Archive For The “సినిమా” Category

ఏ నిమిషానికి ఏమి జరుగునో..!

By |

ఏ నిమిషానికి ఏమి జరుగునో..!

దేశవ్యాప్తంగా లోక్‌సభకు, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు’ అనే పాట అందరి మదిలోనూ మెదులుతోంది. ఆయా రామ్‌, గయారామ్‌ల కహాని ఓ పక్క సాగుతుండగానే సీటు దక్కినవారు సైతం చేతులెత్తేసి ఎన్నికల బరికి దూరంగా జరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇదే సమయంలో అటు చిత్రసీమలోనూ రాజకీయ చిత్రాల విషయంలో పై పాటను గుర్తుచేసుకుంటు న్నారు సినీజనం. అంతేకాదు… ‘అనుకున్న దొక్కటీ అయినది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్‌ బుల్‌…

Read more »

సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘118’

By |

సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘118’

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ మొదటి నుండి కాస్తంత కొత్తదనం ఉన్న కథలను ఎంపిక చేసుకుంటున్నారు. బయటి నిర్మాతలు దానిని రిస్క్‌గా భావిస్తారనిపించి నప్పుడు తానే నిర్మాణ బాధ్యతలను భుజానికెత్తుకుంటున్నాడు. ఈ ప్రయాణంలో ఎదురు దెబ్బలు తగిలిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ ప్రయోగాన్ని తన మిత్రుడు కోనేరు మహేశ్‌ సహకారంతో చేశారు కళ్యాణ్‌ రామ్‌. లూసిడ్‌ డ్రీమింగ్‌ నేపథ్యంలో, సినిమాటోగ్రాఫర్‌ కె.వి. గుహన్‌ దర్శకత్వంలో ‘118’ అనే సస్పెన్స్‌, థ్రిల్లర్‌ మూవీలో నటించాడు. గౌతమ్‌ (కళ్యాణ్‌రామ్‌)…

Read more »

క్లాసిక్‌, పాపులర్‌ టైటిల్స్‌పై కన్నేశారా!!

By |

క్లాసిక్‌, పాపులర్‌ టైటిల్స్‌పై కన్నేశారా!!

తెలుగులో ఏడాదికి సగటున నూట యాభై స్ట్రయిట్‌ చిత్రాలు విడుదల అవుతున్నాయి. కథల్లో కొత్తదనం లేకపోవడమే కాదు.. ఆ కథలకు తగ్గట్టు కొత్త పేర్లు పెట్టడంలోనూ దర్శక నిర్మాతలు విఫలమవుతున్నారు. పాత సినిమా పేర్లనే అనేక మంది దర్శకులు వాడేసుకుంటున్నారు. గత ఏడాదినే ఉదాహరణగా తీసుకుంటే… దాదాపు పదిహేను స్ట్రయిట్‌ సినిమాలకు పాత చిత్రాల పేర్లు పెట్టారు. కానీ అందులో విజయం సాధించిన చిత్రం ఒక్కటంటే ఒక్కటే! మరి పాత పేరు పెద్దంతగా కలిసిరాదని తెలిసీ ఆ…

Read more »

వైయస్‌ఆర్‌ను స్మరింపచేసిన ‘యాత్ర’

By |

వైయస్‌ఆర్‌ను స్మరింపచేసిన ‘యాత్ర’

కాంగ్రెస్‌ పార్టీలో రాణించడం అంటే వైకుంఠపాళి ఆట ఆడటం లాంటిది! పైకి తీసుకెళ్లే నిచ్చెనలే కాదు… ఆ పక్కనే తోటి నేతలే పాముల్లా కాటేసి, కిందకి తోసేస్తుంటారు. సర్కస్‌ను తలపించే ఆ పార్టీలో నెగ్గుకురావాలంటే పాలిట్రిక్స్‌ ప్లే చేయాల్సిందే. ఒకానొక సమయంలో నలుగురిలో నారాయణ అనిపించుకున్న వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి ఆ తర్వాత ఆ పార్టీ రాష్ట్ర పగ్గాలను చేతికి అందుకుని, తనదైన ముద్ర వేశారు. ఆ క్రమంలో చేసిందే పాదయాత్ర. అదే ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన…

Read more »

బాక్సాఫీస్‌ బరిలో ‘యూరి’ విజయకేతనం!

By |

బాక్సాఫీస్‌ బరిలో ‘యూరి’ విజయకేతనం!

సినిమా అనే వినోద సాధనం ద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే తలంపు ఇవాళ్టి దర్శక నిర్మాతలలో తగ్గిపోతోంది. పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకోవడానికి ఎలాంటి చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేయడానికైనా వెనకాడని పరిస్థితిని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో భారత సైనికుల సత్తాను ప్రపంచానికి చాటే విధంగా తెరకెక్కింది ‘యూరి: ద సర్జికల్‌ స్ట్రైక్‌’ చిత్రం. 2016 సెప్టెంబర్‌ 18న జమ్ము-కాశ్మీర్‌లోని యూరి గ్రామంలో టెర్రరిస్టులు జరిపిన దాడిలో 19మంది భారతీయ సైనికులు అసువులు బాశారు….

