Archive For The “సంపాదకీయం” Category

గోరక్షతో భారత సౌభాగ్య రక్ష !

By |

గోరక్షతో భారత సౌభాగ్య రక్ష !

మానవ మనుగడకు ఆధారభూతమైన పంచభూతాల్లో నీరు, నేల పరిమితమైనవని మనందరికీ తెలుసు. గాలి మాత్రం కావాల్సినంత ఉందని కొందరు అనుకొంటారు. కాని మనకు ప్రాణాధారమైన ఆక్సిజన్‌ అనే ప్రాణవాయువు మన చుట్టూతా ఉన్నట్టి మనం పీల్చుకునే గాలిలో ఐదోవంతు మాత్రమే ఉందని పదోతరగతి చదివిన విద్యార్థికి కూడా తెలుసు. కోటాను కోట్లుగా ఉన్న జనం నిరంతరం పీల్చుకొంటుంటే ఏదో ఒక రోజుకు ఆక్సిజన్‌ తగ్గిపోవడం లేదా పూర్తిగా లోపించి మనుషులంతా మరణించడం జరగదా? జరగదు. అలా జరక్కుండా…

Read more »

శ్రీనగర్‌లో అమిత్‌షా వ్యూహాత్మక అడుగులు

By |

శ్రీనగర్‌లో అమిత్‌షా వ్యూహాత్మక అడుగులు

మానవ దేహారోగ్యాన్ని తరుణ వ్యాధులు, దీర్ఘ వ్యాధులు చికాకు పంచినట్లే తాత్కాలిక, దీర్ఘకాలిక సమస్యలు దేశ ప్రగతిని కుంటుపరుస్తాయి. చిట్కా వైద్యంతో దీర్ఘ వ్యాధులను నివారించాలని చూసినప్పుడు దేహంలో కీడు సంభవించినట్లే దీర్ఘకాల సమస్యలను అడ్డదారుల్లో పరిష్కరించాలని ప్రయత్నించినప్పుడు దేశంలో విపరీత పరిణామాలు సంభవిస్తాయి. హైదరాబాద్‌ తదితర సంస్థానాల విలీనం విషయంలో నాటి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వ్యాధి మూలాలకు చికిత్స చేసినట్లు సామ, దాన, భేద దండోపాయాలను ప్రయోగించి నేరుగా సంస్ధానాధిపతులను ఒప్పించి నిర్వివాద…

Read more »

అక్రమ కట్టడాల కూల్చివేత

By |

అక్రమ కట్టడాల కూల్చివేత

స్వాతంత్య్ర పూర్వకాలం నుండే వంగ దేశీయుల ప్రభావం తెలుగువారిపై ఉంది. దేశంలో ఆంగ్లేయుల రోజుల నుండి కూడా వంగదేశీయులు వివిధ రంగాల్లో తెలుగు వారిని ప్రభావితం చేశారు. స్వామి వివేకానంద, రవీంద్రనాధ్‌ టాగోర్‌ వంటి మహనీయుల నుండి నేటి బిజెపి పూర్వరూపమైన జనసంఘ్‌ వ్యవస్థాపకులు డా.శ్యామాప్రసాద్‌ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి ప్రణవ్‌ ముఖర్జీ తదితరులంతా వంగదేశీయులే. స్వాతంత్య్రోద్యమానికి ఊపిరులూదిన బంకించంద్ర చటర్జీ ఆనందమఠ్‌ నవల, దాన్లోంచి వచ్చిన వందేమాతర గీతం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. శరత్‌,…

Read more »

యోగానంద గురుపీఠం!

By |

యోగానంద గురుపీఠం!

మానవ జీవన గమనానికి ఆనందమే అంతిమ గమ్యం. కష్టాలు ఎలా కొని తెచ్చుకోవాలి! దుఃఖం అనుభవించేదెలా? అని ఆలోచించి తగిన కార్యాచరణ సాగించే మానవుడెవడూ ఈ భూమ్మీద ఉండడు. ప్రపంచంలోని ప్రతి వ్యక్తీ ఆనందం కోసమే తపిస్తాడు, శ్రమిస్తాడు. ఆనందం పొందడానికి అనుసరించే మార్గాల్లో, అనుభవించే స్థాయిల్లో తేడా ఉండొచ్చు కాని ఆనందం కోసమే అందరూ తపిస్తారన్నది అక్షర సత్యం.పాశ్చాత్యులకు, భారతీయులకు గల పదార్ధ, పరార్ధ దృష్టి భేదము ఆనందం విషయంలో కూడా ప్రతిఫలించింది. పదార్ధముల, వస్తువుల…

Read more »

తెలుగు తేజం విశ్వవ్యాప్తర కావాలి !

By |

తెలుగు తేజం విశ్వవ్యాప్తర కావాలి !

