Archive For The “విశ్లేషణ” Category

ఆవిష్కృతమైన అపూర్వఘట్టం

By |

ఆవిష్కృతమైన అపూర్వఘట్టం

తెలంగాణ నీటిపారుదల వ్యవస్థ చరిత్రలో అపూర్వఘట్టమైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఈ నెల 21వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని బీడు భూములను నీటి ఎద్దడి నుంచి కాపాడే అద్భుత నిర్మాణం.. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో మొదలైన తెలంగాణ ఉద్యమం.. ప్రత్యేక రాష్ట్రం కల సాకార మయ్యేదాకా ఉధృతంగా కొనసాగింది. ప్రధానమైన మూడు నినాదాల్లో మొదటిది నీళ్లు. తెలంగాణలోని 20 జిల్లాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం బహుళార్ధసాధక…

Read more »

యోగ సాధన చేశారు ఉపశమనం పొందారు..

By |

యోగ సాధన చేశారు ఉపశమనం పొందారు..

నమస్కారాలు. నా వయసు 35 సంవత్సరాలు. నేను గత కొన్ని సంవత్సరాలుగా అధిక బరువు సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నాను. దాంతో ఏ పని చేసినా త్వరగా అలసిపోతున్నాను. ఆరోగ్యం నిలకడగా ఉండదు. కాళ్లు నొప్పులు. మనసులో టెన్షన్‌ బాగా ఉంటుంది. కోపం చాలా ఎక్కువ. ఒక గంట సేపు కేవలం కారు డ్రైవ్‌ చేసినందుకే ఎంతో అలసట వచ్చేస్తుంది. మరో గంట విశ్రాంతి తీసుకోవాలని పిస్తూ ఉంటుంది. అన్ని సమస్యలతో నేను బాధ పడుతున్న సమయంలో…

Read more »

అలుపెరగని ఆ దేశ సేవకుడు ఇక లేరు

By |

అలుపెరగని ఆ దేశ సేవకుడు ఇక లేరు

రాజమండ్రి: ‘రాజేంద్ర’ పేరుతో అత్యవసర పరిస్థితిలో ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలోను, తరువాత దివిసీమ ఉప్పెన తదనంతర సేవలోను పాల్గొని అందరికి చిరపరిచితులైన ఎస్‌.టి.జి. రామచంద్రాచారి (64) జూన్‌ 6న రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదం దుర్మరణం చెందారు. ఉదయం శాఖకు హాజరై రోడ్డు దాటుతూ ఉండగా మోటర్‌ సైకిల్‌ ఢీ కొట్టడంతో తీవ్ర ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రామచంద్రాచారి మచిలీపట్నం ఆంధ్రజాతీయ పాఠశాల, కళాశాలలో విద్యాభాసం…

Read more »

వంగభూమిలో భంగపడ్డ దీదీ!

By |

వంగభూమిలో భంగపడ్డ దీదీ!

వంగభూమిలో కమలం అనూహ్యంగా వికసించింది. పశ్చిమ బెంగాల్‌లో తనకు ఎదురే లేదు అన్నట్లు ప్రధాని మోదీతో పాటు బీజేపీతో కయ్యానికి దిగిన మమతా బెనర్జీ ఘోరంగా భంగపడ్డారు. కేంద్రంతో అనుసరించిన ఘర్షణ వైఖరికి తగిన మూల్యమే చెల్లించుకున్నారు. మమత దీదీ అహంకారాన్ని దెబ్బ తీస్తూ బెంగాల్‌ ఓటర్లు బీజేపీకి ఏకంగా 18 సీట్లు కట్టబెట్టారు. టీఎంసీకి 12 సీట్లు కోత పెట్టారు. మమత అనుసరించిన మైనారిటీ సంతుష్టీకరణ, హిందూ వ్యతిరేక రాజకీయాలను లోక్‌సభ ఎన్నికల ఫలితాల రూపంలో…

Read more »

మోదీ వెంట నడిచిన మైనారిటీలు

By |

మోదీ వెంట నడిచిన మైనారిటీలు

భారతీయ మేధావులది ఒక వింత మన్తత్వం. మార్పు అనేది ఉంటుందంటే వీరు నమ్మలేరు. అందులో సెక్యులర్‌ ముసుగులో అవాంఛనీయ శక్తుల కోసం పనిచేసే హిందువుల మనస్తత్వం మరీ వికృతం. ముస్లింలు తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారంటే వీరు కొద్డిగా అంగీకరించలేరు. ఆ సంగతి ఆలోచించేందుకు కూడా అంగీకరించరు. ముస్లింలు భారతీయ జీవన స్రవంతిలోనే తాము ఉన్నట్టు ప్రకటించుకోవడానికే మొగ్గు చూపుతున్నారని ఎవరైనా అంటే, వెంటనే వారి నోరు నొక్కేస్తారు. బీజేపీకీ, ముస్లింలకూ మధ్య ఒక శాశ్వత శత్రుత్వం ఉండాలని…

Read more »

లెంపలేసుకున్న ‘టైమ్‌’

