Archive For The “వినోదం” Category

వెంటాడుతూనే ఉన్న దేశ విభజన విషాద గాథ ‘భారత్‌’!

By |

వెంటాడుతూనే ఉన్న దేశ విభజన విషాద గాథ ‘భారత్‌’!

స్వాతంత్య్రం పొందే క్రమంలో దేశ విభజనకు అంగీకరించడం అనేది ఘోర తప్పిదమనే విషయాన్ని కోట్లాది మంది అంగీకరిస్తారు. ఓ వర్గాన్ని సంతుష్టీ కరించే క్రమంలో జరిగిన ఆ విభజన లక్షలాది మందికి కాళరాత్రిగా మిగిలిపోయిందన్నది వాస్తవం. అది జరిగి ఏడు దశాబ్దాలు గడిచిపోయినా… ఓ రాచపుండులా కొన్ని కుటుంబాలలోని వ్యక్తులను, తర్వాతి తరాలను అది బాధకు గురి చేస్తూనే ఉంది. ఆనాటి సంఘటనల గురించి అవగాహన ఉన్నవారిని, కనీసం కొంతైనా అర్థం చేసుకున్నవారిని ‘భారత్‌’ చిత్రం మెప్పిస్తుంది….

Read more »

విడాకులు

By |

విడాకులు

”యథాప్రకారం సిద్ధిరస్తు” అన్నట్లు ప్రతిరోజు లాగే ఆరోజూ టిఫిన్‌ తినేసి లంచ్‌బాక్సులతో పిల్లలు కాలేజీకి, కొడుకు షాపుకి, కోడలు ఆఫీసుకి వెళ్లిపోయారు. ”ఇంకా ఎప్పుడు నాకు టిఫిన్‌ పెట్టేది? కడుపులో ఎలుకలు పరుగెడ్తున్నాయి.” అన్నట్లు వంటగదివైపు ఆకలి చూపులు విసిరాడు విశ్వనాథం. వస్తున్నా… తెస్తున్నా… అన్నట్లు మందహాసం చేస్తూ భర్త ముందు టిఫిన్‌ ప్లేటు, మంచినీళ్ల గ్లాసు పెట్టింది శారద. ప్లేటులోకి చూసిన విశ్వనాథం కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ముఖంలోకి విసుగు వరదలా తోసుకొచ్చింది. ”నీకెన్నిసార్లు చెప్పాను శారదా…..

Read more »

గురి కుదిరింది !

By |

గురి కుదిరింది !

భారత షూటింగ్‌కు మంచిరోజులొచ్చాయి. ఖేలో ఇండియా పుణ్యమా అని మన యువ షూటర్లు ప్రపంచ రికార్డుల మోత మోగిస్తూ టోక్యో ఒలింపిక్స్‌కి బెర్త్‌లు ఖాయం చేసుకుంటూ దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారు. మ్యూనిచ్‌ వేదికగా ముగిసిన 2019 ప్రపంచకప్‌ షూటింగ్‌లో భారత షూటర్లు రికార్డుల వర్షం కురిపించారు. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ షూటింగ్‌లో రాహీ సర్నోబట్‌ మొత్తం 37 పాయింట్లతో విజేతగా నిలిచింది. ఈ విజయంతో టోక్యో ఒలింపి క్స్‌లో పాల్గొనటానికి అర్హత సంపాదించింది. ఆసియా క్రీడల…

Read more »

యువ కథానాయకుల వివాదాస్పద ప్రకటనలు

By |

యువ కథానాయకుల వివాదాస్పద ప్రకటనలు

చలనచిత్రసీమ చాలా చిత్రమైంది! సినిమా విడుదలకు ఓ రోజు ముందే నిర్మాతలు సూపర్‌ డూపర్‌ హిట్‌, స్మాషింగ్‌ హిట్‌, ఎపిక్‌ హిట్‌ వంటి పోస్టర్స్‌ను పబ్లిసిటీ కోసం సిద్ధం చేసి పెట్టుకుంటారు. ప్రేక్షకాదరణతో నిమిత్తం లేకుండా వాటిని సినిమా విడుదలైన మర్నాడే వాడేస్తుంటారు. ఇక స్టార్‌ హీరోలతో సినిమాలు తీసిన నిర్మాతలైతే, అంతకు ముందు తొలిరోజు వసూళ్లను దృష్టిలో పెట్టుకుని దానిని మించి తమ సినిమాకు ఓపెనింగ్స్‌ వచ్చాయని ఊదరకొడుతుంటారు. ఇందులో చాలా వరకూ అవాస్తవాలే అని…

Read more »

సిద్ధార్థ -13

By |

సిద్ధార్థ -13

8. గోవిందుడు బౌద్ధభిక్షుకులకు కమల సమర్పించిన తోటలో విశ్రాంతికోసం గోవిందుడు కొన్నాళ్లు ఉన్నాడు. సమీపంలో నదిఒడ్డున ఒక పల్లెకారి ఉన్నట్టూ, అతడు గొప్ప సిద్ధుడు అయినట్టు చెప్పుకోగా విన్నాడు. ఆ పల్లెకారిని చూడవలెనని బయలుదేరాడు. గోవిందుడు భిక్షుక నియమాలను శ్రద్ధతో పాటించేవాడు. అతడంటే తోటి భిక్షుకులకు చాలా గౌరవం కూడాను. కాని అతని హృదయంలో అశాంతి ఇంకా వదలలేదు. అతని సాధన ఇంకా ఫలించలేదు. గోవిందుడు నదిదగ్గరకు వచ్చాడు. నదిని దాటించమని పల్లెకారిని అడిగాడు. అవతలి గట్టుకు…

