Archive For The “ప్రాంతీయం” Category

తెలంగాణలో బీజేపీకి గత వైభవం

By |

తెలంగాణలో బీజేపీకి గత వైభవం

భారీగా పెరిగిన ఓట్ల శాతం తెలంగాణలో తమకు తిరుగేలేదనుకుంటున్న టీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆత్మపరిశీలనలో పడింది. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదనుకున్న భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా పుంజుకుంది. అధికార టీఆర్‌ఎస్‌కు వెన్నులో వణుకు పుట్టించే స్థాయికి ఎగబాకింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏకపక్షంగా ఏలుతున్న టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని తేల్చి చెప్పేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. సంఖ్యాపరంగా చూస్తే మిగతా పార్టీలకంటే టీఆర్‌ఎస్‌ ఎక్కువ స్థానాలు గెలిచినా.. ప్రస్తుతం నెలకొన్న…

Read more »

ఇక్కడేదీ ఆ చరిష్మా..!

By |

ఇక్కడేదీ ఆ చరిష్మా..!

భారతీయ జనతా పార్టీ.. భారతదేశంలో ఎంతో ఘన చరిత్ర ఉన్న జాతీయ పార్టీ.. ఇప్పటివరకు 11 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉంది.. మరో ఐదేళ్లకు గానూ ప్రజల నుండి సాధారణ మెజారిటీకి మించి అసాధారణ స్థాయిలో సీట్లు, ఓట్లు పొందింది. జాతీయవాదం నినాదంతో ప్రజల గుండెల్లో పదిల స్థానం సంపాదించుకుంది. దేశాన్ని అభివృద్ధి వైపు శీఘ్రంగా నడిపించే పార్టీగా ప్రజలు వజ్ర సమానంగా నమ్మారు.. దేశవ్యాప్తంగా ఎందరో మహామహులైన నాయ కుల బలం, కార్యకర్తల బలగం…

Read more »

సారు.. కారు.. బేజారు..

By |

సారు.. కారు.. బేజారు..

– తెలంగాణలో కమల వికాసం – గులాబీ కోటలకు బీటలు తెలంగాణ లోక్‌సభ ఫలితాల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు భారతీయ జనతా పార్టీ భారీ షాక్‌ ఇచ్చింది. రాష్ట్రంలో గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనన్న సంకేతాలు కనబరిచింది. లోక్‌సభ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలతో ఈ కొత్తశకానికి బీజం పడింది. కాంగ్రెస్‌ పార్టీ కూడా తనవంతు కోత పెట్టడంతో టీఆర్‌ఎస్‌కు ఊహించని దెబ్బ తగిలింది. 16 ఎంపీ సీట్లు తమకే దక్కుతా యని కేసీఆర్‌ పెట్టుకున్న ధీమా నిజం…

Read more »

కోరదగిన మార్పు.. సహజమైన తీర్పు..

By |

కోరదగిన మార్పు.. సహజమైన తీర్పు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సరికొత్త చరిత్ర సృష్టించారు.. అహంకార పూరిత రాజకీయాలకు పాతరేశారు.. అభివృద్ధి పనులు చేయకుండా అరకొర సంక్షేమ పథకాలతో పబ్బం గడుపుకుందామనుకున్న వారిని తన్ని తరిమేశారు.. ఒకపక్క రాష్ట్రం ఆర్థిక వెనుకబాటులో ఉంటే స్వలాభం కోసం ప్రభుత్వ ఖర్చుతో పోరాట దీక్షలు నిర్వహించిన దుబారా నేతను పునాదులతో సహా పెకలించారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర పాలనను గాలికొదిలేసి, జాతీయ రాజకీయాలతో అంటకాగిన సీనియర్‌ నేతను ఇంటికే పరిమితం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాక…

Read more »

ఫ్రంట్‌కు డీఎంకే షాక్‌.. కేసీఆర్‌ చెన్నై టూర్‌ అట్టర్‌ఫ్లాప్‌!

