Archive For The “ధారావాహిక” Category

సిద్ధార్థ-2

By |

సిద్ధార్థ-2

2. శ్రమణులతో సాధన ఆనాడు సాయంత్రానికి వారు శ్రమణులను కలుసుకున్నారు. తమతో చేర్చుకొమ్మని వారిని ప్రార్థించారు. అందుకు శ్రమణులు అంగీకరించారు. సిద్ధార్థుడు ఒక పేదబ్రాహ్మణునికి తన వస్త్రాలను దానం చేశాడు. తన కొల్లాయిని, కావిరంగు పైపంచను మాత్రం దగ్గర ఉంచుకున్నాడు. ఒంటిపూట భోజనం ప్రారంభించాడు. సొంతంగా అన్నం వండుకోడు. ముందు ఒక పక్షము, తరువాత ఒక మాసము ఉపవాసం చేశాడు. దేహంలో కండలు కరిగిపోయినవి. గడ్డం పెరిగింది. గోళ్లు పెరిగినవి. అతని విస్ఫార నేత్రాలలో ఏవో విచిత్ర…

Read more »

సిద్ధార్థ – 1

By |

సిద్ధార్థ – 1

1. బ్రాహ్మణ కుమారులు బ్రాహ్మణ కుమారులు సిద్ధార్థుడు గోవిందుడు కూడా పెరుగుతున్నారు. ఇంటిపట్టున, ఏటివొడ్డున, అడవులలో, అశ్వద్ధవృక్షం కింద ఎక్కడవున్నా ఇద్దరు మైత్రితో కలసి మెలసి తిరిగేవారు. నదీస్నానాల వల్లనూ, అనుష్ఠానాలవల్లనూ, అగ్ని¬త్రాది కర్మల వల్లనూ సిద్ధార్థుని సుకుమార శరీరం కొంచెం నల్లపడింది. ఇంటిలో తల్లి పాటలు పాడుతూ ఉండేది. తండ్రి పండితులతో తర్కవాదాలు జరుపుతూ ఉండేవాడు. మామిడితోటలో ఆడుకొంటూ ఉన్న సిద్ధార్థుని కళ్లముందు నీడలు మసలుతూ ఉండేవి. సిద్ధార్థుడు పండిత గోష్ఠులలో పాల్గొన్నాడు. గోవిందునితో వాద…

Read more »

కాలాతీతం

By |

కాలాతీతం

‘శ్రీకృష్ణ జయంతి రెండునే వచ్చేసిందేవిఁటే అమ్మాయీ! ఇంకా నయం.. కాలెండర్‌ చూసు కున్నావట సరిపోయింది. శ్రావణ బహుళ షష్ఠి లగాయితు భాద్రపదమంతా అన్నీ పర్వదినాలే..’ ఉదయ కాలపు పూజా కార్యక్రమాలు సంతృప్తిగా ముగించుకొని- తడి, పొడి, మడి బట్టలు మార్చుకుని స్థిమిత పడ్డాక జగదీశ్వరమ్మ గారు నింపాదిగా కళ్లద్దాలు తగిలించుకుని – హాల్లో పెద్ద సింహాసనం లాంటి పాతకాలపు టేకు కుర్చీలో సుఖాసీనురాలై వెంకట్రామా అండ్‌ కో వారి తెలుగు కాలెండర్‌ తిరగేస్తోంది. ఏ పండగైనా సరే…

Read more »

జీవనస్రవంతి-39

By |

జీవనస్రవంతి-39

: జరిగిన కథ : మల్లెవాడ వెళ్లిన జీవన్‌కి జాహ్నవి గురించి కరణం గారు చెపుతూ ‘జాహ్నవిని చదువుకని సుధీర్‌ వద్దకు పంపితే వాడు దానిని లొంగదీసుకున్నాడని, జాహ్నవి ఆత్మహత్య చేసుకుందని, హాస్పిటల్‌లో ఉందని చెప్పి బాధపడ్డారు కరణంగారు. జాహ్నవిని కోడలిగా చేసుకోడానికి సుధీర్‌ నాన్న సుబ్బ రామయ్య ఒప్పుకున్నాడని, కాని పిల్లలు రావటానికి వీల్లేదన్నాడని చెప్పారు. సుధీర్‌తో మాట్లాడటానికి జీవన్‌ వెళ్లాడు. ‘జాహ్నవికి అప్పుడు నేనే సహాయం చేద్దామనుకున్నాను. కానీ ఇప్పుడిలా జరిగింది, మీరు కాస్త…

Read more »

జీవనస్రవంతి -38

By |

జీవనస్రవంతి -38

: జరిగిన కథ : మల్లెవాడ వెళ్లే ముందు జీవన్‌ స్రవంతితో వితంతువు, ఇద్దరు పిల్లలున్న జాహ్నవిని పెళ్లి చేసుకుని, ఆమెకు కొత్త జీవితం ప్రసాదిద్దాం అని మూడేళ్ల క్రితమే అనుకున్నానని చెప్పాడు. అందుకు స్రవంతి ఎంతో బాధపడింది. మౌనంగా రోధించింది. జీవన్‌ ఆమెను ధైర్యంగా ఉండమని, జాహ్నవి వైపు నుండి ఆలోచించమని చెప్పాడు. అన్నీ ఆలోచించిన స్రవంతి కూడా జీవన్‌ నిర్ణయాన్ని కాదనలేకపోయింది. ‘ఆల్‌ ది బెస్ట్‌’ అంది. మల్లెవాడ వెళ్లిన జీవన్‌ని కరణంగారు ఆహ్వానించారు….

