గురించి చాటుకోకపోవడం, ప్రదర్శించకపోవడం వంటి లక్షణాలు వీరిలో అద్భుతమనిపిస్తాయి. డంబాచారాలను దూరంగా ఉంచగలుగుతాయి. మహోదాత్తమైన దైవభావన మీద సాధారణ వ్యక్తులలో భ్రమలు పెంచకుండా నిరోధించగలుగేవి ఇలాంటి లక్షణాలే. అలాంటి…

Read more »

అనుభవ కథనాల సమాహారం..

By |

అనుభవ కథనాల సమాహారం..

అనుభవాలు అందరికీ ఉంటాయి. అవి ఎందరికి జ్ఞాపకం ఉంటాయి? ఒక వ్యక్తి తన జ్ఞాపకాలను మరొకరితో పంచుకొన్నప్పుడు, అవి తాను కూడా జ్ఞాపకం ఉంచుకోవలసినవని అవతలి వ్యక్తి భావిస్తేనే వాటిని ‘అనుభవాలు’గా గుర్తిస్తాం. అంటే ఒక వ్యక్తి ఇష్టంగానో, కష్టంగానో నడచిన బాట, ఆ బాటలోని జాడలు, ముద్రలు ఇతరులకు వెలుగుబాట కావాలి. ఆ స్థాయిలో ఆ వ్యక్తి అనుభవమూ, జ్ఞాపకాలూ, నేర్చుకోదగ్గ పాఠమూ ఉండాలి. అటువంటి విలువైన, మేలైన, అరుదైన అనుభవాల సంపుటి ‘ఇప్పచెట్టు నీడలో..’…

Read more »

ఐక్యతా మంత్రమే ఆయన ఊపిరి

By |

ఐక్యతా మంత్రమే ఆయన ఊపిరి

ఇరవయ్యో శతాబ్దాన్ని మలచిన మహా పురుషులలో డాక్టర్‌ కేశవరావ్‌ బలీరాం హెడ్గెవార్‌ ఒకరు. ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపన యోచన, ఆ సంస్థకు ఉండవలసిన తాత్వికతను నిర్ధారించడం, భవిష్యత్తును దర్శించడం ఇవన్నీ డాక్టర్‌ హెడ్గెవార్‌ మహోన్నతను చాటి చెబుతాయి. విజాతీయత ఈ దేశాన్ని, జీవన విధానాన్ని ఎంతగా ధ్వంసించినా మళ్లీ ఆ వైపే అడుగులు వేస్తున్న జాతి గతిని మార్చిన వారాయన. అదే జీవిత సందేశం. ఆయన జీవిత విశేషాలు, సందేశం గురించి చెప్పే పుస్తకం ‘పరమ పూజనీయ డా….

Read more »

సాగరం మీద సంతకం

By |

సాగరం మీద సంతకం

సముద్ర మార్గాలను ఉపయోగించుకుని సుదూర దేశాలతో సంబంధాలు నెలకొల్పుకొనే సంప్రదాయం భారతదేశంలో నాలుగువేల ఏళ్ల క్రితమే ఉంది. వాణిజ్య, దౌత్య సంబంధాలు రెండింటికీ కూడా సముద్రయానం ఉపకరించింది. కానీ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకునే ధోరణి భారతీయులకు తొలి నుంచీ లేదు. ‘సముద్ర మహారాజ్ఞి’కి (బ్రిటన్‌) ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు శతాబ్దాలు ఊడిగం చేసినా కూడా సముద్ర సంబంధ వ్యవహారాలు మన బుద్ధికి చేరలేదు. ఇదొక చారిత్రక వైచిత్రి. స్వతంత్ర భారతంలో ఎక్కువ కాలం అధికారం వెలగబెట్టిన…

Read more »

అమరత్వానికి అక్షర నివాళి

By |

అమరత్వానికి అక్షర నివాళి

ఈ దేశంలో బుద్ధిజీవులది వింతధోరణి. ఎప్పుడూ నకారాత్మక దృక్పథమే. ఒకే వంశస్థులైన బాబర్‌, అక్బర్‌, ఔరంగజేబు, షాజహాన్‌, జహంగీర్‌లకు అధ్యాయాలకు అధ్యాయాలు కేటాయించి చరిత్ర రాస్తారు. అదే విజయనగర సామ్రాజ్యాన్ని గురించో, కాకతీయుల పరాక్రమం గురించో అంటే మాత్రం కొన్ని పుటలకు పరిమితం చేస్తారు. రాణా, ఛత్రపతి, ప్రతాపరుద్రుడు, శ్రీకృష్ణదేవరాయల చరిత్రలను స్థానిక చరిత్రలుగా భ్రమింపచేస్తారు. అది మన చరిత్రకారులకు ముందునుండి ఉన్న పైత్యం. అలాగే ఈ దేశంలో వీరులను విలన్లుగా చూపిస్తారు లేదా అసలే చూపించరు….

Read more »

విజ్ఞాన వీధులలో మన తొలి అడుగులు

By |

విజ్ఞాన వీధులలో మన తొలి అడుగులు

ఇంత సుదీర్ఘమైన చరిత్ర, దానితో ఆవిర్భ వించిన జీవన విధానం, ఇవి అందించిన అనుభవంతో ఈ పురాతన దేశంలో విశేష జ్ఞానం పెంపొందిన మాట నిజం. కాబట్టి చింతన, కల్పన ఇక్కడ సహజ సిద్ధంగా వృద్ధి చెందాయి. ఖగోళ రహస్యాలను ఛేదించే యత్నం ఆరంభంలో ఇక్కడ జరిగింది. అంటే గణితం కూడా ప్రవర్థిల్లింది. వైద్యశాస్త్రం అద్భుతంగా పురోగమించింది. శుశ్రుతుడు వంటి ఘనులు మన చరిత్రలో కనిపిస్తారు. అలాగే పశువైద్యం కూడా. కాబట్టి రసాయనిక శాస్త్రం కూడా అంతో…

Read more »

శివాజీ ‘సురాజ్య’ మాధవీయం…!

By |

శివాజీ ‘సురాజ్య’ మాధవీయం…!

భారతదేశ చరిత్రలో మేలిరత్నం శివాజీ. ఈ రోజుకూ ఆయన వీరోచిత పోరాట స్ఫూర్తి ఈ దేశాన్ని రగిలిస్తూనే ఉంది. గత కాలంలోని భారతీయుల యుద్ధ వైఫల్యాలను క్షుణ్ణంగా పరిశీలించి కొత్త తరహా గెరిల్లా యుద్ధాన్ని, పోరాట వ్యూహాల్ని సిద్ధం చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ. హిందూ సామ్రాజ్య దినోత్సవం జరిపి హిందూ హృదయ సామ్రాట్‌గా మన్ననలందుకొంటున్న మహాయోధుడు ఛత్రపతి. అలాంటి మహనీయుని జీవితంపై ఎందరో పరిశోధనలు చేసారు. కొందరు ఆయన చరిత్రను కళంకపరిచి పిడికెడు అక్షరాల్లో బంధించాలని…

Read more »