By |

ఫ్రంట్‌కు డీఎంకే షాక్‌.. కేసీఆర్‌ చెన్నై టూర్‌ అట్టర్‌ఫ్లాప్‌!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోందా? ఫ్రంట్‌ గురించి తాను ప్రతిపాదిస్తే.. ఎదుటివాళ్లు తనకే ఉచిత సలహాలు ఇస్తున్నారా? ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రయత్నం వృథా ప్రయాసే అవుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అవుననే వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే గతంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా…

Read more »

పార్టీలను ఊరిస్తున్న విజయం

By |

పార్టీలను ఊరిస్తున్న విజయం

ఈ సంవత్సరం మే 23వ తేదీకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆ రోజు వెలువడతాయి. ఆ ఫలితాలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభకూ ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు కూడా మే 23నే తెలుస్తాయి. రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అన్న ఉత్కంఠ కూడా తేలిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు ఇప్పటివరకు అనేకసార్లు సార్వత్రిక ఎన్నికలతో పాటే జరుగుతూ వస్తున్నాయి….

Read more »

‘ఇంటర్‌’ నిరసనలపై నీళ్లు !

By |

‘ఇంటర్‌’ నిరసనలపై నీళ్లు !

బీజేపీ నేత లక్ష్మణ్‌ దీక్ష భగ్నం తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డులో జరిగిన అవకతవలపై భాజపా సమరశంఖం పూరించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏదో కంటితుడుపు చర్యగా స్పందించడం మినహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం, సమస్యకు శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించకపోవడంపై భారతీయ జనతా పార్టీ కన్నెర్ర జేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ఏప్రిల్‌ 29వ తేదీన హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాల యంలో నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. ఇంటర్‌ ఫలితాల్లో…

Read more »

‘ద్వేషం’ ఆయన జన్మహక్కు

By |

‘ద్వేషం’ ఆయన జన్మహక్కు

ముఖ్యమంత్రి చంద్రబాబులో ఈ మధ్య ఒక విషయం స్పష్టంగా కనబడుతోంది. అదేమిటంటే ఎప్పుడూ ఎవరో ఒక వ్యక్తిని అతిగా ద్వేషించడం. ఇదే కోణంలో మరింత వెనక్కి వెళితే బాబుకు అతిగా ద్వేషించే స్వభావం మొదటినుండే ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. ఆయన మొదట తన మామ ఎన్‌టిఆర్‌ను అతిగా ద్వేషించారు. ఆ క్రమంలో ఎన్‌టిఆర్‌ స్థాపించిన టీడీపీ పార్టీని సైతం కబ్జా చేశారు. 2004 ఎన్నికలలో తాను ఓడిపోయిన తరువాత బాబు కొన్నాళ్లు వాజపేయిని ద్వేషించారు. వాజపాయ్‌తో స్నేహం వల్లే…

Read more »

వరుస ఎన్నికల కోలాహలం..

By |

వరుస ఎన్నికల కోలాహలం..

తెలంగాణలో వరుసగా ఎన్నికల పండుగలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న డిసెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు పూర్తయ్యాయి. అధికార టీఆర్‌ఎస్‌ అత్యధిక మెజార్టీతో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. నిన్నటికి నిన్న లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు ఇంకా వెలువడలేదు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున జాతీయ స్థాయిలో అన్ని దశల పోలింగ్‌ ముగిసిన తర్వాత మే 23వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే.. ఇదే సమయంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ,…

Read more »

మహిళల చేతుల్లో తలరాత !

By |

మహిళల చేతుల్లో తలరాత !

కారు రిపేరు రాదా.. టివి చెడిపోకుండా ఉంటుందా.. స్మార్ట్‌ ఫోన్‌ సమస్య లేకుండా నిరంతరం పనిచేయగలుగుతుందా.. చివరికి యంత్రమే అయినా అత్యంత తెలివిగలది, దృఢమైన మెదడు గలది అని చెప్పుకునే కంప్యూటర్‌కు సైతం రిపేర్లు రాక తప్పదు. ఇవన్నీ ఎలక్ట్రానిక్‌ వస్తువులు. వీటికి రిపేర్లు రాకా మానవు. వాటిని ఆయా నిపుణులు సరిచేసి మళ్లీ నడిపించకా తప్పదు. అటువంటిది పోలింగ్‌ కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ వస్తువు ఇవిఎంలో రిపేరు రాకుండా ఉంటుందా ! కాసేపు మొరాయించకుండా ఉంటుందా…

Read more »