Archive For The “అభిప్రాయం” Category

అలా చేస్తే ఇలాగే అవుతుంది

By |

అలా చేస్తే ఇలాగే అవుతుంది

శ్రీ చంద్రబాబు నాయుడు గారికి గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌. ప్రియమైన చంద్రబాబు నాయుడుగారు.. ఘోర పరాజయపు అవమానాన్ని ఎదుర్కొన్న మీకు నా హృదయపూర్వక సానుభూతి. మిమ్మల్ని మీరు మచ్చలేని మహాత్ములుగా భావించడం, ఫాసిస్ట్‌ విధానాలను అవలంబించే మమతా బెనర్జీ, వంశ పారంపర్య పాలనను ఏర్పరచాలని కలలుగన్న దేవెగౌడ, అరాచకవాది కేజ్రీవాల్‌, ఎలాంటి శక్తి సామర్ధ్యాలు లేని శరద్‌పవార్‌, ద్రవిడవాది స్టాలిన్‌ వంటి వారిని కలుపుకుని విలువలు లేని కూటమి కట్టడానికి ప్రయత్నించడం వంటివి మీ పరాజయా…

Read more »

చేను గట్టున నడుస్తున్న పద్యం

By |

చేను గట్టున నడుస్తున్న పద్యం

‘కవిత్వం రాయటమంటే ఖడ్గంతో సహజీవనం చెయ్యటం మొద్దుబారటానికీ వీల్లేదు మోడుగా మిగలటానికీ వీల్లేదు…’ నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగులో వినిపిస్తున్న గొంతు కె. శివారెడ్డి. ఈ పద్యం ఆయనకు ప్రతిష్టాత్మ కమైన సరస్వతీ సమ్మాన్‌ పురస్కారం తెచ్చిన ‘పక్కకు ఒత్తిగిలితే’ లోనిదే. ఆంగ్ల సాహిత్యం చదివి, అదే అంశాన్ని విద్యార్థులకు బోధించినా శివారెడ్డి తన మూలాలను విస్మరించలేదు. నాగలి పట్టే రైతు, నాగేటి చాళ్లలో దిగే వరినాట్లు, పంట గట్టు మీద వాలే పక్షి, వరికంకులతో పైర గాలుల…

Read more »

ప్రదక్షిణం

By |

ప్రదక్షిణం

పుల్వామా సంఘటనకి ప్రపంచం నిర్ఘాంత పోయింది. దేశం ఆవేశంతో ఉడికిపోయింది. ఉద్రేకంతో ఎదురుదెబ్బ తీయాలని పిడికిలి బిగించింది. హింసాకాండలో కన్నుమూసిన 40 మంది వీరుల అంత్యక్రియలను చూసి 24 గంటలలో కోట్లాదిమంది కన్నీరు కార్చారు. ఆవేశం కార్యసాధకుడి ఆయుధం కాదు. ప్రతీకారం పళ్లు కొరకదు. ఒకే ఒకమాట.. అదే మొదటి మాట.. మోదీగారన్నారు ‘ప్రాణాలర్పించిన వీరుల త్యాగం ఊరికే పోదు’ అని. ఈ వాక్యాన్ని ఒక చానల్‌ పదేపదే ప్రకటించింది. ఏం చేస్తారు? ఏం చెయ్యాలి? ఎలా…

Read more »

‘వివేక వాణి’ వినదలుచుకోలేదా?

By |

‘వివేక వాణి’ వినదలుచుకోలేదా?

‘వాదాలు సంవాదాలకు దారి తీయాలి, వివాదాలకు కాదు. మన దేశంలో దురదృష్టం ఏమిటంటే, ఎలాంటి వివాదమూ అవసరం లేని చోట కూడా మనం వివాదాన్ని సృష్టించగలం. వివాదంతో సంఘానికి విఘాతం కల్పించగలం, విషాదం సృష్టించగలం. ఢిల్లీలో ‘మేధావుల’ నెలవుగా పేరొందిన జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలోనే, తాజాగా ఇలాంటి వివాదమే చెలరేగుతోంది. ‘భారతీయ జీవనంలోని శ్రేష్ఠమైన విలువలకు ప్రతీకగా నిలచి, భారతీయ జీవన విధానపు విజయ వైజయంతిని విశ్వమంతటా ప్రకటించిన వివేకా నందుడు, జెయన్‌యులో అస్పృశ్యుడు. ఆయనకు జెయన్‌యు…

Read more »

హిందువులు అల్పసంఖ్యాకులే !

By |

భారతదేశంలో హిందువులు అధిక సంఖ్యా కులు. కాని మరో కోణంలో అల్పసంఖ్యాకులు. మనం మైనారిటీలు అనుకుంటున్నవారే అధిక సంఖ్యాకులనటం సత్యదూరం కాదు. ఒకసారి పరిశీలిస్తే, ఈ వాస్తవాన్ని అంగీక రిస్తాం. హిందువులు పేరుకు ఎక్కువ సంఖ్యలో ఉన్నా, అందులో కొందరు కేటాయింపుల కోసం హిందువు లుగా చెలామణి అవుతూ, ఇతర మతాల్లోకి మారిన వాళ్లు. మరికొందరు – మతం పట్ల భక్తిశ్రద్ధలు, హిందువుగా జీవించాలనే ఆసక్తి ఏమాత్రం లేనివారు. ఏ పండక్కో, పబ్బానికో, పురిటికో, చావుకో కాసింత…

Read more »

