Archive For The “ధారావాహిక” Category

సిద్ధార్థ -13

By |

సిద్ధార్థ -13

8. గోవిందుడు బౌద్ధభిక్షుకులకు కమల సమర్పించిన తోటలో విశ్రాంతికోసం గోవిందుడు కొన్నాళ్లు ఉన్నాడు. సమీపంలో నదిఒడ్డున ఒక పల్లెకారి ఉన్నట్టూ, అతడు గొప్ప సిద్ధుడు అయినట్టు చెప్పుకోగా విన్నాడు. ఆ పల్లెకారిని చూడవలెనని బయలుదేరాడు. గోవిందుడు భిక్షుక నియమాలను శ్రద్ధతో పాటించేవాడు. అతడంటే తోటి భిక్షుకులకు చాలా గౌరవం కూడాను. కాని అతని హృదయంలో అశాంతి ఇంకా వదలలేదు. అతని సాధన ఇంకా ఫలించలేదు. గోవిందుడు నదిదగ్గరకు వచ్చాడు. నదిని దాటించమని పల్లెకారిని అడిగాడు. అవతలి గట్టుకు…

Read more »

సిద్ధార్థ -12

By |

సిద్ధార్థ -12

7. ఓం చాలాకాలం సిద్ధార్థుని ఆ గాయం బాధపెడుతూనే వున్నది. అతడు ఆ నది మీద ఎందరో ప్రయాణికులను దాటిస్తూ వుండేవాడు. ఆ ప్రయాణికులలో కూడ మగపిల్లలు, ఆడపిల్లలు వుండేవాళ్లు. వాళ్ళను చూచినప్పుడు అతని మనస్సు చివుక్కురు మనేది. ఈర్ష్యపడేవాడు. ఆ సుఖము ఆనందము అంతమందికి వుండగా తనకు మాత్రమే ఎందుకు లేకపోవలె. దుర్మార్గులకు దొంగలకు కూడా బిడ్డలు వుంటారు. ఆ బిడ్డలను ప్రేమించుకుంటారు. వాళ్ళ ముద్దు ముచ్చటలను అనుభవిస్తారు. సిద్ధార్థుని మనస్సు అంత పసితనంగానూ, అంత…

Read more »

సిద్ధార్థ -10

By |

సిద్ధార్థ -10

5. పల్లెకారి ”ఈ నదికి సమీపంగానే ఉంటాను. ఆనాడు- ఈ నదినే దాటి నగరానికి వెళ్ళాను. అప్పుడు నన్ను పడవ మీద దాటించిన పల్లెకారి కుటీరానికే వెళ్లుతాను. ఆనాడు ఆ కుటీరాన్ని వదిలిన తరువాత ఒక రకం బ్రతుకు బ్రతికాను. ఆ బ్రతుకు ముగిసింది, మళ్ళా నా క్రొత్త బ్రతుకు ఆ కుటీరం దగ్గరనే ఆరంభం కావలెను” అనుకున్నాడు సిద్ధార్థుడు. నదిలో పారుతూ ఉన్న నీళ్ళవైపు చూచాడు. పచ్చగా స్వచ్ఛంగా వున్నది. నీళ్ళ మీద గీరలు వెండి…

Read more »

సిద్ధార్థ-9

By |

సిద్ధార్థ-9

4. నది వొడ్డున సిద్ధార్థుడు అడవిలో ప్రవేశించాడు. నగరం నుంచి చాలా దూరం నడిచాడు. ఇంతకాలం తాను బ్రతికిన బ్రతుకును తలుచుకున్నప్పుడు అతనికి ఎంతో రోత వేసింది. తన కలలో చచ్చిపోయినట్టు కనిపించిన పిట్ట కమల పంజరంలోది కాదనీ, తన హృయపంజరంలో వున్నదేననీ అనుకున్నాడు. సంసారకూపంలో దిగి ఎంత కుళ్లును పోగుచేశాడు! అంత కాలం తాను బ్రతికి కూడా చచ్చినట్టేననుకున్నాడు. ఈ లోకంలో అతనికి సంతోషాన్ని, ఊరటను కల్పించ గలిగింది ఏమున్నది? ”అబ్బ! మూర్ఛవస్తే – చచ్చిపోతే-…

Read more »

సిద్ధార్థ-8

By |

సిద్ధార్థ-8

3. సంసారం సిద్ధార్థుడు చాలా దినాలు లౌకిక జీవితాన్ని – దానికి అంటకుండా గడిపాడు. శ్రమణుడుగా ఉండినప్పుడు మొద్దువారిన అతని ఇంద్రియాలు తిరిగి మేలుకొన్నవి. అర్థాన్ని, కామాన్ని, అధికారాన్ని అతడు రుచిచూచాడు. కాని అంతకాలం హదయంలో శ్రమణుడుగానే వున్నాడు. కమల తెలివితో ఈ విషయాన్ని గ్రహించింది. అతని జీవితం ఎల్లప్పుడూ ఆలోచన, ప్రతీక్షణ, ఉపవాసము వీటి మీదనే లగ్నమై ఉండేది. లోకంలో సామాన్య జనంతో అతనికి సంబంధం లేదు. అతడు వారికి వేరుగానే వుండేవాడు. సంవత్సరాలు గడిచినవి….

