Archive For The “కవితలు” Category

రాతి రథం

By |

రాతి రథం

ఏ రాజన్యుల సౌందర్య పిపాసకు సాక్షిగా అంకురించావో…. ఏ శిల్పుల శ్రమకు తలవొగ్గి తేరుగా మారావో… కాలం నడకలపై నీ అపురూప సంస్కృతీ శిలాక్షరాన్ని చెక్కిందెవరో ? చరిత్ర గడపలపై నీ అసమాన సౌందర్య చిత్రాన్ని తీర్చిదిద్దిందెవరో ? అల్లంత దూరాన రాళ్ళపై రాగాలు పలికిస్తూ ప్రవహిస్తున్న తుంగభద్రా నదీ సవ్వడులు వింటూ విజయవిఠల దేవాలయ ప్రాంగణంలో గత ప్రాభవ వైభవాల్ని, వైభోగాల్ని ప్రపంచ పర్యాటక యవనికపై నేటికీ ఆవిష్కరిస్తూ జగత్తులోని సౌందర్యారాధకుల్ని సూదంటురాయిలా ఆకర్షిస్తూ రాచఠీవితో…

Read more »

పటేలు ద్యుమణి

By |

పటేలు ద్యుమణి

ఇవాళ దేశానికి కావలసింది వల్లభాయి పటేళ్ళు ఇవాళ సమాజాన్ని నడిపించ వలసింది సర్దార్‌ పటేళ్ళు స్వాతంత్య్రం వచ్చిన నాడు భారతమంతా ముక్కలై పడి ఉన్ననాడు సమస్త భారతం ఒక్కటనే నినాదంతో సంస్థానాలను ఛోటా రాజ్యాలను దేశంలో విలీనం చేసి అఖండ భారతాన్ని నిర్మించిన సర్దారు పటేలు నాయక మణి తరతరాలకు ఈ జాతికి స్ఫూర్తి వల్లభాయి పటేలు వాణి యుగయుగాలకు చైతన్య గీతి కోటిమంది తెలంగాణ ప్రజల్ని కూటికి గుడ్డకు దూరం చేసిన ఘోర పరాభావాలతో జనాన్ని…

Read more »

ఇరవయ్యొకటో శతాబ్దం

By |

మట్టి మహత్యం నుండి గుడిసెలు, గుడిసెల గుండెల్లోంచి భవనాలు, భవనాల ఒడిలోంచి యంత్రాలు…. అసలూ… జీవితమే యాంత్రీకరణైంది బతుకుబాట ఇబ్బందుల్లో జీవన గమనం ఇరుక్కున్నప్పుడు కష్టసుఖాల గోదాలో మొదట బొటన వేలి ముద్రలతికించేవారు ఆధునిక యుగ యానములో విద్యావంతుల బొటనవేళ్ళు గూడా మార్పులు – చేర్పుల్లో మునిగి తేలినై వేలిముద్రలు వేసే వైఖరి మారింది మేజా బల్ల మారింది వేలిముద్రల ప్రాధాన్యం పెరిగింది తప్పనిసరి పరిస్థితిలో వేలిముద్రల నాశ్రయించిన పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే లాగున్నై,…

Read more »

యోగా దివస్‌

By |

యోగా దివస్‌

మానవకోటిలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యమ్మని అందుకె అందరు ఆరోగ్యం పట్ల శ్రద్ధను చూపాలంటూ సందేశమిస్తోంది యోగా దివస్‌.. మానవాళి మేలుకొరకె యోగ విద్యనందించిరి మన పూర్వులు అనారోగ్య నివారణకు మనశ్శాంతి పొందేందుకు ఆ మహాయోగి పతంజలే అందించెను మనకి యోగాను మనిషికి ఆయువు పెంచే ప్రక్రియ శ్వాస నియంత్రణ ప్రాణాయామం అష్టసిద్ధులను ముక్తిమార్గమును అందించేదే యోగాభ్యాసం సర్వ రోగముల నివారణకు దారి దీపాలు యోగాసనాలు యోగాను అభ్యసిద్దాం ఆరోగ్యంతో జీవిద్దాం దేశ ప్రగతికి తోడ్పడదాం స్వచ్ఛపౌరులుగ…

Read more »

యోగివి కారా ఓ నరుడా

By |

యోగివి కారా ఓ నరుడా

యోగివి కారా ఓ నరుడా భోగివి కాకుర ఓ నరుడా మనిషిగ నువ్వు పుట్టినందుకు మహోన్నతుడివి కావాలి మనిషిగ నువ్వు పుట్టినందుకు మంచిని ఇలలో పెంచాలి మంచిని నువ్వు పెంచాలంటే యోగివి కావాలి మహోన్నతుడివి కావాలంటే యోగివి కావాలి హింస క్రౌర్యం దుష్టబుద్ధులను తరమాలంటే వంచన స్వార్ధం దురాక్రమాలను నిర్జించాలంటే సత్యం ప్రేమ శాంతి అహింసలు పెంచాలంటే యోగివి కావాలి నువ్వు యోగివి కావాలి వెయ్యి ముక్కలుగ చీలిన ధరిత్రిని ఒక్కటి చెయ్యాలి తీవ్రవాదపు బాంబుల చెయ్యిని…