Read more »

జీవనస్రవంతి-37

By |

జీవనస్రవంతి-37

: జరిగిన కథ : జీవన్‌ ఆఫీస్‌ నుండి ఇంటికి వచ్చేసరికి మొగలి పూల పరిమళ వాసన వచ్చింది. దాంతో అతనికి మల్లెవాడ, కరణంగారు, సీతమ్మగారు, జాహ్నవి, మల్లేశు గుర్తుకువచ్చారు. ఇప్పుడు తాను మంచి స్థితిలో ఉన్నాడు కాబట్టి జాహ్నవిని పెళ్లాడి ఆమె సమస్యను తీర్చాలనుకుని ఆ విషయం తల్లి మీనాక్షితో చెప్పాడు. స్రవంతిని కోడలిగా పొందా లనుకుంటున్న మీనాక్షి జీవన్‌ మాటలతో కొంత ఆలోచనలో పడి చివరికి జీవన్‌ నిర్ణయాన్ని కాదనలేకపోయింది. మల్లెవాడ వెళ్లడానికి నిర్ణయించిన…

Read more »

జీవనస్రవంతి -36

By |

జీవనస్రవంతి -36

: జరిగిన కథ : మూతి ముడుచుకున్న స్రవంతికి సర్దిచెప్పాడు జీవన్‌. తరువాత ఇద్దరూ ఒకరి వంటలు ఒకరు పంచుకుని లంచ్‌ చేశారు. ఆఫీస్‌ తరపున విదేశాలకు వెళ్లే అవకాశం వస్తే వెళ్లనని, అలా వెళితే తన తల్లి ఒంటరిదవుతుందని అన్నాడు జీవన్‌. ప్రదీప్‌ విషయం చెపుతూ, ఆవేశపడటం వల్ల ఎవరికీ లాభం ఉండదని చెప్పానని, అతడు అర్థం చేసుకున్నాడని అన్నాడు జీవన్‌. తల్లి ప్రేమకు మించినది లేదన్నాడు. హితైషణి పత్రిక సబ్‌ ఎడిటర్‌ ప్రకాశరావు వచ్చి…

Read more »

జీవనస్రవంతి-35

By |

జీవనస్రవంతి-35

: జరిగిన కథ : భయపడుతున్న శిరీషకు స్రవంతి ఫోన్‌ చేసి పేపర్లో వార్తలు నిజాలు అనుకోవద్దు అని చెప్పి, అరగంటకు ముందే ఆమె వద్దకు చేరింది. శిరీష చూపించిన దుర్వార్త చూసి స్రవంతి బాధపడింది. శిరీష తనకూ ఆ కష్టం వస్తుందేమో అని భయపడింది. తాను నానీని ప్రేమిస్తుంటే, ప్రదీప్‌ తన వెంట పడుతున్నాడని, తనకు దక్కని సిరి మరెవ్వరికీ దక్కనీను అన్నాడని చెప్పింది. ఇద్దరూ ఈ విషయాన్ని జీవన్‌కి చెబుతామని నిర్ణయిం చారు. జీవన్‌…

Read more »

జీవనస్రవంతి-34

By |

జీవనస్రవంతి-34

: జరిగిన కథ : శరభయ్య కూతురి పెళ్లికి డబ్బు అప్పుగా కాక జగన్నాథం తాతయ్య ఛారిటబుల్‌ ఫండ్‌ నుండి డబ్బు ఇస్తానని జీవన్‌ చెప్పడంతో మీనాక్షి సంతోషించింది. ఆ ఫండుతోనే డిగ్రీ తరువాత డబ్బు లేక చదువుకోలేకపోయిన కిరణ్‌ని చదివిస్తానని జీవన్‌ అంటే కిరణ్‌ నాకు అంత ఓపిక లేదన్నాడు. సుమతి అమ్మ కాబోతోందని చెప్పాడు. మీనాక్షి స్వీట్‌ తినిపించింది. ఇకనుండి ప్రతి సంవత్సరం తన జీతంతో తాతయ్య పుణ్యతిథి రోజున అన్నదానం చేయడానికి జీవన్‌…

Read more »

జీవనస్రవంతి – 33

By |

జీవనస్రవంతి – 33

: జరిగిన కథ : ఆ రాత్రి భోజనాల వద్ద జీవన్‌ కిరణ్‌తో మాట్లాడుతూ సరుకు రవాణా, బాకీల వసూలు కోసం రాఘవను, ముడి సరుకులు తేవడానికి టెంపో, దానిని నడపడానికి వెంకటేశుని పనిలోకి తీసుకోమన్నాడు. తల్లి మీనాక్షి అనుమతించింది. జీవన్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర అయ్యాడు. తన టీమ్‌లోకి శిరీష, స్రవంతి వచ్చారు. తనను గుర్తుపట్టలేకపోయిన జీవన్‌కు స్రవంతి తనను తాను నవ్వుతూ పరిచయం చేసుకుంది. ఆగస్టు 15 సెలవు కావడంతో జీవన్‌ ఇంటివద్దే…

Read more »