Read more »

సిద్ధార్థ -12

By |

సిద్ధార్థ -12

7. ఓం చాలాకాలం సిద్ధార్థుని ఆ గాయం బాధపెడుతూనే వున్నది. అతడు ఆ నది మీద ఎందరో ప్రయాణికులను దాటిస్తూ వుండేవాడు. ఆ ప్రయాణికులలో కూడ మగపిల్లలు, ఆడపిల్లలు వుండేవాళ్లు. వాళ్ళను చూచినప్పుడు అతని మనస్సు చివుక్కురు మనేది. ఈర్ష్యపడేవాడు. ఆ సుఖము ఆనందము అంతమందికి వుండగా తనకు మాత్రమే ఎందుకు లేకపోవలె. దుర్మార్గులకు దొంగలకు కూడా బిడ్డలు వుంటారు. ఆ బిడ్డలను ప్రేమించుకుంటారు. వాళ్ళ ముద్దు ముచ్చటలను అనుభవిస్తారు. సిద్ధార్థుని మనస్సు అంత పసితనంగానూ, అంత…

Read more »

రైతు వెతల పరిష్కారంలో తడబడిన మహర్షి

By |

రైతు వెతల పరిష్కారంలో తడబడిన మహర్షి

మహేష్‌బాబు లాంటి స్టార్‌డమ్‌ ఉన్న హీరో నటిస్తున్న 25వ చిత్రమంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటం సహజం. పైగా ఆ సినిమాను ఒకరు కాకుండా అగ్ర నిర్మాతలు ముగ్గురు కలిసి నిర్మిస్తుంటే ఆ అంచనాలు అంబరాన్ని తాకుతాయి. అందులోని నటీనటులు, సాంకేతిక నిపుణుల జాబితా చూస్తే ఘన విజయం సాధించడం గ్యారంటీ అనిపిస్తుంది. ఇంతలా అంచనాలు పెంచుకున్న ‘మహర్షి’ మాత్రం పూర్తి స్థాయిలో వాటిని అందుకోవడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. రిషి (మహేశ్‌ బాబు)కి చిన్నప్పటి నుండి తండ్రి…

Read more »

సిద్ధార్థ -10

By |

సిద్ధార్థ -10

5. పల్లెకారి ”ఈ నదికి సమీపంగానే ఉంటాను. ఆనాడు- ఈ నదినే దాటి నగరానికి వెళ్ళాను. అప్పుడు నన్ను పడవ మీద దాటించిన పల్లెకారి కుటీరానికే వెళ్లుతాను. ఆనాడు ఆ కుటీరాన్ని వదిలిన తరువాత ఒక రకం బ్రతుకు బ్రతికాను. ఆ బ్రతుకు ముగిసింది, మళ్ళా నా క్రొత్త బ్రతుకు ఆ కుటీరం దగ్గరనే ఆరంభం కావలెను” అనుకున్నాడు సిద్ధార్థుడు. నదిలో పారుతూ ఉన్న నీళ్ళవైపు చూచాడు. పచ్చగా స్వచ్ఛంగా వున్నది. నీళ్ళ మీద గీరలు వెండి…

Read more »

కాల్‌సెంటర్‌

By |

కాల్‌సెంటర్‌

గచ్చీబోలి.. అరగంట కంటే ఎక్కువ సమయం పట్టని ప్రయాణం. అయితే ఆటో హాస్పిటల్‌ చేరుకోవడానికి ఎంతో సమయం పడుతున్నట్లు అనిపిస్తోంది నీలిమకు. ఎప్పుడూ అమ్మతోబాటే ఉండేది. ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదు. కాల్‌సెంటర్‌లో ఉద్యోగం.. విదేశాల్లోని కస్టమర్ల కాల్స్‌ను ఎంతో పొలైట్‌గా రిసీవ్‌ చేసుకోవాలి. ఓపిగ్గా సమాధానాలివ్వాలి. వాళ్లెంత దురుసుగా మాట్లాడినా మనం వినయంగా ఉండాలి. నీలిమ తల్లి, నాలుగేళ్ల క్రితం తండ్రి పోయినప్ప ట్నుంచీ తన సంరక్షణలోనే ఉంటోంది. నిజం చెప్పాలంటే తల్లి భాగ్యలక్ష్మే కూతురు…

Read more »

సిద్ధార్థ-9

By |

సిద్ధార్థ-9

4. నది వొడ్డున సిద్ధార్థుడు అడవిలో ప్రవేశించాడు. నగరం నుంచి చాలా దూరం నడిచాడు. ఇంతకాలం తాను బ్రతికిన బ్రతుకును తలుచుకున్నప్పుడు అతనికి ఎంతో రోత వేసింది. తన కలలో చచ్చిపోయినట్టు కనిపించిన పిట్ట కమల పంజరంలోది కాదనీ, తన హృయపంజరంలో వున్నదేననీ అనుకున్నాడు. సంసారకూపంలో దిగి ఎంత కుళ్లును పోగుచేశాడు! అంత కాలం తాను బ్రతికి కూడా చచ్చినట్టేననుకున్నాడు. ఈ లోకంలో అతనికి సంతోషాన్ని, ఊరటను కల్పించ గలిగింది ఏమున్నది? ”అబ్బ! మూర్ఛవస్తే – చచ్చిపోతే-…

Read more »