Read more »

రీమేక్స్‌పై దృష్టిపెట్టిన యువతారలు

By |

రీమేక్స్‌పై దృష్టిపెట్టిన యువతారలు

తెలుగు చిత్రసీమలోని యువ కథానాయకులు, నాయికలు ఇప్పుడు రీమేక్స్‌పై దృష్టిపెట్టారు. వివిధ భాషల్లో తెరకెక్కిన సినిమాలను తెలుగులో రీమేక్‌ చేయడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. కొత్త కథను ఎంపిక చేసుకునే కంటే అప్పటికే విజయం సాధించిన చిత్రాలను రీమేక్‌ చేస్తే విజయం ఖాయమనే నమ్మకం ఒకటి కాగా, ఇలాంటి రీమేక్స్‌కు సహజంగానే క్రేజ్‌ ఉండటం వల్ల బిజినెస్‌ సజావుగా సాగుతుందానే ధీమా మరొకటి. ప్రస్తుతం విజయం కోసం తహతహలాడుతున్న యువ కథానాయకులు ఈ బాట పట్టడానికి…

Read more »

‘సాహో’ ‘సైరా’ పైనే ఆశలు

By |

‘సాహో’ ‘సైరా’ పైనే ఆశలు

సంక్రాంతి అంటే సినిమా పండగ కూడా! కానీ ఈ యేడాది ఈ పండగకు వచ్చిన నాలుగు చిత్రాలూ ప్రేక్షకులను నిరాశ పరిచాయి. కలెక్షన్లపరంగా ‘ఎఫ్‌ 2’ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ సినిమా గ్రామర్‌ను పాటించడంలో ఇది విఫలమైంది. ఇక ‘వినయ విధేయ రామ’ కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కడంతో కథ, కథనాలు బాగోకపోయినా… కలెక్షన్లు ఫర్వాలేదనిపిస్తున్నాయి. అందరూ ఊహించిన దానికి భిన్నంగా ‘ఎన్టీయార్‌ – కథానాయకుడు’ ఇటు ప్రేక్షకులను, అటు విమర్శకులను కూడా మెప్పించ లేకపోయింది….

Read more »

నిరాశపర్చిన సంక్రాంతి చిత్రాలు

By |

నిరాశపర్చిన సంక్రాంతి చిత్రాలు

సంక్రాంతి సీజన్‌లో ఎన్ని చిత్రాలు విడుదలైనా వాటిని ప్రేక్షకులు చూస్తారని, నాలుగైదు చిత్రాలు జనం ముందుకు వచ్చినా ఆ ఐదారు రోజులు మంచి కలెక్షన్స్‌ ఉంటాయని సినీజనం భావిస్తుంటారు. కానీ విడుదలైన అన్ని చిత్రాలు.. చెప్పుకోదగ్గవిగా లేకపోతే పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం అదే స్థితి తెలుగునాట ఉంది. ‘ఎన్టీఆర్‌-కథానాయకుడు, రజనీకాంత్‌-పేట, రామ్‌చరణ్‌-వినయ విధేయ రామ, వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌-ఎఫ్‌2’ చిత్రాలు ఒకరోజు తర్వాత ఒకటిగా నాలుగు రోజులపాటు విడుదలయ్యాయి. ‘ఎన్టీఆర్‌-కథానాయకుడు’ చిత్రం విడుదలకు ముందే.. ఇది పాజిటివ్‌…

Read more »

వెండితెరపై బయోపిక్స్‌ వెల్లువ

By |

వెండితెరపై బయోపిక్స్‌ వెల్లువ

గత కొంతకాలంగా భారతీయ సినిమా రంగంలో బయోపిక్స్‌ గాలి బలంగా వీస్తోంది. అయితే ఇప్పుడది వెల్లువలా మారింది. గత యేడాది ‘మహానటి’గా సావిత్రి జీవితగాథ వెండితెరకెక్కి ప్రజాదరణ పొందడంతో తెలుగువారిలోనూ వీటిపై ఆసక్తి బాగానే ఉందని నిరూపణ అయ్యింది. ఇప్పుడు తెలుగులో దాదాపు ఆరేడు బయోపిక్స్‌ రూపుదిద్దుకొంటుండగా, యావత్‌ భారతంలో పాతిక పైగా బయోపిక్స్‌ వివిధ దశల్లో ఉన్నాయి. మహానటుడు, మడమ తిప్పని ప్రజానాయకుడు ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను ఆయన కుమారుడు బాలకృష్ణ రెండు భాగాలుగా నిర్మించారు….

Read more »

2018 తెలుగు చిత్రసీమ విహంగ వీక్షణం

By |

2018 తెలుగు చిత్రసీమ విహంగ వీక్షణం

చూస్తూ చూస్తూ నూతన ఆంగ్ల సంవత్సరాదిలోకి అడుగు పెట్టేశాం. గడిచిన ఏడాదిలో తెలుగు చిత్రసీమలో ఎన్నో వింతలు, ఎన్నో విచిత్రాలు, మరెన్నో వివాదాలు. అగ్రకథానాయకులకు ఈ యేడాది చుక్కలు కనిపించాయి. సరికొత్త కథానాయకులకు విజయాలు దక్కాయి. ఊహించని వివాదాలు కొన్ని చెలరేగగా, ఊహకందని మరణాలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. గడిచిన సంవత్సరంలో దాదాపు 170 స్ట్రయిట్‌ సినిమాలు, 60 వరకూ అనువాద చిత్రాలు తెలుగు వారిని పలకరించాయి. అయితే సీనియర్‌ హీరోలు చిరంజీవి, వెంకటేశ్‌ నటించిన సినిమాలేవీ…

Read more »