Read more »

యోగామృతం

By |

యోగామృతం

యమ నియమ ఆసనాలు ప్రాణాయామ ప్రత్యాహార ధోరణలు ధ్యాన సమాధి స్థితులే అష్టాంగాలు అందరికీ అనునిత్యం ఉపయుక్తాలు ఆరోగ్యంతో ఎల్లప్పుడూ ఉండాలన్నా శరీరానికి శక్తిని ఇవ్వాలన్నా మహా భాగ్యాన్ని అందుకోవాలన్నా అందుకే కావాలి యోగం అన్నా యోగాసనాలు సూర్యనమస్కారాలు తేలికైన సూక్ష్మ వ్యాయామాలు ఆపాద మస్తక ఆనంద శక్తికి యోగ్యమైనది యోగమైందే యోగ పిన్నల నుంచి వయోధికులంతా అనారోగ్య నిర్మూలనకై మనమంతా ఉదయాస్తమానాల్లో యోగం చేద్దాం ఉద్భవించే శక్తియుక్తులతో యాగం చేద్దాం – అమరవాది, భాగ్యనగర్‌ 0

Read more »

ఇదెక్కడి న్యాయం

By |

”మెజారిటీ ఈజ్‌ లా” ఇండియాలో ఇది పగటి కల రాజకీయ పార్టీల నగ్న స్వరూపం మైనారిటీల మెప్పుకోసం మెజారిటీల మనోగాయం స్వీయ ఎదుగుదలకై దిగజారె ఎత్తుగడలు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ రిజర్వేషన్ల ముచ్చట్లు దేశమాత గుండెలపై ఆరని కుంపట్లు ఎందకీ గుద్దులాట ఎప్పటిదాక ఈ వెంపర్లాట ”పదుగురాడ మాట పాటియై ధరజెల్లు” ఇండియాలో ఈ మాట హాస్యపు జల్లు అందరూ చెప్పేమాట ”నలుగురు నడిచేదే బాట” భారతదేశమంతటా ఈ మాటకు టాటా మెజారిటీల వేదన సదా అరణ్య రోదన…

Read more »

వృత్తి వృత్తము

By |

మోటపాటల పల్లవులకు దాసరి పాటల చరణాలు, దూదేకుల ఝంఝారాగాలకు కుమ్మరి చక్రం స్వరాలు, కమ్మరి సుత్తెతాళం, మగ్గం పడుగుపేకల నాట్యవిన్యాసం దర్జీ అతుకుల బతుకులు రెడీమేడ్‌ దర్జాలకు ఫలహారం, బట్టపొట్టకు పరిమితమన్న వర్తకము మాల్స్‌ హంగులకు ఆహారం రైతన్న కాడిజోడెడ్లప్రాణాలు పశువధ శాలలకు కర్పూర హారతులు. సుతి తప్పిన కాలగతికి వర్షాభావం వాతలు ప్లాస్టిక్‌ ప్రతాపాగ్నికి పొగబండ్ల దోస్తీ వాతావరణ కాలుష్యానికి వన్నె చిన్నెలు రచయితల బతుకు బాట నిండా టీ.వీ. సీరియళ్ళ ముళ్ళ కంపలు అవినీతి…

Read more »

పాల మనసు

By |

పాల మనసు

                          చద్దన్నం చాలు నాకు పరమాన్నం ఎందుకులే పాతగౌను చాలు నాకు పసిడి సొగసులెందుకులే అమ్మ ముద్దు చాలు నాకు వెన్నముద్ద లెందుకులే అమ్మపాడు జోలచాలు ఆటపాటలెందుకులే పనికెళ్ళని అమ్ముంటే పసితనాన్ని గెలిచేస్తా ఆ దేవుడు కనబడితే వరమొక్కటి అడిగేస్తా నడక నేర్చి పలకపట్టి బడికెళ్ళే వరకైనా అమ్మ ఒడిని నిదురించే భాగ్యమునే చెదరనీకు అదే మాకు పదివేలు అడుగము…

Read more »

కలాం సలాం

By |

కలాం సలాం

ఓ అబ్దుల్‌ కలాం! మీకు మా సలాం రాజ యోగివి నీవు కర్మయోగివి నీవు భరతావని ముద్దుబిడ్డా! ధన్యమయ్యె నీ పురిటి గడ్డ జగమంత పాకె నీ దివ్యకీర్తి ఓ విజ్ఞాన మణిమయ దీప్తీ! యువత ప్రగతికి నీవే స్ఫూర్తి తుదిశ్వాస వరకూ ఆగనిది నీ ఆర్తి యువతను కలలు కనమన్నావు వాటి సాకారానికి కష్టించమన్నావు నీ సందేశమే యువ హృదయాల్లోకి ”మిసైల్లా” దూసుకెళ్ళింది వారి నైరాశ్యాన్ని ఛేధించింది నీవు మలిచిన ఆ ”పి.యస్‌.యల్వీ” విజ్ఞాన విజయపతాకమెగరెసీ…

Read more »