ఉష్ణోగ్రతలు పెరిగితే అంతా ఉప్రదవమే

By |

ఉష్ణోగ్రతలు పెరిగితే అంతా ఉప్రదవమే

ఈ నివేదికను ఆమోదించిన అనంతరం భవిష్యత్తులో పర్యావరణానికి వాటిల్లబోయే ముప్పును గురించిన ఆందోళనతో పలువురు ప్రతినిధులు కన్నీళ్ల పర్యంతమై ఒకరినొకరు కావలించుకున్నారు కూడా. వాతావరణంలో పెద్దమొత్తంలో పేరుకుపోయిన కార్బన్‌ డయాక్సైడ్‌ని తొలగించాలంటే ప్రపంచ దేశాలన్నీ పెద్దఎత్తున ప్రయత్నాలు చెయ్యాలని ఈ పత్రం స్పష్టంగా పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక విప్లవం ముందు కంటే ఒక డిగ్రీ సెంటీగ్రేడ్‌ అధికంగా ఉన్నాయి. దీని ఫలితంగా అమెరికాలో హరికేన్‌ తుపానులు, కేప్‌టౌన్‌ (దక్షిణా…

Read more »

సేద్యమంటే ఆనాడు ఒక యజ్ఞం

By |

సేద్యమంటే ఆనాడు ఒక యజ్ఞం

వేదాలలో, అంటే వేదకాలంలో కనిపించే వ్యవసాయ విధానం ఒక పుణ్యకార్యమన్న రీతిలో కర్షకులు స్వీకరించినట్టు ఉంటుంది. ప్రస్తుత కాలంలో వ్యవసాయ శాస్త్రజ్ఞులు భూమిని దున్నడానికి లోహ మయమైన ట్రాక్టర్లు వంటి యంత్రాలను ఉపయోగిస్తున్నారు. దున్నే పని వేగవంతమవుతుందని వీరి అభిప్రాయం. ఇంకా, ఎడ్లతో తాపీగా జరిగే పని నుంచి తప్పించుకోవడం, ట్రాక్టర్‌ లోతుగా దున్నగలగడం వంటి ఇతర సౌకర్యాలు ఉన్నాయని భావిస్తున్నారు. వైదిక సంప్రదాయంలో కూడా ఈ ప్రయోజనం గురించిన యోచన లేకపోలేదు. మహాగ్నిచయనం అనే క్రతువుతో…

Read more »

ఇది విపక్షాల గెరిల్లా యుద్ధమే !

By |

ఇది విపక్షాల గెరిల్లా యుద్ధమే !

ధైర్యంగా ఎదురుగా నిలిచి శత్రువుతో యుద్ధం చేయలేని వారిలో తెలివైన వారు దొంగచాటుగా యుద్ధం చేస్తుంటారని, దానిని గెరిల్లా యుద్ధమని అంటారని మనకు తెలుసు. ఇటువంటి విషయాలలో బాగా నిపుణులైన వారు అనుసరించే పద్ధతిని ‘వేయి గాయాలు చేయి, రక్తంకారి చావనీయి (Death by thousand cuts to bleed the enemy) అనే మాటలలో వ్యక్తీకరిస్తారు. నరేంద్రమోదీని ప్రత్యక్షంగా ఎదిరించి, నిలువజాలమని గ్రహించిన ప్రతిపక్షాల వారు, మేధావులు, మీడియాలోని ఒకవర్గంవారూ ఇప్పుడు ఈ విధానాన్ని అనుసరించాలని…

Read more »

ముస్లిం లీగ్‌ ఇస్తానన్న రూ.20 లక్షల కోసం రాధికా వేముల అగచాట్లు

By |

ముస్లిం లీగ్‌ ఇస్తానన్న రూ.20 లక్షల కోసం రాధికా వేముల అగచాట్లు

రోహిత్‌ వేముల వారందరికీ ఒక ఆయుధం. దాన్ని వాడుకున్నంత కాలం వాడుకుని, పారేశారు. ఇప్పుడు రోహత్‌ వేముల, రాధికా వేములలు వీరందరికీ తుప్పు పట్టిన ఆయుధాలు. అందుకే ఇన్నాళ్లు శుష్కప్రియాలు చెప్పి, ఇప్పుడు శూన్య హస్తాలు చూపిస్తున్నారు. అందుకేనా ఇన్నాళ్ల తరువాత రాధిక వేముల హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఇచ్చిన నాలుగు లక్షల రూపాయలను గుట్టు చప్పుడు కాకుండా తీసుకున్నది ? బుట్టలో దాచుకున్న రహస్య రాజకీయ కుట్ర భళ్ళుమంటూ బయటకొచ్చింది. రోహిత్‌ వేముల విషయంలో బిజెపి…

Read more »

ఇప్పుడు గెలిచారు కానీ…

By |

ఇప్పుడు గెలిచారు కానీ…

ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లోని కైరానా లోకసభ స్థానంలోను, నూర్‌పూర్‌ విధానసభ స్థానంలోను భారతీయ జనతాపార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. ఈ రెండు చోట్లా నాలుగు ప్రతిపక్షాలు అంటే రాష్ట్రీయ లోకదళ్‌ (ఆర్‌ఎల్‌డి), సమాజవాది పార్టీ (ఎస్‌పి), బహుజన సమాజపార్టీ (బిఎస్‌పి) కాంగ్రెస్‌లు సంయుక్తంగా ఒకే ఒక్క అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు ప్రకటితమైనప్పటి నుంచి వీరు దాన్ని తమ ఘన విజయంగా భావించి, సంతోషంగా ఉన్నారు. భాజపాకు కాలం…

Read more »