Archive For The “జాతీయం” Category

ఎర్రమూకల వెర్రి చేష్టలు

By |

ఎర్రమూకల వెర్రి చేష్టలు

దేశంలో చాలా చోట్ల పాఠశాలలు, కళాశాలలు తెరుస్తున్నారు. కేరళలో కూడా తెరిచారు. నిజమే ఇదేమీ వింత కాదు. కానీ త్రిశ్శూర్‌లో శ్రీ కేరళ వర్మ కాలేజీ ఒకటి ఉంది. దాని ముందు కొత్తగా చేరిన విద్యార్థుల కోసం ఒక బ్యానర్‌ కట్టారు. బహిష్టు అయిన స్త్రీ కాళ్ల దగ్గర అయ్యప్ప బొమ్మను చిత్రించిన బ్యానర్‌ అది. ఇంతటి సంస్కారవంతమైన బ్యానర్‌తో కొత్త విద్యార్థులను స్వాగతించిన విద్యార్థి సంఘం పేరు ఎస్‌ఎఫ్‌ఐ. స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అనే…

Read more »

పైకి పెద్దతనం.. చేసేది కర్రపెత్తనం

By |

పైకి పెద్దతనం.. చేసేది కర్రపెత్తనం

తన కొంపను పట్టించుకోని పెద్ద మనిషి ఊర్లో వారికి సుద్దులు చెప్పడానికి వచ్చాడట.. ఇలాంటి వారు మనకు సమాజంలో కనిపిస్తూనే ఉంటారు. ఇతరుల ఇళ్లలో ఏం జరుగుతుందోననేది తెలుసుకోవ డానికి చూపించే ఆసక్తిని తమ ఇంటిని తీర్చి దిద్దుకుందాం అనే విషయంలో మాత్రం చూపించరు వీరు. సరిగ్గా అమెరికా తీరు కూడా ఇలాగే ఉంది. తన దేశంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న జాత్యంహకారం, గన్‌కల్చర్‌, హత్యలు, లైంగిక దోపిడీల గురించి మాట్లాడదు అమెరికా. కానీ ఇతర దేశాల్లో…

Read more »

వంగభూమిలో భంగపడ్డ దీదీ!

By |

వంగభూమిలో భంగపడ్డ దీదీ!

వంగభూమిలో కమలం అనూహ్యంగా వికసించింది. పశ్చిమ బెంగాల్‌లో తనకు ఎదురే లేదు అన్నట్లు ప్రధాని మోదీతో పాటు బీజేపీతో కయ్యానికి దిగిన మమతా బెనర్జీ ఘోరంగా భంగపడ్డారు. కేంద్రంతో అనుసరించిన ఘర్షణ వైఖరికి తగిన మూల్యమే చెల్లించుకున్నారు. మమత దీదీ అహంకారాన్ని దెబ్బ తీస్తూ బెంగాల్‌ ఓటర్లు బీజేపీకి ఏకంగా 18 సీట్లు కట్టబెట్టారు. టీఎంసీకి 12 సీట్లు కోత పెట్టారు. మమత అనుసరించిన మైనారిటీ సంతుష్టీకరణ, హిందూ వ్యతిరేక రాజకీయాలను లోక్‌సభ ఎన్నికల ఫలితాల రూపంలో…

Read more »

మోదీ వెంట నడిచిన మైనారిటీలు

By |

మోదీ వెంట నడిచిన మైనారిటీలు

భారతీయ మేధావులది ఒక వింత మన్తత్వం. మార్పు అనేది ఉంటుందంటే వీరు నమ్మలేరు. అందులో సెక్యులర్‌ ముసుగులో అవాంఛనీయ శక్తుల కోసం పనిచేసే హిందువుల మనస్తత్వం మరీ వికృతం. ముస్లింలు తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారంటే వీరు కొద్డిగా అంగీకరించలేరు. ఆ సంగతి ఆలోచించేందుకు కూడా అంగీకరించరు. ముస్లింలు భారతీయ జీవన స్రవంతిలోనే తాము ఉన్నట్టు ప్రకటించుకోవడానికే మొగ్గు చూపుతున్నారని ఎవరైనా అంటే, వెంటనే వారి నోరు నొక్కేస్తారు. బీజేపీకీ, ముస్లింలకూ మధ్య ఒక శాశ్వత శత్రుత్వం ఉండాలని…

Read more »

లెంపలేసుకున్న ‘టైమ్‌’

By |

లెంపలేసుకున్న ‘టైమ్‌’

మీడియా, మరీ ముఖ్యంగా విదేశీ మీడియా భారత ప్రధాని, బీజేపీ ప్రముఖుడు నరేంద్రమోదీ పట్ల ఎలాంటి పక్షపాత వైఖరి, తొందరపాటు ధోరణి, దుందుడుకు వైఖరి అవలంబిస్తున్నదో మరోసారి రుజువైంది. భారతీయ మీడియాలో ఒక వర్గాన్ని మించి ఆ మీడియా వ్యవహరించడమే దారుణం. న్యూయార్క్‌ కేంద్రంగా వెలువడే ‘టైమ్‌’ వారపత్రికకు అంతర్జాతీయంగా పరువు మర్యాదలు ఉన్నాయి. ఆ పత్రిక కూడా దిగజారుడుగా వ్యవహరించింది. టైమ్‌ వ్యవహారం దిగజారుడుతనమేననడానికి ఆ పత్రికే తనకు తానే రుజువులు ఇచ్చింది. మోదీ భారత…