By |

లెంపలేసుకున్న ‘టైమ్‌’

మీడియా, మరీ ముఖ్యంగా విదేశీ మీడియా భారత ప్రధాని, బీజేపీ ప్రముఖుడు నరేంద్రమోదీ పట్ల ఎలాంటి పక్షపాత వైఖరి, తొందరపాటు ధోరణి, దుందుడుకు వైఖరి అవలంబిస్తున్నదో మరోసారి రుజువైంది. భారతీయ మీడియాలో ఒక వర్గాన్ని మించి ఆ మీడియా వ్యవహరించడమే దారుణం. న్యూయార్క్‌ కేంద్రంగా వెలువడే ‘టైమ్‌’ వారపత్రికకు అంతర్జాతీయంగా పరువు మర్యాదలు ఉన్నాయి. ఆ పత్రిక కూడా దిగజారుడుగా వ్యవహరించింది. టైమ్‌ వ్యవహారం దిగజారుడుతనమేననడానికి ఆ పత్రికే తనకు తానే రుజువులు ఇచ్చింది. మోదీ భారత…

Read more »

ముదురుతున్న ‘అగ్ర’ యుద్ధం

By |

ముదురుతున్న ‘అగ్ర’ యుద్ధం

రష్యా పతనంతో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినప్పటికీ అమెరికాకు మనశ్శాంతి లభించలేదు. దానికి కారణం చైనా ఎదుగుదల. ప్రస్తుత ప్రపంచం ఈ రెండింటిని అగ్ర దేశాలుగా పరిగణిస్తోంది. ఈ దేశాల మధ్య వాణిజ్యం ప్రపంచ జిడిపిపై ప్రభావం చూపే స్థాయిలో జరుగుతోంది. ట్రంప్‌ హయాంలో అమెరికా చైనాపై వాణిజ్యంలో పైచేయిని సాధించాలన్న పట్టుదలతో దూకుడును ప్రదర్శిస్తోంది. అందుకు చైనా కూడా తనదైన శైలిలో ప్రతిస్పందిస్తున్నది. ఈ అగ్ర దేశాల మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను…

Read more »

విషవలయంలో తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలలు

By |

విషవలయంలో తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలలు

అగాధాల సృస్టే అక్కడి సిలబస్‌ తెలంగాణలోని గురుకుల పాఠశాలలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు ఏమిటి? అక్కడి విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా బయటకు వచ్చే అవకాశం ఎంత? ఆ పాఠశాలల అన్ని వ్యవహారాలలోను తల దూరుస్తున్న ‘ స్వేరోస్‌ ‘ అనే సంస్థ పాత్ర ఏమిటి? ఈ సంస్థ నాయకుడు ఆ పాఠశాలకు చెందిన ఎస్‌సి బాలిక మీద అత్యాచారం చేసినట్టు పోలీసు కేసు నమోదైనా వారి ఆధిపత్యం ఇంకా అక్కడ యథేచ్ఛగా ఎలా కొనసాగుతోంది? ఇలాంటి ప్రశ్నలు…

Read more »

జాతీయగీతం కూడా ఆపేస్తారా!

By |

జాతీయగీతం కూడా ఆపేస్తారా!

రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించిన పదకొండు పేజీల వినతిపత్రంలో కర్నె శ్రీశైలం ప్రధానంగా స్వేరోస్‌ ఆగడాల గురించి ప్రస్తావించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ ఆశ్రమ విద్యాల యాల సొసైటీలో, తెలంగాణ గిరిజన సంక్షేమ ఆశ్రమ విద్యాలయాలలో పాలు, కూరగాయలు, పరిశుభ్రత, ఔట్‌సోర్సింగ్‌, నియామకాలు, సివిల్‌ పనులు, టెండర్లు అన్నీ కూడా బినామీ పేర్లతో జరుగుతున్నాయని శ్రీశైలం ఆరోపించారు. అదే స్వేరోస్‌. దీని వెనుక సాంఘిక సంక్షేమ ఆశ్రమ విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ హస్తం ఉందని…

Read more »

నిబద్ధతకు నిలువుటద్దం..

By |

నిబద్ధతకు నిలువుటద్దం..

కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కిషన్‌రెడ్డి సాధారణ కార్యకర్తగా మొదలైన ప్రస్థానం కేంద్ర మంత్రి స్థాయికి చేరుకుంది. నాలుగు దశాబ్దాల నమ్మిన సిద్ధాంతం.. నూతన అధ్యాయం దిశగా పయనించేందుకు దోహద పడింది. దేశ రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించి పెట్టింది. గంగాపురం కిషన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం తోటి కార్యకర్తలకు ఆక్సిజన్‌లా మారింది. మొత్తానికి భారతీయ జనతాపార్టీ సంస్కృతికి నిదర్శనంగా నిలిచింది. ఎమ్మెల్యే పదవి తృటిలో చేజారి పోయినా ఎంపీ పదవి వెతుక్కుంటూ వచ్చింది. ఆ వెంటనే కేంద్ర…

Read more »