‘తాడు యిరిగింది భాయ్‌, కర్ర తెగింది భయ్యా’ అని ఉర్దూ ఇంటి భాషగా కలిగిన ముస్లిము పిల్లలు అన్నప్పుడు తెలుగు పిల్లలు ముసిముసిగా నవ్వుకోవడం తెలుగునాట పల్లెల్లో చాలామంది తెలుగు పిల్లలకు అనుభవమే. ఆ తెలుగు పిల్లలే పెరిగి పెద్దయ్యాక ఉద్యోగ రీత్యా భాగ్యనగరానికి వచ్చి ఉంటూ నూతనంగా పరిచయమైన ముస్లిమ్‌ మిత్రులతో ‘భూక్‌లగ్తాహై భాయ్‌’ అన్నప్పుడు ముస్లిము మిత్రులు ముసిముసిగా నవ్వుకోవడం కూడా పరిపాటే. భావము, భాష సరయినవే అయినా నవ్వులు పూయించిన వ్యాకరణదోషం రెండు…

Read more »

జనజాగృతి

By |

జనజాగృతి

కఠిన చర్యలు తీసుకోవాలి తెలంగాణ ఇంటర్‌ బోర్డులో జరిగిన అవకతవకలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికీ స్పందించకపోవడం బాధాకరం. ఇంటర్‌బోర్డు తీరుకు నిరసనగా ధర్నాలు చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులను అత్యంత కిరాతకంగా పోలీసులు ఠాణాలకు తరలించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోకుండా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థి నాయకులను అరెస్ట్‌ చేయడం సరికాదు. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన…

Read more »

నైతికత లేని వారికి పాలనాధికారమా!

By |

నైతికత లేని వారికి పాలనాధికారమా!

తెలుగునాట లోక్‌సభ, శాసన సభల ఎన్నికలకు పోలిరగు ఘట్టం ముగిశాక ఆసక్తికర చర్చ జరుగుతోంది. అటు ఉత్తర ప్రదేశ్‌లోను ఇటు ఆంధ్రప్రదేశ్‌లోను జరిగిన రెండు రాజకీయ ఘటనలే ఈ చర్చకు అంకురార్పణ చేశాయి. మనం చట్టాల పక్షమా, నైతికత పక్షమా అన్న చర్చ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోరది. ఎప్పుడైనా ఎక్కడైనా తన పేరు, ఊరు చెప్పడానికి సామాన్యుడు తడబడడు, కొంత సమయం కావాలని కోరడు. రాహుల్‌ గాంధీకి సంబంధించి అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కొంత…

Read more »

జనజాగృతి

By |

జనజాగృతి

అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి హిందూ సమాజానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున కుట్ర జరుగుతోంది. అందులో భాగంగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కుహనా లౌకికవాదులు. మోదీ ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తున్నా ఆయనపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ నేతలు, టిడిపి, వామపక్షాలు కూటమిగా ఏర్పడి మైనారిటీలను రెచ్చగొడుతూ, వారిలో అనేక అనుమానాలను, అపోహలు కల్గించే పనులు ముమ్మరంగా సాగు తున్నాయి. ఈ దేశ హితం కోరే వారు మోదీ వ్యతి రేకుల…

Read more »

జన జాగృతి

By |

హిందువులకు శుభవార్త భారతీయ జనతా పార్టీ ఈసారి మేనిఫెస్టోలో రామమందిర నిర్మాణం దిశగా కృషి చేస్తామని చెప్పటం హిందువులకు శుభవార్తే. అయితే ఈసారి తప్పకుండా మందిరం నిర్మాణం అయ్యే విధంగా మోదీ ప్రయత్నిస్తారని నమ్ముతున్నాం. అయోధ్యలో శ్రీరాముడు జన్మించిన స్థలంలో భవ్య రామమందిరం నిర్మాణం అయితే దేశానికి మంచి జరుగుతుంది. అనేక శతాబ్దాలుగా దేశంలో నలుగుతున్న ఒక పెద్ద సమస్యకు తెరపడుతుంది. దేశవ్యాప్తంగా హిందుత్వ వాతావరణం వెల్లివిరుస్తుంది. హిందుత్వ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు సుఖంగా జీవించగలుగుతారు….

Read more »

నికార్సయిన ఓటర్ల జాబితా కావాలి!

By |

నికార్సయిన ఓటర్ల జాబితా కావాలి!

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ విభాగాల్లో, రాజకీయ నేతల్లో పొడసూపిన పెడధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ సామాజిక ముఖచిత్రాన్ని ప్రస్ఫుటించడంలో జనాభా లెక్కల పాత్ర ఎంత కీలకమో దేశ రాజకీయ పంథాను నిర్ణయించడంలో ఓటర్ల జాబితా పాత్ర అంతే కీలకం. అంతటి ప్రాముఖ్యతగల ఓటర్ల జాబితా విషయంలో ఎన్నికల సంఘం, రాజకీయ పక్షాలు ఇరువురూ బాధ్యతా రహితంగా వ్యవహరిరచారనే చెప్పాలి. నిర్దిష్ట కాలావధిలో జనాభా లెక్కల సేకరణ జరుగుతున్నట్లు ఓటర్ల జాబితా కూడా తయారు కావాలి. దీని…

Read more »