Read more »

ప్రకంపనలు… ప్రతిధ్వనులు…

By |

ప్రకంపనలు… ప్రతిధ్వనులు…

‘మళ్లీ గెలిచిన భారత్‌…లెక్కించిన ఓట్లను బట్టి మరో చరిత్రాత్మక విజయం దిశగా దూసుకు పోతున్న మోదీ, బీజేపీ’ – ఇది 2019 లోక్‌సభ ఎన్నికలలో నరేంద్ర మోదీ విజయం గురించిన వార్తకు శీర్షిక. కానీ భారతదేశంలో ఒక పత్రిక పెట్టిన శీర్షిక కాదు. పాకిస్తాన్‌లో ప్రముఖ మీడియా సంస్థ ‘డాన్‌’ వెబ్‌సైట్‌ ఇచ్చిన వార్తకు శీర్షిక ఇది. ‘విపక్షాలను విభ్రాంతికి గురిచేసిన మోదీ’ అన్న శీర్షికతో ‘ది ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌’ పత్రిక వార్తను ప్రచురించింది. ఈ రెండు…

Read more »

ఎవరి కర్మ ఫలితం తేలనుంది!

By |

దశాబ్దాలుగా దేశంలో వంశపారంపర్య అవినీతిని పెంచి పోషించిన కాంగ్రెస్‌ పార్టీ విలువల గురించి మాట్లాడటం అంటే అంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదు. ప్రధానమంతి నరేంద్ర మోదీపై పదే పదే అసత్య ఆరోపణలు చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్న రాహుల్‌ గాంధీకి ఒక్కసారిగా ఊహించని షాక్‌ ఎదురైంది. తన తండ్రి పాపాల చిట్టాలను విప్పేసరికి విలవిలలాడి పోతున్నారు. మిస్టర్‌ క్లీన్‌ అసలు రంగును గుర్తు చేసేసరికి కాంగ్రెస్‌ పార్టీకి దిమ్మ తిరిగినంత పనైపోయింది. గురవింద తన నలుపు…

Read more »

‘మసీదులలో మేమూ ప్రార్థనలు చేస్తాం!’

By |

‘మసీదులలో మేమూ ప్రార్థనలు చేస్తాం!’

మసీదులలో ముస్లిం మహిళలు ప్రార్థనలు చేయడానికి అర్హత ఉంటుందా ? ఈ అంశం గురించి కొన్నేళ్లుగా ప్రపంచం మొత్తం మీద తీవ్రమైన చర్చే సాగుతోంది. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌, డర్బన్‌ ప్రాంత ముస్లిం మహిళలు నిరుడు కూడా మత పెద్దలకు మళ్లీ విన్నవించారు. ఆ విన్నపం చాలా బలమైనది, ”మేం కూడా మసీదు లోపల ప్రార్థనలు చేసుకోవాలని కోరుకుంటున్నార!” రంజాన్‌ పవిత్ర మాసంలో సాయంత్రం మసీదులలో జరిగే పవిత్ర ఖురాన్‌ ప్రవచనాలను, ప్రార్థనలను వినే అవకాశం తమకు కూడా…

Read more »

జమ్మూ హిందువుల పైనా పాక్‌ గురి!

By |

జమ్మూ హిందువుల పైనా పాక్‌ గురి!

కశ్మీర్‌ లోయ నుంచి హిందూ పండిట్లను తరిమేశారు. విడిచి వెళ్లకపోతే చంపేశారు. ఇప్పుడు జమ్మూలో నివసిస్తున్న హిందువులకు కూడా అలాంటి గతే పట్టబోతున్నదా? ముస్లింలు అధికంగా ఉండే కశ్మీర్‌ లోయ నుంచి, ఇప్పుడు హిందూ జనాభా అధికంగా ఉండే జమ్మూ మీద కూడా ఉగ్రవాదం తన పంజాను విసరబోతున్నదా? ఇటీవల జరిగిన చంద్రకాంత శర్మ అనే రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) నాయకుడి హత్య ఈ విషయాన్నే ధ్రువపరుస్తున్నది. జమ్మూ నుంచి కూడా హిందువులను తరిమికొట్టి, అది…

Read more »

వారివైపే విజయ సంకేతాలు

By |

వారివైపే విజయ సంకేతాలు

2019 సార్వత్రిక ఎన్నికలను మొత్తం ఏడు దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశలో 91 స్థానాలకు ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగ్గా, రెండో దశలో 97 స్థానాలకు ఏప్రిల్‌ 18న, మూడో దశలో 115 స్థానాలకు ఏప్రిల్‌ 23న, నాలుగోదశలో 71 స్థానాలకు ఏప్రిల్‌ 29న, ఐదో దశలో 51 స్థానాలకు మే 6న, ఆరో దశలో 59 స్థానాలకు మే 12న, ఏడో దశలో మిగిలిన 59 స్థానాలకు మే19 న ఎన్నికలు జరుగుతాయి. సమస్యాత్మక మరియు…

Read more »