Read more »

సిద్ధార్థ-7

By |

సిద్ధార్థ-7

2. ప్రజలలో సిద్ధార్థుడు కామస్వామిని చూడడానికి వెళ్ళాడు. ఆ ఇల్లు ఒక పెద్దమహలు. నౌకరులు అతనిని తివాసీలమీద నడిపించుకుంటూ లోపలికి తీసుకవెళ్ళారు. యజమాని కోసం నిరీక్షిస్తూ గదిలో కూర్చున్నాడు. కామస్వామి వచ్చాడు. ఇద్దరు స్నేహసూచకంగా వందనాలు తెలుపుకున్నారు. ”నీవు బ్రాహ్మణుడవనీ, పండితుడవనీ, ఉద్యోగం కోసం తిరుగుతున్నావని విన్నాను. అయితే జరగక ఉద్యోగంలో చేరదలచా వన్న మాట” అన్నాడు షాహుకారు. ”నాకు జరగకపోవడమనేది ఏనాడూ లేదు. నేను చాలా కాలం శ్రమణులతో కలిసి ఉన్నాను. అక్కడ నుంచే వచ్చాను.”…

Read more »

సిద్ధార్థ-6

By |

సిద్ధార్థ-6

కమల ఆ మాటలకు విరగబడి నవ్వుతూ అన్నది – నా అనుభవంలో ఇంతవరకు ఒక శ్రమణుడు నా వద్ద శుశ్రూష చేస్తానంటూ రాలేదు. జడలు పెంచుకొని, కావిగుడ్డలు కట్టుకునే శ్రమణులు నా వద్దకు ఎన్నడూ రారు. పెక్కుమంది యువకులు – బ్రాహ్మణ యువకులు కూడా – నా వద్దకు వస్తారు. కాని వారు అందమైన దుస్తులతో, సుగంధాలు విరజిమ్ముతూ సంచులలో ద్రవ్యాన్ని నింపుకొని నా వద్దకు వస్తారు.” ”కమలా ! నీ వద్ద శుశ్రూషను ఇదివరకే ప్రారంభించాను….

Read more »

సిద్ధార్థ -5

By |

సిద్ధార్థ -5

రెండవ భాగం 1.కమల సిద్ధార్థునికి ప్రపంచమంతా మారురూపం పొందింది. అతడు ప్రపంచానికి అంత వశమై పోయినాడు. అడుగుతీసి అడుగు పెడితే అతనికి ఒక క్రొత్త సొగసు గోచరిస్తున్నది. సూర్యోదయం, సూర్యాస్తమయం, ఆకాశాన నక్షత్రాలు, చిన్ని పడవలాగా తేలిపోతున్న నెలవంక, మబ్బులు, అడవిలో తీగెలు, పొదలు, పూలు, సెలయేరు, ఉదయాన చెట్ల ఆకులపై తళతళలాడే మంచు చుక్కలు, దూరాని కగుపించే కొండలు, పక్షుల కలకలారావాలు, తుమ్మెదల రొదలు, చేలమీదుగా మెల్లగా విచే గాలులు, ఇంకా వేర్వేరు రంగులతో వేర్వేరు…

Read more »

సిద్ధార్థ -4

By |

సిద్ధార్థ -4

4. మెలకువ జేతవనం నుంచి సిద్ధార్థుడు బయలుదేరాడు. తన పూర్వజీవితాన్ని ఆ వనంలో వదిలిపెట్టి వెళ్లుతూ ఉన్నట్టుగా తోచింది అతనికి. అతని తలలో అదే ఆలోచన సుళ్లుతిరుగుతూ ఉన్నది. ఆ భావం అతని మనస్సును పూర్తిగా ఆవేశించింది. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అసలు కారణాలు గోచరించేటంత వరకు ఆలోచించాడు. ఆలోచనకు ఫలితం అసలు కారణాలను గ్రహించడమేనని అతనికి తోచింది. ఆలోచన ద్వారా భావాలు తెలివిగా రూపొందుతవి. ఆ భావాలు నశించకుండా స్థిరరూపం దాల్చి, పరిపక్వం కావడానికి ప్రారంభిస్తవి. అతడు…

Read more »

సిద్ధార్థ -3

By |

సిద్ధార్థ -3

సావధీనగరంలో బుద్ధభగవానుని పేరు ప్రతి పసిబిడ్డకూ తెలుసును. గౌతమ శిష్యుల భిక్షాపాత్రలను నింపడానికి ప్రతిగృహిణి నిరీక్షిస్తూ ఉండేది. అనాథపిండికుడు అనే ధనికవణిజుడు జేతవనం అనే తన ఆరామాన్ని బుద్ధుడు శిష్యసమేతంగా ఉండడానికి ఏర్పాటుచేశాడు. ఆ వనం నగరానికి సమీపంలో ఉన్నది. మన యువసన్యాసులు గౌతముని వెదుక్కుంటూ ఆ నగరానికి వచ్చారు. భిక్షాపాత్రలు పట్టుకొని ఒక ఇంటి ముందు నిల్చున్నారు. ఆ ఇల్లాలు వారికి ఆదరంతో అన్నం పెట్టింది. ఆమెను సిద్ధార్థుడు ఇలా అడిగాడు: ”అమ్మా! బుద్ధభగవానుడు ఎక్కడ…

Read more »